అదె చూడరయ్యా
రాగం : భోళి (మేళకర్త 15, మాయ మాళవ గౌళ జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య
ఆరోహణ : స రి1 గ3 ప ద1 స
అవరోహణ: స ని3 ద1 ప గ3 రి1 స
పల్లవి
అదె చూడరయ్యా పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు కొనియాడేరయ్యా ||
చరణము
ఉదయాస్తశైలములు ఒక జంగగా చాచె
అదిగో ధ్రువమండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ||
దండిగా బ్రంహ్మాOడము దాక తోకమీదకెత్తి
మెండగు ధిక్కుల నిండా మేను వెంచెను
గుండు గూడా రాకాసుల కొట్టగా చేతులు చాచె
అండ ఈతని ప్రతాప మరుదరుదయ్యా||
ధిక్కులు పిక్కటిల్లగా దేహారో మములు పెంచె
పక్కన లోకములకు ప్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరి బంటాయ
మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య ||
No comments:
Post a Comment