Sunday, December 29, 2024

MUSINA MUTYALAKELE మూసిన ముత్యాల కేలే మొరగులు

 పల్లవి 

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ||

చరణములు 
కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ||

భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోల్ల కేలే కొనవాండ్లు ||

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి |
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ||

No comments:

Post a Comment

Shani Shingnapur Maharashtra - శని శింగనాపూర్ మహారాష్ట్ర

శని శింగనాపూర్,  మహారాష్ట్ర మహారాష్ట్రలోని అహ్మద నగర్ జిల్లా నేవాస  తాలూకా లో   ఉన్న శ్రీ శనైశ్వరుని దేవస్థానం శని శింగనాపూర్ ఆలయం పుణ్యక్షే...