Sunday, December 29, 2024

KULUKUGA NADAVARO కులుకక నడవరో కొమ్మలాలా

 రాగం: దేసాళం


పల్లవి 
కులుకక నడవరో కొమ్మలాలా |
జలజల రాలీని జాజులు మాయమ్మకు ||

చరణములు 
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా |
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు ||

చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల |
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు ||

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో |
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...