సామజ వర గమన
తాళం: ఆది
రాగం: హిందోళం ( మేళకర్త 20, నట భైరవి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స గ2 మ1 ద1 ని2 స
అవరోహణ: స ని2 ద1 మ1 గ2 స
పల్లవి
సామజ వర గమన
సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత
అను పల్లవి:
సామని గమజ - సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మామ్ పాలయ
వేదశిరో మాతృజ - సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ
No comments:
Post a Comment