Sunday, December 29, 2024

NANATI BATHUKU నానాటి బతుకు నాటకము

 రాగం: ముఖారి


పల్లవి 
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ||

చరణములు 
పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము |
యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ||

కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము |
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ||

తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ||

No comments:

Post a Comment

Somnath, Veraval, Saurashtra, Gujarat - సోమనాథ్, వెరావల్‌, సౌరాష్ట్రా, గుజరాత్

సోమనాథ్,  వెరావల్‌,  సౌరాష్ట్రా,  గుజరాత్ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం:   ధ్యాన శ్లోకము: సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ । ఉజ్జయ...