Sunday, December 29, 2024

MACCHA KURMA VARAHA మచ్చ కూర్మ వరాహ

 రాగం: కాఫీ

తాళ్ళం : ఆది

ఆరోహణం : స రి2 మ2 ప ని2 స'
అవరోహణం : స' ని2 ద ని2 ప మ2 గ రి2 స

పల్లవి 
మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ||

చరణములు 
నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన |
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ ||

కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా |
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన ||

మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ |
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...