Sunday, December 29, 2024

MAHINUDYOGI KAAVALE మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు

 పల్లవి 

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజి వలె నుండి ఏమి సాధించలెడు ||

చరణములు 
వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు 
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదురించితే కాలము నిమిషమై తోచు ||

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ 
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ||

మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెరగక ఉండితే వీరిడియౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును |
పరగ సంశయించితే పాషండుడౌను ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...