Sunday, December 29, 2024

NAGAVULU NIJAMINI నగవులు నిజమని నమ్మేదా

 పల్లవి 

నగవులు నిజమని నమ్మేదా |
వొగినడియాసలు వొద్దనవే ||

చరణములు 
తొల్లిటి కర్మము దొంతల నుండగ |
చెల్లబోయిక జేసేదా |
యెల్ల లోకములు యేలేటి దేవుడ |
వొల్ల నొల్లనిక నొద్దనవే ||

పోయిన జన్మము పొరుగులనుండగ |
చీయనక యిందు జెలగేదా |
వేయినామముల వెన్నుడమాయలు |
ఓ యయ్య యింక నొద్దనవే ||

నలి నీనామము నాలికనుండగ |
తలకొని యితరము దడవేదా |
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి |
వొలుకు చంచలము లొద్దనవే ||

No comments:

Post a Comment

Sravana Maasam - శ్రావణ మాసం

శ్రావణ మాసం శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల ...