Sunday, December 29, 2024

KOLICHINA VAARALA కొలిచిన వారల

 పల్లవి 

కొలిచిన వారల కొంగుపైడితడు
బలిమి తారక బ్రహ్మమీతడు ||

చరణములు 
ఇనవంశాంబుధి నెగసిన తేజము
ఘనయజ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినువుల రఘుకుల నిధానమీతడు ||

పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము
ధరలో రామావతారంబితడు ||

చకితదానవుల సంహారచక్రము
సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము
ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...