Tuesday, December 31, 2024

KARUNA JALADHE DASHARADHE కరుణా జలధే దాశరథే

 కరుణా జలధే దాశరథే


తాళం: ఆది
రాగం: నాథనామ క్రియ (మేళకర్త 15, మాయామాళవగౌలై  జన్యరాగ) 
రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి1 గ3 మ1 ప ద1 ని3
అవరోహణ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3

పల్లవి
కరుణా జలధే దాశరథే
కమనీయానన సుగుణనిధే 

చరణము(లు):
నీ మయమేగా నిలను 
నేమని నే దూరుదును || 1 || 

నిజదాసుల యనుభవ మొకటి
నిను తెలియని జనమత మొకటి || 2 ||

వలచుచు నామము జేయుదురే నిను
దలచుచు ప్రొద్దు పోగొట్టుదురే || 3 ||

సుకృతము లొప్పగింతురే నీ
ప్రకృతిని దెలిసి యేగింతురే || 4 ||

మనసారగ బూజింతురే నిను
మాటి మాటికి యోచింతురే || 5 ||

నిను గనులకు కన కోరుదురే నవ
నిధు లబ్భిన సుఖమును కోరరే || 6 ||

నీ వన్నిటయని పలుకుదురే
నీవే తానని కుల్కుదురే || 7 ||

తమలో మెలగుచు నుందురే 
తారకరూపుని కందురే || 8 ||

భాగవత ప్రహ్లాదహిత రామ
భావుక త్యాగరాజనుత || 9 ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...