Tuesday, December 31, 2024

ADIGO BHADRADRI - అదిగో భద్రాద్రి

 అదిగో భద్రాద్రి


తాళం: ఆది
రాగం: వరాళి (మేళకర్త 39, జలవరాళి జన్యరాగ)
రూపకర్త: రామదాసు

ఆరోహణ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవరోహణ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స

పల్లవి

అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి.

చరణము

ముదముతో సీత ముదిత లక్ష్మణుడు
కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥

చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి ॥ 2 ॥

అనుపమానమై అతిసుందరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥

కలియుగమందున నిల వైకుంఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ॥ 4 ॥

పొన్నల పొగడల పూపొద రిండ్లతొ
చెన్ను మీరగను చెలగుచునున్నది ॥ 5 ॥

శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ॥ 6 ॥

No comments:

Post a Comment

Numerology - Number 6 - న్యూమరాలజీ - 6వ సంఖ్య

న్యూమరాలజీ - 6వ సంఖ్య గ్రహము : శుక్రుడు జన్మదిన తేదీ సంఖ్య : 6, 15, 24 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 6, 15, 24 ఈ తేదీలలో పుట్ట...