Sunday, December 29, 2024

KODEKAADE VEEDE కోడెకాడె వీడె వీడె గోవిందుడు

 పల్లవి 

కోడెకాడె వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు ||

చరణములు 
గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు |
గుల్ల సంకు~ంజక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు ||

కోలచే పసులగాచె గోవిందుడు
కూలగుమ్మె కంసుని గోవిందుడు |
గోలయై వేల కొండెత్తె గోవిందుడు
గూళెపుసతుల~ం దెచ్చె గోవిందుడు ||

కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు |
కుందని శ్రీవేంకటాద్రి గోవిందుడు
గొంది~ం దోసె నసురల గోవిందుడు ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...