Sunday, December 29, 2024

ANTHAYU NEEVE HARI PUMDARIKAKSHA అంతయు నీవే హరి పుండరీకాక్ష

 అంతయు నీవే హరి పుండరీకాక్ష


తాళం: ఆది

రాగం: హిందోళం (మేళకర్త 20, నట బైరవ జన్యరాగ )

రూపకర్త: అన్నమాచార్య 


ఆరోహణ: స గ2 మ1 ద1 ని2 స

అవరోహణ: స ని2 ద1 మ1 గ2 స



పల్లవి
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామా ||


చరణము
కులమును నీవే గోవిందుడా, నా -
కలిమియు నీవే కరుణానిధి
తలుపును నీవే ధరణీధర, నా -
నెలవును నీవే నీరాజనాభా ||

తనువును నీవే దామోదరా, నా -
మనికియు నీవే మధుసూధనా
వినికియు నీవే విట్టలుడ నా -
వెనకముందు నీవే విష్ణుదేవుడా||

పురుగూ నీవే పురుషోత్తమా కోన
నట్టనడుము నీవే నారాయణా
యిట్టె శ్రీ వేంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...