Sunday, December 29, 2024

APPANI VARA PRASADHI అప్పని వర ప్రసాది

 అప్పని వర ప్రసాది 

తాళం    : ఆది
రాగం     : తిల్లంగ్ (మేళకర్త 28, హరి కాంభోజి  జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య

ఆరోహణ    : స గ3 మ1 ప ని3 స
అవరోహణ: స ని2 ప మ1 గ3 స

పల్లవి
అప్పని వర ప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||

చరణము
అంతటికి ఏలికైనా ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన అన్నమయ్య
సంతసాన చెలువొOదే సనకసనందనాదు -
లంతడివాడు తాళ్లపాక అన్నమయ్య ||

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె నన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ధమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అందమైన రామాను జాచార్యమతమును
అందుకొని నిలిచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వేంకటనాధునినిచ్చె
అందరిలో తాళ్లపాక అన్నమయ్య ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...