Sunday, December 29, 2024

NELAMOODU SOBHANAALU నెలమూడు శోభనాలు

 పల్లవి 

నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు |
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా |
కల్యాణమమ్మా..... కల్యాణమమ్మా||

చరణములు 
రామనామమతనిది రామవు నీవైతేను |
చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు |
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ||

హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు |
కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు |
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||

జలజ నాభుడతడు జలజముఖివి నీవు |
అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె |
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||

No comments:

Post a Comment

Numerology - Number 6 - న్యూమరాలజీ - 6వ సంఖ్య

న్యూమరాలజీ - 6వ సంఖ్య గ్రహము : శుక్రుడు జన్మదిన తేదీ సంఖ్య : 6, 15, 24 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 6, 15, 24 ఈ తేదీలలో పుట్ట...