Sunday, December 29, 2024

KSHEERABDI KANYAKAKU క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

 పల్లవి 

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ||

చరణములు 
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ||

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ||

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...