తాళం : ___
రాగం : నీలాంబరి (మేళకర్త __, _____ జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య
ఆరోహణ : స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స
అవరోహణ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స
పల్లవి
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
చరణములు
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన
వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన
అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు
చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయె వుయ్యాల ||
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల
మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి
నిజమైన తొడవాయె వుయ్యాల ||
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో
యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||
కమలకును భూపతికి కదలు కదలకు
మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస
మందంద చూపె నీ వుయ్యాల ||
కమలాసనాదులకు కన్నుల పండుగై
గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి
నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
No comments:
Post a Comment