Sunday, December 29, 2024

KOLANI DOPARIKI కొలని దోపరికి

 పల్లవి 

కొలని దోపరికి గొబ్బిల్లో యదు
కుల స్వామికిని గొబ్బిల్లో ||

చరణములు 
కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండొక శిశువునకు గొబ్బిల్లో |
దండగంపు దైత్యుల కెల్లను తల
గుండు గండనికి గొబ్బిల్లో ||

పాప విధుల శిశుపాలుని తిట్టుల
కోపగానికిని గొబ్బిల్లో |
యేపున కంసుని యిడుమల బెట్టిన
గోప బాలునికి గొబ్బిల్లో ||

దండివైరులను తరిమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిల్లో |
వెండిపైడి యగు వేంకట గిరిపై
కొండలయ్యకును గొబ్బిల్లో ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...