Tuesday, December 31, 2024

ANTHA RAMAMAYAM - అంతా రామమయం

 అంతా రామమయం


తాళం: ఆది

రాగం: వరాళి (మేళకర్త 39, జలవరాళి జన్యరాగ)

రూపకర్త: రామదాసు


ఆరోహణ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవరోహణ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స


పల్లవి

అంతా రామమయంబీ జగమంతా రామమయం (అం)

చరణము(లు):

అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ (అం)

సోమసూర్యులును సురలును తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు (అం)

అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ (అం)

నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు (అం)

అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులును నరిషడ్వర్గము (అం)

ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము (అం)

No comments:

Post a Comment

Numerology - Number 6 - న్యూమరాలజీ - 6వ సంఖ్య

న్యూమరాలజీ - 6వ సంఖ్య గ్రహము : శుక్రుడు జన్మదిన తేదీ సంఖ్య : 6, 15, 24 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 6, 15, 24 ఈ తేదీలలో పుట్ట...