Monday, June 16, 2025

Hastha Nakshatra - హస్త నక్షత్రం

హస్త నక్షత్రం

నక్షత్రం - హస్త
అధిపతి - చంద్రుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - కుంకుడు
జంతువు - మహిషము
నాడి - పక్షి
అధిదేవత - సూర్యుడు
రాశి - 1, 2, 3, 4 పాదాలు కన్య

హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో హస్తా నక్షత్రం 13వ నక్షత్రం. ఈ నక్షత్రం లవకుశుల జన్మ నక్షత్రంగా పేరొందినది. ఈ నక్షత్రముకు శాంతి అవసరములేదు. కానీ గ్రహణం, సంక్రమణం, పితృకాలం అనగా దర్శి మొదలగు వాని యందును, నక్షత్ర త్యాజ్యం మొదలగు సందర్భములలో శాంతి అవసరం. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము, అధిదేవత సూర్యుడు, జంతువు మహిషి (గేదె).

హస్తా నక్షత్ర జాతకులు ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థము చేసుకుంటారు. అడగగనే సహాయము చేస్తారు. మంచి స్నేహితులుగా ఉంటారు. చేసిన తప్పులను అడగకుండా తమకు తాముగా తప్పు ఒప్పుకుంటారు. దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితములో మంచి మలుపులు అవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపుకు కొంత కాలము వేచి ఉండాలి. సర్దుకు పొవడము వలన వైవాహిక జీవితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.

వీరు క్రమశిక్షణను ఇష్టపడతారు మరియు అన్ని సమస్యల్ని కూడా విచక్షణతో ఎదుర్కొంటారు. మనస్సు చురుగ్గా ఉంటుంది కనుక, అనేక ఆలోచనలు పొందుతారు. స్వభావరీత్యా నిశ్శబ్ధంగా ఉంటారు.

సామాజిక, మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. చదువులో చాలా చురుకుగా ఉంటారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే లక్షణం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా వీరు చక్కటి మాటలతో ముగిస్తారు, మరియు కాస్తంత హాస్యపూర్వకంగా ఉంటారు కూడా.

చక్కటి మానసిక సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. శాంతిని ప్రేమిస్తారు కనుక, వీరు వివాదాలకు దూరంగా ఉంటారు. వీరు కాస్తంత బిడియంగా ఉన్నప్పటికీ, వీరు కొత్త స్నేహితులను చేసుకో గలుగుతారు.

ఉద్యోగంతో పాటుగా, మరింత ఎక్కువ వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు, దీనివల్ల మరింత విజయం సాధిస్తారు. వీరి జీవితం సంతోషంగా ఉంటుంది మరియు పనికారణంగా గౌరవాన్ని పొందుతారు. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉంటారు.

వ్యక్తులను బట్టి వీరి నిర్ణయాలు మారవు, వీరికి ఏది ఇష్టం అనిపిస్తుందో, ఆ పనిని చేస్తారు. డబ్బు ఎలా ఆదా చేయాలో తెలుసు కనుక, సాధారణంగా వీరు ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనరు. వీరు శాంతి ప్రేమికులు, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు, మరియు ఆడంబరాలను పెద్దగా ఇష్టపడరు.

జీవితంలో అనేక ఒడుదుడుకులు ఉండవచ్చు, అయితే, వీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. సమస్యను ముగించడంలో నిపుణులు. మానసికంగాను మరియు శారీరకంగాను, వీరు ఎల్లప్పుడూ క్రియాత్మకంగా ఉంటారు మరియు ఖాళీగా కూర్చోవడానికి వీరు ఇష్టపడరు.

ఆనందం స్వభావం ఉంటుంది, అయితే ఎలాంటి తప్పును ఉపేక్షించలేరు. వీరి చర్యల ద్వారా కోరుకన్న ఫలితాలను పొందడం అనేది వీరి యొక్క ప్రత్యేక లక్షణం.

హస్తా నక్షత్రం మొదటి పాదము:
హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. దేవగణ నక్షత్రం. కాబట్టి వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు పరిస్థితులను బట్టి మార్చి ప్రదర్శిస్తారు.

15 ఏళ్ల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం జరుగుతుంది.

హస్త నక్షత్ర మొదటి పాదములోని జాతకులకు ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సైనికపరమైన ఉద్యోగాలు కూడా అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఎదురుకావు. 49 సంవత్సరాలకు మొదలయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాలకు వచ్చే బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా ఉంటుంది.

హస్తా నక్షత్రం రెండవ పాదము:
హస్తా నక్షత్రం రెండవ పాదం జాతకులు ఆధ్యాత్మికం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. 13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహు దశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిర పడాల్సి ఉంటుంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీ యానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది.

కళారంగం వీరికి అనుకూలం. కళారంగం వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించినది పదిల పరచుకుంటే ఇబ్బందులు ఉండవు. 47 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాలకు వచ్చే బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.

హస్తా నక్షత్రం మూడవ పాదము:
హస్తా నక్షత్ర మూడవ పాద జాతకులకు 11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్న పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి.

రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. 29 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరచుకుంటే ఇబ్బందులు ఉండవు. ఇక బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు. వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం.

ఔషధ తయారీ, ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 45 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాలకు వచ్చే బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.

హస్తా నక్షత్రం నాలుగవ పాదము:
హస్తా నక్షత్ర నాల్గవ పాద జాతకులకు తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృవర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్న పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి.

జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఉండవు.

వీరికి ఔషధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం.. వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. 43 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 61 సంవత్సరాలకు వచ్చే బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

హస్తా నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షము :
హస్తా నక్షత్రం వారు జాజి మొక్క, కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం మంచిది. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

హస్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - రోహిణి, హస్త, శ్రవణం - శరీరశ్రమ

సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ధన లాభం

విపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్యహాని

సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - క్షేమం

ప్రత్యక్ తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ప్రయత్న భంగం

సాధన తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - అశ్విని, మఖ, మూల - బంధనం

మిత్ర తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - సుఖం

అతిమిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం, లాభంహస్త నక్షత్రం కన్య (కన్యా) రాశితో సంబంధం కలిగి ఉంటుంది, దీనిని బుధ గ్రహం పాలిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వారి ఆచరణాత్మక నైపుణ్యాలు, తెలివితేటలు మరియు ఒప్పించే స్వభావానికి ప్రసిద్ధి చెందారు.

హస్త నక్షత్రం యొక్క ముఖ్య లక్షణాలు:

సానుకూల లక్షణాలు:తెలివితేటలు మరియు వనరుల లభ్యత: వ్యక్తులు వారి పదునైన మనస్సు మరియు పరిష్కారాలను కనుగొనే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు.

ఆచరణాత్మక నైపుణ్యాలు: వారు తమ చేతులతో పనిచేయడంలో మరియు ఖచ్చితత్వం అవసరమయ్యే పనులలో రాణించడంలో ప్రతిభను కలిగి ఉంటారు.

ఒప్పించే స్వభావం: వారు ఇతరులను ప్రభావితం చేసే మరియు ఒప్పించే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

ప్రేమపూర్వకమైన మరియు విలువైన సంబంధాలు: వారు ఇతరులతో తమ సంబంధాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు.

పరిపూర్ణత:పరిపూర్ణత కోసం వారి కోరిక కొన్నిసార్లు వ్యక్తిగత సంబంధాలలో అపార్థాలకు దారితీస్తుంది.

గుర్తింపు అవసరం:నైపుణ్యం ఉన్నప్పటికీ, వారి కెరీర్లలో వారికి తగిన గుర్తింపు పొందడానికి సమయం పట్టవచ్చు.

నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి
ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి 
తన్నో హస్తా ప్రచోదయాత్

హస్త: వేద పండితుల వద్ద విద్యను అభ్యసించాలి.

నక్షత్ర మంత్రం: నక్షత్రాల మంత్రాలను వారి వారి నక్షత్రాలను బట్టి రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
।। ఓం ।।
ఆయాతు దేవస్స'వితోప’యాతు ।
హిరణ్యయే'న సువృతా రథే'న ।
వహన్, హస్తగ్మ్' సుభగ్మ్' విద్మనాప'సమ్ ।
ప్రయచ్ఛంతం పపు'రింపుణ్యమచ్ఛ' ।
హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః ।
దక్షి'ణేన ప్రతి'గృభ్ణీమ ఏనత్ ।
దాతార'మద్య స'వితా వి'దేయ ।
యో నో హస్తా'య ప్రసువాతి యజ్ఞమ్ ॥


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Nirjala Ekadashi - నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి  లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది....