Monday, June 16, 2025

Uttara Phalguni Nakshatra - ఉత్తర ఫల్గుణి నక్షత్రం

ఉత్తర ఫల్గుణి నక్షత్రం

ఉత్తర ఫల్గుణి నక్షత్రము

నక్షత్రం - ఉత్తర ఫల్గుణి
అధిపతి - సూర్యుడు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - జువ్వి
జంతువు - గోవు
నాడి - ఆది
పక్షి - వడ్రంగి పిట్ట
అధిదేవత - ఆర్యముడు
రాశి - 1 వ పాదం సింహం, 2,3,4 పాదాలు కన్య

ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకుల గుణగణాలు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం, నక్షత్రములలో ఇది పన్నెండవ నక్షత్రము. ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కూడా అంటారు. ఈ నక్షత్రం అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రంగా పేరొందినది. సహోదర వర్గమునకు బలముగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికము. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. స్థిరాస్థులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. తనకు అంతగా పరిచయము లేని రంగములో ఉన్నత స్థితి సాధిస్తారు.

వీరు చాలా శక్తివంతంగా ఉంటారు మరియు ప్రతి పని కూడా చక్కగా చేయడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండటం అనేది వీరి యొక్క ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. సామాజిక కార్యక్రమాల నుంచి వీరు మర్యాదను పొందుతారు. భవిష్యత్తును ప్లాన్ చేసుకునే విషయంలో వీరు నిపుణులు.

ఎల్లప్పుడూ ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, ఈ లక్షణం వల్ల వీరు ఎప్పుడూ విజయం సాధిస్తారు. అయితే, వీరు సంతోషంగాను మరియు ఆనందంగాను ఉంటారు మరియు కొన్ని విషయాల్లో వీరు నిజంగా అదృష్టవంతులు. ప్రతి పనిని నిజాయితీగాను మరియు విధేయంగాను చేస్తారు మరియు కాస్తంత ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు.

ఏదీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత మరియు తెలివితేటలకు నిధిగా ఉంటారు. ప్రతి పని కూడా వారంతట వారే చేయడానికి ఇష్టపడతారు. సమాజంలో విభిన్న వ్యక్తిగా ఉండటం కొరకు, తరచుగా ఉత్సాహానికి గురవుతారు. వీరు డబ్బును ఆదా చేయడంలో సమర్థులు. ఆర్థికంగా, వీరు స్వతంత్రంగా ఉంటారు. కష్టపడి పనిచేసే విషయానికి వస్తే, వీరు ఎన్నడూ భయపడరు, ఇది వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది.

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం మొదటి పాదము
ఉత్తర ఫల్గుణీ మొదటి పాదములో జన్మించిన జాతకులు 6 నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 నుంచి 23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కలగటం వల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి.

41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవటంతో ఈ జాతకులు పుష్యరాగంను బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. ఇక 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ. కాబట్టి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేష్టము. అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి.

ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతి బాధలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది. ఇలా 9 వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రెండవ పాదము
ఉత్తర ఫల్గుణీ నక్షత్రము రెండో పాదములో జన్మించిన జాతకులకు తొలి 4 సంవత్సరముల నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ నడుస్తుంది. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 14 సంవత్సరముల 6 నెలల వరకు చంద్ర మహర్దశ.. వస్తుంది కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి.

14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 21 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికంను వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 39 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ.

కనక పుష్య రాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. ఇక 55 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ. కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సంవత్సరాల 6 నెలల వయస్సు నుంచి 91 సంవత్సరాల 6 నెలల వరకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం.


ఉత్తర ఫల్గుణీ నక్షత్రం మూడవ పాదము
ఉత్తర ఫల్గుణీ నక్షత్రం మూడవ పాదములో జన్మించిన జాతకులు స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని మార్గములో కూడా ఉన్నత స్థితి సాధిస్తారు.

తక్కువ ధరల్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనం విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు.

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం నాలుగవ పాదము
ఉత్తర ఫల్గుణీ నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ ఉంటుంది. ఒక సంవత్సరము 6 నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ ఉంటుంది.

11 సంవత్సరాలు 6 నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్దశ ఉంటుంది. 18 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ ఉంటుంది.

36 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 52 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ ఉంటుంది. 52 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ ఉంటుంది.

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకులు పెంచాల్సిన వృక్షము:
ఉత్తర ఫల్గుణి నక్షత్రం వారు జువ్వి చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. ఇతరులకు సహాయ సహకారాలు చేతనైనంతగా అందించడానికి కృషి చేస్తారు. ఈ నక్షత్రాధిపతైన రవికి గోధుమలు, పద్మములు, ఎర్రని వస్త్రాలు, రాగి ఇష్టమైనవి.

ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - శరీరశ్రమ

సంపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - ధన లాభం

విపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - కార్యహాని

సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - క్షేమం

ప్రత్యక్ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ప్రయత్న భంగం

సాధన తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - బంధనం

మిత్ర తార - అశ్విని, మఖ, మూల - సుఖం

అతిమిత్ర తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: ఉత్తమ ధాన్యమును సత్ప్రవర్తన గలవారికి దానం చేయాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
శ్రేష్టో' దేవానాం" భగవో భగాసి ।
తత్త్వా' విదుః ఫల్గు'నీస్తస్య' విత్తాత్ ।
అస్మభ్యం' క్షత్రమజరగ్మ్' సువీర్యమ్” ।
గోమదశ్వ'వదుపసన్ను' దేహ ।
భగో'హ దాతా భగ ఇత్ప్ర'దాతా ।
భగో' దేవీః ఫల్గు’నీరావి'వేశ ।
భగస్యేత్తం ప్రసవం గ'మేమ ।
యత్ర' దేవైస్స'ధమాదం' మదేమ ॥

ప్రయోజనాలు / లక్షణాలు:
బుద్ధిమంతులు మరియు తత్వచింతనలో శ్రద్ధ కలవారు. మానవతా దృక్పథం కలిగినవారు, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. వృత్తిలో స్థిరత మరియు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. 
కుటుంబ జీవితంలో సామరస్యంగా ఉండే స్వభావం. విద్య, రచన, అధ్యయనం వంటి రంగాలలో శ్రేష్ఠత చూపే నైపుణ్యం. ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ గుణాలు అధికంగా ఉంటాయి.

శుభ కార్యాల కోసం:
ఉత్తర ఫల్గుణి నక్షత్రం చాలా శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించబడుతుంది. వివాహం, గృహ ప్రవేశం, భూమి కొనుగోలు వంటి కార్యాలకు ఇది శుభ ఫలితాలిచ్చే నక్షత్రంగా భావించబడుతుంది.

అసలు ఈ నక్షత్రంలో పుట్టినవారు పెద్ద మనసు, ధైర్యం, ఉన్నత ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి మీద సూర్యుని ప్రభావం ఉండటంతో, నాయకత్వ, ప్రజా సేవా రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Nirjala Ekadashi - నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి  లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది....