Sunday, May 24, 2026

Sunday - ఆదివారం

ఆదివారం - భాను వాసరే 

ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అని వేదోక్తి. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే! అలాంటి ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యనారాయణుడు. ప్రత్యక్షంగా కనబడే ఏకైక భగవానుడు. అందుకే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడన్నారు.

సూర్యుడు చాలా అల్ప సంతోషి. అదెలాగంటే "ఆదిత్యో నమస్కార ప్రియః". ఆయన ఎదురుగా నిలచి చేతులు రెండు శిరసుపై జోడించి నమస్కరిస్తే చాలు, అడిగినవన్ని ప్రసాదించే దైవం సూర్యుడు.

ఆదివారం రోజు సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని మన ఇంట్లో ఎక్కడైతే సూర్యకాంతి ప్రసరిస్తుందో ఆ ప్రాంతమంతా బాగా శుభ్రం చేసుకోవాలి.

ఒక రాగి పాత్రలో కానీ వేరే ఏదైనా లోహంతో చేసిన పాత్రలో నిండుగా నీరు తీసుకొని సూర్యుని ద్వాదశ నామాలు జపిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యునికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.

ఎర్రని పుష్పాలను ముగ్గులో ఉంచాలి. ఆ ముగ్గులోకి సూర్యుని ఆవాహన చేసి ధూప దీపాలతో పూజించాలి. సూర్యునికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.

ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజున ఇంట్లో సూర్యకాంతి ప్రసరించే ప్రదేశంలో, వీలయితే ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం!

ఆదివారం సూర్యుడిని పూజించడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, విజయాన్ని ప్రసాదిస్తాడు.

ఆదివారం రోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం శ్రేయస్కరం. సూర్యుని పూజ వలన నేత్ర సంబంధిత సమస్యలు, శరీర రుగ్మతలు తగ్గుతాయని పండితులు చెబుతారు.

సూర్య మంత్రం :
 ఓం సూర్యాయ నమః

ఆరోగ్యం : సూర్యుడు ఆరోగ్యాన్ని కలిగించే దేవత. సూర్యుడిని పూజించడం ద్వారా శరీరంలోని ప్రాణశక్తి (విటమిన్ D సహా) పెరుగుతుంది. నేత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె సంబంధిత రోగాలు కూడా దూరమవుతాయని విశ్వాసం ఉంది.

మనస్సుకు ప్రశాంతత : సూర్యుడి మంత్రాల జపం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం చేసిన సూర్య నమస్కారాలు శరీరాన్ని విశ్రాంతిగా, సజీవంగా మారుస్తాయి.

గ్రహ దోష నివారణ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారికి ఆదివారం చేసే పూజల వల్ల పాజిటివ్ ఫలితాలు వస్తాయి. సూర్యుడి అనుగ్రహంతో పదవీ లాభం, ప్రభుత్వం నుంచి సహాయం, పేరు ప్రతిష్టలు లభిస్తాయి.

ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు : సూర్యుడు నాయకత్వం, దైర్యానికి సంకేతం. సూర్యుడిని నిత్యం పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి అభివృద్ధి చెందుతుంది.

పాప పరిహారం :
సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య మంత్రాలు జపించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.


నిత్య పారాయణ శ్లోకాలు

No comments:

Post a Comment

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...