మందహాస సుందరవదనారవిందంతో ప్రసన్నురాలై దశదిశలకూ కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యం తొణికిసలాడగా పలకరించింది.
అశ్వపతీ! నీ మనసులో ఉన్నది ఎమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఎమిటో అదీ తెలుసు. నీది పుత్రవాంఛ. ఆమెది పుత్రికావాంఛ. క్రమంగా రెండూ తీరతాయి. అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది.
అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన ఆదంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానయై యౌవనవతి అయ్యింది. ద్యుమత్సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్యప్రేమతో ఆనందిస్తున్నారు. ఎడాది గడిచింది.
ఒకనాడు సత్యవంతుడు సమిధలూ ఫలాలూ పుష్పాలూ తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకుని సావిత్రికూడా అతని వెంటవెళ్ళింది.
సత్యవంతుడు చెట్టుమీదనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంటపడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు.
సాధ్వీ! ఎక్కడికి వస్తున్నావు? మానవశరీరంతో నావెంట రావడానికి వీలులేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీదేహం విడిచిపెట్టి రా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుషు చెల్లింది. కర్మఫలం అనుభవించాలి కనక నాలోకం తీసుకుపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఃఖాదులన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాదిదేవతలే కర్మబద్దులు. అమరత్వాది సర్వసిద్ధులూ కర్మఫలాలే. విష్ణుసాలోక్యాది చతుష్టయంగానీ సురత్వ మానవత్వ రాజేంద్రత్వాదులుగానీ శివత్వ గణేశత్వ మునీంద్రత్వ తపస్విత్వ బ్రహ క్షత్రియాదిత్వ మ్లేచ్చత్వ జంగమత్వ శైలత్వ రాక్షసత్వ కిన్నరత్వ వృక్షత్వ పశుత్వ వనజీవిత్వ క్షుద్రజంతుత్వ కృమిత్వ దైత్యత్వ దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి.
యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రపత్తులతో స్తుతించి ప్రశ్నలవర్షం కురిపించింది. యమధర్మరాజా! కర్మకు హేతువేమిటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది? జ్ఞానమంటే ఎమిటి? బుద్ది అంటే ఎమిటి? ప్రాణమంటే ఏమిటి? ఇంద్రియాలూ వాటి లక్షణాలూ ఏమిటి? దేవతలంటే ఎవరు? భోగమంటే ఎమిటి? భోక్త ఎవరు? భోజయిత ఎవరు? నిష్కృతి ఎమిటి? జీవుడెవరు? పరమాత్మ ఎవరు? దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చు - అని అభ్యర్థించింది.
సావిత్రీ! వేదం ఏది చెబితే అది ధర్మం. ఏది ఆచరించమంటే అది కర్మ ఆది మంగళప్రదం. వేదోక్తాలు కాని కర్మలన్నీ అమంగళాలు. నిష్కామంగా సత్కర్మలను(దైవకార్యాలను) అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అదే ఉత్తమభక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ మృత్యు జరా వ్యాధి శోక భయాలు ఉండవు.
సాధ్వీ! భక్తి రెండు విధాలు. ఒకటి నిర్వాణప్రదం. రెండవది హరిరూపప్రదం. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వరులు మొదటిది కోరుకుంటారు. వైష్ణవులు రెండవది అభిలషిస్తారు.
భగవంతుడు అంటే కర్మస్వరూపుడు. పరమాత్మ పరాప్రకృతి. అతడే కర్మబీజం. అతడే కర్మహేతువు. కర్మఫలప్రదుడు. దేహధారి నశ్వరం.
జగత్సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించేది (కర్త) దేహి. అతడే భోక్త. ఆత్మ -భోజయిత(అనుభవింపజేసేది). భోగమంటే విభవభేదం. నిష్కృతియే ముక్తి. సదసద్భేదబీజం జ్ఞానం. వివేచనాశక్తియే బుద్ధి. అది జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలు. దేహధారులకు బలప్రదాలు. ఇంద్రియాలకు ప్రభువై ఈశ్వరాంశమై కర్మలకు ప్రేరకమై దుర్నివార్యమై అనూహకమై అనిరూప్యమై అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్నే మనస్సు అంటారు.
లోచనాది జ్ఞానేంద్రియాలు అయిదూ శరీరులకు అంగరూపాలై కర్మప్రేరకాలు అవుతున్నాయి అవ్వే మిత్రులూ అవ్వే శత్రువులు. అవే సుఖప్రదాలు. అవే దుఃఖప్రదాలు.
సూర్యుడు వాయువు పృథివి బ్రహ్మాదులు - వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణ - దేహధారిని జీవుడంటారు. పరమమూ వ్యాపకశీలమూ నిర్గుణమూ ప్రకృతికి అతీతమూ కారణకారణమూ అయినది బ్రహ్మ అదే పరమాత్మ.
వత్సా! అడిగావుకదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగివెళ్ళు - అంటూ యముడు ముందుకి నడిచాడు.
మహానుభావా! ఎక్కడికి వెడతాను? ఎలా వెడతాను? నా భర్తనూ జ్ఞానసముద్రుడవైన నిన్నూ విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలకన్నింటికి నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గనరక హేతువులైన కర్మలు ఏమిటి? ముక్తిప్రదాలు ఏవి? భక్తిప్రదాలు ఏవి? ఏ కర్మాచరణంవల్ల యోగి అవుతున్నాడు? రోగి అవుతున్నాడు? దీర్ఘజీవి అవుతున్నాడు? అల్పాయుష్కుడవుతున్నాడు? సుఖి కాగలుగుతున్నాడు? దుఃఖి అవుతున్నాడు? అంగవిహీనుడు బధిరుడు అంధుడు పంగువు (కుంటి) ప్రమత్తుడు దాత అతిలుబ్ధుడు చోరుడు - ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఎది? బ్రాహ్మణత్వ తపస్విత్వాదులు ఏ కర్మల ఫలాలు? స్వర్గభోగమూ వైకుంఠమూ లభించాలంటే ఏ కర్మలు చెయ్యాలి? సర్వోత్కృష్టమూ నిరామయమూ అయిన గోలోకం లభించేది ఎలాగ? నరకలోకాలు ఎన్ని? వాటి పేర్లు ఎమిటి? ఎవడు నరకానికి పోతాడు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధిఫలం? ఇవన్ని నాకు తెలియజెప్పు - అని అభ్యర్థించింది సావిత్రి.
ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తోంది ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రీ! ఇంతాజేస్తే నీకు పన్నెండేళ్ళు లేవు. కానీ యోగులకూ జ్ఞానులకూ మించిన జ్ఞానం కనపడుతోంది నీ ప్రశ్నల్లో మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు. అందుకే ఆపేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రీ సమానవు. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడికి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా - సత్యవంతుడికి నువ్వు సౌభాగ్యదేవతపు సుప్రియవు. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతిదేవిలాగా, అగ్నికి స్వాహాదేవి లాగా, పితృదేవతలకు స్వధాదేవిలాగొ, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా నువ్వు సత్యవంతుడికి సౌభాగ్యదేవతవు. హృదయేశ్వరివి. నీ జ్ఞానానికీ నీ జిజ్ఞాసకూ ఆనందించాను. వరం ఇస్తున్నాను. ఏమి కావాలో కోరుకో - అన్నాడు.
మహాభాగా! సత్యవంతుడికి ఔరసులైన పుత్రులు నూర్గురు నాకు కలిగేటట్టు వరమియ్యి. నా తండ్రికి నూర్గురు పుత్రుల్నీ మామగారికి చూపునీ రాజ్యలాభాన్నీ అనుగ్రహించు. లక్ష సంవత్సరాల తర్వాత జన్మాంతంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ప్రసాదించు. జీవుల కర్మవిపాకంగురించీ విశ్వవిస్తారబీజం గురించీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి. కనక తెలియజెప్పు - అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు.
పతివ్రతాశిరోమణీ! అలాగే. నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. జీవకర్మవిపాతం అడిగావుకదూ! ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రం. శుభాశుభకర్మలన్నింటికీ అనుభవక్షేత్రం. జీవకోటి తమతమ కర్మానుసారం ఆయా రూపాల్లా ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తుంటారు. మిగతా లోకాలలో కర్మఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత.

No comments:
Post a Comment