Thursday, May 21, 2026

Friday Sri Maha Lakshmi Devi - శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి

శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి

శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, దీపం వెలిగించి అమ్మవారిని స్మరిస్తే. ఆ ఇల్లు వైకుంఠంలా మారుతుంది.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శుక్రవారానికి, లక్ష్మీదేవికి అత్యంత విడదీయలేని సంబంధం ఉంది. శుక్రవారాన్ని "భృగువాసరం" అని కూడా పిలుస్తారు. ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శుక్ర గ్రహం మరియు లక్ష్మీదేవి: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్ర గ్రహం భోగభాగ్యాలకు, కళలకు, అందానికి మరియు సౌకర్యాలకు కారకుడు. లక్ష్మీదేవి కూడా ఐశ్వర్య ప్రదాయిని కావడంతో, శుక్రవారం నాడు ఆమెను పూజిస్తే శుక్ర గ్రహ దోషాలు తొలగి, జాతకంలో శుక్రుడు బలపడతాడని చెబుతారు.


సముద్ర మధనం - పుట్టుక: పురాణాల ప్రకారం, క్షీరసాగర మధనం జరిగినప్పుడు మహాలక్ష్మి ఉద్భవించింది. ఆమె శుక్రుడికి సోదరి సమానురాలని మరియు క్రితం జన్మలో భృగు మహర్షి పుత్రిక. అందుకే శుక్రవారం ఆమెకు ప్రీతిపాత్రమైన రోజైంది.

స్థిరలక్ష్మి నివాసం: శుక్రవారం సాయంత్రం ఇల్లు శుభ్రంగా ఉంచుకుని, దీపారాధన చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుందని నమ్ముతారు.

ఎక్కడైతే శుక్రవారం నిష్ఠతో మహాలక్ష్మి పూజ జరుగుతుందో, అక్కడ దారిర్ధ్యం దరిచేరదు. ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల నమ్మకం.

శుక్రవారం పూట చేసే భక్తికి మెచ్చి, ఆ ఇంట్లో 'స్థిర లక్ష్మి'గా కొలువై ఉంటుంది. అంటే సంపాదించిన ధనం వృధా కాకుండా ఇంట్లోనే నిలుస్తుంది.

కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లోని కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో ప్రశాంతత లభిస్తాయి.

మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం చదువుతూ అమ్మవారికి పాయసం లేదా తెల్లటి పదార్థాలను నైవేద్యంగా పెడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఒక తెలియని వెలుగు, ఆనందం ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.


శుక్రవారం పాటించవలసిన సంప్రదాయాలు:
ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించడం. మహాలక్ష్మి విగ్రహానికి లేదా ఫోటోకు పసుపు, కుంకుమలతో పూజ చేయడం.

"శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి" లేదా "కనకధారా స్తోత్రం" పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.

ఒక చిన్న సూచన:
శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉప్పు లేదా పులుపు వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదని పెద్దలు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్లకుండా ఉంటుందని భావిస్తారు.

No comments:

Post a Comment

Adhika Jyeshta Maasam - అధిక జ్యేష్ఠ మాసం

అధిక జ్యేష్ఠ మాసం అధిక జ్యేష్ఠ మాసం అనేది హిందూ పంచాంగం ప్రకారం చాలా పవిత్రమైన మరియు విశేషమైన సమయం. సూర్య మానానికి, చంద్ర మానానికి మధ్య వచ్చ...