Sunday, May 24, 2026

Saturday - శనివారం

శనివారం

హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు శనివారం రోజు చేయాల్సిన పనులు:
శనివారం రోజున హనుమంతుడిని భక్తితో కొలిస్తే, శని దేవుని ఆగ్రహం చల్లారి, జాతకంలోని ఏల్నాటి శని దోషాలు తొలగిపోతాయి.

ఈ పవిత్రమైన రోజున గుడిలో లేదా ఇంట్లో కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక భయాలు, ఒత్తిడి పూర్తిగా దూరం అవుతాయి.

ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో (లేదా ఆవనూనెతో) దీపం వెలిగించి, సింధూర బొట్టు పెట్టడం వల్ల అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.

హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల మాల లేదా సింధూర మాల సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి.

హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమంతునికి సమర్పిస్తే హనుమంతుడు సంతోషిస్తారని చెబుతున్నారు.

శనివారం రోజున ఆంజనేయస్వామి వారికీ ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

శనిదేవుని అనుగ్రహం పొందేందుకు శనివారం రోజు చేయాల్సిన పనులు:
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎంతో తెలివిగా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలి. అయితే చాలా శాతం మంది ఆర్థిక విషయాలలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. శనివారం రోజు ఆర్ధిక వృద్ధి కోసం కొన్ని పరిహారాలు మరియు పూజలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. 

నల్ల నువ్వులు, నల్ల దుస్తులు లేదా ఆహారం దానం చేయడం ద్వారా శనిదేవుని కరుణ పొందుతారని శాస్త్రాల్లో చెప్పబడింది.

శమీ చెట్టుకు పూజ:
శనివారం నాడు శమీ చెట్టుకు నమస్కరించి, నీరు పోయాలి. 

శని మంత్రాలు:
'ఓం శనైశ్చరాయ నమః' మంత్రాన్ని 11 సార్లు జపించాలి. 

ఆవునేతితో దీపారాధన:
శనివారం నాడు ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేయాలి. 

పేదలకు సహాయం:
శనివారం రోజు పేదలకు, చిన్న పిల్లలకు సహాయం చేయాలి. 

శనిదేవుడిని ధ్యానించడం:
శనిదేవుడిని ధ్యానించి, ఆయన అనుగ్రహం కోరుకోవాలి. 

శనివారం నాడు నూనెతో దీపారాధన: 
నూనెతో దీపారాధన చేయాలి. శనివారం రోజు ఈ పరిహారాలు మరియు పూజలు చేయడం ద్వారా ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి, శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది

No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...