Sunday, April 3, 2016

JYOTHISHA SHASTRAMU - జ్యోతిషశాస్త్రము

జ్యోతిష్యం నేర్చుకుందామా 

1. చాంద్ర సంవత్సరము 

శుక్ల పాడ్యమి మొదలు బహుళ అమవాస్యాంతము వరకు ఒక నెల (అమవాస్యాంతము మొదలు అమవాస్యాంతము) అట్టి 12 నెలలు ఒక సంవత్సరముగా గణన చేయుదురు. 

తెలుగు సంవత్సరముల పేర్లు 

1  . ప్రభవ,  2. విభవ, 3. శుక్ల, 4, ప్రమోద్యూత, 5. ప్రజోత్పత్తి, 6. అంగీరస, 7. శ్రీముఖ, 8. భావ, 9. యువ, 10. ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాధి, 14.విక్రమ, 15.వృష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, 30.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత్, 37.శోభకృత్, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత్, 46.పరిధావి, 47.ప్రమాది, 48.ఆనంద, 49.రాక్షస, 50. నల, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్థి, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58.రక్తక్షి, 59.క్రధన, 60.క్షయ(అక్షయ). 

అయనములు 

1. ఉత్తరాయనము : సూర్యుడు మకరరాశిని ప్రవేశించినది మొదలు మిధునరాశి చివరివరకు సంచరించు 6 మాసముల కాలము ఉత్తరాయన మనబడును. ఈ కాలమునందన్ని శుభ కర్మల నాచరించుట ప్రశస్థము. 
2. దక్షిణాయనము : మిగిలిన 6 మాసముల కాలమును దక్షిణాయనము అందురు. 

ఋతువులు

1. వసంతము
2. గ్రీష్మము
3. వర్షము
4. శరత్
5. హేమంత  
6. శిశిర 

మాసములు 

1. చైత్రము 
2. వైశాఖము 
3. జ్యేష్టము,
4. ఆషాడము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీయుజము
8. కార్తీకము
9. మార్గశీర్షము
10. పుష్యము
11. మాఘము

శూన్యాధిక మాసములు

1. సూర్యుడు మీనరాశి యందు సంచరించు కాలంలో గల చైత్రమాసము,
2. మిధునరాశి సంచార కాలంలో గల ఆషాడమాసము,
3. కన్యారాశి సంచారంలో గల భాద్రపద మాసము,
4. ధనూరశి సంచారంలో గల పుష్యమాసము, 
ఫై మాసములను శూన్య మాసములు అందురు. ఈ మాసములలో శుభకర్మలనాచరించరాదు. ఏ మాసమునందు రవికి వేరొక రాశి యందు ప్రవేశించుటయుండదో (శుక్లపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు గల కాలము) అట్టి మాసము అధిక మాసమనబడును. ఒకే మాసము నందు రెండు రాశులలో సూర్య ప్రవేశము జరిగిన యెడల ఆ మాసము క్షయ మాసమనబడు, అధిక, క్షయ మాసములు రెండు అన్ని శుభకర్మలకు యోగ్యములు కావు. 

పక్షము 

1. శుక్ల (శుద్ధ) పక్షము : అన్ని శుభ కర్మలకు ప్రాశస్తమైనది 
2. కృష్ణ (బహుళ) పక్షము : కొన్ని ప్రత్యేక కార్యములకు ప్రాశస్తమైనది 

తిధులు 

1. పాడ్యమి 
2. విదియ 
3. తదియ 
4. చవితి 
5. పంచమి 
6. షష్టి 
7. సప్తమి 
8. అష్టమి 
9. నవమి 
10. దశమి 
11. ఏకాదశి 
12. ద్వాదశి 
13. త్రయోదశి 
14. చతుర్దశి 
15. పొర్ణమి, అమావాస్య 
శుక్ల పక్షము నందు మొదటి 5 తిధులు కృష్ణ పక్షము నందు చివరి 5 తిధులు మంచివి కావు 
శుక్ల పక్షము కృష్ణ పక్షము రెంటి యందు రెండవ 5 తిధులు సామాన్య ఫలప్రదము
శుక్ల పక్ష మూడవ 5 తిధులు కృష్ణ పక్షమందు మొదటి 5 తిధులు ఉతమ ఫలప్రదము. రిక్త తిధులు ఉభయ పక్షములందు అప్రశస్తమైనవి. 

తిధివార యోగములు 

అది, మంగళవారములందు నంద తిధులు 
సోమ, శుక్రవారములందు   భద్ర తిధులు 
బుధవారము నందు           జయ తిధులు 
గురువారము నందు           రిక్త తిధులు 
శనివారము నందు             పూర్ణ తిధులు 
కలిగి యుండిన యెడల మృత్యు ప్రదము. 
మంగళవారము నందు జయ తిధులు, బుధవారము నందు భద్ర తిధులు, గురువారము నందు పూర్ణ తిధులు, శుక్రవారము నందు నంద తిధులు, శనివారము నందు రిక్త తిధులు కల్గియుండిన యెడల మిగులు శుభప్రదము. 

వారములు 

1. ఆదివారము 
2. సోమవారము 
3. మంగళవారము 
4. బుధవారము 
5. గురువారము 
6. శుక్రవారము 
7. శనివారము

ఇందు ఆది, మంగళ, శనివారములు శుభకర్మల నాచరించుటకు కూడవు. సోమ, బుధ, గురు, శుక్ర వారములు ప్రశస్థము. 

నక్షత్రములు 

6. ఆర్ద్ర 
7. పునర్వసు 
8. పుష్యమి 
9. ఆశ్లేష 
10. మఘ 
14. చిత్త 
15. స్వాతి 
16. విశాఖ 
17. అనూరధ 
18. జ్యేష్ఠ 
19. మూల 
20. పుర్వాషాడ 
21 ఉతరాషాడ 
22. శ్రవణం 
23. ధనిష్ఠ
24. శతభిషం 
25. పూర్వాభాద్ర  
26. ఉత్తరాభాద్ర 
27. రేవతి 

నక్షత్ర సంజ్ఞలు 

మొత్తం 27 నక్షత్రములు ధ్రువ, చర, ఉగ్ర, సాధారణ, క్షిప్ర మృదు, దారుణ సంజ్ఞలు కలిగియుండగలవు 
1. రోహిణి, ఉత్తర,  ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర - ధ్రువ నక్షత్రములు 
2. పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషములు - చర నక్షత్రములు 
3. భరణి, పుబ్భ, మఘ, పూర్వాషాడ, పూర్వాభాద్ర - ఉగ్ర నక్షత్రములు 
4. కృత్తిక, విశాఖలు - సాధారణ నక్షత్రములు 
5. అశ్వని, పుష్యమి, హస్త, అభిజిత్ లు - క్షిప్ర నక్షత్రములు 
6. మ్రుగశిర, చిత్త, అనూరాధ, రేవతిలు - మృదు నక్షత్రములు 
7. ఆర్ద్ర, ఆశ్లేష, జ్యేష్ట మూలలు - దారుణ నక్షత్రములు 
8. భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, మూలలు - అధొముఖములు 
9.ఆర్ద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర రోహిణిలు ఊర్ధ్వముఖములు
10. అశ్వని, మృగశిర, పునర్వసు హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, రేవతీలు -తిర్యోజ్గ్ముఖములు 
11. అశ్వని, రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు సాధారణంగా శుభ కార్యములకు యొగ్యమ్య్నవి. 
12. పునర్వసు, పుష్యమి, మఘ స్వాతి, మూల నక్షత్రములు కొన్ని సందర్భములలో కొన్నికార్యములకు శుభప్రదమై యున్నవి. 
13. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్లేష, పుబ్భ, విశాఖ, జ్యేష్ఠ పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రములు అన్ని కార్యములకు అయొగ్యములు. 

దుష్టతిధి వార నక్షత్ర యోగములు 

1. పంచమీ తిధి - హస్తా నక్షత్రము, ఆదివారం కలిసిన యోగము అదే విధముగా 
2. సప్తమీ తిధి - అశ్వనీ నక్షత్రము, మంగళవారం 
3. షష్ఠి తిధి    - మృగశిరా నక్షత్రము, సోమవారము 
4. అష్టమీ తిధి - అనూరాధ నక్షత్రం, బుధవారం 
5. దశమీ తిధి - రేవతీ నక్షత్రం, శుక్రవారం 
6. నవమీ తిధి - పుష్యమీ నక్షత్రం, గురువారం 
7. ఎకదశి తిధి రోహిణి నక్షత్రం, శనివారం ఫై విధంగా తిధి వార నక్షత్రములు కలిగిన సమయమునందు సమస్త శుభకార్యములు ఆచరించరాదు. 
శ్లో॥ భోమాశ్వని ప్రయాణంచ ప్రవేశే శని రోహిణి । 
      వివాహే గురు పుష్యేతు షాణ్మాసం మరణం ధృవమ్ ॥ 
అను ప్రమాణముండుట వలన అశ్వనీ మంగళవారము నందు ప్రయాణము, రోహిణి శనివారము నందు గృహ ప్రవేశము, పుష్యమీ గురువారము నందు వివాహమును ముఖ్యముగా చేయకూడదు. ఆయా తిది నక్షత్ర వారములతో కూడిన దుష్ట యోగములందు వాటి నాచరించిన మరణ ప్రదము కాగలదు.

యోగములు 

1. విష్కంభము 
2. ప్రీతి
3. ఆయుష్మాన్
4. సౌభాగ్య
5. శోభన 
6. అతిగండ 
7. సుకర్మ 
8. దృతి 
9. శూల 
10. గండ 
11. వృద్ధి
12. దృవ 
13. వ్యాఘాత 
14. హర్షణ 
15. వజ్ర 
16. సిద్ధి 
17. వ్యతీపాత 
18. వరీయాన్
19. పరిఘ 
20. శివ 
21. సిద్ధి 
22. సాధ్య 
23. శుభ 
24.  శుభ్ర 
25. బ్రహ్మ
26. ఐంద్ర 
27. వైదృతి
మొత్తం 27 యోగములు ఇందు విష్కంభము, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వరియాన్, పరిఘ, వైద్రుతియను 9 యోగములు మాత్రము సమస్త శుభ కర్మలయందు పనికిరావు. మిగిలిన యోగములు శుభప్రదము . 

కరణములు 

1. బవ 
2. బాలువ 
3. కౌలువ
4. తైతుల 
5. గరజి 
6. వణజి
7. భద్ర 
8. శకుని 
9. చతుష్పాత్ 
10. నాగవ 
11. కింస్తుఘ్నము 
మొత్తం 11 కరణములు వీటిలో మొదటి ఏడు కరణములు చర సంజ్ఞ గలవి. మిగిలిన నలుగు స్థిర సంజ్ఞ గలవి. ఈ కరణములు ప్రతిదినము వరుస క్రమములో రాజాలవు. గణిత విధానముననుసరించి ఒక తిధికి రెండు కరణము లేర్పడుచుండ గలవు. మరియు శుక్ల, కృష్ణ పక్షముల యందు గల భేదముచే కరణములు మార్పుజెందు చుండగలవు. వీనియందు భద్రకరణము, శకుని కరణము శుభకార్యములయందు గొప్ప దోష ప్రదములు, గరజి, వణజి, చతుష్పాత్, నాగవ, కింస్తుఘ్న కరణములు సామాన్య దోష ప్రదములు, మిగిలిన బావ, బాలువ, కౌలువ, తైతుల కరణములు మాత్రమే శుభకార్యములు శుభప్రదమై యున్నవి. 

సంవత్సరము నందలి అయనము, ఋతువు, మాసము, పక్షము, తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణములను పంచాంగ యుక్త మగు కాల విశిష్ఠతను వివరణత్మకమగు యోగ్యా యోగ్యతలను గుర్తించుట ముహూర్త నిర్ణయమునకు అతి ముఖ్యాంశము. పంచాంగ శుద్ధి ప్రధమ కర్తవ్యము. 

గ్రహములు -వివరములు

2. చంద్రుడు 
4. బుధుడు 
6. శుక్రుడు 
7. శని 
8. రాహువు 
9. కేతువు 

ప్రతివారికి వారి వారి జాతకములు ననుసరించి జీవిత కాలంలో అనేక శుభా శుభ ఫలితము లీ నవగ్రహములవల్లనే 
కలుగుచుంటవి. వీరిలో గురు, శుక్ర, పూర్ణ చంద్రులు మాత్రమే నైసర్గిక శుభ గ్రహములు! మిగిలినవారు నైసర్గిక పాప గ్రహములు లగుదురు. బుధుడు - ఏ గ్రహ సంభంధమును పొంది యుండిన ఆ గ్రహముయొక్క  శుభ లేక పాపత్వములు కలిగియున్దగలడు. జాతక చక్రములు పరిశీలించుటకు ముందు - ఈ గ్రహముల యొక్క  పూర్తి స్వరూప -స్వభావములు, వీరికి కల్గు శుభా - శుభ స్థితి మరియు ఉచ్ఛ - నీచలు, పరస్పర శత్రు - మిత్రత్వములు  పరిశీలించుట చాల అవసరము! కేంద్ర స్థానములకు ఆధిపత్యము వహించిన  నైసర్గిక శుభ గ్రహములు - పాప (అశుభ ) ఫలితములు నివ్వగలవు. అదే విధముగా కోణ స్థానదిపత్యము నందిన నైసర్గికపాపగ్రహములు కూడా చెడు ఫలితములనే కలుగజేయును. సహజముగా దుష్ట స్థానములని చెప్పబడు - లగ్నాధి 6, 8, 12 స్థానముల ఆధిపత్యము - ఏ గ్రహములకు కలిగినను వారు మంచిని చేయగలరు. 2, 3, 11 ఆధిపత్యములు కూడా అంత మంచివి కావు. 

లగ్నాధిగా స్థాన వివరణ

కేంద్ర స్థానములు:-  1, 4, 7, 10 (కంటకములు )

త్రికోణస్థానములు :- 1, 5, 9 (కోణములు )

అపచయ స్థానములు :- 1, 2, 4, 5, 7, 8, 9, 12

ఉపచయ స్థానములు :-3, 6, 10, 11

పణ పరములు :- 2, 5, 8, 11

అపో క్లీబ స్థానములు :- 3, 6, 9, 12

త్రిషడాయములు :- 3, 6, 11

త్రికములు 6, 8, 12

గ్రహద్రుష్టి :- ప్రతి గ్రహము తానున్న రాసి నుండి ఏడవ రాశిని, అందలి గ్రహములను వీక్షించగలదు . మరియు గురువు ఫైవిధముగా గానే 5, 9 రాశుల యందు,  కుజుడు 4, 8 రాశుల యందు , శని 3, 10 రాశుల యందు విశేష దృష్టి కలిగియుండగలరు. 7 వ రాశి యందలి దృష్తి పూర్ణ దృష్టి! శనికి - 3, 10 స్థానముల దృష్టి, కుజునికి - 4, 8 స్థానముల దృష్టి, గురునికి - 5, 9 స్థానముల దృష్టి విశేష బలము గలిగి యుండగలవు. 

గ్రహములు - ఆధిపత్యాదులు 

గ్రహ
ములు 
ఆధిపత్య
స్వస్థలము
ఉచ్చ
రాశులు
పరమోచ్చ 
భాగాలు
నీచ 
రాశులు
పరమనీచ 
భాగాలు
మూల 
త్రికోణాలు
మిత్ర 
గ్రహములు
సమ 
గ్రహములు
శత్రు 
గ్రహములు
రవిసింహముమేష10తుల10
సింహం 
2/3భాగం
చం, కు,
గు 
బు శ , శు 
చంద్రకర్కాటకంవృషభం3వృశ్చిక3
(వృషభం) 
కర్కాటకం
ర, బుకు, గు,
శు , శ  
-
కుజ 
మేషము 
వృశ్చికం
మకరం 28కర్కాటక 15
మేషం 
12/30 బాగం 
ర, చం,
గు 
శు, శ,బు 
బుధ
మిధునం 
కన్య
కన్య15 మీన 15
కన్య 
2వ భాగం
ర, శు, కు, గు, శ చం 
గురు 
ధనుస్సు 
మీనము
కర్కాటక5మకరం5
ధనస్సు 
1/3భాగం
ర, చంశ బు, శు 
శుక్ర
వృషబం 
తుల
మీనం27కన్య27 
తుల 
9/10 భాగం
బు, శ కు, గు ర, చం 
శని 
మకరం  
కుంభం 
తుల 20మేషం 20
కుంభం  
2/3భాగం 
బు, శు గు ర, చం, కు 
రాహు
మిధునం
ధను 
సింహం శు, శ బు, గు ర, చం, కు 
కేతు 
ధను 
మిధునం 
కుంభం ర, చం, కు బు, గు శు, శ 


" సృష్టి, స్థితి, లయములను కలిగింపుచు కొనసాగుచున్న కల చక్రమునందు వివిధ దశలు సంప్రాప్తించుటకు ఆధార భూతమైనది "భచక్రము" అందు నిరంతరము సంచరించునవి గ్రహములు!" అని సనాతన జ్యోతిశ్శాస్త్ర భిప్రాయము.

భచక్రము 12 రాశులుగా విభజింపబడి, అందు 27 నక్షత్రములు, 108 నక్షత్ర పాదములు కల్గి, 360 భాగాల (డిగ్రీల) ప్రమాణమై యున్నది. వర్తులాక్రుతిగల భూమి తన చుట్టూ తాను తిరుగుచున్నపుడు ఏ ప్రదేశంలో, ఏ సమయంలో బచక్రమునందలి ఏ రాశి యొక్క కిరణములు భూమి ఫై బడునో ఆ సమయంలో అ సమయంలో ఆ రాశియే జాతకుల జన్మలగ్నము కాగలదు . జన్మలగ్నము ననుసరించియే జాతకుల యొక్క శేషించిన తను ధనాది భావము లెర్పడుచున్నవి. ఈ విధమైన లగ్న నిర్ణయమును గావించుటయే జ్యోతిశ్శాస్త్రంలో బహుకష్టమైన విషయము ఇందుకు జాతకుడు జన్మించిన సమయము, ఆ ప్రదేశమునందలి అక్షాంశ - ధీర్గంశలు, ఆయనాంశాలు, మొదలగునవెన్నో విషయములను పరిశీలించి, జన్మలగ్న నిర్ణయము గావింపవలసియున్నది

జన్మలగ్నముతో బాటుగా జాతకుని ఫలితములను గమనించునపుడు చంద్రలగ్నము (చంద్రుడున్న రాశి), రవి లగ్నము (రవి యున్న రాశి ), నవాంశ లగ్నము (జన్మ లగ్నము యొక్క నవాంశ ) లను కూడా పరిగణన లోనికి తీసుకోవలసి యున్నది. జననము మొదలు 30 సంవత్సరముల వరకు జన్మ లగ్నము నుండి, పిమ్మట 60 సం।।ల వరకు చంద్ర లగ్నము నుండి, తరువాత 90 సం॥ ల వరకు రవి లగ్నము నుండి, అటు పిమ్మట నవాంశలగ్నము నుండి జాతకుని యొక్క ఫలితములను ధెల్పవలెనని కొందరు శాస్త్రకారుల అభిప్రాయము. ముఖ్యముగా ఫలితములను పరిశీలీంచునప్పుడు జన్మకాలమునకు గల ద్వాదశ భావముల యొక్క సహజస్థితి (భావస్పుటము) గ్రహముల యొక్క స్పుట, బాగా, లిప్తలు, షడ్వర్గ బలము, అష్టకవర్గ బలము, ఆధిపత్యములు, యుతి, దృష్తి అను వానిని వివిధ రకాలుగా పరిశీలించి, గ్రహింపకుండిన ఫలితములు తారుమారు కగలవు.

జాతక ఫలితములను దెల్పుటకు జన్మకాలమునందలి గ్రహస్థితులతో బాటుగా ఆయా దశా భుక్తుల యొక్క కాలము నందలి గోచార గ్రహముల యొక్క బలాబలములుగూడా ఆలోచించుట సమంజసము. చంద్ర స్థితి, రాశి నుండి ఏర్పడు ఈ గోచార గ్రహముల ప్రభావము జాతకుని ధశాంతర్ధశా ఫలితముల ఫై తప్పక ఏర్పడగలదు. గోచారము నందలి గ్రహముల ద్వారా ఫలితములనాలోచించునప్పుడు వేదలు, అష్టక వర్గము ప్రాధాన్యత కల్గియుండగలవు. కావున జన్మలగ్న, చంద్రలగ్నముల ద్వారా ఆయా వయోకాలముల యందలి జ్యోతిష ఫలితములను నిర్దుష్టముగా గుర్తించుటకు వీలు కల్గుచున్నధి.

ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు  


1.మేష లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టాదిపతి బుధుడు, చతుర్దాదిపతి చంద్రుడు, పంచమాదిపతి రవి, నవమ వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని. 

2.వృషభ లగ్నమునకు : లగ్నషష్టాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, తృతీయాధిపతి చంద్రుడు, చతుర్దాధిపతి రవి, సప్తమవ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి గురువు, నవమ దశమాధిపతి శని!

3.మిధున లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, షష్టలాభాధిపతి  సప్తమ దశమాధిపతి గురుడు, అష్టమ నవమాధిపతి శని!

4.కర్కాటకలగ్నమునకు : లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయవ్యాయాధిపతి బుధుడు, చతుర్ధ లాభాధిపతి శుక్రుడు, పంచమ ధశమాధిపతి కుజుడు,  షష్టభాగ్యాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి శని!

5.సింహ లగ్నమునకులగ్నాధిపతి రవి, ద్వితీయ లభాదిపతి  బుధుడు, తృతీయ ధశమాధిపతి శుక్రుడు, చతుర్ధ భాగ్యాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ట సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చన్ద్రుదు. 

6.కన్యా లగ్నమునకు : లగ్న దశమాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యదిపతి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి కుజుడు, చతుర్ధ సప్తమాధిపతి గురువు, పంచమ షష్టధిపతి శని, లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి. 

7.తులా లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు, తృతీయ షష్టధిపతి గురువు, చతుర్ధ పంచమా ధిపతి శని, నవమ వ్యయాధిపతి బుధుడు, దశమాదిపతి చంద్రుడు, లాభాధిపతి రవి! 

8.వృశ్చిక లగ్నమునకు : లగ్నషష్టాధిపతి కుజుడు, ద్వితీయ పంచమాధిపతి గురువు, తృతీయ చతుర్ధధిపతి శని, సప్తమ వ్యయధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి బుధుడు, నవమాధిపతి చంద్రుడు దశమాదిపతి రవి!

9.ధనుర్లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి గురువు, ద్వితీయ తృతీయధిపతి శని, పంచమ వ్యయాధిపతి కుజుడు, షష్ట లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు,  నవమాధిపతి రవి!

10.మకర లగ్నమునకు :లగ్న ద్వితీయాధిపతి శని, తృతీయ వ్యయాధిపతి గురువు,  చతుర్ధ లాభాధిపతి కుజుడు, పంచమ దశమాదిపతి శుక్రుడు, షష్ట నవమాధిపతి బుధుడు, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి రవి!

11. కుంభ లగ్నమునకు : లగ్న వ్యయాధిపతి శని, ద్వితీయ లాభాధిపతి గురువు, తృతీయ ధశమాధిపతి కుజుడు, చతుర్ధ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమ అష్టమాధిపతి బుధుడు, షష్టాధిపతి చంద్రుడు, సప్తమాధిపతి రవి!
12. మీన లగ్నమునకు : లగ్న దశమాదిపతి గురువు, ద్వితీయ నవమాధిపతి కుజుడు, తృతీయ అష్టమాధిపతి శుక్రుడు, చతుర్ధ సప్తమాధిపతి బుధుడు, పంచమాధిపతి చంద్రుడు, షష్టాధిపతి రవి, లాభవ్యయాధిపతి శని!

ద్వాదశ లగ్నములకు శుభ - పాప గ్రహములు 

1. మేష లగ్నమునకు రవి, గురులు శుభులు! బుధ, శుక్ర, శనులు పాపులు!!
2. వృషభ లగ్నమునకు రవి, శనులు, శుభులు! చంద్ర, గురు, శుక్రులు పపులు!!
3. మిధున లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! రవి, కుజ, గురు, శనులు పాపులు!!
4. కర్కాటక లగ్నమునకు కుజ, గురులు శుభులు! బుధ, శుక్రులు పాపులు!!
5. సింహ లగ్నమునకు కుజుడు మాత్రమే శుభుడు!బుధ, శుక్రులు పాపులు!!
6. కన్యా లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! చంద్ర, కుజ, గురు పాపులు!!
7. తులా లగ్నమునకు బుధ, శనులు శుభులు! రవి, కుజ, గురులు పాపులు!!
8. వృశ్చిక లగ్నమునకు గురువు మాత్రమే శుభుడు! బుధ, శుక్ర, శనులు పాపులు!!
9. ధనుర్లగ్నమునకు రవి, కుజులు శుభులు! బుధ, గురులు కూడా కొన్ని సందర్బములలో మంచివారు! శుక్రుడు పాపి!!
10. మకర లగ్నమునకు బుధ, శుక్రులు శుభులు! చంద్ర, కుజ, గురులు పాపులు!!
11. కుంభ లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు!చంద్ర, కుజ, గురులు పాపులు!!
12. మీన లగ్నమునకు చంద్ర, కుజలు శుభులు! రవి, బుధ, శుక్ర, శనులు పాపులు!!
13. లగ్నము వలన, ఆత్మ సంభంధమైన విషయములను, జాతకుని అనూహ్య కర్మలను తెలియధగియున్నది. 
14. చంద్ర లగ్నమువలన జాతకుడు తెలిసిజేయు కర్మలను, వాటి ఫలితములను గుర్తించవలెను. 
15. నవాంశలగ్నముల వల్ల జాతకుని పూర్వజన్మ కర్మలకు సంభందించిన ఫలితములు తెలియధగియున్నది. 
16. జన్మలగ్నము జాతకుని దేహస్థితి, అంగసోష్ట వము, శారీరక సుఖములను ధెల్పును. 
17. చంద్రలగ్నము మనో ధర్మములను, మానసిక స్థితి గతులను ధెల్పును. 
18. అంశలగ్నము శరీరచ్చయా, అంతర్గత స్వభావములను తెల్పును. 
19. లగ్నాధిపతి శుభుడై 5-9 స్థానములందు, పాపియై 1-4-7-10 స్థానములందు యున్న యెడల - జాతకునికి శుభ ఫలితములు ప్రాప్తించగలవు. 
20. 3-11 స్థానములలో లగ్నాధిపతియున్న - సామాన్య శుభ ఫలితములు కల్గును. 
21. 2-6-8-12 స్థానములలో లగ్నాధిపతి యున్న అశుభ ఫలితములు నివ్వగలడు. 

2 comments:

  1. From which book did you take the data sir

    ReplyDelete
  2. The above details are only upto Chaturdha bhava palithalu. What about the remaining eight bhava palithalu. Where can I get the it sir. Please indicate the reference book.

    ReplyDelete

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...