Thursday, January 23, 2025

KUMBHA MELLA - కుంభమేళా

కుంభమేళా

మహా కుంభమేళ 144 సంవత్సరములు ఒకసారి.

పూర్ణ కుంభమేళా 12 సంవత్సరములకు ఒకసారి.

అర్థ కుంభమేళా 6 సంవత్సరములకు ఒకసారి.

కుంభమేళ 3 సంవత్సరం లో ఒకసారి వస్తాయి.

మహా కుంభ మేళ అంటే ఏంటి? అసలు దాని చరిత్ర

ప్రతి 12 యేళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహా మేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి (కుంభ రాశి). మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్టు పురాణాలు చెపుతున్నాయి. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు, రాక్షసుల మధ్య దేవ - దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకొని వెళుతూ ప్రయాగ(అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు చుక్కలు జారి పడినట్టు పురాణాలు చెపుతున్నాయి.

అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తుంటారు. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు. ఆరేళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్థ కుంభమేళా అని.. 12 యేళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహా కుంభ మేళా అని పిలుస్తారు.

సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు.

మహాక్రతువు

దేశం నలుమూలలనుంచే కాక, ప్రపంచం అంతట్నుంచీ తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించే మహాక్రతువు కుంభమేళా. త్రివేణీ సంగమ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళా.

ప్రయాగ

ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం. హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు. మన దేశంలో వున్న 7 ముఖ్యమైన తీర్ధ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ.

త్రివేణీ సంగమం

ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్ధం. గంగ, యమునా, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది.

గంగానదీ

కనుక దీన్నిబట్టి నదినీటినీ,అందులోను గంగా నదినే మనం ప్రథమంగా నమస్కరిస్తము. సమస్త దేవతలూ నివశించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ. పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానదీ నీటి యొక్క ప్రత్యేకత.

సరస్వతీ నది

విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చిందని దీనిలో స్నానం ఆచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తూవుంటాయి. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూవుంది

త్రివేణీ సంగమ తీరం

అందుకే ఈ తీరాన్ని త్రివేణీ సంగమ తీరంగా పిలుస్తూంటాం. పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని మన పూర్వీకుల విశ్వాసం.  

Wednesday, January 22, 2025

NANDHEESWARUDU - నందీశ్వరుడు

నందీశ్వరుడు 

నందీశ్వరుడు శివుడి వాహనం ఎలా అయ్యాడు..??  

పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శిలాదుడు. శిలాదుడికి సంతానం లేదు. సంతానం కోసం అతను చెయ్యని వ్రతం లేదు. స్నానం చేయని తీర్ధం లేదు. అయినా ప్రయోజనము కలుగలేదు. చివరకు శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యటం మొదలు పెట్టాడు. అలా చాలాకాలం గడిచింది. శిలాదుడు పట్టు వీడలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి. ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి "దేవదేవా! ఆశ్రితవత్సలా! అనాథ రక్షకా! నాకు సంతానం లేదు. నా వంశము నిలపటానికి అయోనిజుడైన కుమారుని ప్రసాదించు అతడు వేదవేదాంగవిదుడు, విద్వాంశుడు, సకల శాస్త్రజ్ఞుడు, గుణ సంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుషు కలవాడు అయి ఉండాలి" అన్నాడు.

శిలాదుని ప్రార్థన మన్నించి ఈశ్వరుడు "నువ్వు, కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కాని అల్పాయుష్కుడవుతాడు" అన్నాడు. శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చెయ్యాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు. విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడ చక్కని రూపురేఖలు, అందచందాలు, శరీర సౌష్టవము కలిగి ముద్దులు మూటగడుతున్న బాలుని ఇంటికి తెచ్చి పెంచుకోవటం మొదలుపెట్టాడు శిలాదుడు. ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దాము అనుకున్నారు.. అప్పుడు అశరీరవాణి "ఋషివర్యా! ఈ బాలుడు మీకే కాదు, ఆది దంపతులయిన పార్వతీపరమేశ్వరులకు కూడా ఆనందము కలుగచేస్తాడు. కాబట్టి ఇతడికి 'నందుడు' అని నామకరణం చెయ్యండి" అన్నది. ఆకాశవాణి చెప్పిన ప్రకారము బాలుడికి నందుడని పేరు పెట్టారు. ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. బాలుడు ఏకసంధాగ్రాహి కావటంతో కొద్దికాలంలోనే సమస్త విద్యలూ. నేర్చుకున్నాడు.

ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు. ఆ సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత సత్కారాలు, కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. 'బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణ సంపన్నుడు. కాని ఆయుష్షు మాత్రం లేదు" అన్నారు వాళ్ళు.

ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించటం ప్రారంభించారు. కుమారుడు వారి వద్దకు వెళ్ళి, 'తండ్రి, మీ విచారానికి కారణము ఏమిటి?' అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులతో అష్టశ్వర్యములు, నవనిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు. కాని శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి. శివుని అనుగ్రహము సంపాదిస్తాను" అన్నాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్ళాడు నందుడు.

కేదారము వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి నందుడు, "ప్రభూ! నీ దర్శన భాగ్యం కలిగిన తరువాత ఇంకా కావలసినది ఏముంది? ఎల్లవేళల యందు నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు" అన్నాడు. అతడి కోరిక మన్నించాడు శివుడు. "దీర్ఘాయుష్మంతుడవై మాతో పాటు ఉండు" అన్నాడు.

తరువాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభ ముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిచి, అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యమునిచ్చాడు. శివుడు నందీశ్వరుడితో "నీవు నా భక్తుడవు, సందర్భం వచ్చినప్పుడు భృత్యుడివిగా, నా వాహనానివి. ముల్లోకాలను జయించగల బలపరాక్రమాలు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఐదు తరాలవారు. నా రుద్రగణాలలో చేరగలరు" అని దీవించాడు. ఈ రకంగా శిలాదుడి కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు. ఇదీ నందీశ్వరుడి కథ.

Friday, January 17, 2025

వేంకటేశ నిను సేవింపను పది

వేంకటేశ నిను సేవింపను పది

తాళం: ఆది  

రాగం: మధ్యమావతి మేళకర్త __,__ జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: 

అవరోహణ:

పల్లవి

వేంకటేశ నిను సేవింపను పది
వేల కనులు కావలెనయ్య || వేం..||

అను పల్లవి:

పంకజాక్ష పరిపాలిత మునిజన
భావుకమగు దివ్యరూపమును కొన్న || వేం..||

చరణము(లు):

ఎక్కువ నీవని దిక్కులఁ బొగడఁగ
అక్కఱగొని మది సొక్కి కనుంగొన
నిక్కము నీవె గ్రక్కునఁ బ్రోవు త
ళుక్కని మెఱసే చక్కతనముగల || వేం..||

ఏ నోము ఫలమో నీ నామామృత
పానము అను సోపానము దొరికెను
శ్రీనాయక పరమానంద నీ సరి
గానము శోభాయమానాంఘ్రులుగల || వేం..||

యోగిహృదయ నీవే గతియను జన
భాగధేయ వరభోగీశశయన
భాగవతప్రియ త్యాగరాజనుత
నాగాచలముపై బాగుగ నెలకొన్న || వేం..||

తెరతీయగ రాదా లోని

తెరతీయగ రాదా లోని

తాళం: ఆది  

రాగం: గౌళిపంతు మేళకర్త __,__ జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: 

అవరోహణ:


పల్లవి

తెరతీయగ రాదా లోని
తిరుపతి వెంకటరమణ మత్సరమను ॥తె॥

అను పల్లవి:

పరమపురుష ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని ॥తె॥

చరణము(లు):

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులురీతి యున్నది
హరిధ్యానము సేయువేళ చిత్తము
అంత్యజువాడకుఁ బోయినట్లున్నది ॥తె॥

మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైనరీతి యున్నది
అచ్చమైన దీప సన్నిధిని మరు
గిడఁబడి చెఱిచినట్లున్నది ॥తె॥

వాగురయని తెలియక మృగ గణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత! మదమత్సరమను ॥తె॥

ఎందు దాగినాఁడో ఈడకు రా

ఎందు దాగినాఁడో ఈడకు రా

తాళం: త్రిపుట (చాపు)   

రాగం: తోడి మేళకర్త 65,__ జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి2 గ3 మ2 ప ద2 ని3 స 

అవరోహణ: స ని3 ద2 ప మ2 గ3 రి2 స 


పల్లవి

ఎందు దాగినాఁడో ఈడకు రా
నెన్నడు దయవచ్చునో ఓ మనసా || ఎం.. ||

అను పల్లవి:

ఎందుకు చపలము వినవే నా మనవిని
ముందటివలె భక్తుల పోషించుట కెం..

చరణము(లు):

అలనాడు కనక కశిపు నిండారు
చలముఁజేసి సుతుని సకల బా
ధలఁ బెట్టగా మదిని దాళక ని
శ్చలుఁడైన ప్రహ్లాదుకొఱకు కంబములో
పల నుండఁగలేదా ఆ రీతిని నే || ఎం.. || 

మును వారివాహ వాహన తనయుఁడు మద
మున రవిజుని చాలఁ గొట్టుటఁ జూచి
మనసు తాళఁజాలలేక ప్రేమ
మున పాలనముసేయ తాళతరువు మరు
గున నిల్వఁగలేదా రీతిని నే  || ఎం.. ||

తొలి జన్మముల నాఁడు జేసిన దుష్కర్మ
ముల నణఁగను సేయ ఆరుశ
త్రులఁబట్టి పొడిసేయ అదియుఁగాక
ఇలలో చంచలము రహిత నిజభక్త జ
నులను త్యాగరాజుని రక్షింప నే || ఎం.. ||

నిధిచాల సుఖమో రాముని స

నిధిచాల సుఖమో రాముని

తాళం: త్రిపుట (చాపు)   

రాగం: కల్యాణి మేళకర్త 65,__ జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి2 గ3 మ2 ప ద2 ని3 స 

అవరోహణ: స ని3 ద2 ప మ2 గ3 రి2 స 


పల్లవి
నిధిచాల సుఖమో రాముని స
న్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస ॥ని॥

అను పల్లవి:
దధి నవనీత క్షీరములు రుచో దాశ
రథీ ధ్యానభజన సుధారసము రుచో ॥ని॥

చరణము(లు):
శమ దమ మను గంగాస్నానము సుఖమో క
ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో
మమత బంధవయుత నరస్తుతి సుఖమో
సుమతి త్యాగ రాజనుతుని కీర్తన సుఖమో ॥ని॥

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా ఇటువంటి సేవ

తాళం: ఆది   

రాగం: బిలహరి మేళకర్త 29, శంకరాభరణం  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి2 గ3 ప ద2 స 

అవరోహణ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స 

పల్లవి

దొరకునా ఇటువంటి సేవ || దొ..|| 

అను పల్లవి:
దొరకునాల్పతపమొనరించిన భూ
సురవరులకైన సురలకైన || దొ.. || 

చరణము(లు):

తుంబురనారదులు సుగుణకీర్త
నంబుల నాలాపము సేయగా
అంబరీషముఖ్యులు నామము సే
యఁగ జాజులపై చల్లఁగా
బింబాధరలగు సురవారయళి
వేణులు నాట్యములాడఁగా
అంబుజభవ పాకారు లిరుగడల
నన్వయ బిరుదావళిని బొగడఁగా
అంబరవాస సతులు కరకంక
ణంబులు ఘల్లని విసరఁగ మణిహా
రంబులు గదలగ మాచే ఫణి
ల్పంబున నెలకొన్న హరిని గనుఁగొన || దొ..|| 

మరకతమణిసన్నిభ దేహంబున
మెఱుఁగు కనకచేలము శోభిల్లఁ
చరణయుగ నఖావళికాంతులు
జందురు పిల్లలను గేర
వరనూపురము వెలుగఁగ గరయుగమున
వజ్రపుభూషణములు మెఱయ
నురమున ముక్తాహారములు మఱియు
ఉచితమైన మకరకుండలంబులు
చిఱునవ్వులుగల వదనంబున ముం
గురు లద్దంపుఁ గపోలము ముద్దు
గురియు దివ్యఫాలంబునఁ దిలకము
మెఱసే భువిలావణ్యనిధిని గన || దొ.. || 

తామసగుణరహిత మునులకుఁ బొగడఁ
దరముగాకనే భ్రమసి నిల్వఁగ
శ్రీమత్కనకపుఁ దొట్లపైని చెలు
వందఁగఁ గొలువుండఁగ
కామితఫలదాయకీయౌ సీత
కాంతునిగని యుప్పొంగఁగ
రామ బ్రహ్మతనయుఁడౌ త్యాగ
రాజు తా బాడుచు నూచఁగ
రాముని జగదుద్ధారుని సురరిపు
భీముని త్రిగుణాతీతుని బూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ
ధాముని కనులార మదిని గనుగొన || దొ.. || 


Gayatri Mahima - Goutamudi Katha - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మహిమ - గౌతముడి కథ జనమేజయా! ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన పదిహేను సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లే...