Saturday, August 15, 2026

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు

మారుతి మాటలు విని అంగదుడు:

సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్నులకు ఉచితంకాదేమో! మన హనుమ రాక్షస సంహారంచేసే వచ్చాడు కనక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. సీతను రా
మలక్ష్మణుల ముందుంచి మన పరాక్రమం చాటుకుందాం, అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు.

నాయనా! సుగ్రీవుడు కాని, రాముడు కాని మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా 
మనం సాహసించి సీతను తీసుకువెడితే ఆ రాజశార్దూలుడు మనలను ఏ దృష్టితో చూస్తాడో! అది తన వంశ ప్రతిష్ఠకు భంగకరం అనుకుంటాడేమో! మనకు తెలీదు.

ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్లు చేశామో అయన మనస్సు వికలమయి తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది.

అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పడమే 
మన కర్తవ్యం. అప్పుడాయన ఏం చెపితే అలా చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా! అనగా అంగద, హనుమదాదులందరూ అంగీకరించారు.

మధువనం

No comments:

Post a Comment

Why worship Kubera when Goddess Lakshmi is present? - లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి?

లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి చాలామంది ఒక సందేహం అడుగుతారు. ధనానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవా... లేక కుబేరుడా? దీనికి సమాధాన...