రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట
బ్రాహ్మణవంశానికే రత్నంవంటివాడా; నీ బంధువులపాలిటి చింతామణివంటివాడా! పద్మాలవంటికండ్లున్న శ్రీకృష్ణునికి నా సందేశాన్ని వినిపించి; ఆయనను వెంట తీసుకుని వచ్చావు. నా మనసులోని మాటను కృష్ణునికి చెప్పి నన్ను ప్రాణాలతో నిలబెట్టావు.
నీ దయవల్ల నేను బతికాను. నీలాంటి పుణ్యాత్ములెక్కడైనా ఉంటారా! ఇంత సహాయంచేసిన నీకు నేను ఎలాంటి ఉపకారాన్నీ తిరిగి చేయాలో? నాకు తెలియడం లేదు, కృతాజ్ఞలాగా రెండు చేతులూ చేర్చి నమస్కరిస్తాను.
ఇలా పలికి రుక్మిణి చేతులు జోడించి నమస్కరించింది. తర్వాత, ఆమెతండ్రి భీష్మకుడు తనకూతురు పెళ్లికి బలరామకృష్ణులు వచ్చారని విన్నాడు. వెంటనే మంగళవాద్యాలధ్వనులతో వారికి ఎదురుగా వెళ్లి, ఆహ్వానించాడు. వారికి మధుపర్కం సమర్పించి గౌరవించాడు.

వాళ్లకు వస్త్రాలూ, నగలూ కానుకలుగా ఇచ్చాడు. బంధువులతోనూ, సైన్యంతోనూ వచ్చిన ఆ బలరామకృష్ణులకు అన్నిరకాల సౌకర్యాలతోనూ ఉన్న విడిదిగ్భహాలను ఏర్పాటు చేశాడు.
ఇలాగే ఈ ఉత్సవానికి ఎందరో రాజులు వచ్చారు. వాళ్లు వయసులోనూ, ప్రతాపంలోనూ, శక్తిలోనూ, ధనసంపదలలోనూ గొప్పవాళ్లు. కనుక వాళ్ల వాళ్ల హోదాలకు తగిన రీతిలో, రాజు అన్ని పదార్థాలను ఇప్పించి, వాళ్లను గౌరవించాడు.
ఇంతలో పెళ్లికి శ్రీకృష్ణుడు వచ్చాడనే వార్త విదర్బనగరప్రజలకు తెలిసింది. ఆయన్ను చూడాలని వాళ్లు వచ్చారు. తమ కళ్లు అనే దోసిళ్లతో ఆయన ముఖపద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ (వాళ్లు ఇలా అన్నారు.)
చక్రాన్ని ఆయుధంగా కల ఈ శ్రీకృష్ణుడు విదర్భరాజకుమారికి తగినవాడు. అలాగే విదర్భరాజపుత్రికూడా శ్రీకృష్ణునికి సరైన జోడు. భార్యభర్తల జత ఇంత అందంగా ఉంటుందా?
చక్రాన్ని ఆయుధంగా కల ఈ శ్రీకృష్ణుడు విదర్భరాజకుమారికి తగినవాడు. అలాగే విదర్భరాజపుత్రికూడా శ్రీకృష్ణునికి సరైన జోడు. భార్యభర్తల జత ఇంత అందంగా ఉంటుందా?
ఈ ఇద్దరినీ జతకూర్చిన బ్రహ్మ మంచినేర్పరి కదా! శత్రువుల గర్వాన్ని అణచివేసి, శ్రీ కృష్ణుడు ఈ అందాలరాశికి మగడు కావాలి. మా పుణ్యఫలంవల్ల వీరిద్దరూ దంపతులు అగుదురుగాక!
(జనం వచ్చింది శ్రీకృష్ణుణ్ణి చూడాలని. కానీ చూస్తున్నది రుక్మిణీ కృష్ణులను. ఎంత మంచిజంట అంటున్నారు. పైగా ఇలాంటి జంటను కూర్చిన బ్రహ్మ 'నేర్పరి' అంటున్నారు. వీళ్లపెళ్లి మా పుణ్యఫలం. ఈ వేడుకను చూడడం మా భాగ్యం అనుకోవడంలో భక్తి, ప్రేమలు పెనవేసుకున్నాయి.)
ఈ విధంగా అందరూ అన్నారు. ఆ సమయంలో
పెళ్లిమంటపంనుంచి రుక్మిణి బయలుదేరింది. ఊరిబయట ఉన్న పార్వతీదేవిఆలయానికి వెళుతూంది. ఎలాంటి ప్రమాదపరిస్థితి ఎదురైనా సరే, ఎదుర్కొని పోరాడడానికి ఆమెకు రక్షణగా చాలమంది భటులు బయలుదేరారు. వాళ్ల చేతుల్లో రకరకాల ఆయుధాలు ఉన్నాయి.

ఇంతటి రక్షణమధ్య, ముందువైపు గుంపులుగా వేశ్యలు వెళ్తున్నారు. వాళ్ల చేతుల్లో నైవేద్యాలు, ముడుపులు ఉన్నాయి. వాళ్ల అలా వెళ్తుండగా, బ్రాహ్మణసువాసినులు పూలు, గంధం, మంచి వస్త్రాలు, నగలు కలిగినవాళ్లై, మంగళప్రదమైన పాటలుపాడుతూ నడిచారు.
ఉడుక, మద్దెల, శంఖం, తప్పెట, బాకా, పిల్లనగ్రోవి, భేరి మొదలైన వాద్యాల ధ్వనులు హోరెత్తించి, ఆకాశమంతా అలముకున్నాయి. చెలికత్తెలు తనను సేవిస్తుండగా, తనను పెంచిన తల్లులు, బంధువుల భార్యలు వెంటరాగా నుదుట ముంగురులతో కన్యరుక్మిణి పార్వతీదేవికి మొక్కడానికి వినయంగా అంతఃపురంనుండి వెడలి నడిచింది. ఆ రుక్మిణి నుదురును ముంగురులు కప్పేస్తున్నాయి.
రుక్మిణీదేవి గౌరీఆలయానికి వస్తూ ఉంది. ఆమెవెంట సూతులు, వందిమాగధులు, గాయకులు, పాఠకజనం వస్తున్నారు. వాళ్లు ఆమె వంశకీర్తినీ, ప్రతాపాన్ని వంశాన్ని గురించి ప్రశంసిస్తున్నారు. అలా అందరూ వెంటవస్తూ ఉండగా ఆమె నెమ్మదిగా నడుస్తూన్నది.

శ్రీకృష్ణునిపాదకమలాలను మనసులో స్మరిస్తూ పార్వతిదేవిగుడికి చేరింది. కాళ్లూ చేతులా నీటిధారలతో శుభ్రం చేసుకున్నది. ఆచమనం చేసి శుచియై గౌరీదేవిదగ్గరకు వెళ్లింది. అపుడు బ్రాహ్మణ ముత్తైదువలు శివునితో కూడిన పార్వతికి అభిషేకం చేయించారు.
గంధాక్షతలను సమర్పించారు. వస్త్రాలతో, పుష్పాలతో, నగలతో అలంకరింపజేశారు. ధూపదీపాలను ఇచ్చారు. రకరకాలైన నైవేద్యాలను నివేదింపజేశారు. కానుకల అర్పించారు. దీపమాలికలతో హారతులెత్తినారు. పిదప రుక్మిణీదేవితో దుర్గాదేవికి మొక్కింపచేశారు. అప్పుడు
నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతి సేయు మమ్మ నిన్
నమ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ
సర్వశక్తిమంతురాలివైన గౌరీదేవి! ఎప్పటికీ ఉండే పురాతనదంపతులైన ఉమామహేశ్వరులు మీరు. మిమ్ములను పూజిస్తున్నాను. అమ్మా! మంచి చేకూర్చు. నీవు అందరికీ పూజనీయురాలివి. దయకు సముద్రంలాంటి దానివి కదమ్మా! శ్రీకృష్ణుణ్ణి నాకు భర్తగా చేయమ్మా! నిన్ను నమ్ముకున్నవారికి నష్టమనేది లేదుకదమ్మా!
('సదాభవః సదాతనః సనాతన శ్చ' - నాశనం లేనిది సనాతనం. సనాతునులైన ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరులు. వారిని ప్రార్థిస్తున్న, రుక్మిణి. 'ఉమా' శబ్దప్రయోగంతో తనను రక్షించుమని వేడుకుంటున్న. 'అవతీత్యుమా' రక్షించేది ఉమ. పద్యమంతటా 'అమ్మా' అని పిలుస్తున్నట్లే ఉంది. పైగా ప్రాసాక్షరం ద్విత్వమకారం కావడంతో శిశువు తల్లి వెంటబడి వెళుతూ 'అమ్మా అమ్మా' అని వేడుకుంటున్నట్లే ఉంది.)
ఈ విధంగా పలికి, పార్వతీదేవికి ఆమె మొక్కింది. ఆ తర్వాత పతీసమేతంగా ఉన్న బ్రాహ్మణముత్తెదువలకు ఉప్పుతోకూడిన పిండివంటలు, తాంబూలం, మెడలో వేసుకునే పసుపు దారాలూ, చెఱకుగడలు ఇచ్చి, రుక్మిణీదేవివాళ్లను భక్తితో పూజించింది.
ఆ ముత్తెదువలు సంతోషంతో పొంగిపోయారు. మనసారా దీవించారు. అక్షతలు వేశారు. రుక్మిణీదేవి తన తలపై అక్షతలను ధరించి, పరమశివునిసతి పార్వతిదేవికి మొక్కింది. మౌనవ్రతాన్ని చాలించి మందిరంనుండి బయటకు వెళ్లింది.
ఈ విధంగా వస్తున్న రుక్మిణి మేఘాల మధ్యనుండి వెలువడిన తొలకరి వర్షాకాలపు మెరుపుతీగలా మెరుస్తున్నది. చంద్రబింబంనుండి బయటికి వచ్చి తిరుగుతున్న జింకవలె ఉంది. బ్రహ్మదేవుడు అనే నటుడు నాటకరంగంలోని తెర పైకి ఎత్తితే రంగంమీద ప్రత్యక్షమైన మోహినీదేవతవలె ఉంది.

దేవతలు, రాక్షసులు ఒకానొకప్పుడు మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి అనే పామును తాడుగా చుట్టి అటూ ఇటూ లాగి పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో ఘుమఘుమ అని శబ్దం చేస్తున్న సముద్రంనుండి పుట్టిన లక్ష్మీదేవిలా ఉంది - రుక్మిణి. రకరకాల నగలు ధరించి రుక్మిణి ప్రకాశిస్తూంది.
మెల్లగా గౌరీదేవ్యాలయంనుండి బయటికి వచ్చింది. మానససరస్సులో బంగారు తామరపూల మధ్య విహరిస్తున్న రాజహంసలా ఉంది. పసిడికుండలజంటను పోలిన కఠిన వక్షోజాల బరువుతో ఆమె నడుము వణకిపోతున్నది. ఆమెచేతులకు ఉంగరాలున్నాయి, వాటిపై రత్నాలు పొదగబడి ఉన్నాయి.
అలాంటి ఎర్రటిచేతులతో ఒక ఇష్టసఖిచేతిని ఆసరాగా పట్టుకుంది. రుక్మిణిచెవులకు బంగారు లోలాకులున్నాయి. వాటివెలుగులకిరణాలు ఆమెచెక్కిళ్లపై పడి మెరుస్తున్నాయి. ఉంగరాల ముంగురులు ఆమెముఖంమీద తారాడుతున్నాయి. అది పద్మాలపరిమళాల పై ఆసక్తితో గండుతుమ్మెదలు మూగుతున్నట్లుంది. ఆమె అందంగా చిరునవ్వు నవ్వుతున్నది.
ఆ నవ్వుల వెలుగులు దిక్కులంతటా లేత వెన్నెలకాంతులతో నింపుతున్నాయి. ఆమెపెదవులు దొండపండ్లవలె ఎర్రగా ఉన్నాయి. పలువరుస మొల్లమొగ్గల్లా ఉన్నాయి. పెదవుల ఎరుపు సోకి పలువరసకు ఎరుపువన్నె కలుగుతోంది. కదులుతున్న పైట మన్మథుని పతాకంలా ఉంది.
మొలనూళ్ల పై ఉన్న మణులు మెరుస్తున్నాయి. ఆ మెరుపులు అకాలంలో హరివిల్లును సృష్టిస్తున్నాయి. మన్మథుడు ఒరనుండి పైకితీసి సానపెట్టిన - మెరుస్తున్న బాణాలవలె ఆమెచూపులు వాడిగా ఉన్నాయి. అవి రాజవీరుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. కాలిమువ్వలసవ్వడి కమనీయంగా ఉండి, చెవులకు విందు చేస్తున్నాయి. అలా ఉండే ఆమె శ్రీకృష్ణునికోసం ఎదురుచూస్తూ కాలినడకతో వస్తున్నది.
రుక్మిణికురులు తుమ్మెదలవలె నల్లగా ఉన్నాయి. ముఖం చంద్రబింబంలా ఉంది. ఆమెచూపులు జింక చూపులవలె ఉన్నాయి. పెదవి పగడంవలె అరుణవర్ణంలో ఒప్పారుతూ ఉంది. కంఠస్వరం ఆవ్యక్తమధురంగా ఉంది. కొత్త చిగురుటాకులవలె ఆమె పాదాలజంట శోభిస్తున్నది.

మదించిన ఏనుగుకుంభస్థలాలవలె వక్షోజాలున్నాయి. పిరుదులు ఇసుకతిన్నెలవలె ఉన్నాయి. ఆమెనడకగజరాజగమనాన్ని పోలి ఉంది. చేతులు ఎర్రతామరలను పోలి ఉన్నాయి. ఆమె శరీరంనుండి పద్మాల పరిమళం వెలువడుతున్నది.
ఆమె నడుము సింహం నడుమువలె సన్నగా ఉంది. ఇలాంటి సౌందర్యంతో ఉన్న రుక్మిణిని అక్కడ ఉన్న వారందరూ చూచి ఆశ్చర్య మనస్కులయ్యారు.
అంతేకాదు, ఆ రుక్మిణి చిరునవ్వును, సిగ్గుతోకూడిన చూపులను, చూచి ఆ రాజలోకానికి మనసులు చలించాయి. ధైర్యం జారిపోయింది. తమ పెద్దరికాలను విడిచిపెట్టారు. తాము గొప్పవాళ్లమనే విషయాన్ని మరచిపోయారు. చేతలు ఉడిగిపోయారు. బుద్ది పని చేయలేదు.

ఆయుధాలను పడేశారు. ఏనుగులను, గుర్రాలను, రథాలను ఎక్కకుండా రాజులందరూ నేలకు వాలారు. ఆ జింక కన్నులవంటి కన్నులున్న రుక్మిణి తన ఎడమచేతి గోళ్లతో ముంగురులను ఎగదోసుకుంటూ, పైటను సవరించుకుంటూ ఆ రాజలోకాన్ని కడగంటిచూపులతో చూస్తూ
రుక్మిణి శ్రీకృష్ణుణి దర్శించింది. ఆయన చంద్రబింబంలాగా చల్లని వెలుగులీనుతున్న ముఖంతో ఉన్నాడు. శ్రేష్ఠమైన సింహం నడుమువంటి సన్నని నడుముతో ఉన్నాడు. క్రొత్తగా అప్పుడే విచ్చుకున్న తామర పూలరేకులవలె ఆయనకళ్లు ఉన్నాయి. ఆయనవక్షం చూడసొంపుగా ఉంది.

మేఘం వన్నెలాంటి వన్నెతో ఆయన శరీరం ప్రకాశిస్తూంది. కొండలకు శత్రువైన ఇంద్రుని ఏనుగు - ఐరావతంయొక్క తొండంవలె బలిష్ఠంగా శ్రీకృష్ణుడిచేతులు ఉన్నాయి. అతడు చక్రాయుధంతో ఉన్నాడు.
పసుపుపచ్చని పట్టువస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గొప్పనగలతో అలంకరింపబడి ఉన్నాడు. ఆయనకంఠం శంఖంవలె అందంగా ఉంది. గెలుపు సాధించాలనే ఆసక్తితో ఉన్నాడు. ప్రపంచాన్ని సమ్మోహపరుస్తున్నాడు.
శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment