ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణగణాలను పాడుకుంటూ వచ్చాడు. మునులంతా ఆనందంతో ఎదురువెళ్ళి ఆహ్వానించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపి సభామధ్యభాగంలో సముచితాసనంమీద కూర్చుండబెట్టారు.
నారదుడు శాంతచిత్తుడై సంతోషం ప్రకటించాడు. గౌతముని కీర్తిప్రతిష్టలను ముల్లోకాలలోనూ వింటున్నానని ప్రశంసించాడు. ఇంద్రలోకంలో శచీపతినోట ప్రత్యేకంగా విని నిన్ను చూడాలనిపించి వచ్చానన్నాడు. గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రుడవై ధన్యుడవయ్యావన్నాడు.
మందిరానికి వెళ్ళి గాయత్రీదేవిని దర్శించాడు. కన్నులు వికసించాయి. దివ్యానుభూతితో పరవశించి కీర్తనలు ఆలపించాడు. మరికొంతసేపు గౌతముడితో మునులతో విప్రులతో గడిపి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు.
నారదుడంతటివాడు రావడమూ గౌతముణ్జి ప్రశంసించడమూ ఇంద్రాది దేవతలుకూడా మెచ్చుకుంటున్నారని చెప్పడమూ - ఇదంతా అక్కడి బ్రాహ్మణులకు కంటకింపుగా మారింది. రోజూ ఎవరో ఒకరు రావడమే. గౌతముణ్జి ఓహో ఓహో అనడమే. తట్టుకోలేకపోయారు. ఆసూయ బయలుదేరింది. ఆందరూ చెవులు కొరుక్కుని ఒకనాడు ఒకచోట గుమికూడారు. తగిన సమయం చూసి వాతపెట్టాలి. ఇతడి యశస్సుకి అడ్డుకట్ట వెయ్యాలి - అని నిశ్చయంచుకున్నారు.

పదిహేనేళ్ళు గడిచాయి. వానలు పడ్డాయి. నేలపచ్చబడింది. పంటలు పండాయి. కరువు తీరింది. దేశం సుభిక్షంగా ఉంది. నాలుగువైపులనుంచీ వార్తలు చేరాయి. బ్రాహ్మణులు మళ్ళీ రహస్యసమావేశం జరుపుకున్నారు. ఏదోఒక వంకతో గౌతముణ్జి శపించి మనమన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు.
ఆహా! ఎంత అందంగా ఉందో చూశావా జనమేజయా! ఇలాంటి వాళ్ళని కన్న తల్లిదండ్రుల జన్మ నిజంగా ధన్యం అనాలి కదూ !! కాలమహిమ అటువంటిది. దాన్ని తెలుసుకోవడం ఎవడితరం!
సరే - అందరూ కూడబలుక్కుని ఒక మాయ ఆవును సృష్టించారు. అది కూర్చుంటే లేవలేదు. లేస్తే నడవలేదు. అంతటి ముసలిది. ఇవ్వేళో రేపో అన్నట్టుంది దాని పరిస్థితి. అలాంటి ఆవును సృష్టించి గౌతముడి పర్ణశాలదగర వదిలిపెట్టారు.

లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఇది గుమ్మంనుంచి లోపలికి రాబోయింది. మహర్షి చూశాడు. హుం హుం అంటూ మెల్లగా అదిలించాడు. లేచి బయటికి తోలడం అగ్నిహోత్రానికి విఘ్నమవుతుందని కూర్చున్నచోటునుంచి కదలకుండానే హుంకారంతో అదిలించాడు. ఆ మాత్రానికే ఆ ముసలి ఆవు ప్రాణాలు వదిలేసింది. నేలకు ఒరిగిపోయింది.
ఇంకేముంది - బ్రాహ్మణులు అరుపులూ కేకలూ మొదలుపెట్టారు. అయ్యో! అయ్యో! ఆవును చంపేశాడు గౌతమమహర్షి గోహత్యామహాపాతకి - అంటూ గుండెలు బాదుకున్నారు. గౌతముడికి ఇదంతా వింతగా అనిపించింది. అలాగే హోమం పూర్తి చేసుకుని ఇవతలికి వచ్చాడు.
అసలు సంగతి ఏమిటా అని ఒక్కసారి దివ్యదృష్టి సారించాడు. విషయం అర్థమయ్యింది. బ్రాహ్మణుల పన్నాగమని తెలిసిపోయింది. అసూయాగ్రస్తులై ఇంతకు తెగిస్తారా! కుట్రలు పన్నుతారా! కోపం భగభగలాడింది. ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయాడు. కన్నులు నిప్పులు కురిసాయి. కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు.
బ్రాహ్మణాధములారా! వేదమాతపట్ల గాయత్రీధ్యానంపట్ల తన్మంత్రజపంపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఎర్పడుగాక! వేదంపట్ల వేదోక్తయజ్ఞాలపట్ల తద్వార్తలపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! శివుడిపట్ల శివమంత్రంపట్ల శివశాస్త్రంపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక!

మూలప్రకృతి శ్రీదేవిపట్ల తన్మంత్రధ్యానాలపట్ట తత్కథలపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడు గాక! దేవీమహోత్పవ దిదృక్షపట్ల దేవీనామానుకీర్తనపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! దేవీభక్తుల సాన్నిధ్యంపట్ల దేవిభక్తులను అర్చించడంపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక!
శివోత్సవ దిదృక్షపట్ల శివభక్తార్చనపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! రుద్రాక్ష బిల్వపత్రాలపట్ల పరిశుభ్ర విభూతిపట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! శ్రాతస్మార్త సదాచార జ్ఞానమార్గాలపట్ల బ్రాహ్మణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక!
అద్వైతజ్ఞాననిష్ఠపట్ల శాంతిదాంత్యాది సాధనపట్ల బ్రాహ్మణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! నిత్యకర్మానుష్ఠానంపట్ల అగ్నిహోత్రంపట్ల బ్రాహ్మాణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక! స్వాధ్యాయ ప్రవచనలపట్ల గోదానాది సత్కర్మలపట్ల పితృశ్రాద్దాలపట్ల కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతాలపట్ల ప్రాయశ్చిత్తాలపట్ల బ్రాహ్మణాధములారా! మీకు సర్వదా వైముఖ్యం ఎర్పడుగాక!
శ్రీదేవిపట్ల కాక ఇతరదేవతలపై శ్రద్ధాసక్తులు పుట్టి శంఖచక్రాది చిహ్నాంకితులై బ్రాహ్మణాధములారా! మీరు ధర్మభ్రష్టులగుదురుగాక! కాపాలిక మతాసక్తులై బౌద్దశాస్త్రరతులై పాషండాచార నిరతులై పితృమాతృ సుతా భ్రాతృకన్యాభార్యా విక్రయణ తత్పరులై వేద తీర్ధ ధర్మవిక్రయులై బ్రాహ్మణాధములారా ! మీరు సర్వదా పతితులగుదురుగాక!
పాంచరాత్ర కామశాస్త్ర కాపాలికమత బౌద్ధమతాల పై శ్రద్ధకలిగిన వారగుదురుగాక! మాతృకన్యాగాములూ భగినీగాములూ పరస్త్రీలంపటులూ అయి సదాచారభ్రష్టులగుదురుగాక! ఓ బ్రాహ్మణాధములారా! మీరూ మీ వంశాల్లో పుట్టే స్త్రీపురుషులందరూ - మద్దత్తశాపాగ్ని దగ్గులగుదురుగాక!
ఇన్ని శాపాలతో పని ఏముంది! గాయత్రీదేవి మూలప్రకృతి పరమేశ్వరి - మీమీద కోపాగ్నులు సర్వదా కురిపించుగాక! ఇక అంధకూపాది నరకకుండాలలోనే మీ ఆందరి ఉనికి అని తెలుసుకోండి. పొండి - అని బ్రాహ్మణులమీద వాగ్దండం ప్రయోగించి నీళ్ళు స్పృశించి దేవీదర్శనం కోసమని గాయత్రీమందిరానికి వెళ్ళాడు.
సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవికూడా ఆ బ్రాహ్మణుల దుశ్చేష్టితానికి ఆశ్చర్యపోయింది. జనమేజయా! అందుకే ఇప్పటికీ ఆ దేవి ముఖం స్మయయుక్తంగానే - ఆశ్చర్యపోతున్నట్టే - ఉంటుంది.
తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతముణ్ణి ఆ స్మయమానముఖాంబుజ గాయత్రీమాత ఓదార్చింది. వత్సా! పాముకి పాలుపోసినట్టయ్యింది. విషంగానే మారుతుంది. ఆది సహజం. వాళ్ళ కర్మ అలా కాలింది. నువ్వేం చేస్తావ్. మహాభాగా! శాంతించు.
ఈ మాటలతో గౌతముడు తేరుకున్నాడు. ఆశ్రమం చేరుకున్నాడు. యథాపూర్వకంగా తపస్సు సాగించాడు.
విప్రుల పశ్చాత్తాపం

No comments:
Post a Comment