Thursday, September 4, 2025

Sri Kali Devi Vupasana Vidhanamu - శ్రీకాళీదేవి ఉపాసనా విధానము

శ్రీకాళీదేవి ఉపాసనా విధానము

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతి పాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకా
ళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. భయంకర ఆకారంతో, తంత్ర శాస్త్రంలో కాళి ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

దశ మహావిద్యలలో అత్యంత ముఖ్యమైన దేవత కాళికాదేవి. తాంత్రికులకు ఆమె ఇష్టదేవత. తంత్రమున ఎందరు దేవతలు ఉన్నా కాళీమాతకు ప్రత్యేకస్థానం ఉన్నది. ఎందుకంటే కాళీ ఉపాసనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాళీ ఉపాసన అతిశీఘ్ర ఫలదాయిని. అతిప్రాచీన కాలం నుంచి మన దేశంలో పరంపరగావస్తున్నది. ఒక జీవితకాలం పట్టే సాధనను కాళీమాత కొన్ని నెలలలో ఇవ్వగలదు. కానీ ఈ సాధన అందరూ చె య్యులే రు. ఇది చాలా కష్టమైన సాధన అని చెబుతారు.

చైతన్య దీపిక కాళిక

పార్వతీదేవి ఉగ్ర రూపమే కాళికా దేవి. ఈమె సృష్టి చైతన్యానికి రూపం. కాల స్వరూపం. కాలం ఎప్పుడూ గతిశీలమే. అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్యమే కాళిక. అన్ని వర్ణాలనూ తనలో నింపుకున్న కాళ రాత్రి ఈమె వర్ణం.

కాళీమాత అవతరణ
ఈమె అవతరణని గురించి వేదములలో, దేవి భాగవతంలో, పురాణములలో ఎన్నో కధలు న్నాయి. సృష్టి ఆరంభంలో మహావిష్ణు నాభి కమలం నుంచి బ్రహ్మ ఉదయించాడట. విష్ణువు నిద్రావశుడై ఉండగా ఆయన చెవిలోంచి పుట్టిన = మధుకైటభ రాక్షసులు (బ్రహ్మను బాధించడం మొదలుపెట్టారు. వారినేమీ చేయలేక విష్ణువును లేపడానికి ప్రయత్నించి విఫలుడై మహామాయను, కాల స్వరూపిణి అయిన కాళిని స్తుతించగా ఆమె అవతరించి విష్ణువుని లేపి, రాక్షసులని సంహరించడానికి శక్తి నిచ్చింది అంటారు.

సమస్త విద్యలకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాల లోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకొనేటప్పుడు అగ్నితో సమానమైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభవిస్తారు.
 
కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్శశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యలలో ఈమె ప్రధాన దేవతగా కొలుస్తారు. కాళీ జ్ఞాన శక్తికి, క్రియాశక్తికి, ఆదిమాతగా చెబుతారు.

నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీ మాతయే సృష్టించిందని చెప్పబడివుంది. నిరుత్తర తంత్రం, పిచ్చిల తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్మొంటాయి. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించినా ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహా సాధువులు, సన్యాసులు కాళీ మాతను సేవించి కైవల్య ప్రాప్తినొందారు. వారిలో మనందరకు సుపరిచితమైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రముఖులు.

ఒకనాడు భూమిపైన పాప సంచయం బాగా పెరిగిపోయింది. భగవన్నామ స్మరణ, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి, ప్రజలు అరిషడ్వర్గాలకు లోనై స్వేచ్చగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండాపోయింది. దీంతో ఆగ్రహించిన కాళీమాత ఉగ్రంగా నాట్యం చేయనారభించింది. దీంతో లోకాలన్ని కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీమాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవుణ్ణి చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీ మాత మహాదేవుడిపై తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తుంటుంది. అంటే అమ్మ ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహా శివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలికింద పడుకుని ఉంటాడు. స్వామి చర్యను చూసిన కాళిక అచ్చెరువుతో నాలుక తెరచి ఉంటుంది.

కాళి ఎనిమిది రూపాలు
కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనిమిది రూపాలు.

1. దక్షిణ కాళిక,
2. సిద్ధ కాళిక,
3. గుహ్య కాళిక,
4. శ్రీ కాళిక
5. భద్ర కాళిక,
6. చాముండా కాళిక,
7. శ్మశాన కాళిక,
8. మహాకా
ళిక.

మంత్ర మహార్గవం ప్రకారం ఆదిశక్తి

కాళీ మాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్మరించింది. అందుకే కాళీ మంత్రాలలో ( అనేక బేధాలు ఉన్నాయి. బ్రహ్మ స్వరూపమైన కాళీని ఆదిశక్తి అని చెబుతుంది మంత్ర మహార్ణవము. మొదట్లో దక్షిణ భైరవుడు కాళీ మాతను 
పూజించి ఉపాసన చేసినందువలన ఈమె దక్షిణ కాళిక అని పిలవబడుచున్నది. మార్మండేయ మహా పురాణంలో ఈ కాళిని నిత్య అనే పేరు పిలువబడినది. ఈమె అవసరాన్ని బట్టి అనేక రూపములలో మనుషులకు, దేవతలకు, రాక్షసులకు శుభములు చేకూరుస్తూ వుంటుంది.

మహాకాలుని వలనే మహాకాళి కూడా సృష్టి వినాశనమును, సృష్టి సంహరమును అంత్యకాలము నందు చేసే మహా రుద్ర రూపిణి. కాలం నుంచే పదార్ధము పుట్టి, మరలా ఆ కాలంలోనే ఈ పదార్ధము అంతా కలిసిపోతుంది. ప్రళయాంతమున జరిగే మహా ప్రళయమునకు ప్రత్యక్ష సాక్షి ఈ మహా కాళి,

కా
ళీమాత నడుము చుట్టూ మానవ ఖండిత కరములు చుట్టుకుని ఉంటుంది. అంటే తాను కనపడకుండా మానవుల చేతులతో తాను పని చేయిస్తూ ఉంటాను అన్న సిద్ధాంతానికి ప్రతీకగా విషయాన్ని చెబుతారు.

శ్లో: జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ ।
దుర్గాక్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే ॥


మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయం మరియు సంశయం ఎక్కువ, ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీ మాత.

కాళికగా జననం
దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుటి నుండి క్రోధజ్వాలయై కాళిక జన్మించిందని, రక్తబీజుడనే రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణియై అవతరించిందనీ, దేవి పురాణం, మార్మండేయ పురాణాలలోని కథలు చెబుతున్నాయి. 

కాళికాదేవి నల్లని రూపం తమోగుణానికి ప్రతీక. ఒకచేతిలో ఆమె ఖండించిన అసురుని తల, ఖడ్గం, వరద అభయ హస్తాలతో ఉంటుంది. అమ్మ శ్మశానంలో నర్తిస్తుంది. కాలం అంటే వినాశం అనే అర్ధం కూడా ఉంది. ఆ వినాశం అనివార్యమైనది. సృష్టించబడిన ప్రతి వస్తువూ నశించక తప్పదు. సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాళిక. ఆమె మహాకాలుని స్రీ రూపం. ఆమె మెడలోని పుర్రెలదండ దుష్టులను భయపెడుతుంది. ఆ దండలోని పుర్రెలు 22 బీజాక్షరాలకి ప్రతీకలని అంటారు.

కాళికాదేవి రూపాలు ఎన్ని?
కాళికాదేవి దక్షిణ కాళి, వామ దేవి అనే రెండు ప్రధాన రూపాలు ఉన్నాయి. బృహన్నీలా తంత్రం ప్రకారం కాళికా దేవి రక్తవర్ణంతో సుందర రూపంలోనూ, కృష్ణ వర్ణం (నలుపు) తో భయంకర రూపంతోనూ ఉంటుంది. భద్రకాళీ రూపం భక్తులకు రక్షగా ఉంటుంది.

కాళికా దేవి విద్యాదాయిని. నీల కంఠుడు మహాకవి కాళి దాసుగా అయినాడంటే అది అమ్మదయే. కాళికా దేవి మన లోని జాడ్యాలను భయాలను తొలగించి, చైతన్యాన్ని ఇస్తుంది. శత్రువుల నుంచీ, దుష్ట పీడల నుంచీ కాపాడుతుంది. అఖండమైన విద్యాప్రాప్తిని ప్రసాదిస్తుంది.

కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రివాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒకసారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. ప్రేమ అనేది ఒక అపు రూపమైన తత్వం. తిట్టుకున్న కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

కాళికారూపం భయం గోలిపేదిగా ఉంటుంది. కాని తత్త్వం తెలుసు కుంటే భయం ఉండదు. కాళీదర్శనం కలిగితే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. కాళికా వరప్రసాదికి అసాధ్యం అనేది ముల్లోకాలలో లేనేలేదు. అతని ఆజ్ఞను పంచభూతాలు తలదాల్చవలసిందే. 

భయంకరమైన కాళీరూపాలు కూడా చాలా ఉన్నాయి. అవి చూచి సామాన్య సాధకులు తట్టుకోలేరు. కాళీమాత రూపాలు ఒకటి కాదు. అనేకం ఉన్నాయి. భద్రకాళి, శ్మశానకాళి, కరాళకాళి, మహాకాళి ... ఇలా చాలారూపాలు ఉన్నాయి. వాటిలో 
శ్మశానకాళి రూపం అత్యంత భయానకం. కాని మహాకాళి అలా కాదు. ఆమె రూపం అత్యంత మనోహరంగా ఉండి మాతృత్వ భావనను కలిగిస్తుంది. మన సొంత తల్లిని కొన్ని ఏళ్ళ తరువాత చూచినప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమ హృదయంలో పెల్లుబుకుతుంది. కారణం ఆమె ప్రపంచానికే తల్లి. ఆది శక్తి దేవతలకు మానవులకు సమస్త జీవకోటికి చరాచర సమస్త సృష్టికి మాత.

కాళి రూపం చిత్రకారుని ఊహ కాదు
కాళి సామాన్యంగా నాలుగు చేతులు కలిగి ఉంటుంది. నూరు చేతుల రూపం కూడా ఉన్న ప్పటికీ సామాన్యంగా మనం చూచే రూపం మాత్రం ఇదే. ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో ఖండిత శిరస్సు, మిగిలిన రెండు చేతులలో వరద అభయ ముద్రలు దాల్చి అచేతనుడైన శివునిపైన నిలబడి ఉన్నట్లు మనం సాధారణంగా కనబడే చిత్రాలలో చూస్తాము. ఇది చిత్రకారుని ఊహకాదు. సాధకులకు దర్శనం ఇచ్చే దేవతా స్వరూపం కూడా ఇలాగే ఉంటుంది అంటారు. ఆ రూపం చిత్రం కంటే ఎన్నోరెట్లు జీవంతో ఉంటుంది. ఆకారం భయానకమే. కాని ఈ భయంకర రూపం రాక్షస ప్రవృత్తి కలవారికే పరిమితం. ఆమె బిడ్డలకు కాదు. బిడ్డకు తల్లి కోపంగా ఉన్నా భయం కలుగదు. ఆ తల్లి కోపం తనలోని అసుర ప్రవృత్తి పైనే గాని తన పైన కాదు అన్న సత్యం తెలిస్తే భయం ఆ అమ్మవారిపై ఉన్న భయం పటాపంచలౌతుంది. 

మన దేవతల విగ్రహాలు చిత్రాలు, చిత్రకారుని ఊహలు కావు. అవి మార్మికభాషా సంకేతాలు అని చెబుతారు. అంటే గొప్ప భావాన్ని దృశ్య రూపంగా చెప్పటం. ఈ దృశ్య రూపంకంటే బాగా చెప్పటం,
కవితాత్మకంగా చెప్పటం సాధ్యం కాదు అని భావన. 

శివుడు అనగా సృష్టికి ముందు ఉన్నటు వంటి అఖండ నిరాకాల నిశ్చల పరతత్త్వం. అట్టి నిశ్చల తత్వమున కదలిక వచ్చి సృష్టి జరిగింది. ఆ కదలికే శక్తి ఆ శక్తికే కాళి అని పేరు. అచేతనంగా పడి ఉన్న శివుడు సృష్టికి మూలము ఆధారము అయిన పరమాత్మ, ఆ పరమాత్ముని ఆధారంగా శక్తి సృష్టిస్థితి లయలు చేస్తున్నది. అనగా అచేతన బ్రహ్మము పైన చేతనాత్మక శక్తి నాట్యం చేస్తున్నది. దీనినే శివునిపైన శక్తి నిలిచి ఉన్న చిత్రంగా చూపుతారు. 

సాధకుడు ఇంద్రియాతీతుడై సమాధి అవస్థలో ప్రవేశించినపుడు దేహస్పృహ కోల్పోతాడు. అపుడు శవం మాదిరిగా అచేతనుడై పడి ఉంటాడు. కాని ఆ అచేతనునిలో ఆద్యాశక్తి కుండలీరూపంలో జాగ్భతమై ఉంటుంది. కదలిక లేక సమాధి అవస్థలో ఉన్న సాధకునిలో మహాశక్తి జాగృతం అయి ఉంటుంది. ఈ శక్తి అతనిలోని రాక్షసత్వాన్ని ఒకే దెబ్బతో అంతం చేస్తుంది. అతనికి వరద అభయశక్తిగా నిలిచి రక్షిస్తుంది. ఆ జాగ్భత శక్తి ముందు ఏ రాక్షస ప్రవృత్తులూ నిలువలేవు. చావు లేని రక్తబీజుడైనా సరే ఈ శక్తిముందు అంతం కావలసిందే.

మనిషి తనలోని పశు ప్రవృత్తి రాక్షసప్రవృత్తి పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. కాని అవి సఫలం కావు. పూర్తిగా కళ్లు తెరిచిన జాగ్భత కుండలినీ శక్తి మాత్రమే ఈ పని ఒక్క క్షణంలో చెయ్య గలుగుతుంది. కాళి నిరంతరం జరుగుతున్న భాహ్యసృష్టి ప్రక్రియకు సజీవ రూపం. ఇంకొక రకంగా సాధకుని ఆంతరిక సాధనా లో గే అం ప్రక్రియకు ప్రతి రూపం. ఈ తాః నకరాలు ౦ విధంగా బాహ్య ఆంతరిక భూమికలలో నిరంతరం ఆమె లీల జరుగుతూనే ఉంటుంది. కాళీ అనుగ్రహం పొందగలిగితే అట్టి వాని జన్మలో ఇక అందుకోవలసిన శిఖరాలు ఉండవు. ఆమె సర్వ శక్తిమయి. పరబ్రహ్మ మహిషి అని దేవీ భాగవతం స్తుతించింది. సమస్త లోకాలు భువనాలు ఆశక్తి ఆటలు, లీలా విలాసాలు. సమస్త అవతారాలు, దేవతలు ఆమె బిడ్డలు. ఆ శక్తిలోనే పుట్టి పెరిగి లయిస్తుంటారు. కాళీశక్తికి అతీతంగా ఏదీ లేదు, ఎవరూ లేరు. ఇదే కాళీ తత్త్వం.

కాళి కాల రూపంలో ఉన్న ఈశ్వర శక్తి. తాంత్రికుల దృష్టిలో, యావత్‌ ప్రపంచము, ఒక మహా శ్శశానము. కాళి, కాల గమనములోని అనంతమైన కదలికలను, అనంత వేగముతో తన సునిశితమైన నాట్య భంగిమలతో వ్యక్తము చేయును. ఆమె సర్వమును కబళించు నిర్ధాక్షిణ్య మారణ ప్రక్రియకు సంకేతము.

వివిధ రూపాలలో ఆరాధన
శాక్తేయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే దేవిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.

ఛాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన సంవర్గ, ప్రాణవిద్యల ఆధారంగా కాళీ ఉపాసన జరుగుతుంది. దేవతలలోని వాయువు, మానవులలోని ప్రాణము అనునవి రెండునూ ముఖ్యమైన సంవర్గములు. ఇవియే సకల ప్రాణికోటికి చైతన్య శక్తిని ఇచ్చునవి. ఈ ప్రాణవాయువు యొక్క వైశ్విక చైతన్య శక్తినే తాంత్రికులు “కాళి” గా ఉపాసిస్తారు.

కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించవచ్చు. లోకంలో ఇది అసాధ్యం, జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి. ఇదెట్లా సాధ్యం అవుతుంది? కా
ళీ అను గ్రహంతో కాలగతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మీభూతం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది. మహా కాళీ శక్తికి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు. 

కాళీమాతకు, కుండలినీశక్తికి సంబంధం ఉంది. ఎలాగంటే, ఆద్యా శక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే శక్తిలేక పోవటమే “నిద్రాణ స్థితి” అంటే. కాళీమంత్ర సాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీ శక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.

కాళీమాత మేడలో పుర్రెల దండ ఉంటుంది. ఈ పుర్రెలు తంత్ర శాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్ర విజ్ఞానం ప్రకారం ఇవి సంసృతం లోని ఏభై అక్షరాలతో సమం. ఈ పుర్రెలదండను వర్ణ మాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు. అక్షరములు అనే మాటలో  అద్భుతమైన అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు. మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు. కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు. కనుక వాటికి నాశనం లేదు.

పు
ర్రెలను మెడలో ఎందుకు ధరిస్తుంది?
పుర్రెలు శాశ్వతత్వానికి సూచన. మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి. మనిషి శరీరంలో పు
ర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి. కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.

మాత సర్వ మంత్ర స్వరూపిణి
పు
ర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది. ఏభై అక్షరాలు షట్‌ చక్రాలలోని ఏభై దళాలలో ఉంటాయి. కుండలినీ సాధన చేసేవారికి వీటి గురించి వివరాలు పరిచితమే. మూలాధార పద్మం 4 దళములు. స్వాధిష్టాన పద్మం 6 దళములు, మణిపూరక పద్మం 10 దళములు, అనాహత పద్మం 12 దళములు, విశుద్ధ పద్మం 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం 2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు, 50 స్పందనలుగా ఉంటాయి. సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే. కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్ర మయి. సర్వ మంత్ర స్వరూపిణి.

నేటికీ ఉజ్జయినిలో కాళీ సాధకులు
కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళీ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు.

శరీరమందు నిరంతరము ప్రవహించుచు, జీవయాత్రను నిర్వహించుచున్న ఈ ప్రాణవాయువు, ప్రతి కదలికలోనూ ఏకాగ్రతను కల్పించి, చాంచల్యములేని మనస్సుతో మాతను కొలిచేవారిని కాళి ఎప్పుడూ రక్షించును. ఉచ్చ్వాస-నిశ్వాస గతులను అనుసరించుచూ, శ్వాస మూలమును పొందుచూ, ప్రాణాన్ని ఉపాశించువాడు కాళీప్రసాద పాత్రుడు కాగలడు.

శ్రీ కాళీ మహా విద్యా


దశమహా విద్యలు

Wednesday, September 3, 2025

Sri Shodase Devi Sahasra Nama Stottram - శ్రీ షోడశీ దేవి సహస్రనామ స్తోత్త్రం

శ్రీ షోడశీ దేవి సహస్రనామ స్తోత్త్రం

ధ్యానం:

బాలార్క మండలా భాసాం చతుర్భాహుం త్రిలోచనామ్‌
పాశాంకుశ శరాంశ్చాపం ధారయంతీం శివాం భజే ॥ 01 ॥

యంత్రోద్దారః
బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వశ్ర నాగదళ సంయుత షోడశారమ్‌ ॥ 02 ॥

వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ
శ్రీ చక్రరాజ ముదితం పరదేవతాయా ॥ 03 ॥

సహస్రనామ స్తోత్రమ్‌
కైలాసశిఖరే రమ్యే నానా రత్నోపశోభితే
కల్పపాదప మధ్యస్థే నానా పుష్పోప శోభితే ॥ 04 ॥

మణిమండప మధ్యస్థే ముని గంధర్వ సేవితే
కదాచిత్సుఖ మాసీనం భగవంతం జగద్గురుం ॥ 05 ॥

కపాల ఖట్వాంగధరం చంద్రార్థకృత శేఖరమ్‌
త్రిశూలడమరరూహస్తం మహావృషభ వాహనమ్‌ ॥ 06 ॥

జటాజూటధరం దేవం వాసుకీ కంఠభూషణమ్‌
విభూతి భూషం దేవం నీలకంఠం త్రిలోచనమ్‌ ॥ 07 ॥

ద్వీపి చర్మపరీధానం శుద్ధస్ఫటిక సన్నిభమ్‌
సహస్రాదిత్య సంకాశం గిరిజార్ధాంగ భూషణమ్‌ ॥ 08 ॥

ప్రణమ్య శిరసా నాధం కారణం విశ్వరూపిణం
కృతాంజలిపుటో భూత్వా ప్రాహైనం శిభీవాహనః ॥ 09 ॥

కార్తికేయ ఉవాచ
దేవదేవ జగన్నాధ సృష్టి స్థితి లయాత్మక
త్వమేవ పరమాత్మా చ త్వం గతి స్సర్వ దేహినామ్‌ ॥ 10 ॥

త్వం గతి స్సర్వలోకానాం దీనానాం చ త్వమే వహి
త్వమేవ జగదాధార స్త్వమేవ విశ్వకారణః ॥ 11 ॥

త్వమేవ పూజ్య స్సర్వేషాం త్వదన్యో నాస్తి మే గతిః
కింగృహ్యం పరమంలోకే కిమేకం సర్వ సిద్ధిదం ॥ 12 ॥

కిమేకం పరమంశ్రేష్ఠం యోగఃస్వర్గమోక్షదః
వినా తీర్థేన తపసా వినాదానైర్వినా మఖైః ॥ 13 ॥

వినా లయేన ధ్యానేన నరః సిద్ధి మవాప్నుయాత్‌
కస్మా దుత్పద్యతే సృ
ష్టిః కస్మింశ్చ ప్రళయోభవేత్‌ ॥ 14 ॥

కస్మా దుత్తీర్యతే దేవ సంసారార్ణవ సంకటాత్‌
తదహం శ్రోతు మిచ్ఛామి కథయస్వ మహేశ్వరః ॥ 15 ॥

ఈశ్వర ఉవాచ
సాధు సాధు త్వయా పృష్ఠం పార్వతీ ప్రియ నందన
అస్తి గుహ్య తమం పుత్ర కథయిష్యా మ్యసంశయ ॥ 16 ॥

సత్వం రజస్తమ శ్చైవ యేచాన్యే మహదాదయః
యేచాన్యే బహవోభూతాః సర్వప్రకృతిసంభవాః ॥ 17 ॥

సైవ దేవీ పరాశక్తి ర్మహా త్రిపుర సుందరీ
సైవ ప్రసూయతే విశ్వం విశ్వం సైవ ప్రపాస్యతి ॥ 18 ॥

సైవ సంహరతే విశ్వం జగదేతచ్చరాచరమ్‌
ఆధారస్సర్వ భూతానాం సైవరోగార్తి హారిణీ ॥ 19 ॥

ఇచ్భాజ్ఞాన క్రియాశక్తి ర్బ్రహ్మ విష్ణు శివాదయః
త్రిథాశక్తి స్వరూపేణ సృష్టి స్థితి వినాశినీ ॥ 20 ॥

సృజ్యతే బ్రహ్మ రూపేణ విష్ణు రూపేణ పాల్యతే
సంహరే రుద్ర రూపేణ జగదేతచ్చరాచరమ్‌ ॥ 21 ॥

యస్యాయోనౌ జగత్సర్వం అద్యాపి పరివర్తతే
యస్యాంప్రలీయతే చాంతే యస్యాం చ జాయతే పునః ॥ 22 ॥

యాం సమారాధ్యత్రైలోక్యం సంప్రాప్తమ్‌ పద ముత్తమమ్‌
తస్యానామసహస్రం తు కథయామి శృణుష్వతత్‌ ॥ 23 ॥

ఓం అస్యశ్రీ త్రిపుర సుందరీ సహస్రనామ స్తోత్ర మంత్రస్య 
శ్రీ భగవాన్‌ దక్షిణామూర్తిః బుషి జగతీఛందః ॥ 24 ॥

సమస్త ప్రకటగుప్త సంప్రదాయ కులకౌలోత్తీర్ణ నిర్గర్భ
రహస్య అచింత్య ప్రభావతీదేవతా ఓం బీజమ్‌ ॥ 25 ॥

హ్రీం మాయాశక్తిః కామరాజేతి క్లీం కీలకమ్‌ జీవో బీజమ్‌
సుషుమ్నానాడీ సరస్వతీ శక్తిర్థర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః ॥ 26 ॥

ధ్యానం:
ఆధారే తరుణార్మబింబరుచిరం హేమప్రభం వాగ్భవమ్‌
బీజం మన్మథ మింద్రగోపసదృశం హృత్పంకజే సంస్థితమ్‌
విష్ణు బ్రహ్మపదస్థ శక్తి కలితం సోమప్రభా భాసురమ్‌
యే ధ్యాయన్తి పదత్రయం తవశివే తే యాన్తి సౌఖ్యం పదమ్‌ ॥ 27 ॥

కల్యాణీ కమలాకాళీ కరాళీ, కామరూపిణీ
కామాఖ్యా కామదా కామ్యా కామనా కామచారిణీ ॥ 28 ॥

కాలరాత్రి ర్మహారాత్రిః కపాలీ కాలరూపిణీ
కౌమారీ కరుణాముక్తిః కలికల్మషనాశినీ ॥ 29 


కాత్యాయనీ కరాధారా కౌముదీ కమలప్రియా
కీర్తిదా బుద్ధిదా మేధా నీతిజ్ఞా నీతి వత్సలా ॥ 30 ॥

మాహేశ్వరీ మహామాయా మహాతేజా మహేశ్వరీ
మహాజిహ్వా మహాఘోరా మహాదంష్ట్రా మహాభుజా ॥ 31 ॥

మహామోహాంధకారఘ్నీ మహామోక్షప్రదాయినీ
మహాదారిద్య్రనాశా చ మహాశత్రువిమర్దినీ
 ॥ 32 ॥ 

మహామాయా మహావీర్యా మహాపాతక నాశినీ
మహామఖా మంత్రమయీ మణిపూరకవాసినీ
 ॥ 33 ॥

మానసీమానదా మాన్యా మానశ్చక్షూరణేచరా
గణమాతా చ గాయత్రీ గణ గంధర్వ సేవితా
 ॥ 34 ॥

గిరిజా గిరిశా సాధ్వీ గిరిస్థా గిరి వల్లభా
చండేశ్వరీ చండరూపా ప్రచండా చండమాలినీ
 ॥ 35 ॥

చర్వికా చర్చికాకారా చండికా చారురూపిణీ
యజ్ఞేశ్వరీ యజ్ఞరూపా జపయజ్ఞ పరాయణా
 ॥ 36 ॥

యజ్ఞమాతా యజ్ఞభోక్త్రీ యజ్ఞేశీ యజ్ఞసంభవా
సిద్ద యజ్ఞ క్రియాసిద్దిర్యజ్ఞాంగీ యజ్ఞరక్షికా
 ॥ 37 ॥

యజ్ఞక్రియా యజ్ఞరూపా య
జ్ఞాంగీ యజ్ఞ రక్షికా
యజ్ఞక్రియా య
జ్ఞాచ యజ్ఞాయజ్ఞ క్రియాలయా ॥ 38 ॥

జాలంధరీ జగన్మాతా జాతవేదా జగత్ప్రియా
జితేంద్రియా జితక్రోధా జననీ జన్మదాయినీ
 ॥ 39 ॥

గంగాగోదావరీ చైవ గోమతీ చ శతద్రుకా
ఘర్ఘరా వేదగర్భా చ రేచికా సమవాసినీ
 ॥ 40 ॥

సింధుర్మందాకినీ క్షిప్రా యమునా చ సరస్వతీ
భద్రా రాగవిపాశా చ గండకీ వింధ్యవాసినీ
 ॥ 41 ॥

నర్మదా సింధుకావేరీ వేత్రవత్యా సుకౌశికీ
మహేంద్రతనయా చైవ అహల్యా చర్మకావతీ
 ॥ 42 ॥

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారావతీ తీర్జామహాకిల్బిషనాశినీ
 ॥ 43 ॥

పద్మినీ పద్మమధ్యస్థా పద్మ కింజల్కవాసినీ
పద్మవక్త్రా చకోరాక్షి పద్మస్థా పద్మసంభవా ॥ 44 


హ్రీంకారా కుండలధారా హృత్పద్మస్థా సులోచనా
శ్రీంకారీ భూషణా లక్ష్మీః క్లీంకారీ క్లేశ నాశినీ ॥ 45 


హరివక్త్రోద్భవా శాంతా హరి వక్త్ర కృతాలయా
హరివ
క్త్రోద్భవా శాంతా హరివక్ష స్థలస్థితా ॥ 46 

వైష్ణవీ విష్ణు రూపా చ విష్ణు మాతృ స్వరూపిణీ
విష్ణుమాయా విశాలాక్షీ విశాలనయనోజ్ఞ్వలా ॥ 47 


విశ్వేశ్వరీ చ విశ్వాత్మా విశ్వేశీ విశ్వరూపిణీ
విశ్వేశ్వరీ శివారాధ్యా శివనాధా శివప్రియా ॥ 48 


శివమాతా శివాఖ్యా చ శివదా శివరూపిణీ
భవేశ్వరీ భవారాధ్యా భవేశీ భవనాయికా ॥ 49 


భవమాతా భవాగమ్యా భవకంటక నాశినీ
భవప్రియా భవానందా భవానీ భవ మోహినీ ॥ 50 


గాయత్త్రీ చైవ సావిత్రీ బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ
బ్రహ్మేశీ బ్రహ్మదా బ్రహ్మా బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ
 ॥ 51 

దుర్గస్థా దుర్గరూపా చ దుర్గా దుర్గార్తి నాశినీ
సుగమా దుర్గమా దాంతా దయాదోగ్థ్రీ దురాపహా
దురితఘ్నీ దురాధ్యక్షా దురాదుష్కృతనాశినీ
 ॥ 52 

పంచాస్యాపంచమీ పూర్ణా పూర్ణ పీఠనివాసినీ
సత్వస్థా సత్వరూపా చ సత్వస్థా సత్వ సంభవా
 ॥ 53 

రజస్థా చ రజోరూపా రజోగుణసముద్భవా
తమస్థా చ తమోరూపా తామసీ తామసప్రియా
 ॥ 54 

తమోగుణ సముద్భూతా సాత్వికీ రాజసీ కళా
కాష్ఠా ముహూర్తా నిమిషా అనిమేషా తతః పరమ్‌
 ॥ 55 

అర్థమాసా చ మాసా చ సంవత్సరస్వరూపిణీ
యోగస్థా యోగరూపా చ కల్పస్థా కల్పరూపి
ణీ ॥ 56 

నానారత్న విచిత్రాంగీ నానాభరణమండితా
విశ్వాత్మికా విశ్వమాత విశ్వపాశ వినాశినీ
 ॥ 57 

విశ్వాసకారిణీ విశ్వా విశ్వశక్తి విచక్షణా
యవా కుసుమ సంకాశా దాడిమీ కుసుమోపమా
 ॥ 58 

చతురంగీ చతుర్భాహు శ్చతురాచార వాసినీ
సర్వేశీ సర్వదా సర్వా సర్వదా సర్వదాయినీ
 ॥ 59 

మాహేశ్వరీ చ సర్వద్యా శర్వాణీ సర్వమంగళా
నళినీ నందినీ నందా ఆనందానందవర్ధినీ
 ॥ 60 

వ్యాపినీ సర్వభూతేషు భవభార వినాశినీ
సర్వశృంగార వేషా
ఢ్యా పాశాంకుశ కరోద్యతా
సూర్యకోటి సహస్రాభా చంద్ర కోటినిభాననా
 ॥ 61 

గణేశకోటి లావణ్యా విష్ణు కోట్యరిమర్దినీ
దావాగ్నికోటి దళినీ రుద్ర కోట్యుగ్ర రూపిణీ
 ॥ 62 

సముద్ర కోటి గంభీరా వాయుకోటి మహాబలా
ఆకాశ కోటి విస్తారా యమకోటి భయంకరీ
 ॥ 63 

మేరుకోటి సముచ్ఛ్రాయా గణకోటి సమృద్ధిదా
నిష్కస్తోకా నిరాధారా నిర్గుణా గుణవర్జితా
 ॥ 64 

అశోకాశోకరహితా తాపత్రయ వివ
ర్జితా
వశి
ష్ఠా విశ్వజననీ విశ్వాఖ్యా విశ్వవర్ధినీ ॥ 65 

చిత్రావిచిత్ర చిత్రాంగీ హేతుగర్భా కులేశ్వరీ
ఇచ్చాశక్తిః జ్ఞాన శక్తిః క్రియాశ
క్తిః శుచిస్మితా ॥ 66 

శుచిస్మృతి మయీ సత్యా పంచతత్త్వోపరిస్థితా
మహాసత్వమయీ సత్త్వా 
పంచతత్త్వోపరిస్థితా ॥ 67 

పార్వతీ హిమవత్పుత్రీ పారస్థా పారరూపిణీ
జయంతీ భద్ర కాళీ చ అహల్యా కులనాయికా
 ॥ 68 

భూతధాత్రీ చ భూతేశీ భూతస్థా భూతభావనా
మహాకుండలినీ శక్తిర్మహా విభవవర్ధినీ
 ॥ 69 

హంసాక్షీ హంసరూపా చ హంసస్థా హంస రూపిణీ
సోమ సూర్యాగ్ని మధ్యస్థా మణి మండలవాసినీ
 ॥ 70 

ద్వాదశార సరోజస్థా సూర్యమండల వాసినీ
అకలంకా శశాకాంభా షోడశారనివాసినీ
 ॥ 71 

డికినీ రాకినీ చైవ లాకినీ కాకినీ తథా
శాకినీ హాకినీ చైవ షట్చక్రేషు నివాసినీ
 ॥ 72 

సృష్టిస్థితి వినాశాయ సృష్టిస్థిత్యంత కారిణీ ।
శ్రీ కంఠ ప్రియ హృత్కంఠానందాఖ్యా బిందుమాలినీ
 ॥ 73 

చతుష్టష్టి కళాధారా దేహదండసమాశ్రితా
మాయాకాళీ ధృతిర్మేధా క్షుధాతుష్టిర్మహాద్యుతిః ॥ 74 

హింగుళా మంగళా సీతా సుషుమ్నా మధ్యగామినీ
పరఘోరా కరుళాక్షీ విజయా జయదాయినీ ॥ 75 

హృత్పద్మనిలయా భీమా మహాభైరవనాదినీ
అకాశలింగసంభూతా భువనోద్యానవాసినీ ॥ 76 

మహత్సూక్ష్మాచ కంకాళీ భీమరూపా మహాబలా
మేనకా గర్భ సంభూతా తప్తకాంచన సన్నిభా ॥ 77 

అంతరస్థా కూటబీజా త్రికూటాచలవాసినీ
వర్ణాఖ్యా వర్ణరహితా పంచాశద్వర్ణ భేదినీ ॥ 78 

విద్యాధరీ లోకధాత్రీ అప్పరా అప్పరః ప్రియా
దీక్షాదాక్షాయణీ దక్షా దక్షయజ్ఞ వినాశినీ ॥ 79 

యశఃపూర్ణా యశోదా చ యశోదాగర్భ సంభవా
దేవకీ దేవమాతా చ రాధికా కృష్ణవల్లభా ॥ 80 

అరుంధతీ శచీంద్రాణీ గాంధారీ గంధమాలినీ
ధ్యానాతీతా ధ్యాన గమ్యా ధ్యానజ్ఞా ధ్యానధారిణీ ॥ 81 

లంబోదరీ చ లంబోష్టీ జాంబవతీ జలోదరీ
మహోదరీ ముక్తకేశీ, ముక్తకామార్థసిద్ధిదా ॥ 82 

తపస్వినీ తపోనిష్టా సుపర్ణా ధర్మవాసినీ
బాణచాపధరా ధీరా పాంచాలీ పంచమప్రియా ॥ 83 

గుహ్యాంగీ చ సుభీమా చ గుహ్యతత్వా నిరంజనా
అశరీరా శరీరస్థా సంసారార్ణవ తారిణీ ॥ 84 

అమృతా నిష్కలా భద్రా సకలా కృష్ణ పింగళా
చక్రప్రియా చ చక్రాహ్వా పంచచక్రాది ధారిణీ ॥ 85 

పద్మారాగ ప్రతీకాశా నిర్మలాకాశ సన్నిభా
అధఃస్థా ఊర్ధ్వరూపా చ ఊర్థ్వ పద్మనివాసినీ ॥ 86 

కార్యకారణ కర్తృత్వే శశ్వద్రూపేషు సంస్థితా
రసజ్ఞా రసమధ్యస్థా గంధస్థా గంధరూపిజీ ॥ 87 

పరబ్రహ్మ స్వరూపా చ పరబ్రహ్మ నివాసినీ
శబ్దబ్రహ్మ స్వరూపా చ శబ్దస్థా శబ్దవర్జితా ॥ 88 

సిద్ధిర్భుద్ధిః పరాబుద్ధిః సందీప్తిర్మధ్య సంస్థితా
స్వగుహ్యా శాంభవీ శక్తిః తత్వస్థా తత్వరూపిణీ ॥ 89 

శాశ్వతీ భూత మాతా చ మహాభూతాధిప ప్రియా
శుచిప్రేతా ధర్మసిద్ధిః ధర్మవృద్ధిః పరాజితా ॥ 90 

కామసందీపినీ కామా సదా కౌతూహల ప్రియా
జటాజూట ధరాముక్తా సూక్ష్మాశక్తి విభూషణా ॥ 91 ॥

ద్వీపిచర్మ పరీధానా చీరవల్మల ధారిణీ
త్రిశూల డమరుధరా నరమాలా విభూషణా ॥ 92 ॥

అత్యుగ్రరూపిణీ చోగ్రా కల్పాంత దహనోపమా
త్య్రైలోక్యసాధినీ సంధ్యా సిద్ధిసాధక వత్సలా ॥ 93 ॥

సర్వవిద్యామయీ సారా చాసురాణాం వినాశినీ
దమనీ దామనీ దాంతా దయాదోగ్ధ్రీ దురాపహా ॥ 94 ॥

అగ్నిజిహ్వోపమా ఘోరా ఘోరఘోర తరాననా
నారాయణీ నారసింహీ నృసింహ హృదయే స్థితా ॥ 95 ॥

యోగేశ్వరీ యోగరూపా యోగమాతా చ యోగినీ
ఖేచరీ ఖచరీ ఖేలా నిర్వాణపద సంశ్రయా ॥ 96 ॥

నాగినీ నాగకన్యా చ సువేశా నాగనాయికా
విషజ్వాలావతీ దీప్తా కళా శత విభూషణా ॥ 97 ॥

తీవ్రవక్త్రా మహావక్త్రా నాగకోటిత్వ ధారిణీ
మహాసత్వా చ ధర్మజ్ఞా ధర్మాతి సుఖదాయినీ ॥ 98 ॥

కృష్ణమూర్థా మహామూర్ధా ఘోరమూర్ధా వరాననా
సర్వేంద్రియ మనోన్మత్తా సర్వేంద్రియ మనోమయీ ॥ 99 ॥

సర్వ సంగ్రామ జయదా సర్వప్రహరణోద్యతా
సర్వపీడోపశమనీ సర్వారిష్ట నివారిణీ ॥ 100 ॥

సర్వైశ్వర్య సముత్పన్నా సర్వగ్రహ వినాశినీ
మాతంగీ మత్తమాతంగీ మాతంగీ ప్రియ మండలా ॥ 101 ॥

అమృతోదధి మధ్యస్థా కటిసూత్రై రలంకృతా
అమృతోదధి మధ్యస్థా ప్రవాళ వసనాంబుజా ॥ 102 ॥

మణిమండల మధ్యస్థా ఈషత్ప్రహసితాననా
కుముదా లలితా లోలా లాక్షా లోహితలోచనా ॥ 103 ॥

దిగ్వాసా దేవదూతీ చ దేవదేవాధి దేవతా
సింహోపరి సమారూఢా హిమాచల నివాసినీ ॥ 104 ॥

అట్టాట్టహాసినీ ఘోరా ఘోరదైత్య వినాశినీ
అత్యుగ్ర రక్తవస్త్రాభా నాగకేయూర మండితా ॥ 105 ॥

ముక్తాహార లతోపేతా తుంగపీన పయోధరా
రక్తోత్పల దళాకారా మదఘూర్ణితలోచనా ॥ 106 ॥

సమస్త దేవతామూర్తిః సురారి క్షయకారిణీ
ఖడ్గినీ శూలహస్తా చ చక్రిణీ చక్రమాలినీ ॥ 107 ॥

శంఖినీ చాపినీ బాణా వజ్రినీ వజ్రదండినీ
ఆనందోదధి మధ్యస్థా కటిసూత్రై రలంకృతా ॥ 108 ॥

నానాభరణ దీప్తాంగీ నానామణి విభూషితా
జగదానంద సంభూతా చింతామణి గుణాన్వితా ॥ 109 ॥

త్రైలోక్య నమితా తుర్యా చిన్మయానంద రూపిణీ
త్రైలోక్యనందినీ దేవీ దుఃఖదుస్వప్న నాశినీ ॥ 110 ॥

ఘోరాగ్ని దాహశమనీ రాజదేవార్థ సాధినీ
మహాపరాధ రాశిఘ్నీ మహాచౌర భయాపహా ॥ 111 ॥

రాగాది దోషరహితా జరామరణ వర్జితా
చంద్రమండల మధ్యస్థా పీయూషార్ణవ సంభవా ॥ 112 ॥

సర్వదేవైః స్తుతా దేవీ సర్వసిద్ధై ర్నమస్కృతా
అచింత్య శక్తిరూపా చ మణిమంత్ర మహౌషధిః ॥ 113 ॥

అస్తి స్వస్తిమయీ బాలా మలయాచలవాసినీ
ధాత్రీ విధాత్రీ సంహారీ రతిజ్ఞా రతిదాయినీ ॥ 114 ॥

రుద్రాణీ రుద్రరూపా చ రుద్రరౌద్రార్తి నాశినీ
సర్వజ్ఞా చైవ ధర్మజ్ఞా రసజ్ఞా దీనవత్సలా ॥ 115 ॥

అనాహతా త్రినయనా నిర్భారా నిర్వృతిః పరా
పరా ఘోరా కరాళాక్షీ సుమతీ శ్రైష్ఠ్య దాయినీ ॥ 116 ॥

మంత్రాలికా మంత్రగమ్యా మంత్రమాలా సుమంత్రిణీ
శ్రద్ధానందా మహాభద్రా నిర్ద్వంద్వా నిర్గుణాత్మికా ॥ 117 ॥

ధరణీ ధారిణీ పృథ్వీ ధరాధాత్రీ వసుంధరా
మేరుమందర మధ్యస్థా స్థితిః శంకర వల్లభా ॥ 118 ॥

శ్రీమతీ శ్రీమయీ శ్రేష్ఠా శ్రీకరీ భావభావినీ
శ్రీదా శ్రీమా శ్రీనివాసా శ్రీమతీ శ్రీమతాం గతిః
ఉమా సారంగిణీ కృష్ణా కుటిలా కుటిలాలకా
త్రిలోచనా త్రిలోకాత్మా పుణ్యాపుణ్య ప్రకీర్తితా ॥ 119 ॥

అమృతా సత్యసంకల్పా సాసత్యాగ్రంథి భేదినీ
పరేశీ పరమాసాధ్యా పరా విద్యా పరాత్పరా ॥ 120 ॥

సుందరాంగీ సువర్ణాభా సురాసుర నమస్కృతా
ప్రజా ప్రజావతీ ధన్యా ధనధాన్య సమృద్ధిదా ॥ 121 ॥

ఈశానీ భువనేశానీ భవానీ భువనేశ్వరీ
అనంతానంత మహితా జగత్సారా జగద్భవా ॥ 122 ॥

అచింత్యాత్యాఽచిన్త్యశక్తిః చింతాచింత్య స్వరూపిణీ
జ్ఞానగమ్యా జ్ఞానమూర్తిః జ్ఞానినీ జ్ఞానశాలినీ ॥ 123 ॥

అసితా ఘోరరూపా చ సుధాసారా సుధావహ
భాస్కరీ భాస్వతీ భీతిః భాస్వదక్షానుశాయినీ ॥ 124 ॥

అనసూయా క్షమా లజ్జా దుర్లభా భరణాత్మికా
విశ్వఘ్నీ విశ్వవీరా చ విశ్వఘ్నీ విశ్వసంస్థితా ॥ 125 ॥

శీలస్థా శీలరూపా చ శీలాశీల ప్రదాయినీ
బోథినీ బోధకుశలా రోధినీ బోధినీ తథా ॥ 126 ॥

విద్యోతినీ విచిత్రాత్మా విద్యుత్పటల సన్నిభా
విశ్వయోని ర్మహాయోనిః కర్మయోనిః ప్రియాత్మికా ॥ 127 ॥

రోహిణీ రోగశమనీ మహారోగ జ్వరాపహా
రసదా పుష్టిదా పుష్టి మానదా మానవప్రియా ॥ 128 ॥

కృష్ణాంగ వాహినీ కృష్ణా కృష్ణా కృష్ణసహోదరీ
శాంభవీ శంభురూపా చ శంభుస్థా శంభుసంభవా ॥ 129 ॥

విశ్వోదరీ యోగమాతా యోగముద్రాఘ్న యోగినీ
వాగీశ్వరీ యోగనిద్రా యోగినీ కోటిసేవితా ॥ 130 ॥

కౌళికా మందకన్యా చ శృంగార పీఠవాసినీ
క్షేమంకరీ సర్వరూపా దివ్యరూపా దిగంబరీ ॥ 131 ॥

ధూమ్రవక్త్రా ధూమ్రనేత్రా ధూమ్రకేశీ చ ధూసరా
పినాకీ రుద్ర వేతాళీ మహావేతాళ రూపిణీ ॥ 132 ॥

తపినీ తాపినీ దీక్షా విష్ణు విద్యాత్మనాశ్రితా
మందరా జఠరా తామ్రా అగ్నిజిహ్వా భయాపహా ॥ 133 ॥

పశుఘ్నీ పశు రూపా చ పశుహా పశువాహినీ
పితా మాతా చ ధీరా చ పశుపాశ వినాశినీ ॥ 134 ॥

చంద్రప్రభా చంద్రరేఖా చంద్ర కాంతి విభూషణా
కుంకుమాంకిత సర్వాంగీ సుధాసధ్గురులోచనా ॥ 135 ॥

శుక్లాంబరధరాదేవీ వీణాపుస్తక ధారిణీ
ఐరావత పద్మధరా శ్వేత పద్మాసనస్థితా ॥ 136 ॥

రక్తాంబర ధరాదేవీ రక్త పద్మవిలోచనా
దుస్తరా తారిణీ తారా తరుణీ తార రూపిణీ ॥ 137 ॥

సుధాధారా చ ధర్మజ్ఞా ధర్మసంగోపదేశినీ
భగేశ్వరీ భగారాధ్యా భగినీ భగనాయికా ॥ 138 ॥

భగబింబా భగక్షిన్నా భగయోనిర్భగప్రదా
భగేశ్వరీ భగారాధ్యా భగినీ భగనాయికా ॥ 139 ॥

సర్వసంక్షోభిణీ శక్తిః సర్వ విద్రావిణీ తథా
మాలినీ మాధవీమాధ్వీ మధురూపా మహోత్కటా ॥ 140 ॥

భరుండచంద్రికా జ్యోత్స్నా విశ్వచక్షుస్తమోపహా
సుప్రసన్నా మహాదూతీ యమదూతీ భయంకరీ ॥ 141 ॥

ఉన్మాదినీ మహారూపా దివ్యరూపా సురార్చితా
చైతన్యరూపిణీ నిత్యాక్లిన్నా కామమదోద్ధతా ॥ 142 ॥

మదిరానందకైవల్యా మదిరాక్షీ మదాలసా
సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధిద్యా సిద్ధ సంభవా ॥ 143 ॥

సిద్ధార్థిః సిద్ధమాతా చ సిద్ధిస్సర్వార్థ సిద్ధిదా
మనోమయీ గుణాతీతా పరంజ్యోతిః స్వరూపిణీ ॥ 144 ॥

పరేశీ పారగా పారా పరాసిద్ధిః పరాగతిః
విమలా మోహినీ చాద్యా మధుపాన పరాయణా ॥ 145 ॥

వేద వేదాంగ జననీ సర్వ శాస్త్రవిశారదా
సర్వదేవమయీ విద్యా సర్వ శాస్త్రమయీ తథా ॥ 146 ॥

సర్వజ్ఞానమయీ దేవీ సర్వ ధర్మమయీశ్వరీ
సర్వయజ్ఞమయీ యజ్ఞా సర్వ మంత్రాధికారిణీ ॥ 147 ॥

సర్వ సంప్రత్పతిష్ఠాత్రీ సర్వ విద్రావిణీ పరా
సర్వ సంక్షోభిణీదేవి సర్వ మంగళకారిణీ ॥ 148 ॥

త్రైలోక్యాకర్షిణీ దేవీ సర్వాహ్లాదనకారిణీ
సర్వ సమ్మోహినీ దేవీ సర్వ స్తంభన కారిణీ ॥ 149 ॥

త్రైలోక్య జృంభణీ దేవీ తథా సర్వవశంకరీ
త్రైలోక్య రంజినీ దేవీ సర్వ సంప్రత్పదాయినీ ॥ 150 ॥

సర్వమంత్రమయీ దేవీ సర్వద్వంద్వక్షయంకరీ
సర్వసిద్ధి ప్రదాదేవీ సర్వవిద్రావిణీతథా ॥ 151 ॥

సర్వ ప్రియకరీ దేవీ సర్వమంగళ కారిణీ
సర్వకామప్రదా దేవీ సర్వదుఃఖ విమోచినీ ॥ 152 ॥

సర్వ మృత్యు ప్రశమనీ సర్వ విఘ్న వినాశినీ
సర్వాంగ సుందరీ మాతా సర్వ సౌభాగ్యదాయినీ ॥ 153 ॥

సర్వజ్ఞా సర్వశక్తిశ్చ సర్వైశ్వర్య ఫలప్రదా
సర్వజ్ఞానమయీ దేవీ సర్వవ్యాధి వినాశినీ ॥ 154 ॥

సర్వాధార స్వరూపా చ సర్వపాపహరా తథా
సర్వానందమయీ దేవీ సర్వేక్షాయాః స్వరూపిణీ ॥ 155 ॥

సర్వలక్ష్మీమయీ విద్యా సర్వేప్పిత ఫలప్రదా
సర్వారిష్టప్రశమనీ పరమానంద దాయినీ ॥ 156 ॥

త్రికోణ నిలయా త్రిస్థా త్రిమాత్రా త్రితను స్థితా
త్రివేణీ త్రిపదా త్రిస్థాత్రిమూర్తి స్త్రిపురేశ్వరీ ॥ 157 ॥

త్రిధామ్నీ త్రిదశాధ్యక్షా త్రివిత్‌ త్రిపురవాసినీ
త్రయీ విద్యాచ త్రిశిరా త్రైలోక్యా చ త్రిపుష్కరా ॥ 158 ॥

త్రికోటరస్థా త్రివిధా త్రిపురా త్రిపురాత్మికా
త్రిపురశ్రీ త్రిజననీ త్రిపురా త్రిపురసుందరీ ॥ 159 ॥

ఇదం త్రిపురసుందర్యాః స్తోత్రం నామ సహస్రకం
గుహ్యాద్గుహ్యతరం పుత్ర తవప్రీత్యై ప్రకీర్తితమ్‌ ॥ 160 ॥

గోపనీయం ప్రయత్నేన పఠనీయం ప్రయత్నతః
నాతః పరతరం పుణ్యం నాతః పరతరం తపః ॥ 161 ॥

నాతః పరతరం స్తోత్రం నాతః పరతరాగతిః
స్తోత్రం సహస్రనామాఖ్యం మమవక్త్రాద్వినిర్గతం ॥ 162 ॥

యః పఠేత్ప్రయతో భక్త్యా శ్రుణు యద్వా సమాహితః
మోక్షార్థిలభతే మోక్షం స్వర్గార్థీ స్వర్గ మాప్పుయాత్‌ ॥ 163 ॥

కామం ప్రాప్నుయా త్కామీ ధనార్థీ చ లభేద్ధనమ్‌
విద్యార్థీ లభతే విద్యాం యశోర్థీలభతే యశః ॥ 164 ॥

కన్యార్థీ లభతే కన్యాం సుతార్థీ లభతే సుతం
గుర్విణీ జనయే త్పుత్రం కన్యా విందతి సత్పతిమ్‌ ॥165 ॥

మూర్థోఽపిలభతే శాస్త్రం కుజనోపిలభతే గతిం
సంక్రాంత్యాం వామావస్యా మష్టమ్యాం చ విశేషతః ॥ 166 ॥

పౌర్ణమాస్యాం చతుర్ధశ్యాం నవమ్యాం భౌమవాసరే
పఠేద్వా పాఠయేద్వాపి శ్రుణుయాద్వా సమాహితః ॥ 167 ॥

సముక్త స్సర్వపాపేభ్యః కామేశ్వర సమోభవేత్‌
లక్ష్మీవాన్‌స్తువంశ్చైవ వల్లభ స్సర్వయోషితాం ॥ 168 ॥

తస్యవశ్యం భవేదాశు త్రైలోక్యం స చరాచరమ్‌
రుద్రం దృష్ట్వా యథా దేవా విష్ణుం దృష్ట్వా చ దానవాః ॥ 169 ॥

తథాహి గరుడం దృష్ట్వా సింహం దృష్ట్వా యథా గజాః
కీట వత్ప్రపలాయన్తే తస్య వక్త్రావలోకనాత్‌ ॥ 170 ॥

అగ్నిచోర భయం తస్య కదాచిన్నై వసంభవేత్‌
పాప్మానో వివిధాః శాంతిం మేరు పర్వత సన్నిభాః ॥ 171 ॥

యస్మాత్తచ్చృణు యాద్విఘ్నాం స్తృణం వహ్నిహుతం యథా
ఏకదా పఠానాదేవ సర్వ పాపక్షయోభవేత్‌ ॥ 172 ॥

దశథా పఠనాదేవ వాచా సిద్ధిః ప్రజాయతే
శతథా పఠనాద్వాపి ఖేచరో జాయతే నరః ॥ 173 ॥

సహస్రదశ సంఖ్యాతం యః పఠేద్భక్తి మానసః
మాతాస్య జగతాం ధాత్రీ ప్రత్యక్షా భవతి ధ్రువమ్‌ ॥ 174 ॥

లక్షపూర్ణే యథాపుత్ర స్తోత్ర రాజంపఠేత్‌ సుధీః
భవపాశ వినిర్ముక్తో మమతుల్యో న సంశయః ॥ 175 ॥

సర్వ తీర్థేషు యత్పుణ్యం సకృజ్జప్త్వా లభేన్నరః
సర్వవేదేషు యత్‌ ప్రోక్తం తత్ఫలం పరికీర్తితమ్‌ ॥ 176 ॥

భూత్వా చ బలవాన్‌ పుత్ర ధనవాన్‌ సర్వ సంపదం
దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభమ్‌ ॥ 177 ॥

సయాస్యతి నసందేహః స్తవరాజస్య కీర్తనాత్‌

ఇతి శ్రీ వామకేశ్వర తంత్రే హరకుమార సంవాదే మహాత్రిపుర సుందర్యాః
షోడశ్యాః సహస్ర నామస్తోత్రం సమాప్తం 

Parivarthini Ekadasi - పరివర్తినీ ఏకాదశి (పార్శ్వ ఏకాదశి)

పరివర్తినీ ఏకాదశి (పార్శ్వ ఏకాదశి)

పరివర్తినీ ఏకాదశి రోజున, విష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దీనిని పార్శ్వ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు, శ్రీ హరి నిద్రిస్తున్నప్పుడు రెండవ వైపుకు తిరుగుతాడు, అందుకే ఈ ఏకాదశిని పరివర్తినీ ఏకాదశి అంటారు. దీనిని పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతంలో శ్రీమహావిష్ణువు వామన అవతారాన్ని ఆరాధించడం ద్వారా వాజపేయి యాగంతో సమానమైన ఫలితాలు లభిస్తాయి మరియు మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. ఇది లక్ష్మీ దేవి యొక్క ఉపవాసం, కాబట్టి ఈ రోజున లక్ష్మిని పూజించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.

పరివర్తిని ఏకాదశి వ్రతం పూజా విధానం
పార్శ్వ ఏకాదశి వ్రతం అని కూడా పిలువబడే పరివర్తినీ ఏకాదశి యొక్క ఉపవాసం మరియు ఆరాధన బ్రహ్మ మరియు విష్ణువుతో సహా మూడు లోకాలను ఆరాధించడంతో సమానం.

ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి దశమి తిథి నాడు సూర్యాస్తమయం తర్వాత, ఉపవాసానికి ఒకరోజు ముందు భోజనం చేయకూడదు మరియు రాత్రి విష్ణువును ధ్యానిస్తూ నిద్రించాలి.

ఉపవాసం రోజున, తెల్లవారుజామున నిద్రలేచి భగవంతుని ధ్యానం చేసి, స్నానం చేసిన తర్వాత, విష్ణువు విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించండి.

విష్ణువు పూజలో తులసి, కాలానుగుణ పండ్లు మరియు నువ్వులు ఉపయోగించండి. ఉపవాసం రోజున ఆహారం తీసుకోవద్దు. సాయంత్రం పూజ చేసిన తర్వాత పండ్లు తినవచ్చు.

ఉపవాసం రోజు ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం మరియు అబద్ధాలు చెప్పడం మానుకోండి. ఇది కాకుండా రాగి, అన్నం, పెరుగు దానం చేయండి.

ఏకాదశి మరుసటి రోజు, సూర్యోదయం తర్వాత ద్వాదశిని ఆచరించి, పేదవారికి లేదా బ్రాహ్మణుడికి ఆహారం మరియు దక్షిణ ఇచ్చి ఉపవాసం విరమించండి.

పరివర్తినీ ఏకాదశి వ్రతం కథ
మహాభారత కాలంలో, పాండు కుమారుడు అర్జునుడి అభ్యర్థన మేరకు, శ్రీ కృష్ణుడు పరివర్తినీ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు - ఓ అర్జునా! ఇప్పుడు సర్వపాపాలను నశింపజేసే పరివర్తినీ ఏకాదశి వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి త్రేతాయుగంలో బలి చక్రవర్తి అనే రాక్షసుడు ఉండేవాడు కానీ అతడు చాలా ధార్మికుడు, సత్యవంతుడు, బ్రాహ్మణులకు సేవ చేసేవాడు. నిత్యం యాగాలు, తపస్సు మొదలైనవి చేసేవారు. అతని భక్తి ప్రభావం కారణంగా, రాక్షస రాజు బలి స్వర్గాన్ని జయించి, దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు. దేవరాజు ఇంద్రుని స్థానంలో బలి చక్రవర్తి స్వర్గాన్ని పరిపాలించడం ప్రారంభించాడు.దేవతల తల్లి అయిన అదితి దేవరాజు ఇంద్రుడు మరియు దేవతలు భయపడి విష్ణువు వద్దకు వెళ్లారు., సహాయం కోసం విష్ణువును ప్రార్థించారు, విష్ణువు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు.

దీని తరువాత నేను వామన రూపాన్ని ధరించి బ్రాహ్మణ బిడ్డ రూపంలో బలి చక్రవర్తి ని జయించాను.

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు - వామన రూపాన్ని ధరించి, నేను బలి చక్రవర్తి ని అభ్యర్థించాను - ఓ రాజా! నాకు మూడడుగుల భూమిని దానం చేస్తే మూడు లోకాలను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. బలి చక్రవర్తి నా అభ్యర్థనను అంగీకరించి భూమిని దానం చేయడానికి అంగీకరించాడు. నేను దానం చేయాలని సంకల్పించగానే, నేను త్రివిక్రముడు (మూడు లోకాలను జయించినవాడు)అనే భారీ రూపం ధరించి, ఒక పాదంతో భూమిని, మరొక పాదం మడమతో స్వర్గాన్ని, నా కాలి వేళ్ళతో బ్రహ్మలోకాన్ని కొలిచాను. ఇప్పుడు బలిచక్రవర్తి కి మూడో పాదానికి ఏమీ మిగలలేదు. తన మూడవ అడుగు వేయడానికి స్థలం లేకపోవడంతో, వామనుడు దానిని ఎక్కడ ఉంచాలని బలిని అడిగాడు. బలి తన వినయం మరియు మాటకు కట్టుబడి, మూడవ అడుగు వేయడానికి తన తలను అర్పించాడు. వామనుడు బలి తలపై తన పాదాన్ని ఉంచి, అతన్ని పాతాళలోకానికి త్రొక్కి, స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇచ్చాడు

బలి చక్రవర్తి నిబద్ధతకు సంతోషించిన వామనుడు అతన్ని పాతాళానికి అధిపతిగా చేసాడు.
నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని బలి 
చక్రవర్తి తో చెప్పాను.

పరివర్తినీ ఏకాదశి రోజున, నా విగ్రహం ఒకటి బలి చక్రవర్తి వద్ద ఉంటుంది మరియు ఒకటి క్షీరసాగరములో శేషనాగు పై నిద్రిస్తూనే ఉంటుంది. ఈ ఏకాదశి నాడు, విష్ణువు నిద్రిస్తున్నప్పుడు ప్రక్కకి తిరుగుతాడు



Tuesday, September 2, 2025

Sri Shodasi Devi Ashtottara Sata Nama Stottram - శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శతనామ స్తోత్త్రం

శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శతనామ స్తోత్త్రం 

భృగురువాచ
చతుర్వక్త్ర జగన్నాథ స్తోత్రం వద మమ ప్రభో
యస్యానుష్టాన మాత్రేణ నరో భక్తి మావాప్నుయాత్  ॥ 01 ॥

బ్రహ్మోవాచ 
సహస్రనామ్నా మాకృష్య నామ్నాం అష్టోత్తరం శతం
గుహ్యాద్గుహ్య తరం గుహ్యం సుందర్యాః పరికీర్తితమ్‌ ॥ 02 ॥

వినియోగః 
అస్యశ్రీ షోడశ్యష్టోత్తర శతనామ స్తోత్రస్య 
శంభు బుషిః అనుష్టుష్పందః 
శ్రీషోడశీ దేవతా ధర్మార్థ కామమోక్ష సిద్ధయే పఠే వినియోగః

ఓం త్రిపురా షోడశీ మాతా త్యక్షరా త్రితయా త్రయీ
సుందరీ సుముఖీ సేవ్యా సామవేద పరాయణా ॥ 03 ॥

శారదా శబ్దనిలయా సాగరా సరిదంబరా
శుద్దాశుద్ధ తనుస్సాధ్వీ శివధ్యాన పరాయణా ॥ 04 ॥

స్వామినీ శుంభువనితా శాంభవీ చ సరస్వతీ
సముద్రమథినీ శీఘ్రగామినీ శీఘ్రసిద్ధిదా ॥ 05 ॥

సాధుసేవ్యా సాధుగమ్యా సాధు సంతుష్ట మానసా
ఖట్వాంగ ధారిణీఖర్వా ఖడ్గకర్పర ధారిణీ ॥ 06 ॥

షడ్వర్గ భావరహితా షడ్వర్గ పరిచారికా
షడ్వర్గా చ షడంగా చ షోఢాషోడశ వార్షికీ ॥ 07 ॥

క్రతురూపా క్రతుమతీ ఋభుక్ష క్రతుమండితా
కవర్గాది పవర్గాంతా అంతస్థ్సా అంతరూపిణీ ॥ 08 ॥

ఆకారాకారరహితా కాలమృత్యు జరాపహా
తన్వీతత్వేశ్వరీ తారా త్రివర్షా జ్ఞానరూపిణీ ॥ 09 ॥

కాళీకరాళీ కామేశీ చ్ఛాయా సంజ్ఞా ప్యరుంధతీ
నిర్వికల్పా మహావేగా మహోత్సాహా మహోదరీ ॥ 10 ॥

మేధా బలాకా విమలా విమల జ్ఞానదాయినీ
గౌరీ వసుంధరా గోపుత్రీ గవాంపతి నిషేవితా ॥ 11 ॥

భగాంగా భగరూపా చ భక్తిభావ పరాయణా
ఛిన్నమస్తా మహాధూమా తథాధూమ్ర విభూషణా ॥ 12 ॥

ధర్మ కర్మాదిరహితా ధర్మకర్మ పరాయణా
సీతామాతంగినీ మేధా మధుదైత్య వినాశినీ ॥ 13 ॥

భైరవీ భువనా మాతా
భయదా భయసుందరీ
భావుకా బగళా కృత్యా బాలాత్రిపురసుందరీ ॥ 14 ॥

రోహిణీ రేవతీ రమ్యా రంభా రావణ వందితా
శతయజ్ఞ మయీ సత్వా శతక్రతు వరప్రదా ॥ 15 ॥

శతచంద్రాననా దేవీ సహస్రాదిత్య సన్నిభా
సోమసూర్యాగ్ని నయనా వ్యాఘ్ర చర్మాంబరా వృతా ॥ 16 ॥

అర్థేందు ధారిణీ మత్తా మదిరా మదిరేక్షణా
ఇతి తే కథితం గోప్యం నామ్నాం అష్టోత్తరం శతమ్‌ ॥ 17 ॥

సుందర్యా సర్వదా సేవ్యం మహాపాతక నాశనమ్‌
గోపనీయం గోపనీయం గోపనీయం కలౌయుగే ॥ 18 ॥

సహస్రనామ పాఠస్య ఫలం యద్వై ప్రకీర్తితమ్‌
తస్మాత్కోటి గుణం పుణ్యం స్తవ స్యాస్య ప్రకీర్తనాత్‌ ॥ 19 ॥

పఠేత్సదా భక్తియుతో నరోయో నిశీధకాలే
ప్యరుణోదయే వా
ప్రదోషకాలే నవమీ దినే
థవా లభేత్‌ భోగాన్‌ పరమాద్భుతాన్‌ ప్రియాన్‌ ॥ 20 ॥ 

॥ ఇతి బ్రహ్మయామళే షోడశీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ సంపూర్ణం 

Sri Shodasi Devi Ashtottara Sata Namavali 2 - శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శత నామావళి 2

శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శత నామావళి

ఓం త్రిపురాయై నమః ।
ఓం షోడశ్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం త్య్రక్షరా
యై నమః ।
ఓం త్రితయాయై నమః ।
ఓం త్రయ్యై నమః ।
ఓం సున్దర్యై నమః |
ఓం సుముఖ్యై నమః ।
ఓం సేవ్యాయై నమః ।
ఓం సామవేదపరాయణాయై నమః
  ॥ 10 

ఓం శారదా
యై నమః ।
ఓం శబ్దనిలయా
యై నమః ।
ఓం సాగరాయై నమః ।
ఓం సరిదమ్బరాయై నమః ।
ఓం శుద్దాయై నమః ।
ఓం శుద్ధతనవే నమః ।
ఓం సాధ్వ్యై నమః ।
ఓం శివధ్యానపరాయణాయై నమః ।
ఓం స్వామిన్యై నమః ।
ఓం శమ్భువనితాయై నమః
  ॥ 20 

ఓం శామ్భవ్యై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం సముద్రమథిన్యై నమః ।
ఓం శీఘ్రగామిన్యై నమః ।
ఓం శీఘ్రసిద్ధిదా
యై నమః 
ఓం సాధుసేవ్యాయై నమః ।
ఓం సాధుగమ్యా
యై నమః ।
ఓం సాధుసన్తుష్టమానసాయై నమః ।
ఓం ఖట్వాధారి
ణ్యై నమః ।
ఓం ఖర్వాయై నమః
  ॥ 30 

ఓం ఖడ్గఖర్పరధారి
ణ్యై నమః ।
ఓం షడ్వర్గభావరహితాయై నమః ।
ఓం ష
డ్వర్గపరిచారికాయై నమః ।
ఓం ష
డ్వర్గాయై నమః ।
ఓం షడ్గయై నమః 

ఓం షోఢా
యై నమః ।
ఓం షోడశవార్షిక్యై నమః ।
ఓం క్రతురూపా
యై నమః ।
ఓం క్రతుమత్యై నమః ।
ఓం ఋభుక్షక్రతుమణ్డితా
యై నమః  ॥ 40 

ఓం కవర్గాదిపవర్గాన్తా
యై నమః ।
ఓం అన్తఃస్థా
యై నమః 
ఓం అనన్తరూపి
ణ్యై నమః ।
ఓం అకారాకారరహితా
యై నమః ।
ఓం కాలమృత్యుజరాపహాయై నమః ।
ఓం తన్వ్యై నమః ।
ఓం తత్త్వేశ్వర్యై నమః ।
ఓం తారాయై నమః ।
ఓం త్రివర్షా
యై నమః |
ఓం జ్ఞానరూపి
ణ్యై నమః  ॥ 50 

ఓం కాల్యై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం కామేశ్యై
 నమః ।
ఓం ఛాయాయై నమః ।
ఓం సంజ్ఞాయై నమః ।
ఓం అరున్ధత్యై నమః ।
ఓం నిర్వికల్పాయై నమః ।
ఓం మహావేగాయై నమః ।
ఓం మహోత్సాహాయై నమః 

ఓం మహోదర్యై నమః
  ॥ 60 

ఓం మేఘాయై నమః ।
ఓం బలాకాయై నమః ।
ఓం విమలాయై నమః ।
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః ।
ఓం గౌర్యై నమః 

ఓం వసున్ధరాయై నమః ।
ఓం గోప్య్రై నమః ।
ఓం గవామ్పతినిషేవితాయై నమః ।
ఓం భగ్గా
యై నమః ।
ఓం భగరూపాయై నమః
  ॥ 70 

ఓం భక్తిపరాయణా
యై నమః ।
ఓం భావపరాయణాయై నమః । 72
ఓం ఛిన్నమస్తాయై నమః ।
ఓం మహాధూమా
యై నమః ।
ఓం ధూమ్రవిభూషణా
యై నమః ।
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః ।
ఓం ధర్మకర్మపరాయణాయై నమః ।
ఓం సీతాయై నమః ।
ఓం మాత్గన్యై నమః ।
ఓం మేధా
యై నమః  ॥ 80 

ఓం మధుదైత్యవినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః |
ఓం భువనాయై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం అభయదా
యై నమః ।
ఓం భవసున్దర్యై నమః ।
ఓం భావుకాయై నమః ।
ఓం బగలా
యై నమః ।
ఓం కృత్యాయై నమః 

ఓం బాలాయై నమః
  ॥ 90 

ఓం త్రిపురసుందర్యై నమః ।
ఓం రోహి
ణ్యై నమః |
ఓం రేవత్యై నమః |
ఓం రమ్యాయై నమః ।
ఓం రమ్భాయై నమః ।
ఓం రావణవన్దితాయై నమః ।
ఓం శతయజ్ఞమయ్యై నమః ।
ఓం సత్త్వాయై నమః ।
ఓం శతక్రతువరప్రదాయై నమః ।
ఓం శతచన్ద్రాననాయై నమః
  ॥ 100 

ఓం దేవ్యై నమః ।
ఓం సహస్రాదిత్యసన్నిభాయై నమః ।
ఓం సోమసూర్యాగ్నినయనా
యై నమః ।
ఓం వ్యాఘ్రచర్మామ్బరావృతాయై నమః ।
ఓం అర్థేన్దుధారిణ్యై నమః ।
ఓం మత్తాయై నమః ।
ఓం మదిరాయై నమః ।
ఓం మదిరేక్షణాయై నమః
  ॥ 108 

Sri Shodasi Devi Ashtottara Sata Namavali - శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శత నామావళి

శ్రీ షోడశీ దేవి అష్టోత్తర శత నామావళి

ఓం పరమానందలహర్వై నమః
ఓం పరచైతన్యదీపికాయై నమః
ఓం స్వయంప్రకాశ కిరణాయై నమః
ఓం నిత్యవైభవ శాలిన్యై నమః
ఓం విశుద్ధకేవలాఖండ సత్యకాలాత్మ రూపిణ్యై నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః
ఓం మహామాయా విలాసిన్యై నమః
ఓం గుణత్రయ పరిచ్చే
త్య్రై నమః
ఓం సర్వతత్వ ప్రకాశిన్యై నమః
ఓం స్త్రీ పుం సభావరసికాయై నమః 
 ॥ 10 

ఓం జగత్సర్గాది లంపటాయై నమః
ఓం అశేషనామ రూపాది భేద ఛేద రవి ప్రభాయై నమః
ఓం అనాది వసనారూపాయై నమః
ఓం వాసనోద్యత్ప్రపంచికాయై నమః
ఓం ప్రపంచోప శ్రమప్రౌఢాయై నమః
ఓం చరాచర జగన్మయ్యై నమః
ఓం సమస్త జగదాధారాయై నమః
ఓం సర్వ సంజీవనోత్సుకాయై నమః
ఓం భక్తచేతోమయానంత స్వార్థ వైభవ విభ్రమాయై నమః
ఓం సర్వాకర్షణ వశ్యాది సర్వకర్మ దురంధరాయై నమః
  ॥ 20 

ఓం విజ్ఞాన పరమానంద విద్యాయై నమః
ఓం సంతాన సిద్ధిదాయై నమః
ఓం ఆయురారోగ్య సౌభాగ్య బలశ్రీ కీర్తి భాగ్యదాయై నమః
ఓం ధనధాన్య మణీ వస్త్ర భూషాలేపన మాల్యదాయై నమః
ఓం గృహగ్రామ మహారాజ్య సామ్రాజ్య సుఖదాయిన్యై నమః
ఓం సప్తాంగ శక్తి సంపూర్ణ ఫలప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివేంద్రాది పదవిశ్రాణ న క్షమాయె నమః
ఓం భుక్తి ముక్తి మహాభుక్తి విరక్త్య ద్వైతదాయిన్యై నమః
ఓం నిగ్రహనుగ్రహా ధ్యక్షాయై నమః
ఓం జ్ఞాననిర్దైతదాయిన్యై నమః
  ॥ 30 

ఓం పరకాయ ప్రవేశాది యోగసిద్ధి ప్రదాయిన్యై నమః
ఓం శిష్ట సంజీవన ప్రౌఢాయై నమః
ఓం దుష్ట సంహార సిద్ధిదాయై నమః
ఓం తీలా వినిర్మితానేక కోటి బ్రహ్మాండ మండలాయై నమః
ఓం ఏకస్యై నమః
ఓం అనేకాత్మికా
యై నమః
ఓం నానారూపిణ్యై నమః
ఓం అర్థాంగనేశ్వర్యై నమః
ఓం శివశక్తిమయ్యై నమః
ఓం నిత్యశృంగారైక రసప్రియా
యై నమః  ॥ 40 

ఓం తుష్టాయై నమః
ఓం పుష్టాయి నమః
ఓం అపరిచ్చిన్నాయై నమః
ఓం నిత్యయౌవన మోహిన్యై
 నమః
ఓం సమస్తదేవతా రూపాయై నమః
ఓం సర్వదేవాధి దేవతాయై నమః
ఓం దేవర్షి పితృ సిద్ధాది యోగినీ భైరవాత్మికాయై నమః
ఓం నిధి సిద్ధి మణీముద్రాయె నమః
ఓం శస్త్రాయుధ భాసురాయె నమః
ఓం ఛత్ర చామర వాదిత్ర పతాకవ్య - జనాంచితాయై నమః
  ॥ 50 

ఓం హస్త్యశ్వరథ పాదాతామాత్య సేనా సుసేవితాయై నమః
ఓం పురోహిత కులాచార్య గురుశిష్యాది సేవితాయై నమః
ఓం సుధాసముద్ర మధ్యోద్యత్సుర ద్రుమ నివాసిన్యై నమః
ఓం మణిద్వీపాంతర ప్రోద్యత్కదంబ వనవాసిన్యై నమః
ఓం చింతామణి గృహన్తస్థాయై నమః
ఓం మణిమంటప మధ్యగాయై నమః
ఓం రత్నసింహాసన ప్రోద్యచ్చివ మంచాధిశాయిన్యై నమః
ఓం సదాశివ మహాలింగ మూల సంఘట్ట పిండికాయై నమః
ఓం అన్యోన్యాలింగ సంఘర్ష కండూ సంక్షుబ్ధ మానసాయై నమః
ఓం కళోద్యద్బిందు కాళిన్యా తుర్కానాద పరంపరాయై నమః
॥ 60 ॥

ఓం నాదాంతానంద సందోహ స్వయం వ్యక్త వచోమృతాయై నమః
ఓం కామరాజ మహాతంత్ర రహస్యాచార దక్షిణాయై నమః
ఓం మకార పంచకోద్బూత ప్రొఢాంతోల్లాస సుందర్యై నమః
ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః
ఓం శ్రీ విద్యా మంత్ర విగ్రహాయై నమః
ఓం అఖండ సచ్చిదానంద శివక్త్యైక రూపిణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురేశాన్యై నమః
ఓం మహా త్రిపురసుందర్యై నమః
ఓం త్రిపురవాస రసికాయై నమః ॥ 70 ॥

ఓం త్రిపురాశ్రీ స్వరూపిణ్యై నమః
ఓం మహాపద్మ వనాంతస్థాయై నమః
ఓం శ్రీమత్త్రిపురమాలిన్యై నమః
ఓం మహాత్రిపుర సిద్ధాంబాయై నమః
ఓం శ్రీ మహాత్రిపురాంబికాయై నమః
ఓం నవచక్ర క్రమాదేవ్యై నమః
ఓం మహాత్రిపుర భైరవ్యై నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం లలితాయై నమః
ఓం బాలాయై నమః
 ॥ 80 ॥

ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం శివాయై నమః
ఓం ఉత్పత్తి స్థితి సంహారక్రమ చక్ర నివాసిన్యై నమః
ఓం అర్థమేర్వాత్మ చక్రస్థాయై నమః
ఓం సర్వలోక మహేశ్వర్యై నమః
ఓం వల్మీకపుర మధ్యస్థాయై నమః
ఓం జంబూవన నివాసిన్యై నమః
ఓం అరుణాచల శృంగస్థాయై నమః
ఓం వ్యాఘ్రాలయ నివాసిన్యై నమః
ఓం శ్రీకాళహస్తి నిలయాయై నమః ॥ 90 ॥

ఓం కాశీపుర నివాసిన్యై నమః
ఓం మత్కైలాస నిలయాయై నమః
ఓం ద్వాదశాంత మహేశ్వర్యై నమః
ఓం శ్రీ షోడశాంత మధ్యస్థాయై నమః
ఓం సర్వవేదాంత లక్షితాయై నమః
ఓం శ్రుతి స్మృతి పురాణేతి హాసాగమ కళేశ్వర్యై నమః
ఓం భూతభౌతిక తన్మాత్ర దేవతాప్రాణ హృచిన్మయ్యై నమః
ఓం జీవేశ్వర బ్రహ్మరూపాయై నమః
ఓం త్రిగుణాఢ్యాయై నమః
ఓం గుణాత్మికాయై నమః ॥ 100 ॥

ఓం అవస్థాత్రయ నిర్ముక్తాయై నమః
ఓం వాగ్రమోమా మహీమయ్యై నమః
ఓం గాయత్రీ భువనేశానీ దుర్గా కళ్యాది రూపిణ్యై నమః
ఓం మత్స్య కూర్మ వరాహాది నానారూప విలాసిన్యై నమః
ఓం మహాయోగీశ్వరారాధ్యాయై నమః
ఓం మహావీర వరప్రదాయిన్యై నమః
ఓం సిద్ధేశ్వర కులారాధ్యాయై నమః
ఓం శ్రీమచ్చరణ వైభవాయై నమః ॥ 108 ॥

ఇతి శ్రీ షోడశీ అష్టోత్తర శతనామావళి సమాప్తం 

Monday, September 1, 2025

Sri Tripura Sundare vedapara Sthava - శ్రీ త్రిపుర సుందరీ వేదపార స్తవః

శ్రీ త్రిపుర సుందరీ వేదపార స్తవః

శ్రీగణేశాయ నమః
కస్తూరీపఙ్కభాస్వద్గలచలదమలస్థూలముక్తావలీకా
జ్యోత్స్నాశుద్ధావదాతా శశిశిశుముకుటాల్కృతా బ్రహ్మపత్నీ ।
సాహిత్యామ్ఫోజభ్భఙ్గీ కవికులవినుతా సాత్త్వికీం వాగ్విభూతిం
దేయాన్మే శుభవస్త్రా కరచలవలయా వల్లకీం వాదయన్తీ ॥  01 


ఏకాన్తే యోగివృ
న్ధైః ప్రశమితకరణైః క్షుత్పిపాసావిముకైః
సానన్దం ధ్యానయోగాద్విసగుణసద్దశీ దృశ్యతే చిత్తమధ్యే
 ।
యా దేవీ హంసరూపా భవభయహరణం సాధకానాం విధత్తే
సా నిత్యం నాదరూపా త్రిభువనజననీ మోదమావిష్కరోతు ॥ 02 ॥

ఈక్షిత్రీ సృష్టికాలే త్రిభువనమథ యా తత్‌క్షణే
నుప్రవిశ్య
స్థేమానం ప్రాపయన్తీ నిజగుణవిభవైః సర్వథా వ్యాప్య విశ్వమ్‌
 
సంహ
ర్త్రీసర్వభాసాం విలయనసమయే స్వాత్మని స్వప్రకాశా
సా దేవీ కర్మబన్ధం మమ భవకరణం నాశ్యత్వాదిశక్తిః
 ॥ 03 ॥

లక్ష్యా యా చక్రరాజే నవపురలసితే యోగినీవృన్దగుప్తే
సౌవర్ణే శైలశృఙ్గే సురగణరచితే తత్త్వసోపానయుక్తే 
 
మన్త్రిణ్యా మేచక్గ్యా కుచభరనతయా కోలముఖ్యా చ సార్ధం
సామ్రాజ్ఞీ సా మదీయా మదగజగమనా దీర్హమాయుస్తనోతు
 ॥ 04 ॥

హ్రీఙ్కారామ్బోజభృఙ్గీ హయముఖవినుతా హానివృద్ధ్యాదిహీనా
హంసో
హంమన్రరాజ్ఞీ హరిహయవరదా హాదిమన్త్రార్థరూపా ।
హస్తే చిన్ముద్రికా
ఢ్యా హతబహుదనుజా హస్తికృత్తిప్రియా మే
హార్దం శోకాతిరేకం శమయతు లలితాఘీశ్వరీ పాశహస్తా
 ॥ 05 ॥

హస్తే పఙ్కేరుహాభే సరససరసిజం బిభ్రతీ లోకమాతా
క్షీరోదన్వత్సుకన్యా కరివరవినుతా నిత్యపుష్టాక్ష గేహా ।
పద్మాక్షీ హేమవర్ణా మురరిపుదయితా శేవధిః సమ్పదాం యా
సా మే దారిద్య్రదోషం దమయతు కరుణాదృష్టిపాతైరజస్రమ్‌
 ॥ 06 ॥

సచ్చిద్బ్రహ్మస్వరూపాం సకలగుణయుతాం నిర్గుణాం నిర్వికారాం
రాగద్వేషాదిహ
న్త్రీం రవిశశినయనాం రాజ్యదానప్రవీణామ్‌ ।
చత్వారింశత్త్రికోణే చతురధికసమే చక్రరాజే లసన్తీం
కామాక్షీం కామితానాం వితరణచతురాం చేతసా భావయామి
 ॥ 07 ॥

కన్దర్పే శాన్తదర్పే త్రినయననయనజ్యోతిషా దేవవృ
న్ధైః
సాశ్కం సాశ్రుపాతం సవినయకరుణం యాచితా కామపత్న్యా
 ।
యా దేవీ దృష్టిపాతైః పునరపి మదనం జీవయామాస సద్యః
సా నిత్యం రోగశాన్యై ప్రభవతు లలితాధీశ్వరీ చిత్ప్రకాశా ॥ 08 


హవ్యైః కవ్యైశ్చ సర్వైః శ్రుతిచయవిహితైః కర్మభిః కర్మశీలా
ధ్యానాద్యైరష్టభిశ్చ ప్రశమితకలుషా యోగినః పర్ణభక్షాః ।
యామేవానేకరూపాం ప్రతిదినమవనౌ సంశ్రయన్తే విధిజ్ఞాః
సామే మోహాన్ధకారం బహుభవజనితం నాశయత్వాదిమాతా
 ॥ 09 

లక్ష్యా మూలత్రికోణే గురువరకరుణాలేశతః కామపీఠే
యస్యాః విశ్వం సమస్తం బహుతరవితతం జాయతే కుణ్డలిన్యాః
 ।
యస్యాః శక్తి ప్రరోహాదవిరలమమృతం విన్దతే యోగివృన్దం
తాం వన్దే నాదరూపాం ప్రణవపదమయీం ప్రాణినాం ప్రాణదాత్రీమ్‌
 ॥ 10 

హ్రీఙ్కారామ్భోధిలక్షీం హిమగిరితనయామీశ్వరీమీశ్వరాణాం
హ్రీంమన్త్రారాధ్యదేవీం శ్రుతిశతశిఖరైర్మృగ్యమాణాం మృగాక్షీమ్‌
 ।
హ్రీంన్త్రాన్తైస్త్రికూటైః స్థిరతరమతిభిర్ధార్యమాణాం జ్వలన్తీం
హ్రీం హ్రీం హ్రీమిత్యజస్రం హృదయసరసిజే భావయే
హం భవానీమ్‌ ॥ 11 

సర్వేషాం ధ్యానమాత్రాత్సవితురుదరగా చోదయన్తీ మనీషాం
సావిత్రీ తత్పదార్థా శశియుతమకుటా పఞ్చశీర్షా త్రినేత్రా
 ।
హస్తా
గ్రైః శ్ఖచక్రాద్యఖిలజనపరిత్రాణదక్షాయుధానాం
బిభ్రాణా వృన్దమమ్బా విశదయతు మతిం మామకీనాం మహేశీ
 ॥ 12 

ర్త్రీ లోకస్య లీలావిలసితవిధినా కారయిత్రీ క్రియాణాం
ర్త్రీ స్వాను ప్రవేశాద్వియదనిలముఖైః ప్చభూతైః స్వసృష్టైః ।
ర్త్రీ స్వేనైవ ధామ్నా పునరపి విలయే కాలరూపం దధానా
హన్యాదామూలమస్మత్కలుషభరముమా భుక్తిముక్తిప్రదాత్రీ
 ॥ 13 

లక్ష్యా యా పుణ్యజాలైర్గురువరచరణామ్భోజ సేవావిశేషాద్‌
దృశ్యా స్వాన్తే సుధీభిర్దరదలితమహాపద్మకోశేన తుల్యే ।
లక్షం జస్వాపి యస్యా మనువరమణిమాసిద్ధిమన్తో మహాన్తః
సా నిత్యం మామకీనే హృదయసరసిజే వాసమ్గకరోతు
 ॥ 14 

హ్రీంశ్రీర్మైంమన్త్రరూపా హరిహరవినుతాగస్త్యపత్నీప్రదిష్టా
హాదిః కాద్యర్ణతత్త్వా సురపతివరదా కామరాజప్రదిష్టా
 ।
దుష్టానాం దానవానాం మదభరహరణా దుఃఖహాన్త్రీ బుధానాం
సామ్రాజ్ఞీ చక్రరా
జ్ఞీ ప్రదిశతు కుశలం మహ్యమోఙ్కారరూపా ॥ 15 

శ్రీంమన్త్రార్థస్వరూపా శ్రితజనదురితధ్వాన్తహ
న్త్రీ శరణ్యా
శ్రౌతస్మార్తక్రియాణామవికలఫలదా ఫాలనేత్రస్య దారాః
 ।
శ్రీచక్రాన్తర్నిషణ్ణా గుహవరజననీ దుష్టహ
న్త్రీ వరేణ్యా
శ్రీమత్సింహాసనేశీ ప్రదిశతు విపులాం కీర్తిమాననరూపా
 ॥ 16 

శ్రచిక్రవరసామ్రాజ్ఞీ శ్రీమత్త్రిపురసున్దరీ ।
శ్రీగుహాన్వయసౌవర్ణదీపికా దిశతు శ్రియమ్‌
 ॥ 17  

॥ ఇతి శ్రీమత్త్రిపురసున్దరీవేదసారస్తవః సంపూర్ణం 

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...