Saturday, November 22, 2025

Sri Dhumavati Ashtottara Satanama Sthottram - శ్రీ ధూమావతి అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ ధూమావతి అష్టోత్తర శతనామ స్తోత్రం

ఈశ్వర ఉవాచ:

ఓం ధూమవతీ ధూమ్రవర్ణా ధూమ్రపానపరాయణా
ధూమ్రాక్ష మధినీ ధన్యాన్యస్థాన నివాసినీ ॥ 01 ॥

అఘోరమంత్ర సంతుష్టా అఘోరాచారమండితా
అఘోరమంత్ర సంప్రీతా అఘోరమను పూజితా ॥ 02 ॥

అట్టాహాసనిరతా మలినాంబరధారిణీ
వృద్ధా విరూపా విధవా విద్యా చ విరళద్విజా ॥ 03 ॥

ప్రవృద్ధఘోణా కుముఖీ కుటిలా కుటిలేక్షణా
కరాళీ చ కరాళాస్యా కంకాళీ శూర్చధారిణీ ॥ 04 ॥

కాకధ్వజరథారూఢా కేవలా కఠినా కుహుః
క్షుత్పిపాసార్దితా నిత్యా లలజ్జిహ్వా దిగంబరీ ॥ 05 ॥

దీర్ఘోదరీ దీర్ఘరవా దీర్ఘాంగీ దీర్ఘమస్తకా
విముక్తకుంతలా కీర్త్యా కైలాస స్థానవాసినీ ॥ 06 ॥

క్రూరా కాలస్వరూపా చ కాలచక్ర ప్రవర్తినీ
వివర్ణాచంచలా దుష్టా దుష్టవిధ్వంసకారిణీ ॥ 07 ॥

చండీ చండస్వరూపాచ చాముండా చండనిస్వనా
చండవేగా చండగతిశ్చండముండ వినాశినీ ॥ 08 ॥

చాండాలినీ చిత్రరేఖా చిత్రాంగీ చిత్రరూపిణీ
కృష్ణాకపర్థినీ కుళ్లా కృష్ణరూపా క్రియావతీ ॥ 09 ॥

కుంభస్తనీ మదోన్మత్తా మదిరాపాన విహ్వలా
చతుర్భుజా లలజ్జిహ్వా శత్రుసంహార కారిణీ ॥ 10 ॥

శవారూఢా శవగతా శృశానస్థానవాసినీ
దురారాధ్యా దురాచార దుర్జన ప్రీతిదాయినీ ॥ 11 ॥

నిర్మాంసా చ నిరాహారా థూతహస్తా వరాన్వితా
కలహా చ కలిప్రీతా కలికల్మషనాశినీ ॥ 12 ॥

మహాకాలస్వరూపా చ మహాకాల ప్రపూజితా
మహాదేవ ప్రియా మేధా మహాసంకట నాశినీ ॥ 13 ॥

భక్తప్రియా భక్తగతి ర్భక్తశత్రువినాశినీ
భైరవీ భువనా భీమా భారతీ భువనాత్మికా ॥ 14 ॥

భరుండా భీమనయనా త్రినేత్రా బహురూపిణీ
త్రిలోకేశీ త్రికాలజ్ఞా త్రిస్వరూపా త్రయీ తనుః ॥ 15 ॥

త్రిమూర్తిశ్చ తథాతన్వీ త్రిశక్తిశ్చ త్రిశూలినీ
ఇతి ధూమా మహత్‌ స్తోత్రం నామ్నామష్టశతాత్మకమ్‌  ॥ 16 ॥

మయాతే కథితందేవి శత్రుసంఘ వినాశనమ్‌
కారాగారే రిపుగ్రస్తే మహోత్సాతే మహాభయే ॥ 17 ॥

ఇదం స్తోత్రం పఠేన్మర్త్యోముచ్యతే సర్వసంకటైః
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం గోపనీయం ప్రయత్నతః ॥ 18 ॥

చతుప్పదార్థదం నౄణాం సర్వసంపత్ప్రదాయకమ్‌

ఇతి శ్రీ ధూమావతీ అష్టోత్తర శతనామావళీ స్తోత్రం సంపూర్ణం 

Thursday, November 20, 2025

Sri Shodasha Bahu Nrusimha Ashtakam - శ్రీషోడశబాహునృసింహాష్టకమ్

శ్రీషోడశబాహునృసింహాష్టకమ్

భూఖణ్డం వారణాండం పరవరవిరటం డంపడంపోరుడంపం
డిం డిం డిం డిం డిడిబం దహమపి దహమైః ఝంప
ఝంపైశ్చఝంపైః ।
తుల్యాస్తుల్యాస్తు తుల్యాః ధుమధుమధుమకైః కుంకుమాంకైః కుమాంకైః
ఏతత్తే పూర్ణయుక్తమహరహకరహః పాతు మాం నారసింహః ॥ 01 ॥

భూభృద్భూభృద్భుజంగం ప్రలయరవవరం ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జదుర్జం ఖిఖచఖచఖచిత్ఖర్జదుర్జర్జయంతమ్ ।
భూభాగం భోగభాగం గగగగగగనం గర్దమర్త్యుగ్రగండం
స్వచ్ఛం పుచ్ఛం స్వగచ్ఛం స్వజనజననుతః పాతు మాం నారసింహః ॥ 02 ॥

ఏనాభ్రం గర్జమానం లఘులఘుమకరో బాలచంద్రార్కదంష్ట్రో
హేమాంభోజం సరోజం జటజటజటిలో జాడ్యమానస్తుభీతిః ।
దంతానాం బాధమానాం ఖగటఖగటవో భోజజానుస్సురేంద్రో
నిష్ప్రత్యూహం సరాజా గహగహగహతః పాతు మాం నారసింహః ॥ 03 ॥

శంఖం చక్రం చ చాపం పరశుమశమిషుం శూలపాశాంకుశాస్త్రం
బిభ్రన్తం వజ్రఖేటం హలముసలగదాకున్తమత్యుగ్రదంష్ట్రం ।
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివసః పాతు మాం నారసింహః ॥ 04 ॥

పాదధ్వంద్వం ధరిత్రీకటివిపులతరో మేరుమధ్యూఢ్వమూరుం
నాభిం బ్రహ్మాణ్డసిన్ధుః హృదయమపి భవో భూతవిద్వత్సమేతః ।
దుశ్చక్రాంకం స్వబాహుం కులిశనఖముఖం చన్ద్రసూర్యాగ్నినేత్రం
వక్త్రం వహ్నిస్సువిద్యుత్సురగణవిజయః పాతు మాం నారసింహః ॥ 05 ॥

నాసాగ్రం పీనగణ్డం పరబలమథనం బద్ధకేయూరహారం
రౌద్రం దంష్ట్రాకరాలం అమితగుణగణం కోటిసూర్యాగ్నినేత్రం ।
గాంభీర్యం పింగలాక్షం భ్రుకుటితవిముఖం షోడశాధార్ధబాహుం
వన్దే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః ॥ 06 ॥

కే కే నృసింహాష్టకే నరవరసదృశం దేవభీత్వం గృహీత్వా
దేవంద్యో విప్రదండం ప్రతివచన పయాయామ్యనప్రత్యనైషీః ।
శాపం చాపం చ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన
ఓమిత్యే దైత్యనాదం ప్రకచవివిదుషా పాతు మాం నారసింహః ॥ 07 ॥

ఝం ఝం ఝం ఝం ఝకారం ఝషఝషఝషితం జానుదేశం ఝకారం
హుం హుం హుం హుం హకారం హరిత కహహసా యం దిశే వం వకారం ।
వం వం వం వం వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం
లం లం లం లం లకారం లఘువణవిజయః పాతు మాం నారసింహః ॥ 08 ॥

భూతప్రేతపిశాచయక్షగణశః దేశాన్తరోచ్చాటనా
చోరవ్యాధిమహజ్జ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయం ।
సన్ధ్యాకాలే జపతమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభిః
ప్రహ్లాదేవ వరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే ॥ 09 ॥

॥ ఇతి శ్రీవిజయీన్ద్రయతికృతం శ్రీషోడశబాహునృసింహాష్టకం సమ్పూర్ణం ॥

Wednesday, November 19, 2025

Sri Dhumavati Ashtottara Sata Namavali - శ్రీ ధూమావతి అష్టోత్తర శత నామావళి

శ్రీ ధూమావతి అష్టోత్తర శత నామావళి

ఓం ధూమవత్యై నమః
ఓం ధూమ్రవర్ణా
యై నమః
ఓం ధూ
మ్రపానపరాయణాయై నమః
ఓం ధూమ్రాక్ష మథిన్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధన్యస్థాన నివాసిన్యై నమః
ఓం అఘోరాచార సంతుష్టా
యై నమః
ఓం అఘోరచార మండితా
యై నమః
ఓం అఘోరమంత్ర సంప్రీతా
యై నమః
ఓం అఘోరమంత్ర సంజితాయై నమః
 ॥ 10 ॥

ఓం అట్టాట్టహాస నిరతాయై నమః
ఓం మలినాంబర ధారిణ్యై నమః
ఓం వృద్ధా
యై నమః
ఓం విరూపా
యై నమః
ఓం విధవాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం విరళద్విజాయై నమః
ఓం ప్రబృద్ధఘోణా
యై నమః
ఓం కుముఖ్యై నమః
ఓం కుటిలాయై నమః
 ॥ 20 ॥

ఓం కుటిలేక్షణాయై నమః
ఓం కరాళ్యై 
నమః
ఓం కరాళాస్యాయై నమః
ఓం కంకాళ్యై నమః
ఓం శూర్పధారి
ణ్యై నమః
ఓం కాకధ్వజధారూఢాయై నమః
ఓం కేవలాయై నమః
ఓం కఠినాయై నమః
ఓం కుహూయై నమః
ఓం క్షుత్పిపాసార్ధితాయై నమః
 ॥ 30 ॥

ఓం నిత్యాయై నమః
ఓం లలజ్జిహ్వాయై నమః
ఓం దిగంబర్యై నమః
ఓం దీర్ఘోదర్యై నమః
ఓం దీర్ఘరవాయై నమః
ఓం దీర్ఘాంగ్యై నమః
ఓం దీ
ర్ఘమస్తకాయై నమః
ఓం విముక్తకుంతలా
యై నమః
ఓం కీర్త్యాయై నమః
ఓం కైలాస స్థానవాసిన్యై నమః
 ॥ 40 ॥

ఓం కౄరాయై నమః
ఓం కాలస్వరూపాయై నమః
ఓం కాలచక్రప్రవర్తిన్యై నమః
ఓం వివర్ణాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం దుష్టాయై నమః
ఓం దుష్టవిధ్వంసకారిణ్యై నమః
ఓం చండ్యై నమః
ఓం చండ స్వరూపాయై నమః
ఓం చాముండా
యై నమః ॥ 50 ॥

ఓం చండనిఃస్వనా
యై నమః
ఓం చండవేగాయై నమః
ఓం చండగత్యై నమః
ఓం చండముండవినాశిన్యై నమః
ఓం చండాలిన్యై నమః
ఓం చిత్రరేఖా
యై నమః
ఓం చిత్రాంగ్యై నమః
ఓం చిత్రరూపి
ణ్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం కపర్ధిన్యై నమః
 ॥ 60 ॥

ఓం కుల్లాయై నమః
ఓం కృష్ణరూపాయై నమః
ఓం క్రియావత్యై నమః
ఓం కుంభస్తన్యై నమః
ఓం మదోన్మత్తాయై నమః
ఓం మదిరాపాన విహ్వలాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం లలజ్జిహ్వాయై నమః
ఓం శతృసంహారకారి
ణ్యై నమః
ఓం శవారూఢా
యై నమః ॥ 70 ॥

ఓం శవగతాయై నమః
ఓం శ్మశాన స్థానవాసిన్యై నమః
ఓం దురారాధ్యాయై నమః
ఓం దురాచారాయై నమః
ఓం దుర్జనప్రీతిదాయిన్యై నమః
ఓం నిర్మాంసా నమః
ఓం నిరాహారా
యై నమః
ఓం ధూతహస్తాయై నమః
ఓం వరాన్వితాయై నమః
ఓం కలహా
యై నమః ॥ 80 ॥

ఓం కలిప్రీతాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం మహాకాల స్వరూపాయై నమః
ఓం మహాకాల ప్రపూజితాయై నమః
ఓం మహాదేవ ప్రియాయై నమః
ఓం మేధాయై నమః
ఓం మహాసంకటనాశిన్యై నమః
ఓం భక్తప్రియాయై నమః
ఓం భక్తగత్యై నమః
ఓం భక్తశత్రువినాశిన్యై నమః
 ॥ 90 ॥

ఓం భైరవ్యై నమః
ఓం భువనా
యై నమః
ఓం భీమా
యై నమః
ఓం భారత్యై నమః
ఓం భువనాత్మికాయై నమః
ఓం భారుండా
యై నమః
ఓం భీమనయనాయై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం బహురూపి
ణ్యై నమః
ఓం త్రిలోకేశ్యై నమః
 ॥ 100 ॥

ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిస్వరూపాయై నమః
ఓం త్రయీతనువే నమః
ఓం త్రిమూర్యై నమః
ఓం తన్వీయై నమః
ఓం త్రిశక్త్యై నమః
ఓం త్రిశూలిన్యై నమః
ఓం యక్షరాక్షస పూజితాయై నమః
 ॥ 108 ॥
ఓం ధూం ధూమావత్యై నమః

॥ శ్రీ ధూమావతీ అష్టోత్తర శతనామావళి సమాప్తం 

Sri Dhumavathyucchatana Mantram - శ్రీ ధూమావత్యుచ్చాటన మంత్రః

శ్రీ ధూమావత్యుచ్చాటన మంత్రః

ధ్యానం:
కాకారూఢాతికృష్ణాభా భిన్నదంతా విరాగిణీ
 ।
ముక్తకేశీ సుధూమ్రూక్షీ క్షుత్తృషార్తా భయాతురా ॥

చంచలా చాతి కామార్తా క్లిష్టా పుష్టాలసాంగికా ।
మలినా శ్రమనీ రక్తా వ్యక్తగర్భావిరోధినీ ।
ధృతసర్పాగ్రహస్తా చ ధ్యేయా ధూమావతీపరా ॥

మనుః
ఓం ధూం ధూమావతి దేవదత్తో ధావతీతి స్వాహా ।
ఋషిః క్షపణకః గాయత్రీ ఛందః ధూమావతీ దేవతా ధూం
బీజం స్వాహాశక్తిః సముచ్చాటే వినియోగః-
లక్షం జపేత్మహేశాని జగదుచ్చాటనం చరేత్‌ ।

॥ ఇతి శ్రీధూమావత్యుచ్చాటన మంత్రః 

Sri Dhumavati Prardhana - శ్రీ ధూమావతి ప్రార్ధన

శ్రీ ధూమావతి ప్రార్ధన

వివర్ణా చంచలా దుష్టా దీర్ఘా చ మలినాంబరా
విముక్త కుంతలా రూక్షా విధవా విరళద్విజా ॥ 01
 ॥

కాకధ్వజ రథా రూఢా విలంబిత పయోధరా
శూర్పహస్తాతిరూక్షాక్షా ధూతహస్త వరాన్వితా ॥ 02
 ॥

ప్రవృద్ధ ఘోషణాతు భృశం కుటిలా కుటిలేక్షణా
క్షుత్పిపాసార్థితా నిత్యం భయదా కలహ ప్రియా ॥ 03
 ॥

Sri Dhumavati Hrudaya Sthotram - శ్రీ ధూమవతీ హృదయస్తోత్రం

శ్రీ ధూమవతీ హృదయస్తోత్రం

ఓం అస్య శ్రీ ధూమవతీ హృదయస్తోత్ర మహామంత్రస్య పిప్పలాద
ఋషిః, అనుష్టుప్ఛందః శ్రీ ధూమవతీ దేవతా - ధూం బీజం హ్రీం
శక్తిః క్లీం కీలకం సర్వశత్రుసంహారార్థే జపే వినియోగః -

కరాంగన్యాసః
ఓంధాం అంగుష్ఠాభ్యాం నమః
ఓం ధీం తర్జనీభ్యాం స్వాహా
ఓం ధూం మధ్యమాభ్యాం వషట్‌
ఓం ధైం అనామికాభ్యాం హుం
ఓం ధౌం కనిష్ఠకాభ్యాం వౌషట్‌
ఓం ధః అస్త్రాయఫట్‌

అంగన్యాసః
ఓం థాం హృదయాయ నమః
ఓం ధీం శిరసే స్వాహా
ఓం ధూం శిఖాయై వషట్‌
ఓం ధైం కవచాయ హుం
ఓం ధౌం నేత్రత్రయాయ వౌషట్‌
ఓం ధః అస్త్రాయఫట్‌

ధ్యానమ్‌
ఓం ధూమ్రాభాం ధూమ్రవస్త్రాం ప్రకటితదశానాం ముక్తవాలాంబ
రాఢ్యాం కాకాంకస్యందనస్థాం ధవళకరయుగాం శూర్పహస్తాతిరూక్షామ్‌,
కంకాంక్షు తాక్షంతదేహాం ముహురుతి కుటిలాం వారిదాభాం విచిత్రాం
ధ్యాయేద్ధూమా వతీం కుటిలితనయ నాం భీతిదాం భీషణాస్యామ్‌ ॥ 01 ॥

కల్పదౌ యా కాళికాద్యాచీకలన్మధుకైటభౌ
కల్పాంతే త్రిజగత్సర్వం భజే ధూమావతీమహమ్‌ ॥ 02 ॥

గుణాగారా గమ్యగుణా యా గుణాగుణవర్ధినీ
గీతావేదార్థతత్త్వజ్ఞైః భజే ధూమావతీమహమ్‌ ॥ 03 ॥

ఖట్వాంగధారిణీ ఖర్వఖండినీ ఖలరక్షసాం
ధారిణీ ఖేటకస్యాపి భజే ధూమావతీ మహమ్‌ ॥ 04 ॥

ఘూర్ణ ఘూర్ణకరాఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా
ఘాతినీ ఘాతకానాంయా భజే దూమావతీమహమ్‌ ॥ 05 ॥

చర్వంతీ మస్తిఖండానాం చండముండ విదారిణీం
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీమహమ్‌ ॥ 06 ॥

ఛిన్నగ్రీవాం క్షతాంచ్చన్నాం ఛిన్నమస్త స్వరూపిణీం
ఛేదినీం దుష్టసంఘానాం భజే ధూమావతీమహమ్‌ ॥ 07 ॥

జాతాయా యాచితాదేవై రసురాణాం విధాతినీ
జల్పంతీ బహుగర్జంతీ భజేతాం ధూమరూపిణీమ్‌ ॥ 08 ॥

ఝంకార కారిణీ ఝంఝాం
 ఝంఝాంమాం మవాదినీం
ఝటిత్యాకర్షిణీందేవీం భజే ధూమవతీమహమ్‌ ॥ 09 ॥

హేతిపటంకారసంయుక్తాన్‌ ధనుష్టంకారకారిణీం
ఘోరాఘంఘటాటోపాం వందే ధూమవతీమహమ్‌ ॥ 10 ॥

ఠంఠంఠం మనుప్రీతిం ఠఃఠః మంత్రస్వరూపిణీం
ఠమకాహ్నగతిప్రీతాం భజే ధూమావతీమహమ్‌ ॥ 11 ॥

డమరూ డిండిమారావాం డాకినీగణమండితాం
డాకినీభోగసంతుష్టాం భజే ధూమావతీమహమ్‌ ॥ 12 ॥

ఢక్కానాదేన సంతుష్టాం డక్కావాదన సిద్ధిదాం
ఢక్కావాదచలచ్చిత్తాం భజే ధూమావతీమహమ్‌ ॥ 13 ॥

తత్వవార్తా ప్రియప్రాణాం భవపాయోధితారిణీం
తారస్వరూపిణీం తారాం భజే ధూమావతీమహమ్‌ ॥ 14 ॥

థాం థీం థూం థేమంత్రరూపాం థైంథోథంథః స్వరూపిణీం
థకారవర్ణసర్వస్వాం భజే ధూమావతీమహమ్‌ ॥ 15 ॥

దుర్గాస్వరూపిణీందేవీం దుష్టదానవదారిణీం
దేవదైత్యకృతధ్వంసాం వందే ధూమావతీమహమ్‌ ॥ 16 ॥

థ్వాంతా కారాంధకధ్వంసాం ముక్తద్ధమ్మిల్లధారిణీం
ధూమధారాప్రభాం ధీరాం భజే ధూమావతీమహమ్‌ ॥ 17 ॥

నర్తకీనటనప్రీతాం నాట్యకర్మ వివర్ధినీం
నారసింహీం నరారాధ్యాం నౌమి ధూమావతీమహమ్‌ ॥ 18 ॥

పార్వతీపతిసంపూజ్యాం పర్వతోపరి వాసినీం
పద్మారూపాం పద్మపూజ్యాం నౌమి ధూమావతీమహమ్‌ ॥ 19 ॥

ఫూత్కారసహితశ్వాసాం ఫట్‌ మంత్ర ఫలదాయినీం
ఫేత్కారిగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 20 ॥

బలిపూజాం బలారాధ్యాం బగళారూపిణీం వరాం
బ్రహ్మాదివందితాం విద్యాం వందే ధూమావతీ మహమ్‌ ॥ 21 ॥

భవ్యరూపాం భవారాధ్యాం భువనేశ్వరీ స్వరూపిణీం
భక్తభవ్యప్రదాం దేవీం భజే ధూమావతీమహమ్‌ ॥ 22 ॥

మాయాం మధుమతీం మాన్వాం మకరధ్వజమానితాం
మత్స్యమాంసమహాస్వాదాం మన్యే ధూమావతీమహమ్‌ ॥ 23 ॥

యోగయజ్ఞప్రసన్నాస్యాం యోగినీపరిసేవితాం
యశోదాం యజ్ఞఫలదాం యజేధూమావతీమహమ్‌ ॥ 24 ॥

రామారాధ్యపదద్వంద్వాం రావణధ్వంసకారిణీం
రమేశరమణీపూజ్యామహం ధూమవతీంశ్రయే ॥ 25 ॥

లక్షలీలాకళాలక్ష్యాం లోకవంద్య పదాంబుజాం
లంబితాం బీజకోశాఢ్యాం వందే ధూమవతీమహమ్‌ ॥ 26 ॥

బకపూజ్య పదాంభోజాం బకధ్యానపరాయాణాం
బలాంబ కారిసంధ్యేయాం వందే ధూమావతీమహమ్‌ ॥ 27 ॥

శంకరీం శంకరప్రాణాం సంకటధ్వంసకారిణీం
శత్రుసంహారిణీం శుద్ధాం శ్రయే ధూమవతీమహమ్‌ ॥ 28 ॥

షడాననారిసంహంత్రీం షోడశీరూపధారిణీం
షడ్రసాస్వాదినీం సౌమ్యాం సేవే ధూమవతీమహమ్‌ ॥ 29 ॥

సురసేవిత పాదాబ్జాం సురసౌఖ్య ప్రదాయినీం
సుందరీ గణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 30 ॥

హేరంబజననీం యోగ్యాం హాస్యలాస్యవిహారిణీం
హరిణీం శత్రుసంఘానాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 31 ॥

క్షీరోదతీరసంవాసాం క్షీరపాన ప్రహర్షితాం
క్షణదేశేజ్యపాదాబ్జాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 32 ॥

చతుస్త్రింశద్వర్ణకానాం ప్రతివర్ణాదినామభిః
కృతం తు హృదయంస్తోత్రం ధూమావత్యాస్సుసిద్ధిదమ్‌ ॥ 33 ॥

య ఇదం పఠతిస్తోత్రం పవిత్రం పాపనాశనం
సప్రాష్నోతిపరాం సిద్ధం ధూమావత్యాః ప్రసాదతః ॥ 34 ॥

పఠన్నేకాగ్రచిత్తోయో యద్యదిచ్చతి మానవః
తత్సర్వం సమవాప్నోతి సత్యం సత్యం వదామ్యహమ్‌ ॥ 35 ॥

ఇతి శ్రీ ధూమావతీ హృదయం సోత్రం సంపూర్ణం 

Tuesday, November 18, 2025

Bharathiya Janatha Party - భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

1980లో ఇందిరాగాంధీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చారు. అంతకుముందు జనతా ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ ఫిబ్రవరి 28న ద్వంద్వ సభ్యత్వ అంశాన్ని వదులుకోనని, తుది నిర్ణయం తీసుకునే వరకు అలా కొనసాగుతానని ప్రకటించారు.

ద్వంద్వ సభ్యత్వం అంటే జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండింటిలోనూ ఒకేసారి సభ్యుడిగా ఉండటం. చాలామంది సీనియర్ నాయకులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసంఘ్ సహా పలు పార్టీలు కలిస్తే ఏర్పడినదే ఈ జనతా పార్టీ.

అయితే, జనసంఘ్ సభ్యులు ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టకపోతే, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని జనతా పార్టీ వర్కింగ్ కమిటీ 1980 ఏప్రిల్ 4న నిర్ణయించింది. దీనిని జనసంఘ్ సభ్యులు ముందే ఊహించారు.

ఈ ఘటన గురించి కిన్షుక్ నాగ్ 'ది సాఫ్రాన్ టైడ్: ది రైజ్ ఆఫ్ ది బీజేపీ' పుస్తకంలో రాశారు.

"1980 ఏప్రిల్ 5, 6 తేదీలలో జనతా పార్టీలోని జనసంఘ్ విభాగం దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు 3,000 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడే భారతీయ జనతా పార్టీ ఏర్పాటును ప్రకటించారు" అని పుస్తకంలో తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీకి అధ్యక్షుడిగా నియమించగా, ఎల్.కె. అద్వానీ, సూరజ్ భాన్, సికందర్ బఖ్త్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

1980 ఎన్నికలలో జనతా పార్టీ 31 సీట్లను గెలుచుకోగా, అందులో 16 సీట్లు జనసంఘ్ నుంచే వచ్చాయి. అయితే, ఈ గెలిచిన 16 మంది సభ్యులు 14 మంది రాజ్యసభ సభ్యులు, ఐదుగురు మాజీ క్యాబినెట్ మంత్రులు, ఎనిమిది మంది మాజీ రాష్ట్ర మంత్రులు, ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కొత్త పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వారందరూ తామే నిజమైన జనతా పార్టీ అని చెప్పుకున్నారు.

ఎన్నికల గుర్తుగా కమలం
జనతా పార్టీలో చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఎన్నికల చిహ్నమైన 'హల్ధార్ కిసాన్'ను ఎన్నికల సంఘం తాత్కాలికంగా(ఫ్రీజ్) స్తంభింపజేసింది.

కొత్తగా ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి జాతీయ పార్టీ హోదాను మంజూరు చేసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం బీజేపీకి కమలం గుర్తును కేటాయించింది.

అంతకుముందు చక్రం, ఏనుగు వంటి ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని బీజేపీ కోరింది, కానీ ఎన్నికల సంఘం అంగీకరించలేదు.

జనతాపార్టీ చిహ్నం హల్ధార్ కిసాన్ ఫ్రీజ్ నిర్ణయాన్ని సమీక్షించాలని మాజీ ప్రధాని, జనతా పార్టీ నేత చంద్రశేఖర్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.

ఆరు నెలల తర్వాత హల్ధార్ కిసాన్ చిహ్నంపై ఆంక్షలను ఎత్తివేసింది కమిషన్.

బయటి నేతలకు ప్రాధాన్యం
అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ వెలుపలి నాయకులను బీజేపీ విస్మరించలేదు. నళిన్ మెహతా పుస్తకం 'ది న్యూ బీజేపీ' ప్రకారం..

శాంతిభూషణ్ (కేంద్ర మాజీ మంత్రి), ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ, కె.ఎస్.హెగ్డే (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), సికందర్ బఖ్త్‌ (కాంగ్రెస్ మాజీ నాయకుడు)ను స్వాగతించింది. అంతేకాదు, పార్టీ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలోని ముగ్గురు సభ్యులలో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ వెలుపలివారే.

దేశ విభజన తర్వాత సింధ్ నుంచి శరణార్థిగా భారత్‌కు వచ్చారు రామ్ జెఠ్మలానీ. సికందర్ బఖ్త్ దిల్లీకి చెందిన ముస్లిం.

పార్టీ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును సికందర్ ప్రతిపాదించగా, దీనికి రాజస్థాన్‌కు చెందిన భైరాన్ సింగ్ షెకావత్ మద్దతు ఇచ్చారు.

గాంధీ సోషలిజం
బీజేపీ సైద్ధాంతికంగా గాంధీ సోషలిజం ను స్వీకరించింది, కానీ ప్రారంభంలో పార్టీలోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించలేదు.

'ది సాఫ్రాన్ టైడ్: ది రైజ్ ఆఫ్ ది బీజేపీ' పుస్తకం ప్రకారం..

విజయరాజే సింధియా నాయకత్వంలో చాలామంది బీజేపీ నాయకులు 'సోషలిజం' అనే పదం ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే దీనికి కమ్యూనిస్టుల ముద్ర ఉండటమే.

ఇక 'గాంధీ సోషలిజం'ను స్వీకరించడం వల్ల పార్టీ కాంగ్రెస్‌కు కాపీలా కనిపిస్తుందని, వాస్తవికతను దెబ్బతీస్తుందని కొందరు నాయకులు భావించారు.

ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ 'గాంధీ సోషలిజం'ను స్వీకరించడానికి అనుకూలంగా లేరనీ అనుకున్నారు, కానీ ఆయన కూడా అంగీకరించారు.

కిన్షుక్ నాగ్ పుస్తకం ప్రకారం..
హిందువులు కాని వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ సంతోషంగా లేదు. అయినప్పటికీ, జనసంఘ్ పాత సిద్ధాంతాలను వదిలేసి కొత్తగా ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించుకుంది. బహుశా అందుకే జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలను పార్టీ వేదికపై పెట్టారు.

ముంబయిలో బీజేపీ జాతీయ సమావేశం
1980 డిసెంబర్ చివరి వారంలో ముంబయిలో శివాజీ పార్క్‌లో పార్టీ బహిరంగ సభ జరిగింది, వేలమంది పార్టీ కార్యకర్తలు అందులో పాల్గొన్నారు.

లాల్ కృష్ణ అద్వానీ తన ఆత్మకథ 'మై కంట్రీ, మై లైఫ్‌'లో అప్పటికి 25 లక్షల మంది బీజేపీలో సభ్యులుగా చేరారని, జనసంఘ్ ప్రభావం ఎక్కువున్న సమయంలో 16 లక్షల మంది వరకే ఉన్నారని తెలిపారు.

1981 జనవరి 31న ఇండియా టుడేలో సుమిత్ మిత్రా 'బీజేపీ కన్వెన్షన్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్' శీర్షికతో రాసిన కథనం ప్రకారం.. 54,632 మంది ప్రతినిధులలో 73 శాతం మంది ఐదు రాష్ట్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్) నుంచి వచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ సోదరుడు భావురావు దేవరస్ కూడా సభకు హాజరయ్యారు.

జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతమైన 'గాంధీ సోషలిజం'ను అంగీకరించడం తనకు కష్టమని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు శేషాద్రి చారి అన్నారు.

ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ.. "చాలామంది బీజేపీ సభ్యులు గాంధీ సోషలిజం, పార్టీ కొత్త జెండాతో ఏకీభవించలేదు. ఆ సమయంలో నేను స్వయం సేవకుడిని కాబట్టి నాకు ఇది తెలుసు. ఈ భిన్నాభిప్రాయం విస్తృతంగా ఉంది కానీ, దానిని బహిరంగంగా ప్రకటించలేదు" అని అన్నారు.

విజయ రాజే సింధియా వ్యతిరేకత
అప్పటి బీజేపీ సీనియర్ నాయకురాలు విజయ రాజే సింధియా పార్టీ కొత్త సిద్ధాంతాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. గాంధీ సోషలిజం నినాదం సాధారణ బీజేపీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోందంటూ పార్టీ ప్రతినిధులకు ఐదు పేజీల లేఖ రాశారు. బీజేపీని ఈ నినాదం కాంగ్రెస్ ఫోటోకాపీగా మార్చుతుందని, పార్టీ వాస్తవికతను నాశనం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

విజయరాజే రాసిన రాయల్ టు పబ్లిక్ లైఫ్‌ ప్రకారం.. ‘‘నేను ఈ నినాదాన్ని వ్యతిరేకించాను, ముంబయి సమావేశంలో ఆ నినాదాన్ని పార్టీ మార్గదర్శక సూత్రంగా అంగీకరించారు. జనతా పార్టీ నుంచి బయటకు వెళితే 'గాంధీ సోషలిజం'పై ఆధారపడవలసిన అవసరం లేదని అప్పట్లో చాలామంది పార్టీ నాయకులు భావించారు.’’

క్రిస్టోఫర్ జాఫర్లెట్ తన పుస్తకం 'ది హిందూ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ అండ్ ఇండియన్ పాలిటిక్స్‌' ప్రకారం..

‘‘చివరికి, ఒక మధ్యే మార్గం కనుగొన్నారు. విజయరాజే తన వాదనను ఉపసంహరించుకునేలా ఒప్పించారు. మార్క్స్ సోషలిజానికి బీజేపీ సోషలిజం పూర్తిగా వ్యతిరేకమని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేశారని ఆమె ఒక విలేఖరుల సమావేశంలో తెలిపారు. బీజేపీ సోషలిజం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సమగ్ర మానవతావాదం, సంక్షేమవాదం భావనలపై ఆధారపడి ఉందని చెప్పారు.’’

ఈ మొత్తం చర్చలో వాజ్‌పేయి జోక్యం చేసుకుని, 'గాంధీ సోషలిజం' సిద్ధాంతం నుంచి పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టంచేశారు.

సానుకూల లౌకికవాదం
డిసెంబర్ 30న రాత్రి వాజ్‌పేయి తన ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ సమానత్వ సూత్రాన్ని బీజేపీ స్వీకరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు అవలంభించిన 'సానుకూల లౌకికవాదం' విధానం పార్టీలో ఉంటుందన్నారు.

శివాజీ ఆగ్రాలో బందీగా ఉన్న సమయంలో ఆయన సేవకుడు ముస్లిం అని వాజ్‌పేయి చెప్పారు. 1661లో ముస్లిం సాధువు యాకుత్ బాబా ఆశీర్వాదంతో శివాజీ తన కొంకణ్ స్వాధీన ప్రయత్నాలను ప్రారంభించారని వాజ్‌పేయి అన్నారు.

"జనతా పార్టీ విడిపోయి ఉండవచ్చు, కానీ జయప్రకాశ్ నారాయణ్ కలలను మేం ఎప్పటికీ చెదిరిపోనివ్వం" అని వాజ్‌పేయి అన్నారు.

'గాంధీ సోషలిజం' గురించి పార్టీలో సైద్ధాంతిక చీలికను సూచిస్తున్న వార్తాపత్రిక రిపోర్టులను ఆయన తోసిపుచ్చారు.

వాజ్‌పేయి తన ప్రసంగంలో "ఈ పశ్చిమ కనుమల ఒడ్డున నిలబడి చెబుతున్నదేంటంటే.. చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.

బీజేపీకి మొహమ్మద్ కరీం మద్దతు
సభకు ముఖ్య అతిథిగా మొహమ్మద్ కరీం చాగ్లా పాల్గొన్నారు. ఆయన నెహ్రూ, ఇందిరా మంత్రివర్గంలో పనిచేశారు.

విభజనకు ముందు చాగ్లా మొహమ్మద్ అలీ జిన్నాకు సహాయకుడిగా కూడా పనిచేశారు. చాగ్లాను అటల్ బిహారీ వాజ్‌పేయి స్వాగతించారు, ఆయన లౌకికవాదానికి చిహ్నం అని అన్నారు. వాజ్‌పేయి భవిష్యత్ ప్రధానమంత్రి అని చాగ్లా అభిప్రాయపడ్డారు.

మొహమ్మద్ కరీం తన ఆత్మకథ 'రోజెస్‌ ఇన్ డిసెంబర్' లో.. "ఆ సమయంలో రాజకీయాలు, చట్టం రెండింటిలోనూ జిన్నా నాకు ఆదర్శంగా నిలిచారు. ఆయన జాతీయవాదిగా ఉన్నంత కాలం నేను మద్దతు ఇచ్చాను. కానీ ఆయన మతతత్వంలోకి మారి రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్థించడంతో మా మార్గాలు వేరయ్యాయి" అని తెలిపారు.

సమావేశానికి జిన్నా మనవడి నిధులు
మొత్తం కార్యక్రమానికి రూ. 20 లక్షలు ఖర్చయ్యాయి, ఆ సమయంలో ఇది పెద్ద మొత్తం.

వినయ్ సీతాపతి పుస్తకం 'జుగల్‌బందీ: ది బీజేపీ బిఫోర్ మోదీ' ప్రకారం..
‘‘ఈ సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త నుస్లీ వాడియా ఎక్కువ నిధులు అందించారని ఆ కార్యక్రమానికి హాజరైన ఒక సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారు. 1970ల చివరి నాటికి జిన్నా మనవడైన నుస్లీ వాడియా బీజేపీకి అతిపెద్ద ఆర్థిక మద్దతుదారులలో ఒకరిగా మారారు.’’

పార్టీ తొలి సమావేశం జరిగిన 16 సంవత్సరాల తర్వాత అంటే 1996లో బీజేపీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొదటిసారి ఆహ్వానం అందింది. కానీ ఆ పార్టీ పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకోలేకపోయింది. అటల్ బిహారీ వాజ్‌పేయి 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.

కానీ అది తరువాతి రెండు ఎన్నికలలో గెలిచింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 1998లో ప్రమాణ స్వీకారం చేసింది.

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...