Friday, January 30, 2026

Shani Trayodashi - శని త్రయోదశి

శని త్రయోదశి

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులు శని దేవుని పూజించడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి. సూర్య పుత్రుడైన శనిదేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఒక్కో రాశిలో 2.5 ఏళ్లు ఉంటూ వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మనుషులు చేసే పనులకు అనుగుణంగా న్యాయం చేస్తుంటాడు. అయితే ఈయనకు కష్టాలను ఇచ్చే వాడు అనే పేరే ఉంది. కానీ న్యాయబద్ధంగా జీవించే వారికి అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే శనిదేవుడి అనుగ్రహం ఉంటే అన్నీ శుభాలు జరుగుతాయని భావిస్తారు.

శనిదేవుడికి కర్మ ఫలదాత అంటారు. ఈ శనిదేవుడు 12 రాశులపై 7.5 ఏళ్లు ఏలినాటి శని, అష్టమ లేదా అర్ధాష్టమి (2.5 సంవత్సరాలు) రూపంలో ప్రభావం చూపుతూ ఉంటాడు. ఈ సమయంలో ఆయా రాశుల వారికి కష్టాలు ప్రారంభం కావడం, అనుకున్న పనులు ఆలస్యం కావడం, మానసిక ఒత్తిడి కలగడం లేదా అదృష్టం కలిసి రావడం, అద్భుతమైన కెరీర్‌ వృద్ధి కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ప్రస్తుత సమయం లో కుంభ రాశి వారు చివరి దశ. మీన రాశి వారు రెండో దశ, మేష రాశి వారు మొదటి దశ లో వున్నారు. వీరే కాక సింహ రాశి వారు అష్టమ శని మరియు ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని దశలో వున్నారు. కావున వీరు శని త్రయోదశి రోజు పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇది కొంత పరిహారము మాత్రమే పూర్తిగా కాదు.

శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని చెప్తారు. మరియు శనిదేవుని అధీనంలో ఉండే తిథి, నక్షత్రం, వారం, మాసం శనివారం నాడు వస్తుంది కాబట్టి దానిని శని త్రయోదశి అంటారు.

శనిదేవుని శనీశ్వరుడు అని పలకరాదు, శనైశ్చరుడు అని పలకాలి.

ఈ శని మంత్రాన్ని జపించాలి

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్

శని ధ్యానం
నీలద్యుతిః నీలవపుః  కిరీటీ
గృధస్ధితాశ్చాపకారో ధనుష్మాన్|
చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః
సదాస్తు మహ్యం వరమందగామీ||

బీజమంత్రం:
ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః

శని గాయత్రి:
1.ఓం రవిసుతాయ విద్మహే
మందగ్రహాయ ధీమహి
తన్నః శనిః ప్రచోదయాత్

2.ఓం కాకధ్వజాయ విద్మహే
ఖడ్గ హస్తాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు కొన్ని, 100 గ్రాముల నువ్వుల నూనె ప్యాకెట్, 1 కిలో బొగ్గు, ఒక చిన్న నల్ల గుడ్డ, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలు కట్టి, ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నదిలో వేయండి.

కాకికి ఆహార పదార్థాలను అందించి, ఎంతో పుణ్యఫలం కాకి శని దేవుని వాహనం.కాకికి ఆహారం అందించడం వల్ల శనిదేవుడు ప్రీతీ చెందుతాడు మరియు పితృదేవతలు కూడా ప్రీతీ చెందుతారు.

శని త్రయోదశి నాడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా సంప్రదాయాలలో ఉన్నాయి. శని ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్లీ మొదలవుతుందనే నమ్మకం పురాణ కథల ద్వారా ప్రచారంలో ఉంది. ఈ నమ్మకాలు భక్తులలో ఒక క్రమశిక్షణను కలిగించడంలో సహాయపడతాయి.

శనివారం నూనె, గొడుగు, నవధాన్యాలు.. మొదలైన వాటిని కొనుగోలు చేయవద్దు.

ఈ రోజున మీరు నల్ల చీమకు పంచదార ఇవ్వాలి. నల్ల చీమలు కనిపించకుంటే చీమలు ఎక్కువగా ఉన్నచోట పంచదార వేయండి. అలాగే చెట్టు మూలాన దీపం వెలిగించి పూజిస్తే శని కోపం తగ్గుతుంది.

నల్ల నువ్వులు, నువ్వుల నూనె శనికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కాబట్టి వాటితో దానం చేసి పూజిస్తే శని తృప్తి చెందుతుందని చెబుతారు. అలాగే ప్రతి శనివారం ఇలా చేస్తే విజయం చేకూరుతుంది.

నేడు ఆలయానికి వెళ్లి నవగ్రహాల్లో శని దేవుడి ఎదుట దీపం వెలిగిస్తే ఎంతో మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది.


శని


నవ గ్రహ స్తోత్రం

నవగ్రహ బీజ మంత్రములు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Thursday, January 29, 2026

Matsya Puranam - మత్స్య పురాణము

మత్స్య పురాణము

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
 ।
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌ ॥

అష్టాదశపురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధః ప్రకీర్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహస్రాణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు.

మత్స్యపురాణంలోని 53వ అధ్యాయంలో అష్టాదశ పురాణాల లక్షణాలు, ఆపురాణాలలో చెప్పబడ్డ అంశాలు, శ్లోకాల సంఖ్య తదితర విషయాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి. పురాణాలలో ఇది ప్రాచీనమైనదిగా పండితులు భావిస్తారు.

మత్స్యపురాణంలో చెప్పబడ్డ ప్రధాన అంశాలు :
మత్స్యావతారవర్ణన, బ్రహ్మాండసృష్టి, గర్భిణీధర్మాలు, సూర్యచంద్ర వంశాల వర్ణన, గయాక్షేత్ర విశేషాలు, పురూరవుడి చరిత్ర, కచదేవయానుల వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, శ్యమంతకోపాఖ్యానం, కలిధర్మాలు, ద్వాపరధర్మాలు, కృష్ణాష్టమీవ్రతం, అక్షయతృతీయ వ్రతం, మహాదానవర్ణన, పుష్యవాహనుడికథ, ప్రయాగక్షేత్రమాహాత్మ్యం, యమునానదీ స్నాన ప్రాశస్త్యం,
సప్తద్వీపాల వర్ణన, ఋషిలక్షణాలు, పార్వతీకళ్యాణం, వినాయకజననం, కుమారసంభవం, తారకాసురవధ, నృసింహావతారవర్ణన, సావిత్రీ సత్యవంతుల చరిత్ర, రాజధర్మాలు, వామనావతారం, వరాహావతారం, క్షీరసాగరమధనం, 
వాస్తు శాస్త్రవిశేషాలు, క్రియాయోగ వర్ణన, వివిధరకాల ప్రతిమా నిర్మాణ విశేషాలు, కల్పనామ సంకీర్తన వంటి ప్రధానాంశాలతో పాటు మరెన్నో
విషయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.

మత్స్యపురాణ ప్రాశస్త్యం
పాతాళాదుత్పతిష్టోర్మకర వసతయోయస్య పుచ్చాభిఘాతా ।
దూర్ధ్వం బ్రహ్మాండఖండ వ్యతికర విహితవ్యత్యయే నాపతంతి ॥

విష్ణోర్మత్స్యావతారే సకల వసుమతీ మండల వ్యశ్రువానా ।
స్తస్యాస్యోదరితానాం ధ్వని రపహరతాదశ్రితుం వః శ్రుతీనాం ॥
(మత్స్యపురాణం -శ్లో 1 -2)

మత్స్యావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు, పాతాళలోకంనుంచి పైకి ఎగిసిపడే తన మత్స్యంతోకతో కొట్టబడుతూ, సముద్రంపై భాగం నుంచి పడుతూ ఈ బ్రహ్మాండఖండాల సంపర్కంతో పుట్టిన కల్లోలం వల్ల సమస్త భూమండలంలో వ్యాపిస్తూ, పైకెగిరి తిరిగి క్రిందపడుతున్నాడు. ఆ మత్స్యపరమాత్మ నోటినుంచి వెలువడే వేదాలనాదం మనందరి పాపాలనూ పోగొట్టుగాక.

శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సృష్టి ప్రారంభంలో హయగ్రీవుడనే రాక్షసుడు వేదాల్ని దొంగిలించి పాతాళంలో దాచగా, మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి, హయ
గ్రీవుడి చెరలోవున్న వేదాల్ని ఉద్దరించాడు. ఈ విధంగా వేదాల్ని ఉద్ధరించి సమస్త భూమండలాన్ని రక్షించిన మత్స్యావతార విశేషాల్ని చెప్పినందువల్ల ఇది మత్స్యపురాణం అనబడుతోంది. మహాప్రళయ కాలంలో శ్రీమహావిష్ణువు సప్తర్షులకూ,
వైవస్వతమనువుకూ ఉపదేశించిన ఎన్నో మహిమాన్వితమైన కథలు, గాథలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి.

ఈ మత్స్యపురాణాన్ని శైవులు, స్మార్తులు, శాక్తేయులు, వైష్ణవులూ ప్రామాణికంగా గ్రహిస్తారు. పురాణానికి చెప్పబడ్డ ఐదులక్షణాలూ ఈ పురాణంలో సమగ్రంగా వున్నాయి. ఇందులో కథలు, గాథలే కాక అనేకమైన శ్రౌత, స్మార్త, నిత్యనైమిత్తిక కామ్య కర్మలకూ సంబంధించిన వివిధ రకాల అంశాల వివరణ కూడా కనిపిస్తుంది. ప్రాచీనతదృష్ట్యా కూడా మత్స్య పురాణానికి ఒక ప్రత్యేకత
వుంది. అందుకే వామన పురాణం 'పురాణేషు దైవం మాత్స్యమ్‌' - పురాణాలలో దైవంలాంటిది మత్స్యపురాణం అని చెబుతుంది.

ఈ పురాణంలో ఎన్నోరకాల వైదిక అనుష్టాన ప్రక్రియలు వివరించబడ్డాయి. ముఖ్యంగా తొంభైరెండు, రెండువందల అరవై నాలుగు అధ్యాయాల్లో గ్రహశాంతుల గురించి సవివరంగా చెప్పారు. ఇవేకాక రుద్ర, ఉమా, విష్ణు, స్వయంభూ, ఇంద్ర, యమ, అగ్ని జల, సర్ప, వినాయక వంటి దేవీ దేవతలకు నైవేద్యం అనగా బలిని ఎలా సమర్పించాలి? అనే విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి.

మత్స్యపురాణంలో వైదికమంత్రాలే కాకుండా పౌరాణిక మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. ఇవి శ్లోకాల రూపంలో అందరికీ సులభగ్రాహ్యంగా వుంటాయి . ఇందులో పాంచరాత్ర మత సిద్ధాంతానికి సంబంధించిన విశేషాలు చాలావరకూ కనిపిస్తాయి. 264వ అధ్యాయంలో వివిధ దేవతల్ని ప్రతిష్టించే విధివిధానాలు పామ్రాణికంగా చెప్పబడటంతో ఇది విశిష్ట పురాణంగా ప్రసిద్ధిచెందింది. అందుకే వామనపురాణం మత్స్యపురాణం గొప్పతనాన్ని గురించి ఇలా వర్ణిస్తుంది.

ముఖ్యం పురాణేషు యథైవ మత్స్యం స్వాయంభువోక్తి స్వధసంహితాసు ।
మనుస్మృతీనాం ప్రవరోయథైవ తిథైషు ధర్మో విబుధేషు వాస వః ॥
(వామన అధ్యా -12-శ్లో
48)

పురాణాలలో మత్స్యపురాణం, సంహితలలో స్వాయంభుడు చెప్పిన స్వథసంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులన్నిటిలో అమావాస్య గొప్పవి. దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడు.

మత్స్యావతార కథనం












త్రిపురాసురోపాఖ్యానం


Magha Puranam 12 - మాఘ పురాణం 12 పుణ్యక్షేత్రములలో మాఘస్నానము

మాఘ పురాణం - 12 వ అధ్యాయం

పుణ్యక్షేత్రములలో మాఘస్నానము

ఈ విధంగా ననేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నానఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠులవారు వివరించగా-"మహర్షీ! మీ కృపవలన ఆనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని, కాని మరొక సంశయము నాకుగలదు. అది ఏమనగా మాఘమాస మందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ విన్నమ్రుడై కోరగా వశిష్ఠులవారు మరల యిట్లనెను.

దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యముగు తీర్థమహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.

మాఘమాసములో నదీస్నానం ముఖ్యమైనది. మాఘస్నానములు చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనట అవివేకం, ఎందుకు అనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. అవస్యకమైనది కూడాను.

అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నానమాచరించిన ఏడుజన్నలలోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానములతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్యరాలయములు మొదలగు మూడువందల పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొవ్చ ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.

ఇక త్రయంబకమనునొక ముఖ్యమైన క్షేత్రం కలదు, అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్రగోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అదియును గాక మాఘమాసములో గోదావరియందు స్నానముచేసినయెడల సకలపాపములు తక్షణము హారించిపోవుటయేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులుకూడా కలిసి తమతమ స్నేహా సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే 'పరంతప' అను ఉపనది ప్రవహించే చోటకూడ శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము గలదు. ఆ క్షేత్రము బ్రహ్మహాత్యా మహా పాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్రము గలదు. సావధానుడవై ఆలకింపుము.

విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు,ఈశ్వరునికి అయిదేసి తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేరుకూడా కలదుకదా! బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి. నేనే గొప్పవాడనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్దము చేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హాత్యాపాతకము చుట్టుకొన్నది.

శివుడు భయపడి నరికిన బ్రహ్మాతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి ఫుర్రిగా అయినది, ఈశ్వరుడు ఆపుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి 'భిక్షాందేహీ' యని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మముకడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, ఈతనికి పురుషత్వము నశించుగాక"చుగాక అని శపించెను.

ఈశ్వరుడు చేయునదిలేక జారి క్రిందపడిపోయిన ఆ లింగము నందే ఐక్యమైపోయినాడు.

అటుల లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటిసూర్యుల తేజస్సుకలిగి ప్రళయము సంభవించునా? యన్నట్లు భయంకరముగా నుండెను. అవ్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు
శివసాన్నిధ్యమును పొందగలుగుచున్నారు,

Wednesday, January 28, 2026

Magha Puranam 11 - మాఘ పురాణం 11 మార్కండేయుని వృత్తాంతము

మాఘ పురాణం - 11 వ అధ్యాయం

మార్కండేయుని వృత్తాంతము

వశిష్టులవారు దిలీపునకు మృగశృంగుని వివాహాం, మృకండుని జననము, కాశీ విశ్యనాధుని దర్శనం విశ్యనాధుని వరమునలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి

"మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము" అని వశిష్ఠులవారు ఈ విధంగా చెప్పదొడగిరి.

మార్కండేయుని అయువు 16 సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను.

అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి, అరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిర కాలములో సకల శాస్త్రములు, వేదాంత, పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసల నందెను.

"కుమారా! నీవు పసితనమందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్ధికుశలత చే అందరి మన్ననలను పొందుచున్నావు అందులకు మే మెంతయో ఆనందించుచున్నాము? ఆయినను గురువుల యెడ పెద్దల యెడ బ్రాహ్మణుల యెడ మరింత భక్తి భావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును, గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియగును" అని చెప్పిరి.

అటుల పదిహేను సంవత్సరములు గడచిపోయినవి. రోజురోజుకీ తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగుచున్నది, పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి ముహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు.

మునీశ్వరులు గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమన్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించాడు అటుల చేసినందులకుఅందరూ ఆశ్చర్యపడి "మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి? అని ప్రశ్నించారు.

అంత వశిష్ఠులవారు! "ఈ బాలుడు కొద్ది దినముబలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవుకమ్ము" దీవించితిరిగదా! అదెటుల అగును? ఈతని ఆయుర్ధాయము పదహారేండ్లేగదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి, “చిరంజీవివై వర్ధిల్లు" మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని భాధవడి “ దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్ఠులవారినే ప్రశ్నించారు. వశిష్ఠులవారు కొంత సేపాలోచించి మునిసత్తములారా! వినుడు. మన మందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండి" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి.

మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరి తోపాటు మార్కండేయుడు కూడ నమస్కరించగా బ్రహ్మ "చిరంజీవిగా జీవించు నాయినా” యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయవడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి "పరమేశ్యరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక” యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి "ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగ నేరదు. అని పలికి, వత్సా! మార్కండేయా నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీ కే యాపద కలుగదు, గాన నీవట్లు చేయుము".

మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాధుని సేవించి వచ్చెదను, అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండుడు అతనిభార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదన లేక కుమారుని విడిచిపెట్టి యుండలేక, అందరూ కాశీక్షేత్రమునకు బయలు దేరిరి.

కుటుంబసహితముగా కాశీకిపోయి మృకండుడు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు సదాశివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముకడనే యుండెను.

పదహారవయేడు ప్రవేశించెను. మరణసమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములుగొని తెమ్మని అజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ఛ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చునరికి భటులు ఆ సమీపమందు నిలువ లేకపోయిరి. కాలపాశము విసరుటచే చేతులు ఎత్త లేకపోయారు, మార్కండేయునిచుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణములవలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యమున కెరిగించగా - యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయున్నిపై కాలపాశమువిసరెను, మార్కండేయుడు కన్నులు తెరచిచూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయవడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కై లాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమునుచీల్చుకొనివచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను.

యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేకవిధముల ప్రార్థించి జటాధారి కోవమును చల్లార్చు మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమ వర ప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరకదా! అతని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా, గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి "యమా ! నీవు నాభక్తుల దరికి రావలదు సుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.

పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాసఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

Tuesday, January 27, 2026

Magha Puranam 10 - మాఘ పురాణం 10 మృగశృంగుని వివాహము

మాఘ పురాణం - 10 వ అధ్యాయం

మృగశృంగుని వివాహము

దిలీప మహీజునకు వశిష్ఠులవారు ఇట్లు చెప్పసాగిరి "పువ్వు వికసించగానే వాసన వేయును, అది ఒకరు నేర్పవలసీన అవనరము లేదు, అది ప్రకృతినైజము, ఆ విధముగానే మృగశృంగుడు తన బాల్యదశ నుండియే హారినామస్మరణా యందాసక్తి గలవాడయ్యెను.

అతనికి ఐదుసంవత్సరములు నిండినతరువాత గురుకులములో చదువవేసిరి. అచట సకలశాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్నల నొందుచు పాండిత్యము సంపాదించెను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రులు యానతిపై దేశాటన చేసి యనేక 
పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి యుండెను.

కమారుడు 
దేశాటన పూర్తిచేసి వచ్చినతరువాత అతని తల్లిదండ్రులు కన్యనుచూచి వివాహాం చేయుటకు నిశ్చయించినారు, మృగశృంగుడు తాను వరించిన సుశీలనుమాత్రమే వివాహాం చేసుకొనెదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివై భవముగా వివాహము చేసిరి,

సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగునిజూచి "ఆర్యా! మాస్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మాఇద్దరినికూడా ఈశుభలగ్నమున పరిణయమాడుము" అని పలికిరి, మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం, అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా "మా సు
శీలను పెండ్లాడినట్లే మమ్ముకూడ పెండ్లాడుమని అడబడుచులు పటుపట్టినారు.

"మరి పురుషునకు ఒక్క భార్యయేకదా? ఇద్దరు భార్యలా?" అని మృగశృంగుడు ప్రశ్నించగా -

ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవికచా ? దశరధునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరుగదా? వారికి లేని అభ్యంతరములు నీకు కలవా? అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముటిరి,

మృగశృంగుడేమీ జవాబు చెప్పలేకపోయాడు,

వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా-"మృగశృంగా అభ్యంతరము తెలుపవలదు, ఆ ఇరువురికన్యలయభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖంచిన నీకు జయము గలుగదు, అయినను యిటువంటి ఘటనలు మున్ను అనేకములు జరగియున్నవి అని పలికిరి. పెద్దలందరి యభిమతము ప్రకారము 
మృగశృంగుడు ఆ యిరువురు కన్యలనుకూడా వివాహం చేసుకున్నాడు.

ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా మహార్షీ! వివాహము లెన్ని విధములు? వాటి వివరములు "తెలియజేసి నన్ను సంతృప్తుని చేయుడు” అని ప్రార్థించగా - వశిష్ఠులవారు మరల ఇట్లు చెప్పసాగిరి.

రాజా! వివాహము లెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను సావధానుడవై ఆలకింపుము.”

1. బ్రాహ్మాణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు 'బ్రహ్మ' మని పేరు.

2, దైవము: యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును యిచ్చి జేయు "పెండ్లికి 'దైవము' అని పేరు.

3. ఆర్షము :పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని ఆతనికి పెండ్లికూతురు నిచ్చి పెండ్లి చేయు దానిని 'ఆర్షమని' అందురు

4. ప్రాజాపత్యము : ధర్మము కోనం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమనకు '
ప్రాజాపత్యము' అని పేరు.

5. ఆసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయు దానికి '
ఆసుర' మని పేరు.

6. గాంధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతటవారు చేసుకొను వివాహమునకు 'గాంధర్వ' వివాహమని పేరు.


7. 
రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని 'రాక్షస' వివాహమని పేరు.

8 పైశాచిక:మోసగించి, అనగా మాయమాటలచే నమ్మించి 
పెండ్లిచేసుకొను దానికి 'పైశాచిక’ మని పేరు.

ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు గాన, వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.

గృహస్థాశ్రమ లక్షణములు
మంచి నడవడికతో,ఇహమూ,పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే  సరియైన మార్గము.

భార్యయు, భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి జెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిధి సత్కారములాచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకొనేవాడే  సరియైన గృహస్థుడనబడును,

నోములు నోచుట, వ్రతములు చేయుట, వర్వదినములలో "ఉపవాసములుండి కార్తీక మాసమందునా మాఘమాసమందునా నదీ స్నానంచేసి, కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించిన వారికి మంచితేజస్సు కలుగును.

ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు దీర్చుకొని, స్నానముచేసి, నిష్టతో భగవంతుని పూజించవలయును. కార్తీక మాసమందు, మాఘ మాసమందు వైశాఖమాసమందు తన శక్తికొలదీ దానధర్మములు చేసినచో గొప్పఫలము కలుగును, గాన ప్రతి మనుజుడూ ఇహసుఖములకే కాకా పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.

పతివ్రతా లక్షణములు

పురుషుడు తనకు సద్గతి కలిగేనిమిత్త మనేక ఘన కార్యములు చేసినకాని మంచిఫలము పొంద లేకపోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తనభర్తను దైవముగా భావించి మనసారా ఆరాధించవలెను.
తన భర్తయొక్క మంచిగుణములనే స్వీకరించవలయునుగాని, అందాన్ని, ఆకారాన్ని చూచి మురిసిపోకూడదు అటులనే పురుషులునూ స్త్రీ యొక్క అందమునే చూడక, శీల గుణమునులెక్కించి ప్రేమతో అదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యాను  రాగములతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును.  ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిధి సేవలయందు కూడ తగు భక్తి శ్రద్ధలతో చేసినయెడల అట్టి 
స్త్రీకి సద్గతి కలుగును.

భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటలయందు సేవకు రాలి వలెనడుచు కొనవలయును. భోజనము వడ్డించునపుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాముగా భోజనము పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలయును. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందము కలుగ జేయవలెను. రూపంలో లక్ష్మిని బోలియుండ వలెను, ఓర్పు వహించుటలో భూదేవినిబోలియుండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడచు కొనునో అమేయే ఉత్తమ స్త్రీ అనబడును.

స్త్రీ బహీష్ఠుఅయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడకూడదు, ఎవరినీ  ముట్టుకొనరాదు. ఆనాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవరోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లుపోసుకొని, శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి, సూర్యభగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయంనందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.

ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందముతో కాలంగడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను,

మృకండుని జననము

ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి యాడితిగదా యని మృగశృంగుడు మిగుల అనందించెను. ఆ ముగ్గురు పడతులతోను నంసారము చేయుచుండెను. అటుల కొంత కాలం జరిగినది సుశీలయను భార్య గర్భముధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తనకుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణుడు కావలయునని ఆశకలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని నామకరణముచేశారు.

మృకండుడు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులయెడ బంధుజనులయెడ పెద్దలయెడ  భయ భక్తులు గలిగి పెరుగుచుండెను ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయం చేసి, విద్య నభ్య సించుటకై గురుకులమునకు పంపించినాడు.

గురుకులములో గురువు చెప్పిన సకలశాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై  గురువు యొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను.

మృకండడు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు 'మరుద్వతి' యనుకన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండి మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించాను. 

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడ పుత్రులు జన్మించి నందున వారికికూడా అన్ని విద్యలు నేర్పిరి.పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను.తన కుటుంబమంతయును మాఘమాసములో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్టతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకొన్న మాఘమాసఫల ప్రభావంచే సంసారమునందు ఏ  ఇబ్బందియులేకుండా వుండుటేగాక, మృగశృంగునకు మనుమలుకూడా కలిగినందున మరింత యానందించి, తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదిగదాయని సంతోషించుచు తనకింక ఏ అశలు లేనందున భగవస్సాన్నిధ్యమునకు బోవలయునని సంకల్పించి, తవస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీమహావిష్ణూవుని ప్రసన్నుని జేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమున కేగెను.

“విన్నావుకదా భూపాలా! మృగశృంగుడు తాను చేసుకొన్న మాఘమాస ఫలమువలన తనకు పుత్రపౌతాభివృద్ధి కలుగుటయే గాక బొందెతో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు.

ఇక అతని 'జ్యేష్టకుమూరుడైన మృకండునియొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠులవారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.

మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండీ జ్యేష్టపుత్రుడగు మృకండుడే నంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండ చూచుచుండెను. ఆయన కొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహామాడి చాలకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈ విధముగా తలపోసెను.

"కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హారించుటయేగాక, మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీవిశ్వనాధుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంట సమేతముగా వెళ్ళుదును” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై  బయలుదేరెను.

మార్గ మధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమి కీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు.

కాశీపట్టణము నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది.. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ది చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు బయలుదేరివెళ్లాడు.

ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని అనందము కలిగెను, తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భిక్తిశ్రద్ధలతో ప్రార్ధించెను.

ఈ విధంగా కుటుంబసహితంగా మృకండడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణచేసి, దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆ విధంగా ఒక సంవత్సరము విశ్వేశ్వరసన్నిధానమందు గడవనెంచెను.

ఒక దినము మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే. తెలివి తప్పి ప్రాణములు విడిచిరి.

మృకండుడు చాల దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహాన సంసారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు.

మృకండునకు ఎంత కాలమునకునూ సంతానము కలుగనందుననే 
కాశీక్షేత్రమునకు  వచ్చినాడుగదా! సంతానముకొఱకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృకండునకు అతని భార్య మరుధ్వతికి అమితానందము కలిగి, పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికాను.

"మహామునీ! మీభక్తికి యెంతయో సంతసించినారము, మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది,  మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము, గాన మీ యభీష్టము నెఱిఁగింపుడు" అని పలికెను.

అంత మృకండుడు నమస్కరించి "మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదే మా నమస్కృతులు. లోక రక్షక! మీ దయవలన నాకు సలక్షణవతి. సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందు వలన నేను మిమ్ము ధ్యానించుచు, ఆమెతో సంసారసుఖము అనుభవించుచున్నాను. కాని ఎంత కాలమైననూ మాకు సంతానం కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి ఉత్తమ గతులు లేవుగదా? కావున మాకు పుత్రసంతానము ప్రసాదించ వేడుకొనుచున్నాను" అని పార్వతీ పరమేశ్యరులను ప్రార్థించాడు.

మృకండుని దీనాలావము లాలకించి త్రినేత్రుడిట్లు పలికెను.

"మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది, బ్రతికియున్నంత వరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?" అని ప్రశ్నించిరి.

మృకండునకు ఆశ్చర్యముకలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసివచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకు
మీ ధ్యానమునే సలుపుచు,సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైదవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను.

"అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యేను.

పరమేశ్యరానుగ్రపామున ఒక శుభ ముహూర్త కాలమున పుత్రుని గనెను, మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను.

ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడుని భాగవతోత్తముడును, అగుమృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను. తిరిగి బ్రతికించెను.

Monday, January 26, 2026

Magha Puranam 9 - మాఘ పురాణం 9 పుష్కరుని వృత్తాంతము

మాఘ పురాణం - 9 వ అధ్యాయం

పుష్కరుని వృత్తాంతము
ఈ విధంగా నాముగ్లురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా - దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులగు వశిష్ఠులవారితో ఇటుల నుడివెను-

"పూజ్యులై న ఓ మహర్షీ! ఈభూలోకమునకు, యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ఆ ముగ్గుకు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళివచ్చినవి" అని ప్రశ్నించెను.

వశి
ష్ఠులవారు దీర్ధముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి,

“మహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము, భక్తిమార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు, వారొకసారి మాఘమాస ములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.

దీనికొక ఉదాహారణ వివరింతును ఆలకింపుము, ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు యీ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికిపోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతము కడు విచిత్రమైనది.

పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగల వాడు. పరోకారము చేయుటయే తన ప్రథాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్టతో స్నాన, జములు మొదలగు పుణ్య కార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు.

ఒకనాడు యముడు 
పుష్కరుని ప్రాణములుతోడ్కొని రండని తన భటుల కాఙ్ఞాపించినాడు. యమభటులు వెంటనేపోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు.

ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై వుండెను. భటులు తోడ్కొనివచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను, యమ
ధర్మరాజునకు ఏదో భయము అవరించినట్లయినది. వెంటనే పుష్కరుణ్ణి తనప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.

యముడు భటులవంక కోపంగాచూచి- “ఓరీ భటులారా! 
పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీనుకువచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణకిపోయిరి.

యమధర్మరాజు పుష్కరునివై పు జూచి నమస్కరించి, జరిగిన పొరపాటుకు క్షమించమనికోరి "భూలోకముసకు వెళ్లుడు" అని చెప్పెను. జరిగిన పారపాటునకు 
పుష్కరుడుకూడా విచారించి, "సరే వచ్చిన వాడను ఈ యమలోకమునుకూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.

పుష్కరుడు ఒక్కొకదిశకు పోయు నరులు పడుచున్న నరక బాధలను చూడసాగాను. జీవులు వారు చేసుకొన్న పనులను బట్టి అనేక విధముల శిక్షాల ననుభవించు చుండుట పుష్కరుడు కనులారా గాంచెను.అతనికి అమితమగు భయముకలిగెను, తన భయము బోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పావజీవులు తమతమ పాపములను పోగొట్టుకొను చుండిరి, వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక భాధలను చూచి వచ్చినందువలన పుష్కరుడు మరింత జ్ఞానంతో స్మరించుచుండెను.

ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్తవిని రామచంద్రుడు యముణ్ణి ప్రార్ధించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.  అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యనేర్పిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమవలన తిరిగి బ్రతికించెను.


Raja Syamala Devi - శ్యామల నవరాత్రులలో తొమ్మిదవ రోజు రాజ శ్యామలా దేవి లేదా రాజ మాతంగి

శ్యామల నవరాత్రులలో తొమ్మిదవ రోజు రాజ శ్యామలా దేవి లేదా రాజ మాతంగి

శ్యామల నవరాత్రులు (మాఘ గుప్త నవరాత్రులు) 9వ రోజున "రాజ మాతంగి" లేదా రాజశ్యామల దేవిని పూజిస్తారు. మాఘ శుద్ధ నవమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి, శ్యామలా దేవి రూపంలో ఆరాధించడం వల్ల వాక్సిద్ధి, విద్యాభివృద్ధి, శత్రు జయం, కోరిన కోర్కెలు నెరవేరడం వంటి 9 మహా వరాలు లభిస్తాయని నమ్మకం.

ఆమె కళలు, సంగీతం, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ దేవితో కూడా సంబంధం కలిగి ఉంది.

మాతంగ మహర్షికి పుత్రికగా, ఒక గిరిజన కన్య రూపంలో పుట్టిందని పురాణాలు చెబుతాయి. అడవులు, వేట, అరణ్యాలు మరియు పక్షులతో (ముఖ్యంగా చిలుకలు, మైనాలతో) ఈమెకు విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే ఈమెను ప్రకృతికి చిహ్నంగా కూడా పూజిస్తారు.

మాతంగి దేవతను సరస్వతీ దేవి యొక్క తాంత్రిక రూపంగా భావిస్తారు. అందుకే రాజశ్యామల దేవిని ఆరాధించిన వారికీ రాజయోగం, జ్ఞానశక్తి, విద్యాప్రాప్తి కలుగుతాయని చెబుతారు.

శ్యామలా దేవిని దేవి మాతంగి, రాజ మాతంగి, శ్రీ రాజ శ్యామల, మహా మందిరిణి అని కూడా అంటారు.

బ్రహ్మాండ పురాణం ప్రకారం.. లలితా త్రిపుర సుందరి దేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో తన సైన్యంలో శ్యామల దేవిని ప్రధాన మంత్రిణిగా నియమిస్తుంది. రాజ్యపాలన, రక్షణ బాధ్యతలను శ్యామల దేవికే అప్పగిస్తుంది. భండాసురుడి తమ్ముడైన విశుకృడి సైన్యాన్ని శ్యామల దేవి తన గానం, బుద్ధిబలం, వ్యూహంతో జయించి అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది. అప్పటి నుంచే శ్యామల దేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు జరపడం ఆచారంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.

రాజ శ్యామలా దేవి మూడు కళ్ళను కలిగి ఉన్న శక్తివంతమైన దేవత. ఆమె మాతంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. నీల-మేఘ లేదా నీళ్లను మోసుకెళ్లే చీకటి మేఘాలను పోలిన ఆమె రంగుతో, మూడు కన్నుల దేవత అందం మాటల్లో చెప్పలేనిది.


శ్యామల దేవిని పూజిస్తే
శ్యామల దేవి సరస్వతి దేవి స్వరూపంగా భావించబడుతుంది. అందుకే ఆమె చేతిలో వీణ ఉంటుంది. ఈమెను భక్తితో పూజిస్తే, వాక్చాతుర్యం సంగీతం, సాహిత్యం, లలిత కళల్లో ప్రావీణ్యం, లభిస్తాయని విశ్వాసం.

శ్యామల దేవి ఉపాసన వల్ల లభించే ఫలాలు
గుప్త నవరాత్రుల్లో శ్యామల దేవిని ఉపాసించిన వారికి సకల విద్యల్లో ప్రావీణ్యం, ఉద్యోగంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి లభించడం కొత్త ఉద్యోగాలు, పదవులు, రాజకీయాల్లో, పరిపాలన రంగాల్లో ఎదుగుదల, వంటివి కలుగుతాయని నమ్మకం ఉంది. అందుకే ఉన్నత పదవులు ఆశించే వారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులను విశేషంగా పాటిస్తారు. యజ్ఞయాగాదులు వంటి క్రతువులు కూడా నిర్వహిస్తారు.

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...