Friday, March 20, 2026

Himawatparvatam - medicinal properties - హిమవత్పర్వతం - ఓషధులు

హిమవత్పర్వతం - ఓషధులు

హిమవత్పర్వతం అత్యంత మనోహరమైంది. భారతదేశానికి అది ఉత్తరభాగంలో వేల యోజనాలు వ్యాపించి వుంటుంది. ఎందరో సిద్దులకి, ఋషులకి, మునులకి అది నివాస స్థానం. ఎన్నో దివ్యనదులు ఆ పర్వతం నుంచే ఆవిర్భవించాయి. ఆకాశాన్నంటే వృక్షాలతో సుందరమైన వనాలతో ఆదివ్య పర్వతం ఎందరినో ఆకర్షిస్తూ వుంటుంది.

అటువంటి ఆ హిమవ
త్పర్వతం మీద ఒక మనోహరమైన ప్రదేశం వుంది. అక్కడికి సామన్యులెవరూ చేరుకోలేరు. అయితే అదృష్టవశాన మహావీరుడైన మద్రదేశరాజు పురూవరుడు మాత్రమే అక్కడికి చేరుకోగలిగాడు. ఆ దుర్గమమైన ప్రాంతం నుంచే శ్రేష్టమైన 'ఇరావతీ' నది ప్రభవించింది. ఎన్నో వృక్షాలతో, గుబురైన పొదలతో నిండిన ఆ ప్రదేశం దట్టమైన కారుమబ్బుల్లాగా కనిపిస్తుంది.

ఇరావతీనది జన్మస్థానమైన ఆ ప్రాంతం వివిధరకాల అద్భుతమైన దివ్యౌషధులకి నిలయం. అక్కడ సాలతాటి, తమాల, కర్ణికార, శాల్మల (బూరుగు), న్యగ్రోధా (మరి), అశ్వద్ధ (రావి), శిరీష (దిరిసెన), శింశుపా (అగరు), శ్లేష్మాతకామలక(ఉసిరిక), హరీతక(కరక), విభీతక(తాడి), భూరముంజక, బాణ (ఈ రెండూ నదీతీరంలో మొలిచే గడ్డి విశేషాలు), సప్తచ్చద (ఏడు ఆకులువుండే చెట్టు), మహానింబ (పెద్దనిమ్మ) నిబనిర్గుండీ, హరిద్రుమ, దేవదారు, కాలేయక, పద్మక, వందన, బిల్వ, కపిత్థ(వెలగ), రక్తచందన, వాతామ, రిష్టకా, క్షీరా,శ్వకర్ణా, అర్జున(మద్ది) హస్తికర్ణ, సువనస వృక్షాలున్నాయి.

వీటితోపాటు ఓషధీప్రభావం కలిగిన కోవిదార, ప్రాచీనామలక, మధూక(విప్ప), పరాటక, ఖర్జూర, నారికేళ, ప్రియాళ్వామ్రాతక, తంతుమాలధవ, భవ్య, కాశ్మీర పర్ణి, జాతీఫల(జాజికాయ), పూగఫల (పోక) కల్ఫల, సల్లకీ ఫల, మందార, కింసుక, కుసుమాంశుక, పలాశ(మోదుగు), శాల్మలీభేద (మరొకరకమైన బూరుగ), వేతస(మెట్టప్రబ్బలి), జలవేతస (నీటి ప్రబ్బలి), రక్తాంగ,సారంగ హింస(ఇంగువ) ప్రియాంగు, రక్తాశోక, అశోక, కురుక, భువిరూఢక, ముచుకుంద, కుందకోట, రూషక, కింకరాత, కిరాతకేతక(నీటి మొగలి), వనకేతకి(అడవి మొగలి), శోభాంజనాంజన, కుశలంగ, నిచోళక, పర్ణాక, శయనాసన అనే వృక్షాలున్నాయి.

ఈ పర్వతం మీద అందమైన పూలని ఔషధాలుగా పనికివచ్చే ఫలాలని ఇచ్చే మరికొన్ని చెట్లున్నాయి. అవి-ఆసన, మన్మథశరాకార, మనోరమ, సహకార (రసాలం అనే మామిడి) పీతమయూధికా, వల్మీక, శ్వేతయూధికా, జాతీ(జాజి), చంపక (సంపెంగ), తుంబక, తిల, బిల్వ, కుసుంభక (నూనెని ఇచ్చే కుసుమపువ్వు), సుష్మచరణ, వరుణ, కామ వల్లభ, పుష్పాంకుశ, వకుళపారి, భద్రహరిద్రక, ధారాకదంబ, కుటజ, కదంబ, గిరికుటజ (కొండగోగు), సమాక్రాంత, కకుభ, పాలీవన, దాడిమ(దానిమ్మ) ద్రుమచంపక, బంధూక, పాటల, కరవీర, కురవక హిమమంజీర అనేవి. 

ఆ పర్వత పరిసరాల్లోనే జంబూ(నేరేడు), మృదుజంబూ, బీజపూర, కర్పూరాగరు, బంబ(దొండ) సంతానక, వితానక, హింతాలధన్విక, తృణశూన్య, కరీషశాక (నాగ) మదన (ఉమ్మెత్త) పీలుధాతకీ (ఆరె) చిరిబిల్వవాలుక, తింత్రిణీ (చింత) లోధ్ర, విడంగ, క్షీరికా, అంకోల (ఊడుగ) మధుక, భల్లాతక (జీజి) వల్మీక, సిందువార, సుకేసర, నాగకేసర, కరమర్దక, రుద్రాక్ష, ద్రాక్ష, నింబ, పుత్ర జీవక (గారకాయ) తక్కోల వృక్షాలున్నాయి.

ఓషదీగుణాలు కలిగిన మరికొన్ని తీగలతో కూడిన గుబురు పొదలలాంటి జాతులు కూడా వున్నాయి. అవి - పిప్పలీ, నాగవల్లి(తమలపాకు), మరీచ(మిరియం), పద్మ, వనమాలికా, మృద్వీకా(ద్రాక్షా), అతి ముక్తక, వకుళ(పొగడ), సఫల, వక్రకీ, కూష్మాండ (బూడిద గుమ్మడి) పటో(పొట్ల) లాలాబు (సొర), చిరంట, కారవేల్ల (కాకర), కర్కోటక, వార్తాకి(పందిలివంగ), బృహతీఫల, రాజమాషా, అతసీ(బొబ్బర- అవిసె), కంద, విదారీ, కరోట, కాకోలీ, క్షీరకాకోలీ, చక్రకవంటి వృక్షాలు, శాక, శాలి, కాలశాక, శింబి వంటి ధాన్యవిశేషాలు ఇంకా దీర్ఘాయువునిచ్చే ఎన్నో రకాల ఓషధులు హిమవ
త్పర్వతం మీద వివిధ ప్రాంతాల్లో నెలకొన్నాయి. అయితే ఇవన్నీ అందరికీ కనిపించవు. కొన్ని దుర్గమమైన ప్రాంతాల్లోనే పెరుగుతాయి కనుక.

కైలాసపర్వత వర్ణన

No comments:

Post a Comment

Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  శంఖచూడుడి పూర్వజన్మ పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృ...