ఓ పుణ్యాత్మా! భగవంతుడు విష్ణుమూర్తి మానవాకారంతో ఆ యదువంశంలో జన్మించాడు కాబట్టి యదువంశ చరిత్ర వినిన చదివిన ఆ నరుడు జననమరణాలనుండి విడివడి ముక్తిని పొందుతాడు. ఓ నరేంద్రా! ఆ అసమాన మహిమగల విష్ణుమూర్తి నరాకృతిని పొందిన విషయాన్ని వీనులవిందుగా చెబుతాను విను.
యదువునకు సహస్రజిత్తు క్రోష్టువు, నలుడు, రిపుడు అనేవారు నలుగురు జన్మించారు. అందులో పెద్దకొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు పుట్టాడు, ఆ శతజిత్తునకు మహాహయుడు, వేణుహయుడు, హేహయుడు అనేవారు ముగ్గురు జన్మించారు. అందులో హేహయుడు అనేవానికి ధర్ముడు, అతనికి నేత్రుడు, అతనికి కుంతి, వానికి మహిష్మంతుడు, అతనికి భద్రసేనుడు, వానికి దుర్మదుడు, వానికి ధనికుడు, ఆ ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని కృతకర్మ, కృతౌజుడు అనే నలుగురు కలిగారు. అందులో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. ఆ అర్జునుడు తనయొక్క గొప్ప బుద్ధివైభవంతో
ఓ రాజవరేణ్యా! కార్తవీర్యుడనే పేరుగల అర్జునుడు శ్రీహరి అంశతో జనించిన దత్తాత్రేయుని పూజించి, సిద్దులుపొంది, ఎన్నో యజ్ఞదాన తపస్సులుచేసి, దిక్కులన్నీ జయించాడు. అన్నివేళలా హరికీర్తనం గావిస్తూ ధనాన్ని సంపాదిస్తూ దానధర్మాదులు చేస్తూ ఎనబై ఐదువేల సంవత్సరాలు భూమండలాన్ని తన పేరు మారుమ్రోగేలా పరిపాలించాడు. కార్తవీర్యునివలె భూమిని పరిపాలించిన రాజును మనం ఎక్కడా చూడబోము.
ఆ కార్తవీర్యార్జునకుగల వేయిమంది సుతులలో పరశురాముని బారినుండి తప్పించుకొని జయధ్వజుడు, శూరసేనుడు, వృషణుండు, మధువు, ఊర్జితుడు అనేవారు ఐదుగురు బతికారు. జయధ్వజుడికి తాళజంఘుడు, తాళజంఘునికి ఔర్వముని తేజస్సువల్ల నూరుగురు కొడుకులు కలిగారు. అందులో మొదటివాడు వీతిహోత్రుడు. మధువునకు వృక్ణుడు, వృక్ణునికి నూరుగురు సంతానం కలిగారు. అందులో ప్రథముడు వృష్ణి. మధు, వృష్ణి, యదువుల వంశాలవారు మాధవులు, వృష్ణులు, యాదవులని పిలువబడ్డారు. యదుపుత్రుడు క్రోష్టువు, అతనికి వృజినవంతుడు, వానికి శ్వాహితుడు, అతనికి భేరుశేకుడు, వానికి చిత్రరథుడు, చిత్రరథునికి శశిబిందుడు జన్మించారు.
అందమైన స్త్రీలు పదివేలమంది భార్యలతో క్రీడలలో తేలియాడుతూ, పదివేల లక్షలమంది కుమారులు భక్తితో గారవిస్తుండగా, పదునాలుగు రత్నాలతో సప్తద్వీపాధిపతియై, యోగివలె, గొప్ప నీతిగల శశిబిందుడు, నిండుచందమామవలె ప్రకాశించాడు.
శశిబిందుని కుమారుల మొత్తంలో ముఖ్యులైన ఆరుగురిలో, పృథుశ్రవుడు అనేవానికి ధర్ముడు జన్మించాడు. ధర్మునికి ఉశనుడు కలిగాడు. ఈ ఉశనుడు నూరు అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ ఉశనునికి రుచకుడు, రుచకునికి పురుజిత్తు, రుక్ము డు, రుక్మేషువు, పృథువు, జ్యామఖుడు అనేవారు ఐదుగురు జన్మించారు. వారిలో జ్యామఖుడనేవాడు
జ్యామఖుని భార్య శైబ్య. ఆమెపై గాఢమైన ప్రేమ కలిగి ఉన్నాడు జ్యామఖుడు. అతనికి శైబయందు సంతానం లేకపోయినప్పటికి మఱొక భార్యను స్వీకరించలేదు. కొంతకాలం తరువాత శత్రువుల ఇంటినుండి ఒక కన్యను తన రథంమీద బలవంతంగా తీసికొని వచ్చాడు. కన్యను రాజును రథంమీద ఉండటం శైబ్య చూచింది. మోసగాడా! నేనుండగానే నీవు మరొక రమణిని రథంమీద తీసికొని వస్తావా అంటూ భర్తను పరుషాలు పలికింది. ఓ శైబ్యా! ఈమె నీకు సవతి కాదు. కోడలు. ఇది నిజం. నన్ను నమ్ము అన్నాడు జ్యామఖుడు.
శైబ్య కొడుకును కంటుందనే విషయం ఆ సమయంలో తెలిసికొని విశ్వే దేవతలు, పితృదేవతలు ఆనందించారు. వారి దయతో, తనకు సవతిని కోరనిభర్త జ్యామఖుడు తనతో కలియగా శైబ్య విదుర్భుణ్ణి కన్నది. కొడుకును కని జ్యామఖుడు తాను పూర్వం రథంపై తెచ్చిన కన్యను అతనికిచ్చి వివాహం చేశాడు.
విదర్భునకు ఆ కన్యయందు కుశుడు, క్రుథుడు, రోమపాదుడు జన్మించారు. రోమపాదునకు బభ్రువు, బభ్రువుకు విభువు, విభువునకు కృతి, కృతికి ఉశికుడు, ఉశికునకు చేది, చేదికి చైద్యాదులు జన్మించారు.
క్రుథునకు కుంతి, కుంతికి ధృష్టి, ధృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుడు, దశార్హునకు వ్యోముడు, వ్యోమునకు జీమూతుడు, జీమూతునికి వికృతి, వికృతికి భీమరథుడు, భీమరథునికి నవరథుడు, నవరథునికి దశరథుడు, దశరథునికి శకుని, శకునికి కుంతి, కుంతికి దేవరాతుడు, దేవరాతునికి దేవక్షత్రుడు, దేవక్షత్రునకు మధువు, మధువుకు కురువశుడు, కురువశునకు అనువు, అనువునకు పురుహోత్రుడు, అతనికి అంశువు, అతనికి సాత్త్వతుడు, సాత్త్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్టి, దేవాపృథుడు, నందకుడు, మహాభోజుడు అనే ఏడుగురు జన్మించారు.
వారిలో భజమానునికి మొదటి భార్యయందు నిమ్రోచి, కంకణుడు, వృష్ణువు అనే ముగ్గురూ, రెండవ భార్యయందు శతజిత్తు సహస్రజిత్తు అయుతజిత్తు అనే ముగ్గురు పుట్టారు. అందులో దేవాపృథువునకు బభ్రువు పుట్టాడు. తండ్రీకొడుకులైన దేవాపృథువు, బభ్రుడు అనే వీరిరువురి గొప్పతనం పెద్దలు శ్లోకరూపంగా పఠిస్తూ ఉంటారు. ఆ శ్లోకార్థం ఏమంటే
దూరంగా ఉండి ఏది వింటామో దగ్గరకు రాగా దానినే చూస్తాం ఓ రాజా! విను. మానవులలో బభ్రువుకంటె గొప్పవాడు లేడు. స్వభావంలో దేవాపృథునికి సాటి మరొకడు రాడు.
బభ్రుడు, దేవాపృథువు ఇరువురు యోగవిద్యను బోధించిన కారణంగా, పదునాల్లువేల అరవై ఐదుమంది మానవులు ముక్తి పొందారు.
మహాభోజుడు మిక్కిలి ధర్మాత్ముడు, అతని వంశంవారంతా భోజులని పిలువబడ్డారు. వృష్టికి సుమిత్రుడు, యుధాజిత్తు జన్మించారు. యుధాజిత్తునకు శిని, అనమిత్రుడు జనించారు. అనమిత్రుడికి నిమ్నుడు, నిమ్నునికి సత్రాజితుడు, ప్రసేనుడు అనువారిరువురు పుట్టారు. అనమిత్రునకు శిని అనేవాడు మరొకడున్నాడు. అతని కొడుకు సత్యకుడు అతనికి యుయుధానుడనబడే సాత్యకి, సాత్యకికి జయుడు, జయునికి గుణి, గుణికి యుగంధరుడు జన్మించారు.
అనమిత్రునికి పృశ్ని అని వేరొక కొడుకున్నాడు. ఆ పృశ్నికి శ్వఫల్కుడు, చిత్రకుడు జన్మించారు. శ్వఫల్కునకు గాందిని అనే ఆమెయందు అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు దృష్టవర్ముడు, క్షత్రోపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అనే పండ్రెండు మంది కొడుకులు, సుచారువనే కూతురు జన్మించారు.
వాళ్ళలో అక్రూరునికి దేవలుడు, అనుపదేవుడు జన్మించారు. చిత్రునకు పృథుడు, విదూరథుడు మొదలైన చాలమంది వృష్ణివంశం వాళ్ళు అయ్యారు. భజమానుడు, కుకురుడు, శుచి, కంబళ, బర్హిషుడు అనే నలుగురు అంధకునికి పుట్టారు. కుకురుడికి వృష్ణి వృష్ణికి విలోమ తనయుడు, విలోమ తనయునికి కపోతలోముడు, కపోతలోమునికి తుంబురుని మిత్రుడైన అనువు, అనువునకు దుందుభి, దుందుభికి దవిద్యోతుడు, దవిద్యోతునికి పునర్వసువు, వానికి ఆహుకుడు అనే కొడుకు ఆహుకి అనే కన్య జన్మించారు.
ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అనేవారు ఇద్దరు జన్మించారు. వీరిలో దేవకునికి దేవలుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే నలుగురు జన్మించారు. ఈ నలుగురికి ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే ఏడుగురు తోబుట్టువులు కలిగారు.
ఓ రాజా! సాటిలేని సుందరాకారలు, చిగురుటాకులవంటి చేతులు గలవారు, పద్మాక్షులు అయిన దేవకి మొదలయిన ఏడుగురిని వసుదేవుడు పెండ్లాడాడు.
ఉగ్రసేనునికి కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతు అనే కొడుకులు, కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలిక అనే కూతులు జన్మించారు. ఈ నలుగురు వసుదేవుని తమ్ముని భార్యలయ్యారు.
భజమానునికి విదూరథుడు, విదూరథునికి శిని, శినికి భోజుడు, భోజునికి హృదికుడు, హృదికునకు దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనే కొడుకులు కలిగారు. ఆ దేవమీఢుడు శూరుడని పిలువబడతాడు. శూరునికి మారిష అనే భార్యవల్ల వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనే పదిమంది కుమారులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శుతశ్రవస, రాజాధిదేవి అనే ఐదుగురు కొమరితలు పుట్టారు. అందులో
No comments:
Post a Comment