రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తోంది.
ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.
ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు వనవాసం, రావణుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీ సీతారాములోరి కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలా మంది నమ్మకం.
రామాయణం ప్రకారం కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై ఓ పాయసం ఉండే పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.
రాముడి జననం:
ఛైత్ర మాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరామ నవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికీ చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు మహారాజు. వీరిలో రఘు మహారాజు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు.
శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట మీద నిలబడ్డ వ్యక్తి కాబట్టే రాముడిని రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు తదితర పేర్లతో పిలుస్తారు.
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే‘
అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్మకం.
శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది
నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసిన మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్దం లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబటి, వీటిని శ్రీ ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బటి నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరలాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.
పానకం విషువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉషాన్ని తగించి, చలవ చేస్తుంది. జీరశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండలో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.
రామకోటి
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు.
సమస్త పాపాలను హరించివేసి, సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది. రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.
శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు ... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు.
జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం.
కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి
రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి? అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్ లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి. సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.
అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.
ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో సమర్పించండి.
ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు. శుచిగా లేని సమయాల్లోను ... మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

No comments:
Post a Comment