గత మహాకల్పంలో, నేను 'ఉపబర్హణుడు' అనే పేరుతో గంధర్వగణంలో పుట్టి, చెలువంతో, తియ్యనైన లోతైన ప్రవృత్తితో, సుందరీమణులకు ప్రేమాస్పదుడనై విహరిస్తుండగా, ఒకనాడు విశ్వకర్తలయిన ప్రజాపతులు దేవసత్రమనే యజ్ఞంలో శ్రీహరికథల గానంకోసం అప్సరసలను, గంధర్వులను పిలువగా,
రాజా! నేనూ గంధర్వులతో ఆ యజ్ఞాలకు వెళ్లాను. అక్కడ కొన్ని విష్ణుకీర్తనలను పాడుతూ అక్కడి యువతుల మోహానికి గురి అయి, పక్కకు తొలగి వెళ్లాను.
నేను యువతుల పొత్తుతో, ఆ ప్రజాపతులను పట్టించుకొనక, తొలగివచ్చిన తీరును వారు తెలిసికొని, మహారోషంతో నన్ను శపించారు.
'ఈ యాగ భూమిలో శ్రీహరిని కీర్తింపక కాముకురాండ్ర గుంపుతో కలసి, వెళ్ళిపోయిన పాపఫలితంగా, కాంతి హీనుడవై, భూమండలాన శూద్రజాతి వనితకు కొడుకువు కమ్ము.'
('నారదుని పూర్వజన్మ వృత్తాంతకారణము' ఇక్కడ చెప్పబడింది. జన్మకర్మములు నారదునికైనా తప్పదని తెలిపే నారదుని పూర్వజన్మ కథ.)
ఆ శాపవశాన, భూలోకాన ఒక బ్రాహ్మణ దాసికి కొడుకుగా పుట్టాను, ఆ సమయంలో అక్కడ బ్రహ్మవాదులైన పెద్దలకు సేవచేసిన భాగ్యానికి బదులుగా ఈ మహాకల్పంలో బ్రహ్మదేవుని కొడుకుగా పుట్టాను.
రాజా! గేస్తు ఏ ధర్మాచరణతో నేర్పుగా, మోక్షమార్గాన్ని అందుకొని ప్రయాణిస్తాడో, అటువంటి ధర్మప్రకారమంతా నీకై అతి స్పష్టంగా నేను వివరించాను.
విశ్వానికి ఆధారమై నిలిచి, బ్రహ్మాదులకూ అలభ్యుడైనవాడు; స్వయంగా పరబ్రహ్మస్వరూపుడు విష్ణువు. అట్టి హరిని నీవు నీ యాగసందర్భాన అర్చించావు. అర్చనకు పాత్రమగుటే కాదు, నీయింట నున్నాడు. మానవాకృతితో నీ సేవలందుకున్నాడు. నీకు స్నేహితుడతడు; నిర్వాహకుడూ అతడే. నీ మనస్సున కెక్కినవాడు; నీకు బంధువు; నీకు మంత్రి కూడ. ఈ అన్ని విధాలుగా దేవుడు నీకు సుఖశాంతులు కల్పించాడు. రాజా! నీ మహిమ గొప్పది; విచిత్రమైనది కూడా.
నారదుడు పల్కిన సకల వృత్తాంతమూ విన్న ధర్మరాజు, ప్రేమతో పొంగిపోయి, తనముద్దుల మరదియైన దేవదేవుని, వాసుదేవుని అర్చించాడు. అనంతరం వారిరువురూ కలిసి దేవమునిని పూజించారు; అతడూ సంతుష్టుడై ఆకాశమార్జాన వెడలిపోయాడు. అని శుకయోగి, పరీక్షిత్తునకు చెప్పాడు-అని సూతుడనే కథకుడు శౌనకాది మునులకు నైమిశారణ్యాన చెప్పాడు. చెప్పగా (....అనంతరకథకు ప్రారంభం)
రాజీవసదృశలోచన!, రాజీవభవాధిదేవ రాజవినుత! వి,
భ్రాజితకీర్తిలతావృత, రాజీవభవాండభాండ! రఘుకులతిలకా!
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయకాంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
నిరుపమనయకాంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
పద్మాలవంటి కన్నులుకలవాడా! బ్రహ్మ మొదలైన దేవతలచే స్తుతింపబడినవాడా! ప్రకాశించే కీర్తి అనే లతలచే కప్పబడిన బ్రహ్మాండభాండాలు కలవాడా! రఘుకులశ్రేష్ఠా!
సీతాదేవితో క్రీడించుటలో ఆసక్తి కలిగినవాడా! ధర్మమార్గాన్ని అనుసరించేవాడా! అనుపమన్యాయప్రియా! అసురమర్దనా! గురువులకూ, పండితులకూ సుఖాన్ని ఇచ్చేవాడా! భూచక్రాన్ని ధరించేవాడా! దేవతల భయాన్ని దూరం చేసేవాడా! పండితుల మనస్సుల్లో సంచరించేవాడా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
సీతాదేవితో క్రీడించుటలో ఆసక్తి కలిగినవాడా! ధర్మమార్గాన్ని అనుసరించేవాడా! అనుపమన్యాయప్రియా! అసురమర్దనా! గురువులకూ, పండితులకూ సుఖాన్ని ఇచ్చేవాడా! భూచక్రాన్ని ధరించేవాడా! దేవతల భయాన్ని దూరం చేసేవాడా! పండితుల మనస్సుల్లో సంచరించేవాడా!
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
No comments:
Post a Comment