గుత్తికొండ బిలం
గుత్తికొండ బిలం, కొండల నడుమ పకృతిశోభతో బిలం ప్రసిద్ధక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. పూర్వం ముచికుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ప్రజావిశ్వాసం. దీనికి దక్షిణకాశి అనే పేరు ఉంది. ఈ గుత్తికొండ బిలం మాచర్ల - నర్సరావుపేట రహదారి పై ఉంది. మాచర్లకు 65 కి.మీ. కారంపూడికి 30 కి.మీ. నర్సరావు పేటకు 30 కి.మీ. దూరంలో ఉంది.
చరిత్ర
గుత్తికొండబిలం (గుహ) పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం. 13వ శతాబ్దంనాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంది. ఈ పుణ్యక్షేత్రం.సా.శ. 1754వ సంవత్సరంలో స్వయంప్రకాశఅవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణకాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడు. పురావస్తువారి అన్వేషణలో అలనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం ఇక్కడ లభించగా, దానిని హైదరాబాదు పురావస్తుశాలలో పదిలపరిచారు. బిలంలో 101 సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతుంది. కార్తీకమాసంలో జిల్లా నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలి వచ్చి, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
బిలం విశేషాలు
ఈ బిలం ప్రకతి సహజ సిద్దంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామిని దర్శిస్తారు. తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ జలాలు ఎక్కడనుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ జలాలు ఎప్పడు ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి.
ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే బిలమహొత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ బిలానికి మరో ప్రత్యేకత ఉంది ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. నూటొక్క సొరంగాలున్న ప్రాంతం, రహస్యాలకు కేంద్రబిందువుగా ఉంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలు ఉన్నాయి. పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం.
భారతమాత ఆలయం
ఈ బిలం దగ్గర భారతమాత అరుదైన ఆలయం ఉంది. చాగల్లు (నకిరికల్లు) కు చెందిన ఆలపర్తి గోవర్ధనమ్మ 2008లో ఈ ఆలయాన్ని కట్టించింది.
ఉద్యమవేదిక
ఆధ్యాత్మకంగా, పర్యాటక కేంద్రమైన గుత్తికొండ బిలానికి ఉద్యమవేదికగా కూడా పేరుంది.
రోడ్డు మార్గం
ప్రకృతి రమణీయతతో అలరించే ఈ బిలానికి రావాలంటే శ్రమించక తప్పదు. మాచర్ల లేదా నర్సరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తరువాత అక్కడ అందుబాటులో ఉంటే ఆటో మాట్లాడుకొని ఈ బిలానికి చేరుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
Sri Sita Rama Kalyanam - శ్రీ సీతారాములోరి కళ్యాణం
శ్రీ సీతారాములోరి కళ్యాణం రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment