Sunday, March 29, 2026

Devayani Engagement With Yayati - దేవయాని యయాతిని వరించుట

దేవయాని యయాతిని వరించుట

యయాతి మహారాజు దేవయానికి 
చూచి ముందుగా తన పై బట్టను ఇచ్చి, ఏడు సముద్రాలు ఒడ్డాణంగా చుట్టుకొని ఉన్న భూమి అనే కన్యను రక్షించడంలో సామర్థ్యంగల తన కుడిచేతిని ఆలంబనంగా ఇచ్చి, స్వేదంతో ఒడలంతా తడిసినది, సఖీజనులకు కామధేనువు వంటిదైన భృగువంశంలో జన్మించిన దేవయానిని నూతినుండి పైకి తీశాడు.

(సర్వం సహత ఇతి సర్వం సహా. సర్వమునూ సహించునదికనుక భూమికి ఈ పేరున్నది.)

ఈ విధంగా తనను నూతినుండి బైటకు తీసిన యయాతి మహారాజుతో చంద్రముఖి దేవయాని ఇలా అన్నది.

ఓ రాజా! ఈ నూతిలోనుండి నన్ను పైకి తీస్తూ నీవు నా కరగ్రహణం చేశావు. నీవే నా భర్తవు. ఇది దైవికమైన యోగం. పురుష ప్రయత్నానికి కూడా నా వాక్యం సిద్ధమైనదే. సర్వసుఖాలకు నిలయమైన నిన్ను వదిలి వేరొక వరుణ్ణి నేను కోరుకుంటానా? పద్మాల మకరందాన్ని తాగ మరగిన తుమ్మెద మరొక పుష్పమకరందాన్ని కోరుకోదు కదా!

అంతేకాక, ఓ గుణవంతుడా! వినుము. నేను శుక్రాచార్యుని కూతురు అయిన దేవయానిని. పూర్వం బృహస్పతి కుమారుడు కచుడు మా తండ్రి వద్ద మృతసంజీవని విద్య అభ్యసించే సమయంలో, నేను అతనిని కామించాను. అతడు అంగీకరించని కారణంగా అతడు నేర్చిన మృతసంజీవనీ విద్య నశించిపోవాలని నేను శపించాను. అతడు నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండా పోతాడు అని శపించాడు. ఆ కారణంగా నాకు బ్రాహ్మణుడు ప్రాణనాథుడు కాడు. నీవే నా పతివి అని పలుకగా తాను దేవయానిపై మనసు పడి తొందరపాటు ఏమాత్రం లేకుండా ఆలోచించి

దైవయోగం కాకపోతే, నా మనస్సు బ్రాహ్మణసుతను వరిస్తుందా? ఈశ్వరాజ్ఞ కూడా ఈ విషయంలో ఇలాగే ఉంది కాబోలు! అని భావించి రాజైన యయాతి దేవయానిని వరించాడు. ధీరబుద్ధులకు చేయవలసిన పనులు చేయకూడని పనులు అనే సందేహం కలిగినప్పుడు వారి వారి మనస్సులే అందుకు ప్రమాణం.

ఈ విధంగా యయాతి వరించి వెళ్ళిన తరువాత దేవయాని తండ్రివద్దకు వచ్చి శర్మిష్ఠ అన్నమాటలు చేసిన చేష్టల సమాచారం అంతా చెప్పి విలపించగా

క్రూరాత్ముల ఇళ్ళలో పురోహిత వృత్తి చేస్తూ జీవనం సాగించడంకంటె పావురాలలాగా రాళ్ళు తిని బతకడం ఇంతకంటె చాలా ఉచితంగా ఉంటుంది.

(పావురాలు ఆహారం జీర్ణం అవడానికి గులకరాళ్ళు తింటాయని ప్రతీతి. పావురాలలాగా బతకడం అంటే దేనినీ ఆశించక ఏది దొరికితే దాన్ని తిని జీవించడం అని భావం.)

ఈ విధంగా వృషపర్వునివద్ద ఉండడం తప్పని భావించి శుక్రాచార్యుడు తన కొమార్తెను తీసికొని వృషపర్వపురాన్ని వదిలి వెళ్ళుతూ ఉండగా, ఈ విషయం తెలిసిన వృషపర్వుడు శుక్రాచార్యుని వలన మాత్రమే దేవతలను గెలవగలం అని తెలిసినవాడు కాబట్టి శుక్రాచార్యుని దారి కడ్డుపడి పాదాలపై బడి శుక్రాచార్యుణ్ణి ప్రసన్నం చేసికోగా, కోపం విడిచిన శుక్రాచార్యుడు శిష్యుడైన వృషపర్వునితో ఇలా అన్నాడు.

కూతురైన శర్మిష్ఠ తన చెలికత్తెలు వేయిమందితో నా కూతురికి దాస్యం చేస్తే నా కోపం తీరుతుంది. అలా చేస్తేనే నా కూతురుతో నీ రాజ్యానికి వస్తాను అనగానే వృషపర్వుడు సఖీబ్బందంతో కూడిన శర్మిష్ఠను దేవయానికి సేవ చేయడానికి వెంటనే నియోగించాడు.

తండ్రియైన వృషపర్వుడు తన్ను ఆదేశించగా, ఇంక పట్టుదల ఎందులకని నిష్ఠతో, సఖీజన సహస్రంతో, శర్మి
ష్ఠ కోపాగ్నిచే బాధపడుతూ, గర్వానికి నిలయమైన దేవయానిని సమీపించి ఆమె పగ చల్లారేలా ఆమెకు దాసి అయ్యింది.

అటు తరువాత, అతిశయించిన వేడుకతో వృషపర్వుని మంత్రియైన శుక్రుడు రాక్షస రాజు కొమార్తెతో కూడిన తన సుతను పిలిచి, ప్రీతితో, అధిక ఐశ్వర్య సంపన్నుడు, క్షత్రియుడు, నిర్భయుడు, సాధువిధేయుడు, అచ్చమైన కీర్తి గలవాడు దుష్టశత్రువుల పీచమణచ గలవాడు అయిన యయాతికిచ్చి పెండ్లి చేశాడు.

ఈ విధంగా యయాతికి శుక్రాచార్యుడు తన కొమార్తె అయిన దేవయానిని ఇచ్చి పెండ్లిచేసి, శర్మి
ష్ఠతో మాత్రం నీవు కలుసుకో కూడదు అని నిబంధన చేసి వెళ్ళిపోయాడు. పిదప ఆ దేవయాని యయాతివల్ల యదువు, తుర్వసుడు అనే కుమారులను కని, ఒకనాటి రాత్రి ఋతుమతియై బయట ఉండగా, శర్మిష్ఠ అదనుకోసం ఎదురుచూచి, ఒంటరిగా ఉన్న యయాతి దగ్గరకువచ్చి, మన్మథ ఆవేశానికి లోనై తన కోరికను తెలియజేయగా

శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Puru dynasty (Paurava dynasty) - పూరు వంశం చరిత్ర(పౌరవ వంశం)

పూరు వంశం చరిత్ర (పౌరవ వంశం) ఓ భరతవంశ సంభవా! పరీక్షిన్మహారాజా! పూర్వం మీది పూరు వంశమే. అటువంటి పూరువంశంలో జన్మించిన నీకు మీ పూర్వులు, చక్కని...