సద్గుణవిశిష్టుడైన అంబరీషుడు ఏడుదీవులతో కూడిన విశాలభూభారాన్ని తన భుజస్తంభాల పై మోసి శుభప్రాప్తితో రాజ్యవైభవ సంపద కలిగి కూడా చెడునడత లేకుండా నిత్యం విష్ణుపూజలతో కాలం గడపుతూ ఏమరుపాటు లేకుండా ఈ లోకంలో ప్రసిద్ధిని పొందాడు.
అంబరీషుడనే ఆ రాజచంద్రుని మనస్సు విష్ణుపదములందే. మాటలు విష్ణుగుణ కీర్తనమందే. చేతులు విష్ణ్వాలయం శుభ్రపరచడమందే. వీనులు హరికథలను వినడమందే. చూపులు విష్ణురూపదర్శనమందే. శిరస్సు హరినమస్కారమందే, పాదాలు విష్ణ్వాలయాలను చుట్టి రావడమందే. ఆసక్తి హరికైంకర్యమందే. స్నేహం వైష్ణవభక్తులతోనే. ముక్కు వైష్ణవ భక్తుల పాదపద్మములందే. నాలుక తులసీదళ సేవనమందే. కోరికలు పుణ్యకరమైన విషయాలందే ఉండేవి.
(పైన చెప్పినట్లేగాక) ఆ రాజు గొప్పవైభవంతో పుణ్యాత్ముడై యజ్ఞాలకు ప్రభువైన విష్ణువునుగూర్చి వసిష్ఠాదిమునులతో సరస్వతీనది ఒడ్డున భూరిసంభావనలిచ్చి అనేక అశ్వమేధయాగాలు చేశాడు. ఆ అంబరీషుడు మట్టి పెళ్లను బంగారాన్ని సమానంగా చూస్తూ, సర్వకర్మలు విష్ణుపరంగా చేస్తూ రాజ్యాన్ని పాలించాడు. విష్ణువునందు, విష్ణుభక్తులయందు మనసు లంకెపెట్టి తనకు విధించబడ్డ రాజ్యపాలనాకార్యాన్ని వదలిపెట్టకుండా రాజర్షిగా పేరుపొందాడు.
ఇంకా ఆ భక్తాగ్రేసరుడైన అంబరీషుడు
భగవద్భక్తుడైన ఆ రాజు 'హరి' అని తలుస్తాడు. హరి అని దర్శిస్తాడు. 'హరి' అని స్పర్శిస్తాడు. 'హరి'యని వాసనలు చూస్తాడు. హరియని 'రుచి' చూడాలనుకొంటాడు. హరిహరీ! ఆ మహాత్ముడైన అంబరీషుణ్ణి కొనియాడడం సులువైనపని కాదు.
పై చెప్పిన విధంగా (పంచేంద్రియ ప్రవృత్తి) భగవన్నిమగ్నుడు, పుణ్యాత్ముడైన ఆ రాజు మెల్లమెల్లగా పరిపాలనచేస్తూ ఉండగా
భగవదధీన మనస్కుడైన ఆ రాజుకు మెల్లగా గుర్రాలు, ఏనుగులు, సంపదలు, ఉద్యానవనాలు, సంతానం, బంధువులు, మిత్రులు, నగరం, అంతఃపురంవంటి భోగభాగ్యాలపట్ల ఆసక్తి తొలగిపోయింది.
ఆ తరువాత కొంతకాలానికి సంసారంపట్ల సంబంధాన్ని వదలుకొని, పవిత్రుడై ఏకాంతంలో భక్తిపారవశ్యంలో ఉండగా ఆ రాజర్షికి భక్తులపట్ల ప్రేమకలవాడైన హరి శత్రువులను శిక్షించేది, ఆత్మీయుల్ని రక్షించేది అయిన సమస్త విశ్వంలో ఎదురులేని చక్రాన్ని ఇచ్చి వెళ్ళాడు. తరువాత
ఓ రాజా! ఆ మహారాజు తనకు తోడు నీడవలె తనకు తగిన గుణ శ్రేష్ఠురాలైన పట్టపుదేవితో కలిసి, విష్ణువును గూర్చి ఒక సంవత్సరం పాటు ద్వాదశీవ్రతాన్ని చక్కగా చేశాడు.
ఈ విధంగా వ్రతంచేసి, వ్రతాంతంలో కార్తికమాసంలో మూడురాత్రులు ఉపవాసం చేశాడు. యమునానదిలో స్నానంచేసి, మధువనంలో మహాభిషేక పూజావిధానంతో అవసరమని విధింపబడిన అనేక వస్తువులను కలిగి, విష్ణుదేవుణ్ణి అభిషేకించి, మనోహరమైన గంధాలను సమర్పించి, కొంగొత్త సువాసనలు వెదజల్లే పూలతో పూజ చేశాడు. ఆ తరువాత
(ద్వాదశీవ్రత సమాప్తిలో చేయవలసిన విధివిధానం చెప్పబడింది. కార్తికమాసంలో మూడురాత్రుల ఉపవాసం, అనేకపరికరాలతో, గంధాలను, పువ్వులను సమర్పించడం అనేవి విధులు-ఉపవాసం అనగా ఉప= సమీపంలో, వాసం = వసించడం (ఉండడం) ఎవరికి? ఆ భగవంతునికి. అంతటా ఉండే ఆయనకు సమీపంలో ఎలా ఉండడం అనేది ప్రశ్న అంటే భగవచ్చింతన కలిగి ఉండడం. ఈ విధంగా వ్రతాన్ని రాజు పూర్తిచేశాడు.)
పాలు ఏరై ప్రవహిస్తుండగా తిరుగాడేవి, లేతవయసులో ఉండేవి, అందమైనవి, పోట్లమారితనం లేనివి, వెండితొడిగిన గిట్టలు గలవి, బంగారు కుప్పెలు కలిగిన పెద్దకొమ్ములతో ప్రకాశించేవి, దూడల మెడలను నాకుతూ ప్రేమగా చూచేవి, పలురంగులు కలిగినవి అయిన ఆరువందలకోట్ల ఆవులను వైదికశ్రేష్ఠులకు ఆ రాజు దానం చేశాడు.
(ఇవన్నీ మేలు జాతి ఆవుల లక్షణాలు. దానం ఇచ్చేటపుడు మంచిజాతి ఆవులను ఇవ్వడం ధర్మం. లేత వయసులో ఉండడంవల్ల సంతానోత్పత్తి కలవి కావడం, వెండి బంగారు తొడుగులచే ఆరాధింపబడినవైనం తెలుస్తోంది.)
వెంటనే ఆ రాజు చాలమంది బ్రాహ్మణశ్రేష్ఠులకు భక్తితో సంతృప్తిగా భోజనంపెట్టి, ఉపవాసం తర్వాత పారణ చేయడానికి పూనుకొన్నాడు.
ఆ సమయంలో వేదాలను ఆపోశన పట్టినవాడు, తపస్సంపన్నుడు, సాటిలేని యోగాభ్యాసనిపుణుడు, సూర్యునివంటి తేజస్సు కలవాడు అయిన దుర్వాసుడు ఆ రాజు ఇంటికి అతిథిగా వచ్చాడు.
అట్లావచ్చిన మునిని చూచి లేచి నిలబడి, ఆయన కూర్చోడానికి ఆసనం ఏర్పాటు చేసి, పాదపూజచేసి, క్షేమం అడిగి రాజు తన ఇంట్లో భోజనం చేయుమని ప్రార్ధించాడు. ఆ మహాత్ముడుకూడా సంతోషించి రాజుకోరికను ఒప్పుకొన్నాడు. ఆయన యమునానదికి వెళ్ళి స్నానంచేసి ధ్యానంచేస్తూ మునుగుతూ లేస్తూ ఆలస్యం చేశాడు. రాజు చేసే పారణ ముహూర్తంలో సగంగడియ మాత్రమే ఉంది. ద్వాదశిలోనే పారణ చేయవలసిన విషయాన్ని విచారించి, బ్రాహ్మణ తిరస్కారం వల్ల కలిగే దోషాన్నీ శంకించి, పండితులను పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు.
(అహోరాత్రానికి - 30 ముహూర్తాలు. ఒక్క ముహూర్తం= 48 ని. ఒక్క గడియ= 24 ని.
పారణ : వ్రతాలు, దీక్షలు సందర్భంలో ఉపవాసం ఉండి అనంతరం ఆహారం తీసుకోవడాన్ని పారణం అంటారు.)
'దుర్వాసమహర్షి యమునకు స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. ద్వాదశి కూడా వెళ్ళిపోతోంది. అది వెళ్ళిపోయేలోగా పారణ చేయాలి. తగిన ధర్మాన్ని నాకు చెప్పండి' అన్నాడు రాజు.
తనకు కలిగిన ధర్మసంకటాన్ని ముందుంచిన రాజుతో బ్రాహ్మణులు ఇలా అన్నారు.
రాజా! అతిథి స్నానానికి పోయి రాకపోవడంచేత ద్వాదశి పారణను మానివేయడం ధర్మంకాదు. నీటిని స్వీకరించండి. అది తినినట్లుకాదు; తిననట్లుకాదు; సలిలభక్షణం అంగీకారమైందే.
బ్రాహ్మణులు రాజుగారి ధర్మసందేహాన్ని పోగొట్టారు. ఆ రాజర్షి మనసులో విష్ణువును ధ్యానించి నీటిని పారణ చేశాడు. స్నానానికి వెళ్ళిన మునికోసం ఎదురు చూస్తుండగా
ఆ సమయంలో యమునానదిలో స్నానాదికం పూర్తిచేసి వచ్చిన మునీశ్వరుడు అంబరీషుని సేవలు అందుకొన్నాడు. తన బుద్ధితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. బొమముడి కలిగిన ముఖంతో, శరీరం కంపిస్తుండగా, కోపంతో రెట్టించిన, ఆకలి నకనకమంటుండగా, ఇలా అన్నాడు. “ఈ ఐశ్వర్య మదాంధుని, ఈ ఘాతుకుణి, గర్విష్ఠుణ్ణి మీరందరూ చూచారా? వీడు విష్ణుభక్తుడుకాదు. నన్ను అతిథిగా పిలిచి నా రాకకుముందే భుజించి, ధర్మభంగం చేసి దుర్మార్గుడయ్యాడు. నా శక్తి ఇప్పుడు ప్రదర్శిస్తాను. నేను కోపిస్తే ఎక్కడైనాసరే అడ్దుపడేవాడెవడు?” అంటూ
దుర్వాసుడు పటపటమని పండ్లు కొరుకుతూ భయంకరుడై కనుకొనలనుండి తీక్ష్ణమైన నిప్పులు చిటచిటమని రాలుతుండగా చెంపలు పొంగగా హూంకారం చేస్తూ తన జుట్టులోని శిఖను ఒక దాన్ని పెరికి దాన్ని చేత ఆయుధంకల్గిన సంహారక దేవతను సృష్టించి రాజుపై వదిలాడు.
ప్రళయాగ్నితో సమానురాలై, చేతితో శూలాన్ని ధరించి, నేల సురసురమని అణగిపోయేటట్లు పాదాలతో తొక్కుతూ విజృంభించి రాజును సమీపించింది.
విశ్వరూపుడైన విష్ణువు దుర్వాసుని దుష్కృత్యాన్ని తెలిసికొని 'అజ్ఞాని'యైన తపసిమాయను సరిచేయమని చక్రాన్ని పంపాడు. అది ప్రళయాగ్నివలె వచ్చింది.
ఆ విధంగా వచ్చిన చక్రం మునిపంపిన కృత్యను కాల్చి, అంతటితో ఆగక మునిని వెంబడించింది. ముని మేరు పర్వతగుహలో దూరగా అదికూడ సర్పాన్ని వెంబడించే దావాగ్నివలె అందులో ప్రవేశించింది. అంతేగాక
పరులకు మరలించుటకు వీలులేని విష్ణుచక్రం ఒక్క ఉదుటున ముని వెంటబడి భూమిలో దూరితే భూమిలోకి దూరుతుంది. సముద్రంలో మునిగితే తానుకూడ సముద్రాలలో మునుగుతుంది. ఉద్వేగంతో ఆకాశానికి పాకితే తాను కూడా ఆకాశానికి ఎగబాకుతుంది. దిక్కుల్లోకి వెళితే దిగ్వీథుల్లోకి వెళుతుంది. దారిలో ముని ఆగితే తానూ ఆగుతుంది. నిలబడితే నిలబడుతుంది. తొలగినట్లైతే తాను కూడా తొలగిపోతుంది.
ఏ లోకానికైనా వెంబడించి తనతో వచ్చే చక్రాగ్నిజ్వాలల్ని ఆర్పగలిగినవారు లేకపోవడంతో దుర్వాసుడు దేవతలలో ప్రథముడు అయిన బ్రహ్మ దగ్గరకువెళ్ళి, సృష్టి కార్యంలో కౌశలం కలిగిన విలాసమైన చూపులుగల ఓ బ్రహ్మా! 'నన్ను కాపాడు. చక్రాన్ని అడ్డుకో' అని ప్రార్థించాడు.
రెండు పరార్దాల ప్రమాణంకల ఈ కాలాన్ని కాలస్వరూపుడై లోకములో చక్కగా నిండించి, పరిపూర్తి అయిన వెంటనే కళ్లలో ఎర్రదనం వ్యాపించినంతనే వాటిని ఏ ప్రభువు బూడిదచేస్తాడో ఆ ప్రభువైన విష్ణువుయొక్క చక్రాగ్ని జ్వాలలకు అడ్డుపడ కలిగినవాడెవ్వడున్నాడు?
(ద్విపరార్థం అంటే రెండు పరార్థాలు. కేవలం ఇంత అల్పమాత్రం సమయంలో లోకాల్ని నిండిస్తాడు. కోపం కలిగిన వెంటనే వాటిని భస్మీభూతం చేస్తాడు. లోకాలన్ని రెండు పరార్థాల కాలంలోనే పుడుతున్నాయి, గిడుతున్నాయి. అంటే ఎక్కడో కాదు. మనలోనే కదా! ఎన్నో సృష్టింపబడుతున్నాయి. కాసేపటికి లయమవుతున్నాయి.)
ఆ శ్రీహరి ఆజ్ఞను నేను, ఈశ్వరుడు, దక్షుడు, ఇంద్రాదులు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు అందరం లోకకళ్యాణకరమని, గొప్ప కార్యమని, సాటిలేనిదని అనుకొంటూ తలదాలుస్తాం.
'కాబట్టి తాను చక్రాగ్నిని ఆపడానికి అశక్తుణ్ణి' అని బ్రహ్మ అన్నాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని సందర్శించి ఆయినకు సుదర్శనచక్ర విషయం చెప్పాడు. అపుడు ఆ పరమేశ్వరుడిలా అన్నాడు.
నాయనా! విను. ఈ విశ్వప్రభువువైన విష్ణువులో అనేక వేలసంఖ్యలైన బ్రహ్మాండాలు ఆయా సమయంలో పుడుతుంటాయి. నశిస్తుంటాయి. అదేకాదు మేము ఎవరి మాయకు లోనవుతున్నామో, నేను (ఈశ్వరుడు) దేవలుడు, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మ సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైనవారు పరతత్త్వజ్ఞులు, సిద్ధపతులు, ఎవరి మాయను తెలుసుకోలేక ఇటువంటి స్థితిని పొందుతున్నామో అటువంటి సర్వేశ్వరుని యొక్క విశిష్ట ఆయుధాన్ని (చక్రాన్ని) నివారించడం మా వల్లకాదు.
మునీశ్వరా! నీవు ఆ పరమాత్మ శరణంకోరు. అతడు నీకు మేలు చేస్తాడు. అని చెప్పిన శివుని నుండి నిరాశపాందిన దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి
ఆ వైకుంఠంలో ఎత్తైన మణిభవనంపై లక్ష్మీదేవితో సరససల్లాపాలతో విహరించే దేవతా ప్రభువైన విష్ణుణ్ణి చూచి “ఓ వరదా! భక్తరక్షాపరాయణా! దేవేశా! చక్రాగ్నిమంటల్ని మాన్పవా?” అని అభ్యర్థించాడు.
పరమాత్మా! నీ మాహాత్మ్యం అనే సముద్రంయొక్క చివరను నిజంగా తెలుసుకోలేక నీవాత్సల్యానికి పాత్రుడైన నీ భక్తునికి అల్పబుద్ధితో హాని చేశాను. నా అజ్ఞానాన్ని క్షమంచు. నరకలోకవాసి యైనవాడుకూడా నీ పేరును స్మరిస్తే సౌఖ్యస్థితి పొందకుండా ఉంటాడా? (పొందుతాడని భావం)
ఇలా చెప్పి, పాదపద్మాలకు నమస్కరించి, లేవకుండా అట్లే ఉండే దుర్వాసుణ్ణి చూచి, శ్రీహరి ఇలా అన్నాడు.
దుర్వాసుడు ఆవిధంగా పల్కి పాదాల మీది నుంచి లేవక అట్లే ఉండగా విష్ణుడిలా అన్నాడు. ఓ మహార్షీ! బుద్ధిమంతులైన సాధువులు నా మనసును అలవోకగా కొల్లగొట్టుకొని పోతుంటారు. పవిత్రమైన భక్తి అనే తీగలతో మదపుటేనుగును కట్టినట్లు నేర్పుతో నన్ను కట్టివేస్తారు. ఆ బంధాలకు చిక్కి భక్తులయందలి ప్రేమతో నేను వారిని అనుసరిస్తుంటాను.
(పాదపద్మాలకు మొక్కిన దుర్వాసుడు పాదాలను వదలలేదు. అంటే సంపూర్ణ శరణాగతిని పొందాడు. భగవానుని భక్తజనవత్సలకు ఈ పద్యం తార్కాణం. భగవానుడు స్వేచ్చగా విహరించే మదగజం. దాన్ని బంధించాలంటే మంచి తీగలు కావాలి. అవికూడా భక్తి అనే తీగలు. ఆ భక్తితీగలతో ఆయన్ను బంధించవచ్చు. ఆ బంధనాలకు చిక్కిన ఆయన భక్తుడెలా వెళ్తే అలాగా వెళుతుంటాడు.)
నాభక్తుడునా క్షేమాన్ని కోరుతుంటాడు. భక్తులకు నేనే దిక్కు భక్తుడెక్కడికి వెళితే నేను ఆవు వెంటబడే కోడెలాగా వెంటబడి వెళతాను.
దేహాన్ని జీవితాన్ని సంతానాన్ని బంధువులను, భార్యను, ఐశ్వర్యాన్ని వదలి నన్నుతప్ప మరిదేనినీ ఎప్పుడునూ తెలియని వారిని, ఎట్టివారినైనా నేను వదలను.
(భగవంతుని పొందుకోరడానికి మార్గాన్ని భగవానుడే చెబుతున్నాడు. అన్నింటిని వదలి నన్నే దిక్కుగా భావించేవారు ఏ లక్షణాలతో ఉన్నా, వారిని వదలను. ఎల్లప్పుడు కాపాడుతుంటాను అని భావం. అయితే పైన చెప్పినవన్నీ వదలటమెలాగా, శరీరం, జీవితం, ఆలుబిడ్డలు, ఐశ్వర్యం వీటిని వదిలేస్తే భగవానునిరక్ష లభిస్తుంది. అంటే వీటిమీద అహంకారమమకారాల్ని వదలాలి. భగవానుడే దిక్కుగా భావించేవారిని కాపాడుతూ ఉంటాడనడానికి గజేంద్రమోక్షం మంచి తార్కాణం.
ఉత్తముడైన భర్తను పతివ్రతలు ఇష్టపడినట్లు, బుద్ధిమంతులైన భక్తులు పంచేంద్రియాల మార్గాలను అరికట్టి తమమనసులో నన్న భావించుకుంటారు.
ఓ బ్రాహ్మణుడా! సజ్జనుల హృదయం నాది. వారిహృదయమే నేను. లోకాలన్నిటిలో సాధులను నేనుమాత్రమే తెలుసుకోగలను. నా నడవడిని వారుమాత్రమే తెలుసుకోగలరు.
(సాధుల హృదయాలనిండా నిండి ఉన్న భగవానునికి సాధులకు అభేదమని భావించాలి. 'సజ్జనులందుందఱచు సొచ్చియుందు' అన్నాడు వామనుడు.)
భూదేవులైన బ్రాహ్మణులకు తపస్సు, విద్య అనేవి మోక్షాన్ని కల్గిస్తాయి. అవినయపరులకు ఇవే హానిని కలిగిస్తాయి.
నా తేజస్సు సజ్జనుల్లో నిండి ఉంటుంది. వారికి కష్టం కలిగించే వారికి ఆయుధం వలె భయాన్ని కలిగిస్తుంది. మనసుకు సంతోషం లేకుండా చేస్తుంది. ఇది నిజం.
ఓ బ్రాహ్మణుడా! నీకు జనులు పొగడే మంచి గుణవంతుడు, దయాపరుడు అయిన అంబరీషుడు అభయం ఇస్తాడు. అక్కడికే వెళ్ళు. అతని మనసుకు ప్రీతి కలిగించి శరణుకోరు. ఇది నీకు మంచి మార్గం సుమా!
అని ఆ లక్ష్మీపతి ఆనతివ్వగా, ప్రకాశవంతమైన చక్రజ్వాలలవల్ల ఆయాసపడ్డవాడు, కళతప్పినవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు మెల్లగా వచ్చి దయాస్వభావుడు, దోషరహితుడు, నీతిచేత గొప్ప ప్రజ్ఞకలవాడు హితమితభాషి అయిన అంబరీషుణ్ణి వెంటనే భక్తిపూర్వకంగా దర్శించుకున్నాడు.
దుర్వాసుడు చూచి దుఃఖించి ఆ రాజు కాళ్లను పట్టుకొని విడువకుండగా, ఆ రాజచంద్రుడు తన పాదస్పర్శకు జంకి, దయా హృదయుడై విష్ణుచక్రాన్ని ఈ విధంగా స్తోత్రం చేశాడు.
శ్రీహరి మన్నించు ముఖ్యాయుధమా! నీవే అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీటివి, భూమివి, ఆకాశానివి, గాలివి, ప్రాణేంద్రియాలు నీవే. నీవే బ్రహ్మవు, సత్యానివి, యజ్ఞానివి, యజ్ఞఫలానివి, నీవే లోకపాలకులు! నీవే సర్వాత్మవు, కాలానివి, లోకానివి నీవే, అనేకయాగభోక్తవు, నిత్యానివి, మూలతేజానివి నీవే. అటువంటినీకు నమస్కరిస్తున్నాను. మహర్షిని కాపాడు. నాకంతే చాలు.
ఓ చక్రాయుధమా! యుద్దాల్లో నీవు విష్ణువుచేత వదలబడడాన్ని ముందే విని నీ పదునుచేత ఎలాగూ చావడం జరుగుతుందని ముందే రాక్షసరాజులు తమ తలలు, పాదాలు, భుజాలు, తొడలు, చేతులు, మొదలైన శరీరావయవాలు వాలిపోగా ప్రాణవాయువులను వదలుతారు (మరణిస్తారు).
కలతనిద్ర చెందిన రాక్షసులు కలలో కనపడిన నిన్ను చూచి మరణిస్తారు. తెల్లవారిన తరువాత వారి భార్యలు అది చూచి ఏడుస్తారు.
ధర్మమయమైన నీకాంతులు చీకటిని పారద్రోలుతూ, వెలుగులను పుట్టిస్తూ, సజ్జనులను సంపన్నం చేస్తాయి. నిన్నుగూర్చి వర్ణించడం బ్రహ్మకు అశక్యం. నీ రూపం సర్వోత్కృష్టములలో మొదటిదై ఉన్నది. తుది లేదు. మహోన్నతమైనది.
పుండరీకాక్షుడైన హరి దుర్జనులను శిక్షించడానికి నిన్ను నియోగించగా నీవు పూనుకొన్నావు. అయినా ఇకచాలు. ధర్మప్రవృత్తితో ఆపన్నుడై ఉన్న మునిని రక్షించు.
అని చక్రాన్ని పొగిడి నుదుటియందు చేతులు జోడించి (నమస్కరించి) ఇట్లా అన్నాడు.
ఇంద్రుని శత్రువులైన రాక్షసులకు తోకచుక్కలాంటిది, ధర్మానికి వంతెన వంటిది, స్వచ్చమైన ఆకారంకలది, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం దేవేంద్రుని రక్షించేది అయిన చక్రానికి నేను నమస్కరిస్తున్నాను.
అని ప్రశంసించి ఇంకా ఇలాగన్నాడు.
నేను విధించబడిన ధర్మమార్గంలో నడిచేవాడనయితే, యాచకులు అర్థించిన ద్రవ్యాన్ని దానం చేసినవాడనయితే, బ్రాహ్మణుడు మాకు దైవసమానుడే అయితే ఈ మహర్షికి శుభం కలుగుగాక.
సర్వగుణాశ్రయుడైన హరి నా సేవచేత పరవశుడే అయితే, సర్వాత్మల యందుండువాడయితే, ఇప్పుడీ బ్రాహ్మణుడు సుఖాన్ని పొందుగాక.
ఈ విధంగా రాజు స్తుతించగా మునిని మన్నించి, బాధ పెట్టకుండా విష్ణుచక్రం మరలివెళ్లింది. తరువాత దుర్వాసుడు నెమ్మదిగా మెల్లని మంచి మాటలతో ఆ రాజుని ఆశీర్వదించి ఇలా అన్నాడు.
ఓ రాజోత్తమా! నా తప్పుకాచి మేలుచేశావుకదా! విష్ణువు పాదపద్మాల్ని ఇంతగా సేవించావా? ఆశ్చర్యం కలుగుతోంది. నీ బోటి సన్నార్గుల విషయంలో అరుదేమికాదు. నీ వంటివారికి, దానం, రక్షణ అనేవి క్రమంగా మైత్రీపూర్వకంగా సహజగుణాలై సరసకు వస్తాయి కదా!
ఓ రాజోత్తమా! ఎవ్వని పేరు ఒక్కసారి చెవులకు అలవోకగా సోకితే సమస్తమైన పాపాలు తొట్రుపాటుతో కిందు మీదై వైదొలగుతాయో, అటువంటి మంచిని కలుగబేసే, మంగళకరమైన తీర్ధం (గంగ) పాదములందుగల దేవేశుడైన విష్ణుని నిష్కళంక బుద్ధితో సేవించే భక్తులకు అడ్డముండదు.
'ఓ రాజా! నేను చేసిన తప్పును పట్టించుకోకుండా, చక్రాగ్ని దహించుటనుండి నన్ను తప్పించావు. నీ కరుణరసం నీకే తగును రాజా! చెప్పాలంటే నా ప్రాణాలు పోయి మళ్లీవచ్చాయి. ధన్యుడనయ్యాను. ఎప్పుడూ నీ శ్రేయస్సునే కోరుతాను. ఇక వెళతాను'. అన్నాడు మహర్షి
అని దుర్వాసుడు చెప్పగా విని ఆ రాజముఖ్యుడైన అంబరీషుడు మునిపాదాలకు ప్రణమిల్లి, గౌరవించి ఇష్టమైన భోజనం పెట్టించాడు. ఆ ముని తృప్తి పొందాడు.
మరల ఆ దుర్వాసమహర్షి అంబరీషుడితో ఇలా అన్నాడు.
ఓ రాజచంద్రా! ఈ రోజు నిన్ను చూచాను. వీనులవిందుగా నీ మాటలు విన్నాను. నీ ఇంట్లో తృప్తిగా భోజనంచేశాను. వ్రతఫలితం దక్కింది. నేను బతికాను. నీ నడవడిని ఆకాశంలో దేవతలు, భూమిపై మానవులు ఇకమీదట సుఖంగా కూర్చొని పొగడుతూ ఉంటారు. ఇక వెళతాను.
అని పలికి దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి ప్రశంసించి ఆకాశమార్గంలో బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన వచ్చివెళ్ళినప్పటికి ఒక సంవత్సరం నిండి ద్వాదశీవ్రతం పూర్తి అయింది.
“మునికి వచ్చిన కష్టం పోగొట్టడానికి నేనెంత వాడిని. అంతా విష్ణువు దయావిశేషమే” అంటూ రాజు ముని తినడంచేత పవిత్రమైన అన్నాన్ని తిన్నాడు.
హరిసేవకులకు బ్రహ్మపదవి మొదలుకొని అనేక పదవుల వల్ల లభించే భోగభాగ్యాలు నరకప్రాయాలని భావించి అంబరీషుడు రాజ్యంతో తనకుగల సంబంధాన్నే వదలుకున్నాడు.
ఈ విధంగా విరక్తి కలిగినవాడై, మానవులకు ప్రభువైన రాజు తనకు విష్ణువే ప్రభువుకాగా కామక్రోధాదులను జయించినవాడై తనతో సమానులైన కొడుకులను పిలిచి రాజ్యభారాన్ని వారికి అప్పగించి అడవికి వెళ్లాడు.
ఈ అంబరీషుని చరిత్ర విన్నా చదివినా మానవుడు బుద్ధిమంతుడవుతాడు. భోగపరుడవుతాడు. పుణ్యాత్ముడవుతాడు.
(ఇది అంబరీషుని కథకు ఫలుశ్రుతి.)
ఆ అంబరీషునికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అని ముగ్గురు కొడుకులు. వారిలో కేతుమంతుడు, శంభుడు విష్ణువును గూర్చి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళారు. విరూపునికి పృషదశ్వుడు, అతనికి రథీతరుడు పుట్టారు. ఆ మహాత్మునకు సంతానం లేకపోవడం చేత అంగిరసుడనే ముని అతని భార్యకు బ్రహ్మతేజోవంతులైన కొడుకులను ప్రసాదించాడు. వాళ్ళు రథీతరగోత్రులుగాను, ఆంగిరసులనే బ్రాహ్మణులుగాను ప్రఖ్యాతి పొందారు, అని చెప్పి శుక మహర్షి ఇట్లా అన్నాడు.

No comments:
Post a Comment