నారద మహర్షీ! నీవు స్వయంగా బ్రహ్మకు సుతుడవు. సర్వజ్ఞుడవు; నీ వెరుగని ధర్మ మేదీ లోకంలో ఉండదు. నరులకు సర్వవర్ణముల ఆచారాలకు వలసిన ధర్మమేది? విష్ణుభక్తులు; శాంతి, దయ; మంచి నడతగల మీ వంటివారు ఏది గొప్పధర్మమని అనుకుంటారు? ఆ ధర్మపు స్వరూప స్వభావాలు మొత్తమూ తెలుపు. వినాలనే కోర్కెతో ఉన్నాను.
ధర్మరాజు మాటకు నారదుడు, అతనిని చూచి, సతీదేవియందు విష్ణువు అంశతో కలిగి, లోకరక్షణకై బదరికాశ్రమాన తపస్సుచేసే నారాయణమునివలన ప్రాచీనధర్మమిది-అని విని ఉన్నాను. దానిని నీకు చెప్పెదను, వినుము. ఎల్లవర్ణాలవారికీ, సత్యం, దయ మొదలయిన ముప్పది లక్షణాలు ఉండాలి అవి సత్యం, దయ, ఉపవాసం(తపస్సు), శౌచం, ఓర్పు, సదసద్ వివేకం, మనోనియమనం, ఇంద్రియజయం, అహింస, బ్రహ్మచర్యం, దానం, జపం, సంతోషం, మృదుత్వం, సమత్వం, మహాజనసేవ, నిష్కామత్వం, నిష్ఫల క్రియాత్యాగం, మితభాషిత్వం, ఆత్మాన్వేషణం, అన్నోదకదానం, ప్రాణులయందు దేవతాబుద్ధి, ప్రాణులయందు ఆత్మబుద్ధి, (శ్రీమన్నారాయణుని) స్మరణం, కీర్తనం, సేవార్చనం, నమస్కారం, దాస్యం, ఆత్మసమర్పణం, సఖ్యం. ఇవి సామాన్య ధర్మాలు. ఇక ప్రత్యేక ధర్మాలు ఇవి; బ్రాహ్మణునికి, ఎవరియింట అంతరాయంలేకుండ గర్భాధానం మొదలయి సంస్కారాలు సాగునో వానికి, యజ్ఞకరణం యజనం, యాజనం(యాగం చేయించడం) చదవడం, చదివించడం, ఇవ్వడం, తీసికొనడం ఈ ఆరు పనులు విధివిహితాలు. రాజునకు ఈ ఆరింట తీసికొనుట తప్పమిగిలిన అయిదు పనులు, బ్రాహ్మణేతరులను దండించుట, వారినుండి పన్నులు గ్రహించుట - ఇవి విధివిహితాలు. వైశ్యునకు దున్నుట, వాణిజ్యం, పాడిపశువుల పోషణ, బ్రాహ్మణుల అనుసరణ - ఇవి విధివిహితాలు. శూద్రునకు విప్రులను సేవించడం విహితక్రియ.
(నారదుడు బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్న నారాయణుని వల్ల విన్న 30 లక్షణాలుగల 'సనాతన ధర్మము' గురించిన విషయాలు ధర్మరాజుకు తెలిపిన ఘట్టమిది. 'సనాతన' మంటే ఎప్పటికీ ఉండేది. నాశంలేనిది. సనాతన ధర్మం
30 లక్షణాలు : 1. సత్యం 2. దయ 3. తపస్సు 4. శౌచం 5. సైరణ 6. సదసద్వివేకం 7.మనోనియమనం
8. ఇంద్రియజయం 9. అహింస 10. బ్రహ్మచర్యం 11. దానం 12. జపం 13. సంతోషం 14. మృదుత్వం 15.సమత్వం 16.మహాజనసేవ 17.నిష్కామత్వం 18.నిష్ఫల క్రియాత్యాగం 19. మితభాషిత్వం 20.ఆత్మాన్వేషణం 21. అనుమోదకదానం 22. ప్రాణులందు దేవతాబుద్ధి 23. ఆత్మబుద్ధి 24.(శ్రీమన్నారాయణుని) స్మరణం 25. కీర్తనం 26. సేవార్చనం 27. నమస్కారం 28. దాస్యం 29.ఆత్మసమర్పణం 30. సఖ్యం. ఇవి సకల వర్ణాల వారికి సమానం.)
'కృషి' కంటె అయాచన, అంటె బిచ్చమెత్తుకొనకుండా ఉండటం మేలు; దొరికిన దానితో జీవించడంకంటె అనుదిన యాచన ఉత్తమం. దానికంటె పరిగ ఏరి జీవించుట క్షేమం. దానికంటె వ్యాపార ప్రదేశాల జారిపడే గింజలపై బతుకడం మేలు. రాజు చెడిన స్థితిలో ఈ నాల్గు విధాల జీవికకు అర్హుడు. ప్రతిగ్రహం మాత్రం అతనికి అనుచితం. ఆపద సమయంలో అల్పకులజుడైనా అధిక వృత్తిలో జీవిస్తే దోషం లేదు.
శిల, ఉంఛవృత్తులు రెండూ ఋతమనీ, బిచ్చమెత్తని జీవికను అమృతమనీ, నిత్యమూ యాచించే బ్రదుకు తెరువును మృతమనీ, పొలం దున్ని జీవించటాన్ని ప్రమృతమనీ తలుస్తారు. ఆ వృత్తులతో జీవయాత్ర చేయుట మేలు. వ్యాపారాన్ని సత్య - అనృతమనీ, నీచసేవను శ్వవృత్తి, కుక్కబతుకనీ పిలుస్తారు. బ్రాహ్మణుడు అన్నివేదాల ఆకారం. క్షత్రియునిలో దేవతలందరు నివసిస్తారు. కాగా బ్రాహ్మణ క్షత్రియులకు అల్పులను సేవించుట చేయవలసిన పనిగాదు.
రాజా! శమదమగుణాలు, తపశ్శౌచాలు, దయ, మృదుత్వం, సత్యజ్ఞానగుణాలు ఓర్పు, హరిభక్తి హర్షం - ఇవి బ్రాహ్మణునికి సహజ లక్షణాలు.
రాజా! శౌర్యం, దానగుణం జనులను అనుగ్రహించుట ఆత్మనిగ్రహం, కాంతి, ధైర్యం, దైవభక్తి, ధర్మం, అర్థం, కామం, పండితులను, ఆచార్యులను, విష్ణుమూర్తిని, నిత్యమూ సేవించుట, సత్కర్మముచేయుట, సంతోషం, వీరుడుగా ఉండుట, జనులను రక్షించుట ఇవి రాజ లక్షణాలు.
ధర్మ అర్థ కామాలు అనే మూడు పురుషార్థాలు వైశ్యులకు ప్రియమైనవి. గురువులను సురలను బ్రాహ్మణులను సేవించుట, మదం లేకుండటం, సంతుష్టి కలిగించడం అనేవి వైశ్యలక్షణాలు.
దొంగతనం చెయ్యని జీవితం, పరిశుభ్రత, తమ నాయకులను కపటం లేకుండ సేవించడం, మంత్రరహితంగా పంచయజ్ఞాలు నిర్వహించడం, బ్రాహ్మణుల కొలువు, గోసేవ చెయ్యడం, న్యాయమైన ప్రవృత్తి-ఇవి శూద్ర లక్షణాలు.
పంచయజ్ఞాలు: 1. దేవయజ్ఞం 2. ఋషియజ్ఞం 3. పితృయజ్ఞం 4. భూతయజ్ఞం 5. మనుష్యయజ్ఞం - అవి పంచమహాయజ్ఞాలు.
స్త్రీ తన ఇంటిని గౌరవిస్తూ, తానూ ఇల్లూ శుభ్రంగా ఒప్పే విధంగా మెలగాలి. పతిని సల్లాపచతురయై సంతోషపరచాలి. పతిని, దేవునిగా భావించాలి. భర్త నడిచే మంచిమార్గాన్నే తానూ అనుసరించాలి. బంధు జనాన్ని గూడ ఆ మార్గంలోనే నడిపించాలి. పతికి స్నానపానాలలో, అన్నపానీయాలలో సంసారసుఖంలో సంతుష్టిని కలిగించాలి. పతి పతితుడైతే, ఆ సతి, తన పాతివ్రత్య ప్రభావంతో, అతనిని సరైన మార్గంలో తీర్చిదిద్దుకోవాలి.
స్త్రీ తన పతిని సాక్షాత్తు హరిగా భావించి సేవించాలి, అలా మెలిగినట్లైతే, అనంతరకాలాన వైకుంఠంలో, అతడు హరిగా, తాను సిరిగా నిత్యానందంతో మెలగగలరు.
రాజా! స్త్రీకి ఉపవాసాది అనేక వ్రతాలతో(నోములతో) పనే లేదు. కేవలం భర్తను దైవభావంతో సేవిస్తే చాలు; ఆమెకు ఎల్లలోకాలలో దొరకనిది ఉండదు.
ఇంకా సంకరజాతులయిన చాకలి, చర్మకారుడు, మేదరి, జాలరి, చెంచు-మొదలైన ఏడు కులాలవారు, మాల బోయ మాతంగ మొదలైన జాతులకు చెందినవారు, తమతమ పరంపరాగతాలైన వృత్తులనే చేస్తూ, దొంగతనం హింస మాని, జీవించాలి. నరులకు సహజ ధర్మాలు, రెండు భూ స్వర్గ లోకాలలో క్షేమకరాలని వేదవేత్తలు అంటారు. ప్రతిఋతువుతో తప్పక దున్ని పండించే పొలాలు, కొంతకాలానికి బలహీనపడి, వాటిలో వేసిన గింజలు సరిగా మొలవవు. ఎల్లపుడూ నేతిధారలతో అగ్నిని వేలుస్తూ ఉంటే, అగ్నికూడ చల్లారి, అందలి యజ్ఞహవిస్సులు నిష్ఫలమౌతాయి. అదే విధంగా నిరంతరం కామాదులలో మునిగి తేలుతూవుంటే చివరకు మనస్సు నిష్కామమై వైరాగ్యం పుడుతుంది కనుక సత్త్వస్వభావంతో తన వంశధర్మంలో ప్రవర్తించే మానవుడు స్వాభావిక కర్మలను క్రమంగా విడిచి ముక్తిని పొందుతాడు. కాగా జాతిమాత్రంతో నరుని గుర్తింప పనిలేదు. అతని శమదమాది వర్గలక్షణాలను, చూచి మెలగవలెనని, నారదుడు ఇంకా ఇలా అన్నాడు.
శత్రువుల గుండెలకు శూలం వంటివాడా! నిర్మలశీలుడా! ధర్మరాజా! వరుసగా నాల్గువర్ణాలవారి లక్షణాలు చెప్పాను. ఇక నాల్గు ఆశ్రమాల ధర్మాలు తెలుపుతాను.
విను. బ్రహ్మచారి, గడ్డి మొలనూలు, గోచి, జందెం, జింకచర్మం, మోదుగుకర్ర, కమండలం-వీటిని ధరించి, శిరోజాలను సంస్కారహీనంగా వదలి, చేత దర్భలను ధరించి, శీలంతో, మౌనంతో మూడు సంధ్యలలో గాయత్రీ జపంచేస్తూ ఉదయం సాయం వేళలలో సూర్యుని, అగ్నిని, గురువును పూజిస్తూ, గురువు ఇంటిని చేరి, భక్తితో, అణకువతో, మంచి మనసుతో సేవచేస్తూ, వేదాలు చదువుతు, చదువు మొదలా చివరా గురుపాదాలకు నమస్కరిస్తూ, ఉదయ సాయం వేళలలో నిర్ణీత గృహాలలో బీచ్చమెత్తి, వచ్చినదానిని గురువు కర్పించి, అతని అనుమతితో మితంగా భుజించి, ఆయా కాలాలలో ఉపవాసాలు చేస్తూ, స్త్రీలతో, వారిపట్ల ఆసక్తిగలవారితో యెడ ఆసక్తులతో, మితభాషణ చేస్తూ, గురువుగారికి, ఇతరులకు సంబంధించిన స్త్రీలవల్ల నలుగు, తలస్నానం, వీటిని విడిచి, వీటికి దూరంగా ఉంటూ, ఏకాంతంగా వారితో ఉనికి గూడ కలగకుండా, యింట్లో ఉండక, ఇంద్రియాలను జయించి, నిజం పలుకుతూ మెలగవలసి ఉంటుంది.
స్త్రీ అడవినిప్పు. పురుషుడు నేతికుండ. ఈ రెండూ ఒకచోట చేరితే నేతికుండ కరిగిపోకుండా, బ్రహ్మదేవుడైనా తన కూతురినే తాకకుండ ఉండలేడు. ఇక ఇతరుల మాట చెప్పే దేముంది? కాగా బ్రహ్మచారికి మగువతో పొత్తు కూడనే కూడదు.
రాజా! వినుము. నరుడు, ఆత్మసాక్షాత్కారం పొంది, తన ఇంద్రియాలతోపాటుగా, కనిపించే లోకమంతా ఆభాసమాత్రంగా నిశ్చయించుకొని, తానూ, ఈశ్వరుడూ ఒకటేనని మానవుడు ఎప్పటివరకు గ్రహించలేడో అప్పటివరకు ఈమె స్త్రీనేను పురుషుడిని అనే భేదంభావం వీడరాదు. బ్రహ్మచారి, సన్న్యాసి, గృహస్థుడు - ఈ ముగ్గురిలో ఎవరైనా, మనఃపరిపాకం లేక అద్వైతసిద్దాంతాన్ని ఆచరిస్తే మూఢుడు కాగలడు. అందువల్ల, ఏకాంతంలో కూతురుతోనైనా ఉండకూడదు.
రాజా! గృహస్థుడైన నరుడు, తలకు ఒంటికి సంస్కారం చేసుకోకుండా శరీరంపై గంధపు పూతలు పూసికొనుట, నగలు ధరించుట మాని, ఋతుకాలంలో మాత్రం తన భార్యతో కూడుచు, ఇతర యువతులకై పరుగులు పెట్టక దీక్షవహించి, మద్యమాంసాలు విడిచిపెట్టి జీవించినవాడే, పండితుడు. అతని జీవనం మహోన్నతం! అతడే సద్గృహస్థు.!
బ్రాహ్మణుడు గృహస్థాశ్రమం స్వీకరించి, గురువులదగ్గర ఉపనిషత్తులతో అంగాలతో కూడిన మూడువేదాలు చదివి, తన ధీబలానుసారంగా వేదార్థాల విచారణచేసి, తన సమర్థతను బట్టి గురువులకు దక్షిణ లిచ్చి, అనంతరం, తాను తన యింట్లోగాని, అడవిలోగాని ఇతర జీవులతో కలిసి బతుకుతూ, గురువులో, అగ్నిలో, తనలో, ఎల్లప్రాణులలో శ్రీహరి దర్శనం చేస్తూ, ఇంద్రియవ్యసనాలకు లొంగిపోక జ్ఞానవంతుడై, మెలుగుతూ చివరికి పరమాత్మను చేరుతాడు.
రాజా! వానప్రస్థాశ్రమంలో ఉండేవాడికి మునులు చెప్పిన కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని పాటిస్తూ అరణ్యంలో జీవించే నరుడు గొప్పవాడు. అతడు మహర్లోకానికి వెళ్తాడు.
అటు తరువాత, గృహస్థాశ్రమం వదలి అడవికి వెళ్ళి, కృషి చేయక స్వయంగా పండే నివ్వరి మొదలైన ధాన్యాన్ని వండిగాని వండకగాని, ఎండకు పండిన పండ్లనుగాని తింటూ, అడవిలోని కందమూలాదులతో, నిత్యం చేసే యజ్ఞాలకు హోమద్రవ్యాలు చేస్తూ అనుదినమూ, ముందురోజు పోగుచేసిన పదార్థాలను వదలి, కొత్తవి సంపాదిస్తూ, అగ్ని రక్షణకోసం పర్ణశాలను గాని, కొండగుహనుగాని ఆశ్రయించి, మంచు, గాలి, నిప్పు, వాన, ఎండలను ఓర్చుకొంటూ, గోళ్ళు, గడ్డాలు, తలవెండ్రుకలు, ఒడలి వెండ్రుకలు - వీటిని సంస్కరించక, కర్ర, తోలు, కమండలం, నారచీరలు, దుప్పట్లు, ధరించి, పన్నెండైనా, ఎనిమిదైనా, నాలుగైనా, రెండైనా, ఒక్కఏడైనా, తపశ్చర్యతో, బుద్ధినాశం జరగకుండ జాగృతుడై, మునిగా తిరుగుతూ నివసించాలి. అపుడు విధివశాన ముదిమి, రోగాలు వీని బారినపడి అనుష్ఠాన నిర్వహణకు చాలనివాడైతే, ఆహారం మాని, అగ్నులను ఆత్మలో నిక్షేపించుకొని(అగ్నిక్రియలు మాని) సన్యాసాశ్రమం స్వీకరించి, ఆకాశాన దేహపుచిల్లులను, గాలిలో ఊర్పును(ఉచ్చ్వాసనిశ్వాసాలు) తేజస్సులో వేడిని, నీళ్లలో ద్రవాన్ని భూమిలో ఎముకలు మాంసములను, నిప్పులో పలుకవలసిన దానితోపాటు పలుకును, ఇంద్రునిలో చేతతోపాటు చేతిని, హరియందు నడకతోపాటు కాళ్ళను, ప్రజాపతిలో సంభోగంతో పాటు యోనిని, చావున మలంతోపాటు ముడ్డిని, దిక్కులలో శబ్దంతోపాటు చెవిని, గాలిలో స్పర్శతోపాటు తోలును, సూర్యునిలో ఆకారంతోపాటు కళ్ళను, వరుణుడితోడి నాలుకను, భూమిలో వాసనతోడి ముక్కును, చంద్రునిలో కోర్కెలతోపాటు మనస్సును, పండితుడైన బ్రహ్మలో తెలివితోపాటు బుద్ధినీ, శివునిలో అహంకారంతోపాటు, మమకారాన్ని, పరమాత్మలో శక్తితోపాటు మనస్సును, పరబ్రహ్మంలో గుణాలతోపాటు వికృతితో కూడిన జీవుణ్ణి లయింపబేసి, ఆపైన, నేలను నీటిలో, నీటిని తేజస్సులో, తేజస్సును గాలిలో, గాలిని ఆకాశంలోను, ఆకాశాన్ని అహంకారంలో, అహంకారాన్ని బుద్ధిలో, బుద్దిని ప్రకృతిలో, ప్రకృతిని నాశరహిత పరమాత్మలో, లీనంజేసి, చిన్మాత్రంగా మిగిలిన ఆత్మను శాశ్వతమని గ్రహించి, ద్వంద్వభావాతీతుడై, కర్రలు కాలిన తరువాత మిగిలిన నిప్పువలె, నిర్వికార పరబ్రహ్మంలో లయం కావాలి.
రాజా! వానప్రస్థాశ్రమం స్వీకరించి, అడవికి వెళ్ళి, ఆ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ ఇంకా బ్రతికి ఉంటే, అపుడు, సర్వసంగాలను అంటే అన్ని సంబంధ బాంధవ్యాలను వదలి సన్న్యసింప వచ్చు.
మూడవదైన వానప్రస్థాశ్రమానంతరం; నరుడు నాల్గవదీ చివరిదీ అయిన సన్న్యాసాన్ని స్వీకరించాలి. సన్న్యాసమంటే శరీరంమాత్రం మిగిలి, మిగిలినదంతా వదలిపోవడం. ఆ స్థితిలో సన్న్యాసికి ఎల్లజీవులు సమానం. అయితే అతనికి ఏ జీవితోను పని ఉండదు. బిచ్చంతో జీవించాలి. ఏ ఆధారం అతని కుండకూడదు. ఒంటరిగా ఆత్మయందే క్రీడించే మనస్థితి ఉండాలి. సర్వభూతాలలో సమత్వం, శాంతస్వభావం, సముచితత్వం, నారాయణ పరాయణత్వం కలవాడై శరీరంపై గోచీ ఒక్కటే వస్త్రంగా ధరించి, కర్ర తప్ప మిగిలిన పూర్వాశమ సంచితమంతా విడిచిపెట్టాలి. ఆత్మజ్ఞానం చెప్పని శాస్త్రాలు విడిచిపెట్టాలి. గ్రహనక్షత్రాదులను గూర్చి చెప్పే జ్యోతిషాన్ని, జీవేశ్వర భేదమును చెప్పు తర్కశాస్త్రాన్ని చర్చించరాదు. దేనియందును పక్షపాతం లేక శిష్యులను మోసగించి గ్రంథాలకు విపరీతార్థాలు చెప్పక, వైద్యాది విద్యలతో జీవింపక, మత్తు కలిగించే వృత్తితో సంతోషించక ఉండాలి. ఒకచోట పలుదినాలు నివసింపరాదు. దినానికొక ఊరు మారి తిరగాలి. కార్యకారణభావానికి అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ, మంచిచెడులతోకూడిన లోకమంతా పరమాత్మ దర్శనమే చేయగలగాలి. మెలకువలోనైనా, కలలోనైనా, నిద్ర నుండి లేచు సమయములోనైనా ఆత్మదర్శనమే చేయాలి. ఆత్మకు నిజంగా బంధం, ముక్తి లేవని, అవి లోకవ్యవహారంకోసం ఏర్పడ్డాయనే ఎరుక సన్న్యాసికి ఉండాలి. దేహానికి జీవితం శాశ్వతం కాదని మరణం తప్పదని గ్రహించాలి. ప్రాణుల పుట్టుక చావులకు మూలమైన కాలాన్ని దర్శిస్తూ జీవనయాత్ర సాగిస్తున్న సమయంలో సన్న్యాసికి విశేషజ్ఞానం కలిగితే, అపుడతడు పరమహంసగా మారే వీలుంది. ఆ స్థితిలో అతడు తన ఇష్టంకోసం, సన్న్యాసాశ్రమపు గుర్తులు త్యజించినా, ధరించినా భేదముండదు. లోకం కోసం సన్న్యాస చిహ్నాన్ని ధరించనక్కర లేదు. అయితే బాహ్యప్రపంచం తనను తిరస్కరించకుండ జీవిక సాగించాలి. పరమహంసస్థితిలో ఆత్మానుభూతమైన ఆనందాన్ని అంతరంగాన వహించి, బయటకు, తాను పిచ్చివానివలె పిల్లవానివలె అపుడపుడు మూగవానివలె కనిపించాలి.

No comments:
Post a Comment