Sunday, February 1, 2026

Magha Puranam 17 - మాఘ పురాణం 17 కప్పరూపము వదలిన స్త్రీ

మాఘ పురాణం - 17 వ అధ్యాయం

కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట

"మునిశ్రేష్ఠా నా వృత్రాంమును తెలియజేయుదును గాన ఆలకింపుము.

"నా జన్మస్థానము గోదావరినది సమీపమందున్న ఒక కుగ్రామము.న తండ్రి పేరు హరిశర్మ. నాపేరు మంజుల. నన్ను నాతండ్రి కావేరీతీర్థవాసియగు జ్ఞానానందుడనువానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి, మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది.

ఒకనాడు నాభర్త "సఖీ"మాఘమాసము ప్రవేశించినది, మాఘమాసము చాల పవిత్రమైనది, దీని మహత్తు చాల పవిత్రమైనది. నేను నాచిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయచున్నాను, నీవు నాభార్యవు గావున నీవును ఈమాఘమాసమంతయు యీకావేరీనదిలో స్నానమాచరించును. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుండి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానంచేయుము ప్రభాతసూర్యునికి నమస్కరించిన తరువాత నదిఒడ్డున విష్ణువుయుక్క చిత్రపటము పెట్టి పువ్యులతోను మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటికి బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింప్తుము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము, దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా నుండును” అని హితబోధ చేసెను.

నేను అతనిమాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని. నాభర్త చాలా శాంతస్వరూపుడు, అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపమువచ్చి శపించినాడు.

"ఓసీ మూర్ఖురాల! నాయింటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండతగవు మాఘమాసవ్రతము నీకింత నీచంగా కనిపించినదా?
సరియే నీపాపము నిన్నేశిక్షించును, గాన నీవు కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొఱ్ఱలో మండూకరూపంలో  నుందువుగాక" అని నన్ను శపించెను.

వారి సింహగర్జనకు వణకిపోయితిని. వారి శాపమునకు భయపడిపోతిని వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై  బడి రెండుపాదాలు పట్టుకొని "నాకీశాపము ఎట్లు పోవును మరల నిన్నెటుల కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తములేదా అని 
రిపరివిధాల ప్రార్ధించగా నాభర్త కొంతతడవలొచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తర దేశయాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధదశమినాటికి కృష్ణానదీస్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన యెడల ఆ మహర్షి ప్రభావమువలన్న నీకు నిజరూపముకలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపముదాల్చితిని. నా భర్త కూడా నామూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్నిదినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావిచెట్టు తొఱ్ఱలో నివాస మేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు" అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.

"అమ్మాయీ! భయపడకుము నీకీశాపము కలిగి వెయ్యేడ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేకకష్టములు పది జీవించినావు. నీభర్తయును ఏకాంతముగా చాలాకాలముజీవించి హరినామసంకీర్తనలు చేయుచు మృతుడయెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నడు. నీవు తనమాటలు విననందున ఎంతకష్టపడినావో తెలిసినదిగదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకలసౌభాగ్యాలు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధన మైనట్టిది కూడా. దీనికి మించిన మరియొకవ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దురదృష్టి గలజ్ఞాని. అతని గుణగణాలు సంతసించెడివారు. నిన్ను పెండ్లియాడినతరువాత తన వంశాభివృద్ధి చూసినవలయుననెడి ఆశతో నుండేవాడు. నీవలన. అతని ఆశలన్ని నిరాశలయి పోయినవి. నీ మూర్ఖత్వమువలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసివచ్చెను? నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొఱ్ఱలో జీవించమని శపించినాడు.

ఈ దినము నా సమక్షములో ధైవసన్నిధిని పడినందున నీభర్త శాపము ప్రకారము, మరల నీ నిజ రూపము పొందగలిగినావు. అందునా యిది మాఘమాసము. కృష్ణానదీతీరము కాగా మాఘమాస వ్రత సమయము నీ కన్నివిధాలా అనుకూలమైన రోజు.అందుచే నీవు వెంటనేశుచివై రమ్ము. స్త్రీలుగాని, పురుషులుగాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణుసాన్నిధ్యము పొందుదురు. ఎవరయినా తెలిసిగాని, తెలియకగాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమిరోజుననూ నదీస్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పొడ్యమినాడు స్నానముననూ అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానముచేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్దించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపూర్ణము వినిన మోక్షప్రాప్తి కలుగును.

అని గౌతమముని ఆ మునివనితతో చెప్పినటుల మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.

Magha Puranam 16 - మాఘ పురాణం 16 ఆడకుక్కకు విముక్తి కలుగుట

మాఘ పురాణం - 16 వ అధ్యాయం

ఆడకుక్కకు విముక్తి కలుగుట

దిలీప మహా రాజా! సుమిత్రుని కథ ఈశ్యరుడు పార్వతీదేవికి చెప్పినరీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను.ఆదెట్లనా-

మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచునప్పటికీ మాఘస్నానము మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రామైననూ సంశయము లేదు. అని పార్వతీ దేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీ మరల ఇట్లు పలికెను,

"నాధా! శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరిగదా! ఆ వ్రత విధాన మెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరముగా తెలియపరచు" డని పార్వతీ దేవి పరమేశ్యరుని కోరినది.

అంతమహేహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను "మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానముచేసి నది ఒడ్డున గాని, ఇంటివద్దగాని, మంటపమువుంచి,
ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో మ్రుగ్గులు పెట్టి మంటవము మధ్య ఎనిమిది  రేకుల పద్మము వేసి అన్నిరకాల పుష్పములు. ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపుమధ్యమున వుంచి గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు 
రాసి పూజించవలెను.

రాగి చెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్ళును ఉంచి దానిపై కొబ్బరికాయపెట్టి, క్రొత్తవస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్టించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో,
సాలగ్రామమును వుంచి యొక్క సద్బ్రాహ్మణుని ఆహ్వానించి, వారిచేత పంచామృతస్నానం చేయించి, తులసి దళముతోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను,

తరునాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రధాన మివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.

మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, పప్పు వుప్పు, కాయగూరలు
పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు వుంచిగాని, క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని, దానమియ్య వలయును మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని లేక వినునపుడుగాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతున్నిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపైవేసుకోవలయును. గాన శాంభవీ! మాఘస్నానము చేసి మాఘశుద్ధదశమినాడు. లక్ష్మీనారాయణులను నిష్టతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపము లైనను నశించిపోవును, ఇందులకొక ఉదాహరణకూడ తెలియజేసెదను సావధానురాలవై వినుము.

గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధక్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్ఠా గోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుటనలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిదిచేసిరి.

గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయములో స్నానముచేసి తీరముననున్న ఒక రావి చేట్టువద్దకువచ్చి

శ్లో
॥ మూలతో బ్రహ్మారూపాయ మధ్యతో విష్ణురూపిణే
        అగ్రాతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమః॥

అని రావి చెట్టునకు నమస్కరించి ఆ చెట్టుమొదట అసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట, మండప మేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలుకట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము వుంచి పూజంచినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడు కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు, ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొనివుండెను. శిష్యులు వారివద్దనున్న దండముతో దానిని బెదరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తరదిశవైపు మళ్ళి మరల తూర్పు వైపునకు తిరిగి, ఆవైపునుండి దక్షిణ దిశకు కదలి మరల యధాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి.ముందు చేసినటులే రెండవసారికూడా. ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా వారి దండములతో బెదరగొట్టగా మరల ఆకుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి మండపము చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము ఆయివున్నందున వెంటనే అ కుక్క రూవము వదలి ఒక రాజుగా మారిపోయాడు, ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి మునులందరికి నమస్కరించెను. అక్కడ నున్న కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.

"ఓయి! నీ వెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించాడు.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు, నా దేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూవున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసి యున్నాను, ఎక్కువగా అన్నదానము తిలదానము చేసియున్నాను. అనేక చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించినాను. ధర్మశాలలను కట్టించినాను, పశువులు త్రాగుటకు నీటిగుంటలు త్రవ్వించినాను. నిత్యము బీదప్రజల నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్య కార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవవిగ్రహాలను ప్రతిష్టించినను. సద్బ్రాహ్మణులచేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియిన్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా మీకు విశద రచెదను వినుడు.

ఒకానొక దినమున ఒక మునిఫుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయాలన్న సామాన్య విషయము కాదు కదా! దానికి కావలసిన, ధనము వస్తుసముదాయము చాల కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకువచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఏదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశలప్రశ్నలడిగితిని. మునియూ నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియ బేయుదును. ఈ మాసములో మఖర రాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానముచేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యములు చదువుటకాని లేక. వినుటగావి చేయుము. దానివలన వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాక అశ్వమేధయాగము చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలముగాని, తీర్ధస్నానాలు చేయగా వచ్చిన ఫలముగాని లేక దాన
పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుద్గ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చినగాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు, 

ఒక వేళ ఇతరజాతులవారైననూ మాఘమాసమంతట నిష్ఠతో నదీస్నాన మాచరించి దానధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును, అని ఆ ముని
వర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లాంటిని.

"ఆయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరింపను, ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటికాదు. గాన మాఘస్నానములు చేయుటగాని, దాన పుణ్యాదులు జేయుటగాని, పూజానమస్కారములు ఆచరించుటగాని చేయును. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంతకష్టము.! ఇక నాకు ఈనీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలముచాలు" అని ఆ మునితో అంటిని.

నా మాటలకు మునికి కోవంవచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, చేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.

అంతట నేను ఆ మునిచేతులువట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసికొనిపోయెను.

ఆ విధముగా. నేను కొంత కాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మ వచ్చినది. ఏడుజన్మలూ నాకు కుక్కజన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా ఏడు జన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసితినిగాని నా పూర్వ జన్మ నాకుకలిగినది. దైవ యోగమును ఎవ్వరునూ తప్పించ లేరుగదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను" అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని అశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తు గటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యదార్ధములే, నీవుకుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

"నేను నా శిష్యునితో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణితీరమందుండిన కృష్ణానదిలో మూఘమాస మంతయు స్నానములు-జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమనివచ్చి యుంటివి మేమందరము ఈ వృక్షరాజము క్రీంద విష్ణువిగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్కరూపంలోనున్న నీవు దారినిపోతు ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజాసమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీ శరీరము బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యంగా నున్నావు. పరిశుద్ధులమైభగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువుగాని, పక్షిగాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా వున్నందున శిష్యులు నిన్ను తపోదండముతో తరిమిరి. , నైవేద్యము తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టుతిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు, అట్లు మూడు పర్యాయనులు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూమును ప్రసాదించినాడు. అనగా మాఘమాసఫలము భగవంతుని మండపము చుట్టు తిరుగుటనలన పునర్జన్మ వచ్చినదన్న మాట. ఇక మాఘమాసమంతయూ నదిలో స్నాసముచేసి భగవంతుని ఛ్యానించి పురాణపఠనము జేసినచో ఎంతటిఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని వరివారమంతటికీ నమన్కరించుచుండగా అంతలో ఆ రావి చేట్టులోనున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడీ బెకబెకమని అరచి, అటుఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపమువద్దకు వచ్చి కొంచెము చూచుచుండగా హఠాత్తుగా కప్పరూపమును వదలి మునివనితగా మారిపోయెను.

ఆమె నవ యౌవ్వనవతి, అతి సుందరాంగి, ఆమె 
గౌతమఋషినిచూడగానే తనకుజ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది.

అంత గౌతమముని-అమ్మాాయీ! నీ వెవ్వరివెవ్వరిదానవు? నీనామదేయమేమి? నీ వృత్రాంతము తెలియజేయుము అని ప్రశ్నించిరి.

గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియుటచే యిట్లు చెప్పదొడంగెను.

Magha Puranam 15 - మాఘ పురాణం 15 సుమిత్రుడు పశ్చాత్తాపము పొందుట

మాఘ పురాణం - 15 వ అధ్యాయం

సుమిత్రుడు పశ్చాత్తాపము పొందుట

సుబుద్ధియు అతని కుమార్తె ఆమెభర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగినఫలితముచే సమస్తదోషమును పోగొట్టుకొని సుఖంచిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగాతిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను.

“నాధా! సుబుద్ధికుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి మరి 
సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు వినకుతుహలముగానున్నది” అని
సాంబ
శివుని కోరినది, అందుల కా పార్వతీపతి యిట్లు వివరించెను.

సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తానువేసిన పాపమునకు ఫలిత మనుభవించుచుంటినిగదా యని పశ్చాత్తాపమనస్కుడై గురువు గారి వ్రద్దకు పోయి గురువుపాదములపై బడి "గురువరా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అదినాదోషము కాదు. నేను పూజ్యా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని, దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుటచూచి నెమ్మదిగా నావెంటవచ్చినది నేను అటు అడవిమధ్యకు పోయి ఒక కోనేటివద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలలో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు, నన్ను బలవంతము పెట్టినది, నన్నుక్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభంలేదని “నాతో నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణ త్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయముకలిగి నిజంగా అమె ప్రాణ త్యాగమే చేసుకున్న చో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీలేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేనుకూడ పాపరహితుడ నెటులకాగలనో సెలవిండని బ్రతిమాలెను.

శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన 
కుమార్తెవలె తన శిష్యునిగూడ పాపరహితుని జేయ నెంచి సుమిత్రా! నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పావరహితుడవు
కాగలవు, అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సుచేసుకొనుము, ఆ తపస్సుచే కలుగు ఫలితమువలన పా
ము మబ్బు విడిపోయినటుల నశించుపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.

“ధన్యోస్మిధ
న్యోస్మి" మీయజ్ఞప్రకారము నేనిప్పుడే ప్రయాణసన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకుదండ ప్రమాణములాచరించి గంగానదితీరమునకు బయలుదేరెను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమన గుట్టలు, కొండలు, సెలయేళ్లుదాటి ఒక  అరణ్యమధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాదమొనరించు దృశ్యములు కనుపించినవి. కౄరమృగములు సాధు జంతువులు కలసి మెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి, పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము
కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సున కానంద మొన్నరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఓక వటవృక్షము క్రింద విశ్రమించి, నలుదిశల పరికించిచూడగా ఒక ఆశ్రమము కనిపించినది.

వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకువచ్చితొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప  నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి "హరిహరీ" యని బిగ్గరగా కేకలువేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. అదృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజపూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న  సుబుద్ధికి కూడ  ప్రసాదమివ్వగా “స్వామి! మీరాచరించిన వ్రత మెట్టిది? దీనివలన ఫలిత మేమి కలుగును! మనుజుడు పాపరహితుడగునా? ఈ నాసందియములను దీర్పవేడుచున్నాను” అని వినయముగా ఆమునిసత్తముల నడిగెను.

పాపములచే పీడింవబడు చున్న సుమిత్రుని ప్రార్థనవిని అచటనున్న మనుజులందరూ మాఘమాస మందాచరించవలసిన ధర్మమును అతనికి వివరించుటకుగాను వారిలో నొకరిని నియమించిరి అంత నా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు
వివరించెను.

“విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాసవ్రతము ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటి నన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంతమాత్రమున అవి యన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపములన్నియు నశించిపోవును. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానముచేయునో అట్టిమనుజుడు శ్రీహరికి ప్రియుడగును, ఎట్టిదోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘవురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన మొనర్చువారు వైకుంఠవాసులగుదురు. ఆలాగున చేయనివాడు, అసత్యములాడు వాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పర స్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్యము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్షములు చెప్పుట, జనసమర్థముండుచోట మలమూత్రములను విడచుట, గుఱ్ఱములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి, చేయువారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమనము. మరియు ధైవ సంబంధమగు ధనమును అపహారించువాడు, ఏ పుణ్య దినములలోనై న శుచిగా స్నానముచేసి దేవుని ప్రార్థించనివాడు, దాన మిచ్చెదనని వాగ్దానముచేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి రత్నములు సాల గ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టుడై జార చోరత్యములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహా పాతకములు చేసినవారితో సమానులగుదురు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహీంసలు చేయువాడును బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయవాడును మహాపాతకులు. అట్టివారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహసంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనము అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసినవానిని జూచి ఎగతాళిచేయువాడును బ్రహ్మహత్య చేసినవానితో సమానుడగును.

గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం, ఈ వ్రతం చేయుటనలన మాకు ఏమాాత్రమూ పైన  చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును, ఇది ముమ్మాటికీ నిజం.
అందుచేతనే మేమందరను మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము.

మాఘమాసం ప్రారంభముకాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానంచేసి సూర్యునికి నమస్కరించి? నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకుపోయి శ్రీహరికి పూజచేసి, తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆ విధముగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును, మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత గాన యా మాసమందు ఆచరించిన స్నానమువలన కల్గు ఫలము నిచ్చువాడు అతడేగనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. ఒక వేళ నదీతీరమందుగాని, చెఱువు దగ్గరగాని విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమునుగాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు దూపదీప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణశ్రవణము గావించవలయును.

ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మాణునకు వస్త్రములు,  బంగారము ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టాలి, ధనమున్న నారు బ్రాహ్మణా సమారాధన చేసిన యెడల ముకోటిదేవతలు సంతసించుటేగాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలుగదు. ఈ నావచనములు అనత్యములు కావు. ఇప్పటి వరకూ మాఘస్నాన ఫలిత మంతయు విన్నావుగదా! ఇక మాఘమాసం మూడుదినాలు మాత్రమే వున్నది, గాన ఈమూడు దినములలోను ఈనదిలో స్నానముచేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవుకమ్ము" అని మునీశ్వరులు తెలియజేసెను.

అంత సుమిత్రుడు తనగురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు బోయి తపస్సు చేసుకో మనిచెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.

"నీగురువు చెప్పిన విషయం యదార్ధము. నీగురుపుత్రికతో గూడి రతిసల్పినావు. అందు నీదోష మేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించింది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడ నరక బాధలు తప్పవు. గాన ఈ మాఘమాసమందలి మూడుదినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము, తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురుపు చేప్పినవిధముగా భక్తితో తపస్సు చేసిన యెడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు స్వార్ధము, చంచలభావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము" అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడుదినములుండి మాఘస్నానములు చేసి, నదీతీర మందు విష్ణువును పూజించి, పురాణపఠనము గావించెను. తదనంతరము ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీతీరమునకు తపస్సు జేయుటకై వెళ్లిపోయెను.

Kadaliphala Phalam - కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందళి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. కానీ ఆమెకు దైవభక్తి ఎక్కువ.ఎప్పుడూ ధ్యానం లో నిమజ్ఞురాలై ఉండేది. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కానీ ఆమెకు దైవ భక్తి ఎక్కువ. ఆమె ఎప్పడూ దైవభక్తిలో లీనమై ధ్యానం చేస్తూ ఉండేది. పతి భక్తి కన్నా దైవభక్తి ఎక్కువ. దుర్వాస మహాముని యొక్క నిత్యనైమిత్తిక పూజలకు సహాయంచేయక ఎప్పుడూ ధ్యానానిమజ్ఞురాలై ఉండెడిది. కొంతకాలానికి తన తప్పు తెలుసుకొని శని దేవుని ప్రార్ధించి ఎప్పుడూ తన భర్త యొక్క దేవుని సేవలో అర్హమయే ఒక పూజా వస్తువుగా మార్చమని కోరింది. శని దేవుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె కోరికని విన్నాడు.

ఒకనాడు దుర్వాసమహర్షి కందళీ దేవితో నేను కొంత సమయం విశ్రాంతి తీసుకొందును సంధ్యాసమయంనకు పూర్వం మేల్కొలుపు అని కోరి విశ్రమించినాడు. ఆమెనూ ధ్యాన నిమజ్ఞురాలై కాలాతీతమును గమనించలేదు. ధ్యానం నుండి బయటకు వచ్చి చూచుసరికి కాలాతీతమైనది. అంత కందళీ దేవి మహర్షిని నిద్ర లేపగా, లేచిన మహర్షి కాలాతీతమును గమనించి కోపోద్రేకుడై ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు. 

కొంతతడవకు శాంతించి జ్ఞాననేత్రం ద్వారా ఇదిఅంతయు శనిదేవుని వల్ల జరిగినదని తెలుసుకొని కోపించి శనిదేవుని శపించ బోవ అంత శనిదేవుడు ప్రత్యక్షమై కందళి దేవి యొక్క కోరికను వివరించి ఆమె భస్మమును పూజకు పనికివచ్చే విధముగా మార్చమని కోరెను. అంత ఆమె యొక్క భస్మరాశిపై పవిత్ర మంత్రజలం ప్రోక్షించి ఆమెను ఒక కదళీ వృక్షంగా మార్చి ఈ వృక్షం యొక్క ఆకులూ,పళ్ళు సమస్తము దేవుని పూజకు అర్హమవుతాయని పలికి తన తపోదీక్షలో లీనమైనాడు.

శ్రీవత్స

Saturday, January 31, 2026

Magha Purnima - మాఘ పూర్ణిమ Poornima

మాఘ పూర్ణిమ

మాఘ పూర్ణిమ సందర్భంగా నదిలో స్నానం చేయడం ఎంతో పుణ్యం. స్నానం చేసిన తర్వాత అన్నదానం దానధర్మాల వల్ల మీ జీవితంలోని పాపాలు, గత జన్మ పాపాలు తొలగిపోతాయని  భావిస్తారు.

పూర్ణిమ రోజున, శ్రీమహావిష్ణువు కు ఎంతో ప్రీతికరమైన రోజు. కావున ఆరోజు విష్ణు అవతారలకు  మరియు హనుమంతుని పూజిస్తారు. ఈ రోజున విష్ణువు, హనుమంతుని పూజించిన కోరికలు  నెరవేరుతాయని విశ్వాసం.

మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తొలగడానికి మాఘ పౌర్ణమి రోజు సూర్యుడిని, అమ్మవారిని పూజించాలి.

మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి మంత్ర సాధన చేయడం యంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. త్వరగా మంత్ర సిద్ధి జరుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. దశమహావిద్యలు త్వరగా సిద్ధిస్తాయి.

మాఘ మాసంలో దేవతలు స్వర్గం నుండి దిగి గంగా నది ఒడ్డున ఉంటారని చెప్తారు. ఈ మాఘ పూర్ణిమ రోజున నదీస్నానం లేదా సముద్రస్నానం ఎంతో శ్రేయోదాయకం. ముఖ్యంగా గంగానది సముద్రంలో కలిసేచోటు అనగా గంగాసాగర్ లో పుణ్యస్నాన మాచరించిన ఎంతో పుణ్యప్రదం.

ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో ఉంటాడు, చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, మాఘ పూర్ణిమ నాడు నదీ లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సూర్యచంద్రులకు సంబంధించిన అన్ని కష్టాలు తీరుతాయని నమ్ముతారు. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల శరీరానికి బలం మరియు శక్తి లభిస్తుంది.

మాఘ పూర్ణిమ కథ

పురాణాల ప్రకారం, ధనేశ్వర్ అనే బ్రాహ్మాణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఓరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళిక దేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటినుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా, కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

చంద్ర దోషం నుంచి విముక్తి కోసం
ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ‘ఓం శ్రామ్ శ్రీమ్ శ్రౌమ్ సః చంద్రాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.


Magha Puranam 14 - మాఘ పురాణం 14 బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట

మాఘ పురాణం - 14 వ అధ్యాయం

బ్రాహ్మణ స్త్రీ భర్తతో  స్వర్గమునకు వెళ్ళుట

ఓ దిలీపుడా! మాఘమాసములో స్నానమాచరించుట వలన కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివికదా! అటులనే విప్రకన్య తనభర్తతో ఎటుల విష్ణుసాయుజ్యమును పొందెనో వివరింతును సావధానుడవై ఆలకింపుము.

పూర్వకాలమందు కాశ్మీర దేశ మందుగల ఒక గ్రామములో సుబుద్ధి యను బ్రాహ్మణుడు కలడు. అతడు నాలుగువేదములు చదివి అర్థ తాత్పర్యసహితిముగా వర్ణించగల పండితుడు. చదువు నందెటుల పాండిత్యముగలదో బుద్దియందును పేరుకుతగినటులే పెద్దలను గౌరవించుట, భూతదయగలిగి, అందరి మన్ననలను పొందియుండెను. అతడు గొప్ప పండితుడగుటవల్ల ఆనేకమంది ఇతర వండితులు అతని వద్దకు జేరి శిష్యులైరి, అ బ్రాహ్మణుసకు పది సంవత్సరముల బాలికమణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూవవతి, సుగుణాల రాశి, అందాలబరిణి లేడి కన్నులవలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రునివంటి ముఖము గలది. తుమెద రెక్కలను పోలు నల్లని పొడ గాటి తలవెంట్రుకలు గలది, ఆమె నడచినయెడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖవర్చస్సు గలది, కోకిల కంఠమువంటి మధురమైన కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు, పండ్ల వరున చూచినవారికి మరల మరల చూడ వలయునను కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతునాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను.

ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి. ఇంటజరుగు దైవ కార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలు దేరి వెళ్ళుచుండగా, దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను, ఆ బంతి బైటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీలవచ్చి సుమిత్రుని చూచినది.

సుమిత్రుడుకూడ యుక్త వయస్సులో నున్నాడు.చక్కటి అవయవసౌష్టవం కలవాడు, విశాలమైన వక్షముకలిగి, బంగారు కాంతిగల రూపవంతుడు, అతని అందమును సుశీల చూడగానే నివ్యెర పోయినది. అతనిని తదేకదృష్టితో చూచి అతని వెంటబడినది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలదూరమేగెను. అలా కొంతదూరమేగుసరికి ఒక కోనేరు కనుపించెను, ఆ కోనేరునిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి, తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోను, పండ్ల తోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి, మగ నెమళ్ళు ఆడ నెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమతమ పింఛములను విప్పి నాట్యమాడు చున్నవి, నీటి జంతువులు తామరతూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పై కెగిరిపడుతూ నీటిలో ఈదుచున్నవి సుమిత్రుడు దూరంనుంచి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు
గ్రోలి చెట్లనీడను విశ్రమించి యుండెను. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి సంపెంగ పువుల వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రీంద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని
సౌందర్యమును కనులార చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించింది. "ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు న మనస్సు న స్వాధీనములో లేదు. అందులకే నీ వెనుక ఇంతదూరం వచ్చితిని. ఈ ఏకాంతప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము.
చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు, నీవయసు, నావయసు సరిసమానము.
ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె నున్నాము చిలకా గోరింకలవలెను, రతీమన్మధులవలెను లీనమైపోవుదము. ఆ చెట్టుపైనున్న గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన అతుమెదల జంటల చూడు ఏలాగున్నవో! కాన రమ్ము నాయవ్యనబింకాన్ని ఆఘ్రాణించుము, సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములను నీ కర్పింతును. నీవు మన్మధునివలె వచ్చి నన్ను కాగలించుకో” అని అనేక విధాల ఆ విప్రకుమూరుని తొందర పెట్టసాగెను.

అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాటరాక శిలావిగ్రహమువలె ఉండి తేరుకొని తరువాత బాలా! నీ మాటలు చూడ పిచ్చి దానివలెనున్నావు, నీకేదైనా గ్రహము అవరించినదా ? అని సందేహము కల్గుచున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు, నేను నీకు అన్ననగుదును నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలోనున్నావు నీ వెంతటి అందగత్తె
వయినను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు, అదిగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి, గాన నీ ప్రయత్నమును మానుకోనుము. నీకు కష్టములెదురౌను. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మన మిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు వున్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను, ఏ యే జన్మలెత్తినను మనలను వెంటాడుచునే వుండును, ఆ నరక బాధలనుండి - మన మెన్నటికిని విముక్తి నొందజాలము కాన నీకోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాల ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినటుల గరువర్యులకు తెలిసినచొ నిన్ను దండింతురు గాన రమ్ము. ఫలములు, కుశలు పుష్పము మొదలగు పూజాద్రవ్యములను దోడ్కొని పోవుదము" అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు.

అంత నా కన్యయు, బంగారము, రత్నము, విద్య, అమృతము, తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడుగని వివేకవంతుడుగాడు. నానిండు యవ్వనాన్ని, నా'శరీరాన్ని సమస్తమును నీ కర్పింతునన్న నిరాకరించుచున్నావుగదా! సరే నేనిక వంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగ మొనర్చుకొందును. నీవలన ఒక కన్య చనిపోయినదని నలువురూ నిన్ను ఆడిపోసుకొందురు. నన్నొంటరిగా యీ కారడవిలో వదలి ఇల్లుచేరినయెడల నా దండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదియని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయెనని చెప్పియే యుందురు, గాన నేను కామ బాధ భరించ లేకున్నాను. నాతో సంభోగింపుము. నన్ను నీదానను చేసికొనుము” అని పలికెను.

సుమిత్రుడు ఆమె దీనాలాపము లాలకించి సంకటస్థితిలో పడెను. కొంత తడవు ఆలోచించి, ఆ బ్రాహ్మణకన్యతో రతీ క్రీడల దేలుటకే నిశ్చయించుకొనెను.

"శాంకరీ! ఈ విధముగా వారిరువురునూ ఆతటాక సమీప మందొక ప్రదేశమును శుభ్రముచేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు విదజల్లు పుష్పములు బరచి ప్రకృతి సౌందర్యములను జూచి మురిసిపోయి కామతృస్న దీర్చుకొని, మరికొంత సేపు బంతులడి గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొనిరి. వారి కామ వికారములనుచూచి, పక్షులు సిగ్గుపడి అచ్చోటినుండి ఎగిరిపోయినవి. సాధుజంతువులు మొగములుముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులో కలువలు మెడవంచినట్లు నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటున దాగున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలుగూడ సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవుండి సమిత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖముపట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి, తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించెను. అడవికిపోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెనుజూచి “సుశీలా! నీవు ఉద్యానవనములోని చెలులతో బంతులాటలాడి చాల అలసిపోయివున్నావు, పాపము! ఎందుకు నీ
సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయివున్నదోకదా! రమ్ము ఈ మధుర వదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుటవలన నీవు ధరించిన - ఉడుపులుకూడ నలిగియున్నవి. అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురు పైకి ఏమియు ఎరగనిదానివలె నటించెను. మరి కొంత కాలమునకు సుశీలను హీమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడు డోకడు పెండ్లియాడి అత్తవారింటనే నుండిపోయెను.

మరికొంత కాలమునకు సుశీలను "పెండ్లి యాడీన బ్రాహ్మాణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల యేడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెనుకదా! అని గొల్లుమని ఆడదానివలె తండ్రి ఏడ్చుచుండెను. “ఓయీ భగవంతుడా! చిన్నవయసునందే ఇంకనూ సంసారసుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రిదీని కాలమెట్లుతీరును? ప్రజలు విధవను జూచిన యెడల అమంగళకరమని భావింతురే? ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరుకదా! దీనికి కర్మ నేలా కలిగించితివి!” అని పరి పరి విధములుగ దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్లి సుబుద్ధితో “ఆర్యా ! మిరు దుఃఖించుటకు కారణమేమి ? త్వరగా చెప్పుడు" అని పలికెను.

అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో స్వామి! మా దుఃఖముగురించి ఏమని చెప్పుకొందును, మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనామ్ కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయినవారు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు, మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కల్గిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమె కీ దుస్థితి ఎందుకు కలిగెనో ఈమె పూర్వజన్మ మెటువంటిదో మీకు తెలిసియున్న యెడల సెలవిండు" అని వేడుకొనెను.

సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టి చే అంతా గ్రహించి, "విప్రవర్యా! నీ కుమారై వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా వుండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంవర్కము కలిగివుండి, తన భర్త నిద్రలో నుండగా అర్థరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను, ఆ రక్తపాతము భయానకదృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడ ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది, అటువంటి ఘోరాహత్య చేసి, ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషమువల్లనే నీ అల్లుకు చనిపోయాడు, ఆమెకు చుట్టుకున్న పాతకమువలననే విధవరాలై నది, అంతటి పాపాత్మురాలు అయినప్పటికి పుణ్యాత్ములగు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తంతాము గూడా వివరించెదను వినుము.

చాల సంవత్సరాల క్రిందట అనగా నీ కుమార్తెయొక్క పదునాల్గు జన్మల వెనుక మాఘమాసములో
సూర్యభగవానుడు మకరరాశియందుండగా, కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ
తీరమునకు బోయి, స్నానముచేసి ఇసుకతో గౌరీ దేవి ప్రతిమను జేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ దేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమెకూడా పాల్గొనుటవలన ఆ వచ్చిన పుణ్యఫలం చేత నే నీ వంశములో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి? నీ శిష్యునితో రహాస్యంగా అడవికిపోయి తన కామవాంచ కొఱకు, అతనితో రమించినది. అందువలననే యా వైధవ్యం కలిగినది. పూర్వజన్మలో చేసిన పాపకర్మ, ఈ జన్మలో పాపకర్మవలననే కుమార్తెకు అకాల వైధవ్యము కలిగినది.ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది! కానున్నది కాక మానదు, మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా ! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు
సుబుద్ధి “హారివారీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసివచ్చినది. పూర్వజన్మలో యి నా కుమార్తె తన భర్తను హత్యచేసి తానూ అత్మహత్య చేసుకొన్నది? సరే ఈ జన్మలో కూడా కన్యగావుండి నాకు
కుమారునితో సమానుడు, తనకు సోదరుడులాంటివాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటిఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామి ! మీ పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరొకవైపు ప్రేమ కలుగుచున్నవి, గాన కుమార్తె పాపమునుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించవలసినదిగా కోరుతున్నాను” అని పలికెను.

సుబుద్దీ! నీ కుమార్తె గురించి నీ వడగకపోయిననూ తన్నివారణోపాయము వివరించవలయుననియే నేను యిలా వచ్చినను. ఈ మాఘమాసంలో నీ కుమార్తేచేత నదిలోగాని, చెరువులోగాని సూర్యోదయం కాగానే స్నానముచేయించి, అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యము లిచ్చి పూజలు చేయించుము. ఈ విధముగా మాఘమాసమంతయు నీ కుమార్తెచేత చేయించిన యెడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలిగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును.

మాఘశుద్ధ విదియనాడు ముత్తైదువుల పాదములకు పసుపురాసి నుదుటబొట్టుపెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్తచేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికలగుడ్డ పసుపు కుంకుమ, పండ్లు, తమల పాకులు, వక్కలు దక్షిణ పెట్టి దాన్నిపై రెండవ చేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగాభోజనము పెట్టి సంతోష పెట్టవలయును. ఆ విధముగా చేసినయెడల పరపురుష సాంగత్యము వలన కలిగిన దోషము నివారణ యగును.

కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానము చేయవలయునన్న అయిష్టత చూపుదురు గాన, అట్టివారల భార్యలయిననువారిని ప్రోత్సాహవరచి, వారుకూడా నిష్టతో మాఘమాసస్నానములు చేయవలయును. వంశాభివృద్ధికిగాని. కుటుంబ గౌరవానికిగాని, స్త్రీయే ప్రథాన కారకురాలు కనుక ఈ మాఘమాసస్నానము తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాస మంతయు పురాణములు చదివి హరికధలుగాని హరినామ కీర్తనలుగాని ఆలకించుచు, దాన ధర్మములు చేసినయెడల దానికన్న ఫలితముమరొక ఏవ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాసస్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేనివారలచే మాఘస్నానములు విడువక చేయించినియెడల వారిపిచ్చి కుదురును. కుష్టువ్యాధితో భాధపడువారు మాఘస్నానములుచేసిన వారికి రోగనివృత్రియగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు.స్త్రీగాని , పురుషుడుగాని మాఘమాస స్నానములు డాంబికములతో నాలుగురుచూచి పొగుడుతున్నట్టుగా గాక చిత్తశుద్ధితో స్నానములుచేసి విష్ణు దర్శనము. సూర్య నమస్కారములు, పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు అటుల చేసిన "చిత్తశుద్ధిలేని శివపూజలేలయా” అనురీతిగా నిష్ప్రయోజనము లగును. అని సుబుద్ధికి బిక్షాటనకై వచ్చిన సిద్ధుడుపదేశించెను.

ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ది తనకుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కాంచినవానివలె లేచి జరిగిన వృతాంత్తమును విని తానుకూడ తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను.

Friday, January 30, 2026

Magha Puranam 13 - మాఘ పురాణం 13 శివుడు పార్వతికి మాఘమాస మాహాత్మ్యమును వివరించుట

మాఘ పురాణం - 13 వ అధ్యాయం

శివుడు పార్వతికి మాఘమాస మాహాత్మ్యమును వివరించుట

వశిష్ఠులవారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించాను.

"మహామునీ! ఈమాఘమాస మాహాత్మ్యమును ఇంకను వినవలయుననెడికోరిక ఉదయించుచున్నది. గానసెలవిండ"ని ప్రార్ధించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగాను.

మున్ను పార్వతీ దేవికి శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యము గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము.

ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునగు కైలాస పర్వత మందలి మందారవృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చునివున్న సమయమున జగజ్జనని యగు పార్వతీ దేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి, - "స్వామి! మీ వలన ననేక పుణ్యసంగతులు తెలిసికొంటిని. కానిప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలె ననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమం దాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన! నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను.

దేవీ!నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము.

సూర్యుడు మకర రాశియందు నుండగా మాఘమాసమందు ప్రాతః కాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో, అతడు సకల పాపములనుండి విముక్తు డగుటయేగాక, జన్మాంతమందు మోక్షమును పొందును. ఆటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా, ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాదు, జీవనది వున్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్న చోటగాని తటాక మందుగాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయీగాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానము జేసిన విష్ణులోకమునకు పోవును, మూడవనాటి స్నానము
వలన విష్ణుదర్శనం కలుగును, మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందుగల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు.

దేవీ మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందు వుండగా ఏది అందుబాటులోనవున్న అనగా- నదిగాని, చెరువుగాని, నుయ్యిగాని, కాలువ
గాని లేదా పాదము మునుగునంత నీరున్న చోటగాని ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి, శివాలయమునగాని, వైష్ణవాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆర్చనచేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.

ఏ మానవునకైననూ తన శరీరంలో శ క్తి లేక, నడువ లేనటువంటివాడు. గోవు పాదం మునుగునంత నీరున్న సెలయేటి యందైనను కడకు బావియంధైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము
చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ, వాని కష్టములు మేఘమువలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశి యందుండగా నదిస్నాన మాచరించిన యెడల అతినికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానంచేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణం చదివి, విష్ణుమందిరమునగాని, శివాలయమునగాని దీపం వెలిగించి ప్రసాదం సేవించినయెడల అతనికి తప్పక విష్ణు లోక ప్రాప్తి గలుగుటయేగాక, పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించ వచ్చును.

మానవుడు నారా జన్మ మెత్తిన తరువాత మరల ఘోర పాపములుచేసి మరణానంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుటకంటె తాను బ్రతికి ఉన్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించి, వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరంగదా!. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గరమార్గం. గాన ఓ పార్వతీ ఇంకనూ వినుము ఏమానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు ఎటువంటి భాధలనుభవించునో వివరించెదను సావధానురాలవై ఆలకింపుము.

నేను తెలియ జేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతః కాలమున. జపంగాని, విష్ణుపూజగాని యధాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవించును.కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, రంపముల చేత, ఖడ్గముల చేత, నరుకబడును, సలసల క్రాగు తైలములో పడవేయబడును. భయంకరయమకింకరులచే పీడింపబడును.

ఏ స్త్రీ వేకవజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానముచేసి సూర్య నమస్కారము విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి, ఆత్తమామల సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీ కి ఐదవతనము వర్ధిల్లి, ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు
అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.

మాఘమాస స్నానమునకు వయోవరిమితి లేదు, బాలుడైనను, యువకుడైనన్ను, వృద్ధుడైనను, స్త్రీ యైనను, బాలికైనను జవ్వని యైనను మాఘమాస స్నానమాచరించవచ్చును, ఈ మాసమంతయు కడు నిష్టతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది.

పార్వతీ! దుష్టులలో స్నానంచేసినవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము . దొంగిలించినవారు, గురు భార్యతో సంభోగించువారు, మధ్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీస్నానంచేసి విష్ణువును పూజించిన యెడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును, మరియు కులభ్రష్టులైనవాడును, కించిత్‌ మాత్రమైననూ దానధర్మములు చేయని వాడునూ, ఇతరులను వంచించి, వారివద్ద ధన మపహారించిన వాడును, అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్ర ద్రోహియు హత్యలు చేయువాడును,బ్రాహ్మణులను హింసించువాడును,సదా వ్యభిచార గృహములో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించువాడును, రాజద్రోహీ, గురుద్రోహీయు, దైవ భక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తాను గొప్పవాడనను
అహంభావముతో దైవకార్యములను, ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి, సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగుల బెట్టువాడును, చేడుపనులకు ప్రేరేపించువాడును, ఈవిధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానముచేసిన యొడలవారందరు పవిత్రులగుదురు.

దేవీ! ఇంకను దాని మహాత్మ్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూరకర్మములు ఆచరించువాడును, సిగ్గువిడిచి తిరుగువాడును, బ్రహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన
యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును, మాఘమాస స్నానములు ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్పలితము కలుగును, ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండీ ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో
ఆటువంటి మానవులకున్న పాపములు తొలిగిపోయి, ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జెర అర్హుడగును.

శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది, అన్ని జాతులలో
బ్రాహ్మణు డధికుడు, అన్ని పర్వతాలలో మేరుపర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచే ఆ మాసమందాచరించే ఏ స్వల్ప కార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగ జేయును, చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా నున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానము చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టేలు తెచ్చి, అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత
స్నానము చేయించినయెడల ఆ స్నానఫలము పొందగలరు, అదియును గాక చలికాగినవారు స్నానముచేసి శ్రీవారిని దర్శించిన పిదవ అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచియై ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల మంచి ఫలితం కలుగును.

ఈ విధంగా ఆచరించినవానిని జూచి ఏ మనుజుడైననూ అపహాస్యముగా జూచినను, లేక అడ్డుతగిలిననూ, మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, తన భార్యను, లేక కుటుంబసభ్యులందరినీ మాఘస్నాన మాచరించునటుల ఏ మానవుడు చేయునో, అతనికి మాఘమాస ఫలితము తప్పకకల్గును. ఆ విధముగానే బ్రాహ్మణునిగాని, వైశ్యునిగాని, క్షత్రియునిగాని, శూద్రునిగాని, మాఘమాసస్నానం చేయమని చెప్పినయెడల, వాడు పుణ్యలోకము బోవుటకు ఏ అడ్డంకులు వుండవు, మాఘమాస స్నానములు చేసినవారికిగాని లేక వారిని ప్రోత్సహించువారలను జూచిగాని ఆక్షేపించి,పరిహాసం లాడువారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశాక్షీణము కలిగి దరిద్రుడగును.

నడచుటకు ఓపిక లేనివారలు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని, తలపై నీళ్లు జల్లుకొని సూర్యనమస్కారమును జేసి మాఘపురాణమును చదివిగాని, వినుటగాని, చేసిన యెడల జన్మాంతమున విష్ణుసానిద్యము పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘస్నానముగన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘస్నానము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా నూరు అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చిన నెంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాసస్నానము అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మాణహాత్య, పితృహత్యా మహా పాతకములు చేసిన మనుజుడైనను, మాఘమాసము అంతయు కడు నిష్టతో వున్న యెడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.

గనుక ఓ పార్వతీ! మాఘమాసస్నానమువలన యెట్టి ఫలితము కలుగునో వివరించీతినిగాన నే చెప్పిన రీతి ఆచరింపుము.

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...