అభిమానమెన్నడు కల్గురా
తాళం : ఆది
రాగం: వివర్ధని ( మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజఆరోహణం: స రి2 మ1 ప స
అవరోహణం స ని2 ద2 ప మ1 గ3 రి2 స
పల్లవి
అభిమానమెన్నడు కల్గురా
అనాథుడైన నాదుపై నీకు
అనుపల్లవి
అపరాధములన్ని మన్నింపుమయ్య
అభిరామ పట్టాభిరామ నాయందు (అభిమానము)
చరణము
కన్న తల్లియు కన్న తండ్రియు
అన్నియు నీవేయని నమ్మ లేదా
నిను వినా గతి నాకెవరు లేరే
నన్ను బ్రోవు త్యాగరాజ వినుత
No comments:
Post a Comment