Tuesday, December 31, 2024

RAMACHANDRAYA JANAKA MANGALAM - రామచంద్రాయ జనక (మంగళం)

 రామచంద్రాయ జనక (మంగళం)


తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళమ్

చరణము

కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥

చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥

లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మంగళమ్ ॥ 3 ॥

దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళమ్ ॥ 4 ॥

పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతుల మంగళమ్ ॥ 5 ॥

విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళమ్ ॥ 6 ॥

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళమ్ ॥ 7 ॥

No comments:

Post a Comment