Sunday, July 20, 2025

Dwadasa Aditya - ద్వాదశాధిత్యులు

ద్వాదశాధిత్యులు

మనకు ఉదయం లేవగానే ఎంతో అందంగా దర్శనమిచ్చే సూర్యభగవానుడు ఒక్కడే అని మాత్రమే తెలుసు. కానీ మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ, 12 నెలలు 12 రకాలుగా మనకు దర్శనమిస్తాడన్న విషయం ఎవరికీ తెలియదు.

మన పురాణాల ప్రకారం అదిథి, కశ్యపుని దంపతులకు కలిగిన 12 మంది సంతానాన్ని ద్వాదశాధిత్యులు అని అంటారు. ఈ 12 నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితిగతులను బట్టి ద్వాదశాదిత్యులు పేర్లు వర్ణించబడ్డాయి.

ద్వాదశాదిత్యల వెంట ఎల్లప్పుడు ఆరుగురు పరిజనులు ఉంటారు. సూర్యునితో పాటు ఈ ఆరుగురు పరిజనులు కూడా సూర్యుని వలె ప్రతి నెల మారుతూ మనకు దర్శనమిస్తారు.

ద్వాదశాదిత్యుల గురించి మహా భాగవతంలోని 12 వ స్కంధం చివరిలో చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఏ నెలలో సూర్యుడు ఏ విధంగా మారుతాడు. అలాగే పరిజనులు కూడా ఏ పేర్లతో మారుతారు అన్న విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

01) దాత - 
మాసం - చైత్ర మాసం
పరిజనులు: కృత స్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు అనే పరిజనులు ఉంటారు.

02) అర్యముడు
మాసం - వైశాఖ మాసం
పరిజనులు: పుంజికస్థలి, పులహుడు, ఓజస్సు, ప్రహేతి, నారదుకుడు, కంజనీరుడు ఉంటారు.

03) మిత్రుడు
మాసం - జ్యేష్ఠ మాసం
పరిజనులు: మేనక, పౌరషేయుడు, తక్షకుడు, రథస్వనుడు, అత్రి, హాహా అనే పరిజనులు జ్యేష్ఠ మాసం లో సూర్యునితో ఉంటారు.

04) వరుణుడు
మాసం - ఆషాడ మాసం
పరిజనులు: రంభ, శుక్రచిత్తు సహజన్యుడు, హూహూ, వసిష్ఠుడు, సృనుడు అనే పరిజనులు ఉంటారు.

05) ఇంద్రుడు
మాసం - శ్రావణ మాసం
పరిజనులు: విశ్వావసువు, శ్రోత, ఏలా పుత్రుడు, అంగిరసు, ప్రమ్లోచ, చర్యుడు ఉంటారు.

06) వివస్వంతుడు
మాసం - భాద్రపదం మాసం
పరిజనులు: అనుమ్లోద, ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, శంఖపాలుడు.

07) త్వష్ట
మాసం - ఆశ్వయుజ మాసం
పరిజనులు: జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు.

08) విష్ణువు
మాసం - కార్తీక మాసం
పరిజనులు: అశ్వతరుడు, రంభ, సూర్యవర్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఖాపేతుడు అనే పరిజనులు ఉంటారు.

09) అంశుమంతుడు
మాసం - మార్గశిర మాసం
పరిజనులు: కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్ర, మహాశంఖులు అనే ఆరుగురు పరిజనులు సూర్యుని వెంట మార్గశిర మాసంలో ఉంటారు.

10) భగుడు
మాసం - పుష్య మాసం
పరిజనులు: స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణువు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్త.

11) పూషుడు
మాసం - మాఘ మాసం
పరిజనులు: ధనుంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతావి, గౌతముడు అనే పరిజనులు మనకు దర్శనమిస్తారు.

12) క్రతువు
మాసం - ఫాల్గుణ మాసం
పరిజనులు: వర్చుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, అనే ఆరుగురు పరిజనులు ఉంటారు.

ఈ విధంగా సూర్యుడు ప్రతి నెల ఒక్కో పేరుతో మనకు కనిపిస్తాడు. 12 నెలలు 12 పేర్లతో ఉండటం వల్ల సూర్యుడిని ద్వాదశాధిత్యులు అని పిలుస్తారు.

No comments:

Post a Comment