Sunday, August 24, 2025

Sri Surya Narayana Meluko – శ్రీ సూర్య నారాయణ మేలుకో

శ్రీ సూర్య నారాయణ మేలుకో

శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో

పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ
పొన్న పూవు మీది పొగడ పువ్వు ఛాయ |
ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ
వుల్లిపూవు మీది ఉగ్రంపు పొడి ఛాయ || శ్రీ సూర్య ||

ఘడిఎక్కి భానుడు కంబపూవు ఛాయ
కంభపూవు మీది కాకర పూఛాయ |
ఝామెక్కి భానుడు జాజిపూవు ఛాయ
ఝామెక్కి భానుడు సంపంగి పూఛాయ || శ్రీ సూర్య ||

మధ్యాహ్న భానుడు మల్లె పూవు ఛాయ
మల్లె పూవు మీది మంకెన్న పూఛాయ |
అస్తమయ భానుడు ఆవపూవు ఛాయ
ఆవపూవు మీది అద్దంపు పొడి ఛాయ || శ్రీ సూర్య ||

వాలుతూ భానుడు వంగపండు ఛాయ
వంగ పండు మీది వజ్రపు పొడి ఛాయ |
గుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయ
గుమ్మడి పూవుమిదా కుంకుమ పొడి ఛాయ || శ్రీ సూర్య ||

No comments:

Post a Comment