భాద్రపద మాసంలో చివరి పదిహేను రోజులకు, అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులకు మహాలయ పక్షమని పేరు. దీనికే యుద్ధ పక్షమని, పితృ పక్షమని కూడా పేర్లు ఉన్నాయి. పక్షం అంటే పదిహేను రోజులు. ఈ పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేస్తారు కాబట్టీ పితృ పక్షమన్నారు.
ఒకప్పుడు దేవతలకూ రాక్షసులకూ పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారు రాక్షసుల ధాటికి తట్టుకోలేక, యుద్ధభూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకుని జీవించసాగారు. తమను ఈ అపజయ పరాభవం నుండి గట్టెక్కించమనీ, ఈ ఆపద నుండి కాపాడమనీ తమ ఇష్టదైవాలను ప్రార్థించారు. కొందరు దుర్గను, కొందరు సరస్వతిని, కొందరు లక్ష్మిని, మరి కొందరు ఆయుధ దేవతలను ఉపాసించారు. అలా కొన్ని సంవత్సరాలు నిష్ఠతో ఆ పూజలు సాగాయి.
ఒక విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నురాలై పురుషులకు విల్లంబులు, వివిధ రకాల ఆయుధ విశేషాలూ ఇచ్చింది. వారి వారి స్త్రీలకు రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ దేవి ప్రసన్నం కావడంతో ఉత్సాహ భరితులై, సాహసోపేతులై రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వారు యుద్ధానికి వెళ్ళిన ముహూర్తం ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల నడిమి కాలం. దీనికే అభిజిత్ లగ్నమని పేరు.
పురుషులందరూ యుద్ధసన్నద్ధులై వెళ్ళగా, స్త్రీలు తమకిచ్చిన విగ్రహాలను ఒకచోట నిలిపి పూజించారు. ఆ విధంగా స్త్రీలు ఆ దేవతలను పూజించిన పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల ఆ దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది.
ఆనాడు ఆ స్త్రీలు తమకు లభించిన దేవతావిగ్రహాలను ఒకచోట కొలువుగా పెట్టి పూజించిన – బొమ్మల కొలువే – దసరాకు బొమ్మలను కొలువుగా పెట్టే ఆచారంగా పరిణమించింది. తరతరాల నుండీ నేటిదాకా కొనసాగుతూనే ఉంది. బొమ్మల కొలువు అంటే బొమ్మలన్నీ ఒకచోట చేర్చి అందంగా అమర్చటం. కొలువు అంటే సభ వంటిది. నాయకుడు తన ప్రధానస్థానంలో కూర్చుని, తన వారికి దర్శనం ఇచ్చి, వారి యోగక్షేమాలు కనుక్కుని, తగు నిర్ణయాలు తీసుకునే ప్రదేశం.
‘కొలువై యున్నాడే కోదండపాణి,’ ‘కొలువైతివా రంగశాయీ,’ వంటి కీర్తనల్లో ఈమాట వింటూ ఉంటాం. ఈ బొమ్మల కొలువులో ప్రధాన దైవతంగా ఆదిశక్తిని నిలిపి, తక్కిన దేవతలను, సమస్త ప్రాణికోటినీ వరుసగా వాటి వాటి స్థానాల్లో పెట్టడమే కొలువు. ఇదీ దసరాకు బొమ్మలు పెట్టే ఆచారం వెనుక ఉన్న కథ.

No comments:
Post a Comment