Wednesday, January 21, 2026

Dharmavyadhudu Katha - ధర్మవ్యాధుడి కథ

ధర్మవ్యాధుడి కథ

కౌశికుడనే బ్రాహ్మణుడున్నాడు. అతడొక వట వృక్షం క్రింద ఘోర తపస్సు చేస్తున్నాడు.  ఒకనాడతడు యోగ నిష్టలో వుండగా ఆ చెట్టుపై నున్న కొంగ అతనిపై రెట్ట వేసింది. దానికి ఆగ్రహోదగ్రుడైన కౌశికుడు తీవ్రమైన చూపులతో పైకి చూచాడు. అతని తీవ్రమైన కంటి చూపుకు కొంగ మాడి కిందపడ్డది. అది చూచిన కౌశికుడు ఆ ప్రదేశం నుండి లేచి వెళ్ళాడు.

ప్రక్కనే వున్న వొక పల్లెకు భిక్షాటన కోసం వెళ్ళాడు. ఒక పతివ్రత యింటి ముందాగి- “భవతీ! భిక్షాందేహి!” అని భిక్ష కోసం కేక వేశాడు.

భిక్ష కోసం వచ్చిన కౌశికుడి కంఠస్వరం విని, ఆ పతివ్రత లోపల నుండి భిక్ష తీసుకొని వస్తోంది. ఇంతలో ఆమె భర్త మండుటెండలో నడచి యింటికి అప్పుడే వచ్చాడు. చెమట కారుతూ- అలసి సొలసి మండుటెండలో వచ్చిన భర్తను గాంచి, వెంటనే స్నానానికి చల్లని నీళ్ళు పెట్టింది. భర్త స్నానం చేసిన తరువాత తెల్లని శుభ్రమైన వస్త్రాలిచ్చి ధరింపజేసి, భోజనం పెట్టింది. శ్రమపడి వచ్చిన భర్తతో కాసేపు వూసులాడి భోజనం ముగిసిన వెంటనే నిద్రకు పడక యేర్చాటు చేసింది. భర్త నిదురించిన తరువాత భిక్ష తీసుకొని ఆమె బయటకు వచ్చింది.

చిరునవ్వుతో భిక్ష తీసుకొని వస్తున్న పతివ్రతా తిలకాన్ని చూచిన కౌశికుడు కోపంతో పెదవి కొరుకుతూ కళ్ళెర్ర జేసి కఠిన స్వరంతో- “ఓసీ! ఇంటి ముందు బ్రాహ్మణుడు భిక్ష కోసం నిలబడితే, ఏమీ పట్టనట్టు నీ పనిపాటలన్నీ ముగించుకుని తీరిగ్గా భిక్ష తీసుకొని వచ్చావా? కొరవితో తలగీరుకోవటం సమ్మతమా? ఎందుకిట్లా పిచ్చి వని చేశావు? బ్రాహ్మణుడికి అపకారం తలపెట్టి
బ్రతికినవాడింతవరకూ ఈ విశాల ప్రపంచంలో లేడు” అని గద్దించాడు.

దానికా వనితారత్నం మొగాన చిరునవ్వు చిందులాడ, ఆ బాపని ఆగ్రహానికి కొంచెం కూడా చలించకుండా - “ఓయీ తాపనీ! కొంగ రెట్ట వేసిందని కోపంతో బుద్ధిమాలి దాన్ని పొట్టన  బెట్టుకున్నావు. నీ తపశ్ళక్తిని బూడిదపాలు చేశావు. నిగ్రహం లేనీ నీవు బ్రాహ్మణుడవా? నీకు సర్గతి కలుగుతుందా? ఈ మాత్రం ఓర్పు లేనివాడు 'బ్రాహ్మణుడెట్లా అవుతాడు? తెలిసిన వాళ్ళెవరు విన్నా ఫక్కున నవ్వుతారు గదా! శమం దమం లేకుండా, విజ్ఞానం లేకుండా, సమదృష్టి లేకుండా సహనం కించిత్తు కూడా లేకుండా బ్రాహ్మణుడెట్లా అవుతాడు ? బ్రాహ్మణుడని -గీ - పెట్టినంత మాత్రాన 
యెవ్వడూ బ్రాహ్మణుడు కాలేడు. బ్రాహ్మణుడు కోపిస్తే ప్రపంచం భయపడటం నేనెరుగుదును. కానీ, నీ కోపాన్ని కొంగను బూడిద చేసింది. అయినా పాతివ్రత్యం గల శీలవతులను కదలించలేదు. ఒక
సామాన్యమైన చెట్టును కదిలించగల రుంరూమారుతం పర్వతాలను కదలించలేదు గదా!”

అని వెటకారంగా, నర్మగర్భితంగా, మర్మ భేదకంగా పలికిన ఆమె పలుకులు విన్నాడు కౌశికుడు. పతివ్రత పలుకులకు చకితుడయ్యాడు. ఆ సాధుశీల గొప్పతనానికి ఆశ్చర్యపడి “తల్లీ! క్షమించు. తెలియక యిట్లాగా మాట్లాడా. నీవెంతో ధన్యురాలవు. నా తప్పు క్షమించు, నాపై దయవుంచ వేడెద, దుర్లభమైన యోగద్భృష్టితో అంతా గ్రహించినట్లున్నావు. ఇదెట్లా సంభవించింది? నీ వల్లనే తెలుసుకోవాలని నా మనస్సు ఉబలాటపడుతోంది. సెలవీయ గోరుతున్నా”

కౌశికుడి గర్వభంగం జరిగిందని తెలుసుకొన్న పతివ్రతా తిలకం- “ఓయీ! కౌశికా! భర్తకు  నిష్కపటంగా సేవచేయటంవల్ల నాకీ శక్తి సామర్ద్యాలబ్బినాయి. నీవు కోపంతో కొంగను చంపి భిక్ష కోసం యిటు వచ్చావు. అప్పుడే నా భర్త పనికిపోయి, మండుటెండలో యింటికి వచ్చాడు. శ్రమ చేసి వచ్చిన భర్తకు స్నానం - భోజనాదులు చూచి, నీకు భిక్ష తెచ్చా. ఈ ఆలస్యానికి సహించని నీవు ఎంతో మండిపడ్డావు. ఇదేనా నీ ధర్మం? ఎంతకాలం నుండి, ఎంత తవస్సు చేస్తే మాత్రం ఏం ప్రయోజనముంది? మానవత్వమే లేని నీకు బ్రాహ్మణత్వమెట్లా సిద్ధిస్తుంది. తపస్సు చేసినంత మాత్రాన వుత్తమ బ్రాహ్మణుడనయ్యానని పొంగిపోకు. బ్రాహ్మణత్వమనేది పుట్టుకతో రాదు. గుణాల్ని
బట్టి వస్తుంది. ఇక్కడికి కొంతదూరంలో ధర్మవ్యాధుడనే బోయవాడున్నాడు. నీవు అక్కడికి పో. నీకు
కావలసిన ధర్మాలన్నీ అతడు బోధిస్తాడు. ధర్మవ్యాధుడు వేద వేదాంగాల సారమెరిగిన వాడు.”

ఈ మాటలకు జాతి బ్రాహ్మణుడైన కౌశికుడు కటకటపడ్డాడు.

“అమ్మా! బ్రాహ్మణోత్తముడైన నన్ను ఒక బోయకు శిష్యుడిగా పంపటం న్యాయమేనా? నేనాతనికి శిష్యరికం చేయడం సంభవమా? ఇంత శిక్ష విధించటం తగునా?” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

“ఓయీ పిచ్చి బ్రాహ్మణుడా! ధర్మవ్యాధుడు పేరుకు బోయవాడు కావచ్చు. కానీ, అతడు తాను చేసే కర్మను బట్టి, గుణగుణాలను బట్టి బ్రాహ్మణుడు. అతడు చాలా వివేకం గలవాడు. మహా మేధావి, అతనితో సమానమైన పండితుడు మరెక్కడా దొరకడు. నీవు నిజంగా బ్రాహ్మణత్వాన్ని పొందాలనుకొంటే, తప్పకుండా అతణ్జి సేవించాలి. వెంటనే అతని దగ్గరకు వెళ్ళు. ఒకవేళ నా మాట విని బోయకు శిష్యరికం చేయటం అవమానమనుకొంటున్నావా? అతడు పవిత్రాశయుడు. నీకు ధర్మతత్త్వ్వాన్ని తప్పకుండా వివరిస్తాడు. పక్షపాతమంటే ఏమిటో యెరుగనివాడు.  ధర్మవ్యాధుడికి శిష్యరికం చేస్తే నీకు చిన్నతనం గాదయ్యా వచ్చేది, గొప్ప పేరు వస్తుంది. ఎంతో గౌరవం కలుగుతుంది” అని చెప్పింది.

ఆ నారీరత్నం మాటలకు ఎదురుచెప్పటానికి భయపడ్డాడు కౌశికుడు. ఆమె దగ్గర సెలవు తీసుకొని 'సరే' - అని ధర్మవ్యాధుడి దగ్గరకు ప్రయాణమైపోయాడు.

ధర్మవ్యాధుడు కటిక వృత్తి చేస్తాడు. జంతువుల మాంసం అమ్ముతూ వుంటాడు. కౌశికుడు పోయే సమయానికి ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతున్నాడు. చంపిన జంతువొకటి పైన వేలాడగట్టి వుంది. ఇంటి 'ప్రక్మనే మాంసం ఎండకట్టబడి వుంది. ఒక ప్రక్కన చీకులు వేలాడుతున్నాయి. అంతా నంజువాసన వస్తోంది. మాంసం కొనడానికి వస్తూ పోతూ వుండే జనంతో అంతా గజి బిజిగా వుంది. చుట్టూ మాంసపు ఖండాలు - మధ్యలో ధర్మవ్యాధుడు. ఈ సన్నివేశం కౌశికుడి కంటబడ్డది.

ఆ పతివ్రతారత్నం ఈతని దగ్గరకు పొమ్మనేనా? మాంసం అమ్ముతున్నాడు. జంతువధ చేసి హింస చేసే యితడు నాకు ధర్మాన్ని యెట్లా చెపుతాడు? ఏమని చెపుతాడు? ఈతని వుపదేశం విని యెట్లా తరిస్తాను? నాకెట్లా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది?” అని తనలో తానే తర్శించుకొని వనితా లలామ చెప్పిన పల్కులను తిరస్మరించటానికి భయపడి, ధర్మశీలుడైన ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్ళాడు కౌశికుడు.

“మహాత్మా! పతివ్రతా తిలకం ఒకామె పంపగా ధర్మసూక్షాలు తెలుసుకొందామని మీ దగ్గరకు వచ్చా. మీరు సమస్త ధర్మాలు తెలిసినవారనీ, వాటి మర్మాలను వివరించి చెప్పగల సమర్థులనీ తెలిసి మిమ్మల్ని ఆశ్రయించి పరమపదం పొందాలని వచ్చా” అని విన్నవించుకొన్నాడు.

మందవాసం మొగంలో తొలుకాడ ధర్మవ్యాధుడు కౌశికుణ్టి చూచాడు. “కౌశికా! కోపంతో నీవు చెట్టుమీది కొంగను చంపటం తెలుసు. పతివ్రతామణితో వివాదం పెట్టుకొని, కోపంతో పరుషంగా మాట్లాడడం యెరుగుదును. అక్కడి నుండి, ఆమె పంపితేనే నీ జన్మ సార్థక్యం చేసుకోవడానికి యిక్కడకు రావటం గమనించా. నీ సంగతి సమస్తం యెరుగుదును. నీవిక యేమాత్రం చెప్పవలసిన పనిలేదు”

ధర్మవ్యాధుడి దివ్యజ్ఞానానికి ఆశ్చర్యపడ్డ కౌశికుడు, ఏమీ అసహ్యించుకోక యిష్టపడి సేవ చేసి, కావలసిన ధర్మసూక్షాలు తెలుసుకొని కృతకృత్యుడై కొంతకాలానికి మోక్షపదం పొందాడు.

No comments:

Post a Comment