Friday, January 2, 2026

Kandha Gouri Katha - కంద గౌరీ కథ

కంద గౌరీ కథ
ఒక బ్రాహ్మణునకొక కుమార్తెగలదు. ఆ చిన్నది అస్తమానూ ఏడ్చుచుండెడిది. ఎన్ని నోములు నోపించినను ఏడ్చుట మానలేదు. తండ్రి కూతురుని అడవిలోకి తీసుకొనివెళ్లి విచారించుచు కూర్చొనియుండగా పార్వతీ పరమేశ్వరులు భూమి పాలించడమునకు వచ్చి "ఏమి బ్రాహ్మణుడా! ఇక్కడ కూర్చుండి విచారించుచున్నావ" ని యడిగిరి. "మీకెందుకు? ఆ
ర్చెడివారా! తీర్చెడివారా! వెళ్ళండి" అని యా బ్రాహ్మణుడు చెప్పగా "ఆర్చెడివారము, మేమే, తీర్చెడివారము మేమే చెప్పవలసినదా" ని తరిగి యా బ్రాహ్మణుని పార్వతీ పరమేశ్వరులడిగిరి. అప్పుడు బ్రాహ్మణుడు "ఈ
పిల్ల ఊరకే యేడ్చుచుండును. అందుచేత భరింపజాలనివాడనై యిక్కడికి తీసుకొని వచ్చి ఏమియుతోచక విచారించుచున్నాన" ని చెప్పగా పార్వతీ పరమేశ్వరులు - ఈ చిన్నది క్రిందటి జన్మమున కందగాౌరీ నోముపట్టి ఉల్లంఘన చేసినది. అందుచేతనే యేడ్పు సంభవించినది. ఇప్పుడైనా ఏడాది కధ చెప్పి అక్షింతలు వేసికొని వీసెయేబులం కందదుంప, వెండిదుంప, బంగాళదుంప చేయించి ముత్తయిదువునకు రవికెలగుడ్డ, దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి వాయనమిచ్చిన యెడల నీయే
డ్పు కుదురునని చెప్పి వారంతర్థానము నొందిరి.

అప్పుడు బ్రాహ్మణుడు కూతురును తీసుకొని యింటికివెళ్ళి పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారము యధావిధిగ కందగాౌరీ నోముపట్టి౦చి ఉద్యాపనము చేయించెను. నాటినుండి యా బ్రాహ్మణుని కుమార్తె యేడ్చుట మాని సకల సంపదలతో భూలోకమున సమస్త సౌఖ్యముల
ననుభవించెను.

No comments:

Post a Comment