రాజుకూతురు, మంత్రి కూతురు కార్తీక చలిమిళ్ళ నోముపట్టినారు. మంత్రి కూతురు పట్టినయెడు నీలాటి రేవున వాయనమిచ్చినది. నీలాటిరేవున వాయనమిచ్చినందుకు నిధిక్షేపము పరమేశ్వరుడామెకు దయచేసెను. మరుసటి సంవత్సరం కొమ్ముక్రింద వాయనమిచ్చెను. అట్లు యిచ్చినందుకు కొమ్మటేనుగుల వంటి కొడుకులను పరమేశ్వరుడామెకిచ్చెను. మూడవయేడు గుడిలో వాయనమిచ్చి నది. ఇట్లు ఇచ్చినందుకు పార్వతీదేవివంటి అయిదవతనము వచ్చెను.
రాజుకూతురుల్లంఘనము చేసినది, అట్లుల్లంఘనము చేయుటచే నామె హీనదశపట్టి మగడెప్పుడు
రోగాలతో బాధపడుచుండెడువాడు. తనతోటి మంత్రి కూతురు సకలైశ్వర్యములనుభవించుచుండగా తానా హీనదశ ననుభవించలేనని యడవుల పాలైపోయి
పార్వతీపరమేశ్వరులను ధ్యానము చేసుకొనుచున్నది. అట్లామెయుండగా పార్వతీ పరమేశ్వరుల కనుగ్రహమువచ్చి మునిదంపతుల రూపమున ఆమెకు ప్రత్యక్షమై “ఏమమ్మా ఇట్లు దుఃఖించుచున్నావ”ని యడిగిరి. 'మీకెందుకమ్మా! ఆర్బెడివారా! తీర్చేడివారా! వెళ్లుడిని వారితో నామె పలికెను. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని చూచి “మంత్రి కూతురు కార్తిక చలిమిళ్ళ నోము పట్టినది. రాజుకూతురును పట్టినదికదా, రాజుకూతురీలాగుండడమేమి? మంత్రి కూతురట్లుండడమేమి?" అని యడిగెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో -" మంత్రి కూతురు నీళ్ళరేవున వాయనమిచ్చి నందుకు కొమ్మటేనుగులవంటి కొడుకుల నిచ్చితిని. నిన్నుబోలు నయిదవతనమిచ్చితిని. రాజుకూతురుల్లంఘనము చేయుటనుబట్టి ఆమెహీనదశ ననుభవించవలసివచ్చెను” అని చెప్పినాడు. అప్పుడు పేదముత్తెదువు రూపముదాల్చియున్న పార్వతీదేవి యారాజకుమార్తెతో నీ సంగతిచెప్పి వెంటనే తాను కార్తీక చలిమిళ్ళనోము తిరిగి యామెచే పట్టించి యధావిధిగా నుద్యాపనము చేయించి నామెను యింటికి పంపించెను, రాజుకూతురు తన యింటికి వచ్చేసరికి యిల్లు సకలైశ్వర్యములతో తులతూగుచుందెను. మగడు సుఖముగాను, ఆరోగ్యముగాను వున్నాడు. అప్పుడామె పట్టిననోము లోక మందరు పట్టిరి.
విధానము: పట్టినయేడు అయిదుమానికల బియ్యము, మరుసటి సంవత్సరము పదిమానికల బియ్యము, మూడవయేడు పదిహేను మానికల బియ్యము, చలిమిడిముద్దచేసి పట్టినయేడు అయిదుగురు ముత్తయిదువులకు, మరుసటియేడు పదిమందికి, మూడవయేడు పదిహేనుగురికి వాయన మీయవలెను. యీనోము కార్తీక పౌర్ణమినాడు పట్టవలెను.

No comments:
Post a Comment